ముహమ్మద్ అజహరుద్దీన్

(మహమ్మద్ అజారుద్దీన్ నుండి దారిమార్పు చెందింది)

ముహమ్మద్ అజహరుద్దీన్ (జననం 1963, ఫిబ్రవరి 8, హైదరాబాదులో) అజహర్ గా పిలువబడే అజహరుద్దీన్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. మ్యాచ్‌ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని ఆటకు దూరమయ్యాడు. కానీ కోర్టులో ఆ కేసు నుంచి నిర్దోషిగా విడుదలయ్యాడు.[1] 2009 మేలో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యునిగా ఉత్తర ప్రదేశ్ లోని మురాదాబాద్ నియోజకవర్గం నుండి గెలుపొందాడు. ఈయన సికింద్రాబాదులోని మహబూబ్ కళాశాలలో చదువుకున్నాడు.

ముహమ్మద్ అజహరుద్దీన్
ముహమ్మద్ అజహరుద్దీన్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009
ముందు షాఫిఖర్ రహమాన్ బరక్
నియోజకవర్గం మొరదాబాద్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి సంగీత బిజ్లానీ
సంతానం అయాజుద్దిన్
అసద్
మతం ఇస్లాం
వెబ్‌సైటు http://azhar.co/
జనవరి 2, 2014నాటికి
ముహమ్మద్ అజహరుద్దీన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ముహమ్మద్ అజహరుద్దీన్
పుట్టిన తేదీ (1963-02-08) 1963 ఫిబ్రవరి 8 (వయసు 61)
మారుపేరుఅజహర్
బ్యాటింగుకుడిచేతి బ్యాట్స్‌మాన్
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబ్యాట్స్-మ్యాన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 169)1984 డిసెంబరు 31 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు2000 మార్చి 2 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 51)1985 జనవరి 20 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2000 జూన్ 3 - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1981–2000హైదరాబాద్ క్రికెట్ టీమ్
1983–2000సౌత్ జోన్
1991–1994Derbyshire
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా LA
మ్యాచ్‌లు 99 334 229 433
చేసిన పరుగులు 6,215 9,378 15,855 12,941
బ్యాటింగు సగటు 45.03 36.92 51.98 39.33
100లు/50లు 22/21 7/58 54/74 11/85
అత్యుత్తమ స్కోరు 199 153* 226 161*
వేసిన బంతులు 13 552 1,432 827
వికెట్లు 0 12 17 15
బౌలింగు సగటు 39.91 46.23 47.26
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు n/a 0 n/a
అత్యుత్తమ బౌలింగు 0/4 3/19 3/36 3/19
క్యాచ్‌లు/స్టంపింగులు 105/– 156/– 220/– 200/–
మూలం: CricketArchive, 2009 ఫిబ్రవరి 13

జీవిత చరిత్ర

మార్చు

అజారుద్దీన్ 1963 ఫిబ్రవరి 8 న మహమ్మద్ అజీజుద్దీన్, యూసఫ్ సుల్తానా దంపతులకు, హైదరాబాదులో జన్మించాడు. ఆల్ సెయింట్స్ హైస్కూల్లో చదివాడు. నిజాం కళాశాల నుంచి బి.కాం డిగ్రీ పుచ్చుకున్నాడు.[2]

క్రికెట్ జీవితం

మార్చు

ఇతని మణికట్టు ఆట శైలికి పేరు పొందాడు. ఇతను మొట్టమొదటిసారిగా 1984 డిసెంబరు 31 న కలకత్తాలో భారత్ ఇంగ్లండు దేశాల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ తో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు. మొదటి ఇన్నింగ్స్ లోనే 322 బంతులు ఎదుర్కొని 110 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో ఇతనికి జతగా రవిశాస్త్రి 111 పరుగులు చేశాడు. ఈ ఆట డ్రాగా ముగిసింది. తర్వాత ఆడిన రెండు టెస్టు మ్యాచుల్లోనూ అజర్ రెండు శతకాలు సాధించాడు.

1989 లో కృష్ణమాచారి శ్రీకాంత్ తర్వాత భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీ చేపట్టాడు. మొత్తం 47 టెస్ట్ మ్యాచులు, 174 వన్డే మ్యాచులకు కెప్టెన్ గా వ్యవహరించాడు.

