మరియం జకారియా ఇరానియన్ నటి. ఆమె భారతీయ చిత్రాలలో పనిచేసే మోడల్. ఆమె హిందీ, తెలుగు, తమిళ భాషా చిత్రాలలో నటిస్తుంది.[1][2] తెలుగు సినిమా మడత కాజా (2011), హిందీ చిత్రాలు ఏజెంట్ వినోద్ (2012), గ్రాండ్ మస్తీ (2013) వంటి చిత్రాలతో ఆమె మంచి పేరు తెచ్చుకుంది.

మరియం జకారియా
2012లో మరియం జకారియా
జననం
టెహ్రాన్, ఇరాన్
పౌరసత్వంస్వీడన్
వృత్తి
  • మోడల్
  • నటి
క్రియాశీల సంవత్సరాలు2009–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
అరవింద్ ఠాకూర్
(m. 2012)
పిల్లలు1

కెరీర్ మార్చు

స్వీడన్‌లో, మరియం జకారియా మోడల్‌గా, డ్యాన్స్ టీచర్‌గా, కొరియోగ్రాఫర్‌గా పనిచేసింది. ఇండిస్క్ డాన్స్ స్టూడియో అనే బాలీవుడ్ డ్యాన్స్ స్కూల్‌ను స్థాపించింది. ఇది స్వీడన్‌లో బాలీవుడ్ సినిమాకు సంబంధించిన మొదటి నృత్య పాఠశాల.[3] ఆమె బాలీవుడ్‌లో నటించడానికి 2009లో భారతదేశం వచ్చి, ముంబై చేరింది. అక్కడ ఆమె మోడల్‌గా పని చేయడం ప్రారంభించింది. ఈ కాలంలో, ఆమె వివిధ టెలివిజన్ ప్రకటనలలో కనిపించింది, వాటిలో అత్యంత ముఖ్యమైనవి సెట్ వెట్, లేజ్, కోక్ ప్రకటనలు చెప్పుకోవచ్చు. ఆమె ఇమ్రాన్ ఖాన్‌తో కలిసి కోకాకోలా ప్రకటనలో నటించింది.[4][5]

తమిళ చిత్ర దర్శకుడు సుందర్ సి. యూట్యూబ్‌లో ఆమె చేసిన డ్యాన్స్ వీడియోను చూసిన తర్వాత, తన చిత్రం నగరం (2010)లో ఐటెమ్ నంబర్‌(ప్రత్యేక పాట)కు ఆమెను ఎన్నుకున్నాడు.[6][7] 100% లవ్ నుండి హిట్ నంబర్ "దియాలో దియాలా"తో ఆమె కెరీర్ పెద్ద పురోగతి సాధించింది.[8] ఆమె అల్లరి నరేష్‌తో కలిసి మరో తెలుగు చిత్రం మడత కాజా (2011)లో మహిళా ప్రధాన పాత్రలలో ఒకరిగా నటించింది.

2012లో, ఆమె ముఅజ్జామ్ బేగ్ చిత్రం సద్దా అడ్డాలో ఐటెమ్ నంబర్ "డిల్లీ కి బిల్లీ" చేసింది.[9]

సైఫ్ అలీ ఖాన్ చిత్రం ఏజెంట్ వినోద్‌లో, ఆమె ఫరాగా నటించింది. కరీనా కపూర్‌తో కలిసి "దిల్ మేరా ముఫ్త్ కా" పాటలో ముజ్రా చేసింది, ఇది ఆమెకు బాలీవుడ్‌లో ఖ్యాతిని తెచ్చిపెట్టింది. 2012లో, ఇంద్ర కుమార్ చిత్రం గ్రాండ్ మస్తీకి, అఫ్తాబ్ శివదాసాని సరసన చేసింది. గ్రాండ్ మస్తీ భారతదేశంలో ఎ (పెద్దలకు మాత్రమే) సర్టిఫికేట్‌తో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత దేశంలోని బాలీవుడ్ 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. బాక్సాఫీస్ ఇండియా ఈ చిత్రాన్ని భారతదేశంలో సూపర్ హిట్‌గా ప్రకటించింది.

