మహబూబాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల
మహబూబాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లాలోని మహబూబాబాద్ పట్టణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల. గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ఔత్సాహిక వైద్య విద్యార్థులకు వైద్య పరిజ్ఞానాన్ని అందించేందుకు తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఉండాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం 2021లో ఈ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించింది. ఇది కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది. నేషనల్ మెడికల్ కమిషన్ నుండి 2022-23 విద్యా సంవత్సరానికి 150 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతి లేఖను అందుకుంది.[1]
రకం | ప్రభుత్వ వైద్య విద్య |
---|---|
స్థాపితం | 2021 |
అనుబంధ సంస్థ | కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం |
విద్యార్థులు | 150 |
స్థానం | మహబూబాబాద్, మహబూబాబాదు జిల్లా, తెలంగాణ, భారతదేశం |
నిర్మాణ వివరాలు
మార్చుమహబూబాబాద్ పట్టణంలోని శనిగపురం రోడ్డులో ఉన్న సర్వే నంబర్ 551లోని సుమారు 48 ఎకరాలలోని 30 ఎకరాలలో ఈ వైద్య కళాశాల నిర్మించబడింది.[2] 550 కోట్ల రూపాయలతో ఈ నిర్మించనున్న వైద్య కళాశాలకు 2022 మే 10న తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీశ్ రావు శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ కె. శశాంక, జెడ్పీ చైర్ పర్సన్ అంగొతు బిందు తదితరులు ఉన్నారు.[3]
ఆసుపత్రి
మార్చుమహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్ ప్రాంగణంలో వెల్స్ ఫార్గో, యునైటెడ్ వే అనే స్వచ్ఛంద సంస్థల సహకారంతో 70 లక్షల రూపాయల వ్యయంతో 36 పడకల భవనం నిర్మించబడింది. ఇందులో క్రిటికల్ కేర్, కొవిడ్ రోగుల చికిత్స చేస్తారు. 2022 ఏప్రిల్ 18న తెలంగాణ రాష్ట్ర గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, జెడ్పీ చైర్ పర్సన్ బిందు, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు.[4]
కోర్సులు - శాఖలు
మార్చు- అనాటమీ
- ఫార్మాకాలజీ
- ఫిజియోలాజీ
- బయోకెమిస్ట్రీ
- పాథాలజీ
- మైక్రోబయోలాజీ
- ఫోరెన్సిక్ మెడిసిన్
- జెనరల్ సర్జరీ
- ఆర్థోపెడిక్స్
- ఓటో-రైనో-లారిగోలజీ
- ఆప్తాల్మోలజీ
- జనరల్ మెడిసిన్
- టిబి & ఆర్‌డి
- డివిఎల్
- సైకియాట్రీ
- పీడియాట్రిక్స్
- ఓబిజీ
- అనస్థీషియాలజీ
- కమ్యూనిటీ మెడిసిన్
- రేడియోడియాగ్నోసిస్
- ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్
- టీబీసీడీ
- సీటీ సర్జరీ
- న్యూరో సర్జరీ
- న్యూరాలజీ
- ప్లాస్టిక్ సర్జరీ
- యూరాలజీ
- గాస్ట్రోఎంట్రాలజీ
- ఎండోక్రైనాలజీ
- నెఫ్రాలజీ
- కార్డియాలజీ
- ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్
- ఈఎన్‌టీ
- ఆప్తల్
- అనస్తీషియా
- డెంటల్
సిబ్బంది
మార్చువీటిలో 15 ప్రిన్సిపల్, 15 వైస్ ప్రిన్సిపల్ కమ్ ప్రొఫెసర్, 105 ప్రొఫెసర్, 180 అసిస్టెంట్ ప్రొఫెసర్, 300 లెక్చరర్, 15 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, 15 ఆఫీస్ సూపరింటెండెంట్, 30 సీనియర్ అసిస్టెంట్, 15 లైబ్రేరియన్, 30 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.[5] వీటితోపాటు ఈ వైద్య కళాశాలో విధులు నిర్వహించేందుకు కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీస్ సబార్డినేటర్లు, ల్యాబ్ అటెండెంట్, రికార్డింగ్ అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్ వంటి 33 పోస్టులు కేటాయించబడ్డాయి.
తరగతుల ప్రారంభం
మార్చు2022 నవంబరు 15 నుండి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రగతి భవన్ వేదికగా ఆన్‌లైన్ ద్వారా ఒకేసారి 8 వైద్య కళాశాలల ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం తరగతులను సీఎం కేసీఆర్ ప్రారంభించి వైద్యరంగంలో గుణాత్మక మార్పుకు, దేశ వైద్యరంగంలోనే నూతన అధ్యాయానికి నాందిపలికాడు.[6]
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "మహబూబాబాద్ కొత్త వైద్య కళాశాలకు అనుమతి". EENADU. Archived from the original on 2022-11-04. Retrieved 2022-11-04.
- ↑ India, The Hans (2021-06-10). "Mahabubabad: Site identified for Medical college". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-06-11. Retrieved 2022-11-04.
- ↑ telugu, NT News (2022-05-10). "తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే మానుకోట అభివృద్ధి : మంత్రి హరీశ్ రావు". Namasthe Telangana. Archived from the original on 2022-05-11. Retrieved 2022-11-04.
- ↑ telugu, NT News (2022-04-18). "మారుమూల ప్రాంతాల్లో కూడా కార్పొరేట్ వైద్యం : మంత్రులు సత్యవతి, ఎర్రబెల్లి". Namasthe Telangana. Archived from the original on 2022-04-18. Retrieved 2022-11-04.
- ↑ "7 కొత్త వైద్య కళాశాలల్లో 7,007 పోస్టులు". Sakshi. 2021-06-25. Archived from the original on 2021-06-25. Retrieved 2022-11-07.
- ↑ telugu, NT News (2022-11-15). "మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్". www.ntnews.com. Archived from the original on 2022-11-15. Retrieved 2022-11-16.