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు

మార్చు

2000 లో అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు.[3] సిబిఐ నివేదిక ప్రకారం దక్షిణాఫ్రికా కెప్టెన్ హ్యాన్సీ క్రోనేకి బుకీలకు పరిచయం చేసింది అజారుద్దీనే.[4] సిబిఐ తరఫున కె. మాధవన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐసిసి, బిసిసిఐ అజారుద్దీన్ ను జీవితకాలం క్రికెట్ లో ఆడకుండా నిషేధించారు.[5][6]

2012 నవంబరు 8 న హైదరాబాదులోని డివిజనల్ కోర్టులోని న్యాయమూర్తులు అశుతోష్ మొహంతా, కృష్ణమోహన్ రెడ్డి కోర్టుకు సమర్పించిన ఆధారాల మేరకు ఆయనపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. అతనిపై నిషేధం అక్రమమని తీర్పు చెప్పింది. అయితే ఆరోపణలు ఎదుర్కొన్నప్పటి నుంచి అజహర్ మైదానంలోకి రాలేదు. ఈ తీర్పు వెలువడే నాటికి అజహర్ వయసు 49 సంవత్సరాలు.[7][8][9]

రాజకీయ జీవితం

మార్చు

2009 పార్లమెంటు ఎన్నికలు

మార్చు

కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యునిగా ఉత్తర ప్రదేశ్ లోని మురాదాబాద్ నియోజకవర్గం నుండి 49,107 మెజారిటీతో గెలుపొందాడు.[10] ఆయన 2014లో రాజస్థాన్‌లోని టోంక్ సవాయీ మాధోపుర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సుఖ్బీర్ సింగ్ జోనాపురియా చేతిలో 1,35,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అజహరుద్దీన్‌ 2019 ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండి[11], 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రకటించిన రెండో జాబితాలో ఆయనను జూబ్లీహిల్స్‌ అభ్యర్థిగా ప్రకటించింది.[12][13][14]

ఇతరాలు

మార్చు

2013 జూలై 14 న మొహమ్మద్ అజహరుద్దీన్ ఢిల్లీ బ్యాడ్మింటన్ సంఘం (డీబీఏ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[15]

వ్యక్తిగత జీవితం

మార్చు

అజహర్ తన మొదటి భార్య నౌరీన్ కు విడాకులిచ్చి, నటి సంగీతా బిజలానీని వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య సంతానం ఇద్దరు కొడుకులు అయాజుద్దీన్, అసద్. అయాజుద్దీన్ 2011 సెప్టెంబరు 11 న ఔటర్ రింగ్ రోడ్డులో పుప్పాలగూడ వద్ద బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చనిపోయాడు.

ఇవి కూడా చూడండి

మార్చు

*మొహమ్మద్ అజహరుద్దీన్ క్రికెట్ సెంచరీల జాబితా

మూలాలు

మార్చు
  1. http://news.bbc.co.uk/sport2/hi/in_depth/2000/corruption_in_cricket/1055889.stm
  2. "Biography of Azhar". azhar.co.in. Archived from the original on 8 ఏప్రిల్ 2016. Retrieved 12 May 2016..
  3. The CBI Report in Full – Part 26 (Report). 1 November 2000. Retrieved 21 December 2010 – via Rediff.com.
  4. The CBI Report in Full – Part 25 (Report). 1 November 2000. Retrieved 21 December 2010 – via Rediff.com.
  5. Full text of the CBI (Report). Central Bureau of Investigation, New Delhi. 1 November 2000. Retrieved 21 December 2010 – via Rediff.com.
  6. "Azharuddin confesses all". Archived from the original on 11 January 2022.
  7. "AP high court lifts ban on Azharuddin". Wisden India. 8 November 2012. Archived from the original on 12 మే 2016. Retrieved 14 May 2016.
  8. "Match fixing scandal". The Hindu. 8 November 2012. Retrieved 21 March 2015.
  9. "Match fixing charges: Andhra court says life ban on Azharuddin illegal". NDTV. 8 November 2012. Archived from the original on 9 June 2016. Retrieved 21 March 2015.
  10. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-10-11. Retrieved 2013-11-25.
  11. BBC News తెలుగు (31 October 2023). "Telangana Elections: కేసీఆర్‌పై పోటీకి సైతం సిద్ధమన్న అజహరుద్దీన్‌కు జూబ్లీహిల్స్‌లో అదృష్టం వరించేనా?". Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
  12. Eenadu (27 October 2023). "తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండో జాబితా విడుదల". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
  13. Sakshi (27 October 2023). "కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
  14. Andhrajyothy (28 October 2023). "విష్ణును పక్కనెట్టి అజారుద్దీన్‌కే కాంగ్రెస్ టికెట్ ఎందుకు..?". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
  15. http://www.andhraprabha.com/sports/azahar-new-innings/1140.html[permanent dead link]

బయటి లింకులు

మార్చు