వ్యక్తిగత జీవితం మార్చు

మరియం జకారియా 2012లో కొరియోగ్రాఫర్ అరవింద్ ఠాకూర్‌ను వివాహం చేసుకుంది.[10] ఈ దంపతులకు 2013లో ఆర్యన్ ఠాకూర్ అనే కుమారుడు జన్మించాడు.[11]

ఫిల్మోగ్రఫీ మార్చు

సంవత్సరం సినిమా పాత్ర భాష నోట్స్
2009 పేయింగ్ గెస్ట్స్ హిందీ ఐటమ్ సాంగ్
2010 నగరం తమిళం ఐటమ్ సాంగ్
2011 100% లవ్ తెలుగు ఐటమ్ సాంగ్
బ్రమ్మిగాడి కథ తెలుగు ఐటమ్ సాంగ్
మడతకాజా ప్రియా తెలుగు
2012 సద్దా అడ్డా హిందీ ఐటమ్ సాంగ్
ఏజెంట్ వినోద్ ఫరా ఫఖేష్ హిందీ
నా ఇష్టం తెలుగు ఐటమ్ సాంగ్
దమ్ము తెలుగు ఐటమ్ సాంగ్
చక్రధర్ హిందీ ఐటమ్ సాంగ్
రౌడీ రాథోడ్ హిందీ ఐటమ్ సాంగ్
2013 డి-డే హిందీ ఐటమ్ సాంగ్
బజతే రహో హిందీ ఐటమ్ సాంగ్
గ్రాండ్ మస్తీ రోజ్ హిందీ
2014 అంజాన్ తమిళం ఐటమ్ సాంగ్

తెలుగులో సికిందర్ గా విడుదలైంది.

2016 మిస్సింగ్ ఆయ్ ఎ వీక్ఎండ్ హిందీ ఐటమ్ సాంగ్
2017 ఫిరంగి హిందీ ఐటమ్ సాంగ్
2020 అర్జున శ్రుతి తెలుగు రాజశేఖర్ సరసన హీరోయిన్

మూలాలు మార్చు

  1. "Swedish Sizzle". India Today. 30 April 2011. Retrieved 13 October 2011.
  2. Saxena, Kashika. "Maryam Zakaria". The Times of India. Retrieved 4 July 2014.
  3. "Set Wet commercial girl Mushtaq Ahmed in Tollywood". Deccan Chronicle. 29 September 2011. Archived from the original on 4 అక్టోబర్ 2011. Retrieved 13 October 2011. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  4. "Set Wet commercial girl Mushtaq Ahmed in Tollywood". Deccan Chronicle. 29 September 2011. Archived from the original on 4 అక్టోబర్ 2011. Retrieved 13 October 2011. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  5. Itsy bitsy – Balancing act. The Hindu. 11 February 2012
  6. Sizzling item number in Nagaram Archived 22 జనవరి 2014 at the Wayback Machine. Sify.com (17 November 2010). Retrieved 30 March 2012.
  7. Where are all the item girls? – Times Of India. The Times of India. (19 December 2010). Retrieved 30 March 2012.
  8. The girl who follows her dreams Archived 23 ఫిబ్రవరి 2012 at the Wayback Machine. Postnoon. Retrieved 30 March 2012.
  9. "Swedish Model Dances To Dilli Ki Bill". NDTV Movies. 20 April 2011. Archived from the original on 2 April 2012. Retrieved 13 October 2011.
  10. "I Decided To Have A Baby After Grand Masti! – Maryam Zakaria". 7 November 2014. Retrieved 7 April 2021.
  11. "Maryam Zakaria with son Aryan Thakur arrives at Isana Kapoor's birthday party in Mumbai on November 12, 2017 - Photogallery". The Times of India. Retrieved 4 June 2021.