మంథని పురపాలకసంఘం
మంథని పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] మంథని పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం లోని మంథని శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
మంథని పురపాలకసంఘం | |
— పురపాలకసంఘం — | |
అక్షాంశరేఖాంశాలు: 18°35′39″N 79°40′22″E / 18.5942502°N 79.6726632°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | పెద్దపల్లి |
మండలం | మంథని |
ప్రభుత్వం | |
- చైర్పర్సన్ | పుట్ట శైలజ |
- వైస్ చైర్పర్సన్ | ఆరెపల్లి కుమార్ |
వైశాల్యము | |
- మొత్తం | 10 km² (3.9 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 17,927 |
- పురుషుల సంఖ్య | 8,866 |
- స్త్రీల సంఖ్య | 9,061 |
- గృహాల సంఖ్య | 5,230 |
పిన్ కోడ్ - 505184 | |
Area code(s) | టెలిఫోన్ కోడ్ - 08729 |
వెబ్సైటు: అధికార వెబ్ సైట్ |
చరిత్ర
మార్చుమేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న మంథని, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]
భౌగోళికం
మార్చుమంథని 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 18°38′53″N 79°39′58″E / 18.648°N 79.666°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 203 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం పెద్దపల్లి నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 17927 మంది కాగా, అందులో 8866 మంది పురుషులు, 9061 మంది మహిళలు ఉన్నారు. 5230 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 13 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]
పౌర పరిపాలన
మార్చుపురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 18 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం పుట్ట శైలజ చైర్‌పర్సన్‌గా, ఆరెపల్లి కుమార్ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
వార్డు కౌన్సిలర్లు
మార్చు- గుండా విజయలక్ష్మి
- పుట్ట శైలజ (చైర్పర్సన్)
- ఆరెపల్లి కుమార్ (వైస్ చైర్పర్సన్)
- కుర్ర లింగయ్య
- నక్క నాగేంద్ర
- కైతి సమ్మయ్య
- గారెపల్లి సత్యనారాయణ
- కొట్టే పద్మ
- చొప్పకట్ల హనుమంతు
- శ్రీపతి బానయ్య
- వడ్లకొండ రవి
- వేముల లక్ష్మి
- పెండ్రి రామదేవి
మూలాలు
మార్చు- ↑ "Manthani Municipality". manthanimunicipality.telangana.gov.in. Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.
- ↑ Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 7 May 2021.
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 7 May 2021.
- ↑ "Basic Information of Municipality, Manthani Municipality". manthanimunicipality.telangana.gov.in. Retrieved 7 May 2021.[permanent dead link]
- ↑ The Hindu, Telangana (27 January 2020). "All top posts of municipalities in Karimnagar go to TRS". Archived from the original on 28 January 2020. Retrieved 7 May 2021.
వెలుపలి లంకెలు
మార్చు- మంథని పురపాలక సంఘ అధికారిక వెబ్సైటు Archived 2021-05-07 at the Wayback Machine