భగీరథ (సినిమా)

భగీరథ రసూల్ ఎల్లోర్ దర్శకత్వంలో 2005లో విడుదలైన తెలుగు సినిమా.[1][2] ఇందులో రవితేజ, శ్రీయ ప్రధాన పాత్రలు పోషించారు. ఇతర ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, విజయ్ కుమార్, నాజర్ తదితరులు నటించారు.[3]

భగీరథ
Bhageeratha poster.jpg
దర్శకత్వంరసూల్ ఎల్లోర్
రచనరసూల్ ఎల్లోర్
నిర్మాతమల్లిడి సత్యనారాయణ రెడ్డి
నటవర్గంరవితేజ
శ్రీయ
ప్రకాష్ రాజ్
బ్రహ్మానందం
హేమ
విజయ కుమార్
జీవా
నాజర్
వేణు మాధవ్
సునీల్
ఫిష్ వెంకట్
ఛాయాగ్రహణంసునీల్‌ రెడ్డి
సంగీతంచక్రి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీలు
2005 అక్టోబరు 13 (2005-10-13)
నిడివి
161 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథసవరించు

గోదావరి జిల్లాలో కృష్ణలంక అనేది ఒక కుగ్రామం. ఆ ఊరికి వెళ్ళాలంటే కేవలం పడవలపైనే వెళ్ళాలి. వాతావరణ పరిస్థితులు అనుకూలించనపుడు ఆ ఊరి ప్రజలు చాలా మంది అలా ప్రయాణించేటపుడు ప్రమాదాల బారిన పడుతుంటారు. అదే గ్రామంలో ఉండే ధనవంతుడు, ఆ ఊరి సర్పంచియైన బుల్లెబ్బాయి (విజయకుమార్) ఆ గ్రామానికి ఒక వంతెన నిర్మిస్తే బాగుంటుందని అనుకుంటాడు. అందుకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తెలుసుకుని అదే గ్రామంలో నుంచి వెళ్ళి వ్యాపారిగా స్థిరపడిన వెంకటరత్నం (ప్రకాష్ రాజ్)ను అభ్యర్థిస్తాడు. 20 సంవత్సరాలు గడిచినా వెంకటరత్నం ఆ మాతే ఎత్తడు. అసలు ఆ సంగతే పూర్తిగా మరిచిపోతాడు. దాన్ని గురించి కనుక్కోమని బుల్లెబ్బాయి తన కొడుకు చందు (రవితేజ)ను అక్కడికి హైదరాబాదు వెళ్ళి వెంకటరత్నంను కలుసుకోమంటాడు.

హైదరాబాదుకు వచ్చి వెంకటరత్నంను కలుసుకున్న చందు వెంకటరత్నం పూర్తిగా డబ్బు మనిషిగా మారిపోయాడనీ తన ఊరి గురించి పూర్తిగా మరిచిపోయాడనీ తెలుసుకుంటాడు. దాంతో అతని మనసు మార్చాలని నిర్ణయించుకుంటాడు. కొద్ది రోజులు నిరుద్యోగిగా కాలం గడిపిన చందు దుర్గా ప్రసాద్ అనే వ్యాపారవేత్త సహకారంతో తను కూడా మంచి వ్యాపారవేత్తగా పేరు సంపాదించి వెంకటరత్నంకి పోటీగా ఎదుగుతాడు. దుర్గా ప్రసాద్ కూతురైన శ్వేత (శ్రీయ) కూడా అతనికి తనెవరో తెలియకుండా సహకరిస్తుంది. చందు అనేక మలుపుల తర్వాత వెంకటరత్నంను తన బాధ్యతను తెలియజెప్పి తన ఊరికి తీసుకెళ్ళడంతో కథ ముగుస్తుంది.

తారాగణంసవరించు

విడుదల, స్వీకరణసవరించు

2005 అక్టోబరు 13న విడుదలైన[4] ఈ చిత్రం మిశ్రమ స్పందనలు అందుకుంది.

పాటలుసవరించు

చక్రి స్వరాలు సమకూర్చిన ఈ చిత్రంలో మొత్తం ఆరు పాటలున్నాయి. చక్రి, కార్తీక్, రవివర్మ, హరిహరన్, శ్వేత పండిట్, శంకర్ మహదేవన్, కౌసల్య తదితరులు పాటలు పాడారు.[5]

పాట పాడినవారు రాసిన వారు
ఓ ప్రేమ నువ్వే ప్రాణం కార్తీక్, శ్వేత పండిట్
పో పో పోవే చక్రి
ప్రపంచమే కాదన్నా శంకర్ మహదేవన్
ఎవరో ఎవరో హరిహరన్, కౌసల్య
దిల్ సే కర్నా రవివర్మ
నారింజ పులుపు నీది చక్రి, టీనా కమల్

మూలాలుసవరించు

  1. G. V., Ramana. "Bhageeratha - Telugu cinme review". idlebrain.com. Idlebrain. Retrieved 24 November 2016.
  2. Pulla, Priyanka. "Bhageeratha review". movies.fullhyderabad.com. Fullhyderabad.com. Retrieved 24 November 2016.
  3. "Bhageeratha review". indiaglitz.com. indiaglitz.com. Retrieved 24 November 2016.
  4. "ఫిల్మీబీట్ లో భగీరథ ప్రివ్యూ". filmibeat.com. ఫిల్మీబీట్. Retrieved 24 November 2016.
  5. "రాగ.కాంలో భగీరథ పాటలు". raaga.com. raaga.com. Retrieved 24 November 2016.