భలే బుల్లోడు (1995 సినిమా)

1995 చలన చిత్రం

భలే బుల్లోడు 1995 లో వచ్చిన కామెడీ-డ్రామా చిత్రం. జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మించాడు. శరత్ దర్శకత్వం వహించాడు. ఇందులో జగపతి బాబు, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించారు. కోటి సంగీతం సమకూర్చాడు.[1][2]

భలే బుల్లోడు
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం శరత్
తారాగణం జగపతి బాబు,
సౌందర్య ,
జయసుధ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ జగపతి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

కథసవరించు

సెంట్రల్ జైలులో పసికందు చిన్నా (మాస్టర్ ప్రభు) కు జన్మనిచ్చిన జయంతి (జయసుధ) తో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. జయంతి జీవిత ఖైదులో ఉన్నందున, ఆమె సెంట్రీ శాంతమ్మ (నిర్మలమ్మ) ను తన కుమారుడి సంరక్షకురాలిగా ఎంచుకుంది. జయంతి మేనమామ పాపారావు (కోట శ్రీనివాసరావు), హరి (శ్రీహరి) ఆస్తి కోసం జయంతిని ఎప్పుడూ వేధిస్తూండేవారు. కృష్ణ (జగపతి బాబు) దీర్ఘకాలిక బ్రహ్మచారి, తన అన్నయ్య కృష్ణ మోహన్ రావు (రాజా) ను అతడి ప్రేయసి చంపినందున అతడు మహిళలను ద్వేషిస్తాడు. రాధా (సౌందర్య) అనే అందమైన అమ్మాయి కృష్ణతో ప్రేమలో పడుతుంది. కాని అతను స్త్రీ ద్వేషం కారణంగా ఆమె ప్రేమను తిరస్కరిస్తాడు. కొంతకాలం తర్వాత, రాధ ఆత్మహత్యకు ప్రయత్నించినపుడు కృష్ణ, ఆమె ప్రేమను అర్థం చేసుకుని ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. ఇంతలో, చిన్న 10 సంవత్సరాల బాలుడవుతాడు. శాంతమ్మకు రోజురోజుకూ వయసు మీద పడుతోంది. చిన్న బాధ్యతను కృష్ణకు అప్పగించాలని జయంతి నిర్ణయించుకుంటుంది. కృష్ణే తన తండ్రి అని శాంతమ్మ చిన్నతో చెబుతుంది. అక్కడ నుండి, చిన్నా అతనిని నీడలాగా అనుసరిస్తాడు. అతన్ని చాలా వేధిస్తాడు. కృష్ణ, రాధల వైవాహిక జీవితం కూడా కష్టాల్లో పడుతుంది. కృష్ణ, చిన్న, జయంతిల మధ్య సంబంధం ఏమిటనేది మిగతా కథ

తారాగణంసవరించు

సాంకేతిక సిబ్బందిసవరించు

పాటలుసవరించు

సంఖ్య. పాటగాయనీ గాయకులు నిడివి
1. "అక్కడ ఇక్కడ"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర 4:54
2. "ఏసుకోరా నారిగా"  ఎస్.పి.శైలజ, కె.ఎస్.చిత్ర 4:08
3. "ముద్దు ముద్దుగా"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర 4:20
4. "నీ బంపర్ షోకు"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర 4:44
5. "అమ్మా నాన్నా లేని"  రాధిక 3:23
6. "చిన్నదాని చీరచూడు"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర 4:53
మొత్తం నిడివి:
26:22

మూలాలుసవరించు

  1. Error on call to మూస:cite web: Parameters url and title must be specified
  2. "Bhale Bullodu (1995)". Indiancine.ma. Retrieved 2020-09-05.