బ్లేడ్ బాబ్జీ

2008 సినిమా

బ్లేడ్ బాబ్జీ 2008లో దేవి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన హాస్యభరిత చిత్రం.[1][2] అల్లరి నరేష్, సయాలీ భగత్ ఈ చిత్ర నాయకా నాయికలు.

బ్లేడ్ బాబ్జీ
(2008 తెలుగు సినిమా)
Blade Babji poster.jpeg
దర్శకత్వం దేవీ ప్రసాద్
నిర్మాణం ముత్యాల సత్యకుమార్
తారాగణం అల్లరి నరేష్,
సయాలీ భగత్
సంభాషణలు సతీష్ వేగేశ్న
విడుదల తేదీ 24 అక్టోబర్ 2008
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథసవరించు

బ్లేడ్ బాబ్జీ (అల్లరి నరేష్), అతని గ్యాంగు రాజమండ్రిలోని ఒక కాలనీలో ఉంటూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ కాలం గడుపుతూ ఉంటారు. ఇలా ఉండగా వారు గుడిసెలు వేసుకున్న స్థలం యజమాని ఉన్నఫళంగా ఖాళీ చేయమంటాడు. అలా చేయని పక్షంలో నాలుగు కోట్లు చెల్లించమంటాడు. ఆ కాలనీ వాళ్ళనందరినీ కాపాడటానికి వీళ్ళు ఒక బ్యాంకును దోచుకోవాలని పథకం వేస్తారు. అదే సమయానికి బండ బద్రి (జయప్రకాష్ రెడ్డి) అనే దొంగల నాయకుడు కూడా బ్యాంకు దొంగతనానికి ప్రణాళిక వేస్తాడు. కానీ అతని అనుచరులకు బదులు బాబ్జీ అనుచరులు బ్యాంకులో సొమ్ము దొంగతనం చేసి పారిపోతారు. దాచిన సొమ్మును ఒక నిర్మాణంలో ఉన్న భవనంలో నేలలో దాచి పెట్టి ఓడరేవులోని ఒక పడవలో పడుకుంటారు. తెల్లారి లేచి చూసేసరికి అండమాన్ దీవులకు వెళ్ళే దారిలో ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి తిరిగిరావడానికి ఒక నెల రోజులు పడుతుంది.

నెల రోజులకు తిరిగి వచ్చి తాము సొమ్ము దాచిన చోటుకు వెళ్ళగానే అక్కడే ఒక పోలీసు కంట్రోలు రూము దర్శనమిస్తుంది. అక్కడి నుంచి డబ్బు ఎలా సంపాదించాలా అని చూస్తుండగా వాళ్ళకి లంచమిచ్చి పోలీసు ఉద్యోగం సంపాదించిన కృష్ణమనోహర్ (శ్రీనివాస రెడ్డి) తారసపడతాడు. కథానాయకుడూ, అతని బృందం అతన్ని అపహరించి తమ గదిలో బంధించి ఆ స్థానంలో బాబ్జీని పంపిస్తారు.

తారాగణంసవరించు

మూలాలుసవరించు

  1. "Blade Babji movie review". idlebrain.com. G. V. Ramana. Retrieved 14 March 2018.
  2. Aks. "Blade Babji Movie Review". 123telugu.com. Mallemala Entertainments. Retrieved 14 March 2018.