భద్రిరాజు పాలెం
భద్రిరాజు పాలెం, కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. సముద్రమట్టానికి 11 మీ.ఎత్తులో ఉంది.ఈ ఊరు కృష్ణానది పక్కన ఉంది.
భద్రిరాజు పాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°19′55″N 80°47′42″E / 16.331862°N 80.794865°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | తోట్లవల్లూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521163 |
ఎస్.టి.డి కోడ్ | 08676 |
సమీప గ్రామాలు
మార్చుదేవరపల్లి 3 కి.మీ, కనకవల్లి 4 కి.మీ, పెనమకూరు 4 కి.మీ, కుమ్మమూరు, అమీనపురం 6 కి.మీ
గ్రామానికి రవాణా సౌకర్యాలు
మార్చువుయ్యూరు, కంకిపాడు, మానికొండ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 31 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుజిల్లాపరిషత్ హైస్కూల్, దేవరపల్లి, పెనమకూరు
గ్రామంలోని మౌలిక వసతులు
మార్చునీటిశుద్ధికేంద్రం
మార్చుఈ కేంద్ర నిర్మాణానికి గ్రామ పంచాయతీ 3 సెంట్ల స్థలాన్ని ఏర్పాటుచేసారు. హైదరాబాదుకు చెందిన మెగా ఇంజనీరింగ్ & ఇన్ ఫ్రాస్ట్రక్చర్స లిమిటెడ్ (M.E.I.L) అనే సంస్థ సహకారంతో, గ్రామానికి చెందిన దాత కొమ్మారెడ్డి బసివిరెడ్డి కుమారుడు కొమ్మారెడ్డి బాపిరెడ్డి, విజయభాస్కరమ్మ దంపతుల 15 లక్షల రూపాయల వితరణతో, ఈ కేంద్రాన్ని నిర్మించారు. శంకుస్థాపన చేసిన ఒక నెలరోజుల వ్యవధిలోనే యుద్ధప్రాతిపదికన ఈ నిర్మాణం పూర్తిచేయడం విశేషం. ప్రజల వద్ద ఏ మాత్రం రుసుం వసూలు చేయకుండానే ఈ కేంద్రం నుండి శుద్ధమైన రక్షిత మంచినీటిని సరఫరా చేస్తున్నారు. [3][4][5]
అంగనవాడీ కేంద్రం
మార్చుఈ కేంద్రం స్థానిక ఎస్.సి.వాడలో ఉంది.
గ్రామ పంచాయతీ
మార్చు2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో వల్లూరు విమలమ్మ, సర్పంచిగా ఎన్నికైంది. [7]
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చు- శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ రాజభద్రేశ్వరస్వామివారి ఆలయం.
- శ్రీ గంగానమ్మతల్లి ఆలయం:- 2014, నవంబరు-30, ఆదివారం నాడు, ఈ గ్రామంలో గంగానమ్మ, పోతురాజుల జాతరను గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో, కన్నుల పండువగా జరుపుకున్నారు. వివిధప్రాంతాలలో ఉంటున్న గ్రామస్థులు, జాతరను పురస్కరించుకొనిగ్రామానికి తరలి రావడంతో, గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. పెద్దలు, మహిళలు, పిన్నలు నూతన వస్త్రాలు ధరించి గంగానమ్మ తల్లికి మొక్కుబడులు సమర్పించుకున్నారు. ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం, గంగానమ్మకు మొక్కుబడులు సమర్పించుకొని అనంతరం, వరికోతలకు శ్రీకారం చుడతారు. [1]
- శ్రీ అంకమ్మ దేవర ఆలయం:- ఈ గ్రామంలోని ఆళ్ళవారి అంకమ్మ దేవర సంబరాలు, 2015, జూన్-7వ తేదీ ఆదివారం నాడు, వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఆళ్ళ వారి వంశస్థులు ఆలయానికి తరలివచ్చి, అమ్మవారికి పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. [2]
- శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయం భద్రిరాజుపాలెం గ్రామంలో కృఇష్ణానది కరకట్టపై ఉంది.
- శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- ఈ ఆలయ వార్షికోత్సవాన్ని, 2016, మే-12వ తేదీ గురువారంనాడు వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఆలయంలో పూజలు నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు మద్యాహ్నం అన్నసమారాధన వితరణ నిర్వహించారు. [6]
గ్రామంలో ప్రధాన పంటలు
మార్చుచెరకు, పసుపు, అరటి, కంద. ఇవిగాక ప్రస్తుతం ఈ గ్రామ రైతులు ఇప్పుడు బంతిపూల సాగుపై మక్కువ చూపుచున్నారు.
గ్రామంలో ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
మూలాలు
మార్చువెలుపలి లింకులు
మార్చు[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, డిసెంబరు-1; 2వపేజీ. [2] ఈనాడు అమరావతి; 2015, జూన్-8; 38వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015, జూన్-18; 43వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, జూలై-2; 3వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2016, జనవరి-9; 29వపేజీ. [6] ఈనాడు అమరావతి/పామర్రు; 2016, మే-13; 1వపేజీ. [7] ఈనాడు అమరావతి/పామర్రు; 2017, మే-27; 2వపేజీ.