మంచివాళ్ళకు మంచివాడు

తెలుగు సినిమా
(మంచివాళ్లకు మంచివాడు నుండి దారిమార్పు చెందింది)

మంచివాళ్లకు మంచివాడు 1973, జనవరి 13వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై యస్.భావనారాయణ నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్ సమీపంలోని దేల్‌వాడా గ్రామంలో చిత్రీకరించారు.

మంచివాళ్ళకు మంచివాడు
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ఆర్.దాస్
తారాగణం కృష్ణ,
సత్యనారాయణ,
నగేష్,
విజయనిర్మల,
శబ్నం,
ప్రభాకర రెడ్డి,
హలం
సంగీతం సత్యం
గీతరచన దాశరథి,
సినారె,
ఆరుద్ర,
శ్రీశ్రీ
ఛాయాగ్రహణం వి.ఎస్.ఆర్. స్వామి
నిర్మాణ సంస్థ వెంకటేశ్వర ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

సంక్షిప్త కథ

మార్చు

ధర్మపురి అనే రాజ్యంలో రాజు తమ్ముడు సేతుపతి అన్నను, వదినను హత్యచేసి నిధిని కాజేయాలని ప్రయత్నిస్తాడు. అయితే రాజు ముందుగానే నిధిని ఒకచోట భద్రపరచి ఆ రహస్యానికి సంబంధించిన పత్రాలను రెండు పతకాలలో దాచి, విశ్వాసపాత్రుడైన నాగమనాయకుడికి ఇస్తాడు.

అయితే సేతుపతి ఇది పసిగట్టి నాగమనాయకుని కూడా హతమార్చడానికి ప్రయత్నిస్తాడు. నాగమనాయకుడు ఈ నిధి రహస్యంగల పతకాలను చెన్నకేశవయ్యకు ఇచ్చి ప్రాణాలు విడుస్తాడు.

సేతుపతి అతని అనుచరులు జగ్గు, సింగ్‌లు చెన్నకేశవయ్యను బంధించి తీసుకుపోయి హింసిస్తారు. చెన్నకేశవయ్య కొడుకు రంగా సాఖి అనే అమ్మాయి సహాయంతో ఈ దుష్టులను మట్టుపెట్టి ప్రజాధనమైన నిధిని ఎలా కాపాడింది, సాఖి ఎవరన్న విషయం పతాకసన్నివేశంలో తెలుస్తాయి.[1]

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు
పాటల జాబితా
సం.పాటపాట రచయితసంగీతంగాయకుడు(లు)పాట నిడివి
1."ఏఊరోయ్ మొనగాడా ఏ ఊరోయి షోగ్గాడా పాట వింటావా ఆట చూస్తావా"దాశరథిసత్యంఎల్.ఆర్. ఈశ్వరి03:47
2."పిల్లా షోకిల్లా పిలిచే సందె వేళ ఏయ్ పిల్లా లో లో"సినారెసత్యంఎస్.జానకి,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
04:03
3."వెండిమబ్బు విడిచింది వింత దాహం వేసింది గిన్నెనిండా మధువు కన్నెపిల్ల నింపాలి"ఆరుద్రసత్యంఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం04:32
4."లేనే లేదా అంతం లేనే లేదా రానే రాదా విముక్తి రానేరాదా"శ్రీశ్రీసత్యంఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 

మూలాలు

మార్చు
  1. రెంటాల, గోపాలకృష్ణ (28 January 1973). "చిత్ర సమీక్ష: మంచివాళ్ళకు మంచివాడు" (PDF). ఆంధ్రప్రభ దినపత్రిక. No. సంపుటి 38 సంచిక 24. మాడభూషి కృష్ణస్వామి. Archived (PDF) from the original on 10 జనవరి 2023. Retrieved 10 January 2023.

బయటి లింకులు

మార్చు