మహా కూటమి (2009)
మహా కూటమి అనేది 2009 లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు, భారత సార్వత్రిక ఎన్నికలూ ఒకేసారి జరిగినపుడు ఏర్పడిన ముందస్తు కూటమి. దీనిని 2009 జనవరి 21 న నాలుగు రాజకీయ పార్టీలు - తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలు కలిసి ఏర్పాటు చేశాయి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో ఇది ఏర్పడింది.[4]
మహా కూటమి | |
---|---|
నాయకుడు | నారా చంద్రబాబు నాయుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు బి.వి.రాఘవులు కె. నారాయణ[1] |
స్థాపన తేదీ | 2009 జనవరి 21[2] |
రద్దైన తేదీ | 2009 జూన్ ప్రాంతంలో |
రాజకీయ విధానం | లౌకికవాదం కమ్యూనిజం ప్రజాకర్షక వాదం[3] |
కూటమి | థర్డ్ ఫ్రంట్ |
శాసనసభలో సీట్లు | 107 / 294 (2009) |
నేపథ్యం
మార్చు2008 లోక్‌సభ విశ్వాస తీర్మానం తర్వాత లెఫ్ట్ ఫ్రంట్, కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వానికి తాను ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంది. తెలుగుదేశం పార్టీ (తెదేపా), తెరాసలు జాతీయ థర్డ్ ఫ్రంట్ లో భాగంగా వామపక్షాలతో కలిసాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ కూటమి, తమను తాము "అవినీతిమయ కాంగ్రెసుకు", "మతతత్వ బిజెపికీ" వ్యతిరేకంగా ఏర్పాటైన "మహాకూటమి" అని పిలుచుకుంది.[5][6]
అఖిల భారత సున్నీ ఉలేమా బోర్డు ఈ కూటమిని ఆమోదించింది.[7]
అంతర్గత పోరు, ఓటమి
మార్చుకూటమి లోని భాగస్వామ్య పార్టీల మధ్య అంతర్గత పోరు జరిగింది. ప్రధానంగా సీట్ల పంపకాలలో విభేదాల కారణంగా ఈ పోరు ఏర్పడింది.[8] పార్టీల మధ్య పరస్పర అపనమ్మకం, అయోమయం నెలకొని కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీ (పిఆర్‌పి) లకు ఓట్లూ, సీట్లూ కోల్పోయాయి. ముఖ్యంగా, సీట్ల పంపకంపై ఉన్న విభేదాలు పరిష్కరించుకోవడం నామినేషన్ల గడువుకు 48 గంటల ముందు మాతరమే జరిగింది.[6] ఈ కూటమిని ఇండియా టుడే ఇలా వర్ణించింది, "సైద్ధాంతిక భూమిక లేని, సూపర్-సైజ్ ఇగోలు, ప్రధానమంత్రి ఆశలతో కూడుకున్న వదులుగా ఉన్న సమూహం." [9] అధికార వ్యతిరేక ఓట్లు తెదేపా, ప్రజారాజ్యం పార్టీల మధ్య విభాజితమై, కాంగ్రెస్ లాభపడింది. ఇది తెదేపాను దెబ్బతీసింది. టిఆర్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీల ఓట్లు టిడిపికి బదిలీ కాలేదు. దీని వల్ల కూటమి చాలా సీట్లు కోల్పోయింది - ముఖ్యంగా తెలంగాణలో.[10] తెలంగాణ రాష్ట్ర సాధన అంశం కూడా కూటమిలో చీలికకు ఒక కారణం.[11]
ప్రచారం
మార్చుఎన్నికల సమయంలో టీడీపీ అధినేత నాయుడు స్వరంలో అనూహ్యమైన మార్పు వచ్చింది. సైబరాబాద్ (ప్రస్తుతం హైటెక్ సిటీ) స్థాపకుడిగా తనను తాను కీర్తించుకుని, మొన్నటి ఎన్నికలలో తనను తాను ఆధునీకరణ పితామహుడిగా చూపించుకున్న నాయుడు, ఇప్పుడు పేదలు, రైతులు, పల్లెల అభివృద్ధికి సంబంధించిన ఆందోళనలను లేవనెత్తారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు వల్ల తెలంగాణ రాష్ట్ర సాధనకు వ్యతిరేకంగా టీడీపీ కూడా తన వైఖరిని విడనాడాల్సి వచ్చింది.[12]
మేనిఫెస్టో
మార్చుమేనిఫెస్టోను 2009 ఏప్రిల్ 3 న విడుదల చేసారు. అందులోని ముఖ్యాంశాలు[13]
- సామాన్యులకు ఆర్థిక, ఆరోగ్యం, ఆహార భద్రత కల్పించడంతోపాటు సమాజంలో ఆర్థిక అసమానతలను తగ్గించడం.
- నగదు బదిలీ పథకం (CTS) అమలు
- పేద, మధ్యతరగతి కుటుంబాలకు సమీకృత ఆరోగ్య పథకం
- ప్రతి "సామాన్యుడికి" ఉచిత కలర్ టీవీ సెట్
- రాజకీయ అవినీతి నియంత్రణకు చట్టం; రాజకీయ నాయకుల అసమాన ఆదాయాలపై విచారించడానికి, మూల్యాంకనం చేయడానికి ట్రిబ్యునల్ ఏర్పాటు
- ప్రతి కుటుంబానికి ₹2,000 (2023లో ₹5,100) నెలవారీ నగదు అందజేయడం
- తెలంగాణ సమస్య పరిష్కారం
రాజ్యాంగ పార్టీలు
మార్చుఎన్నికల చరిత్ర
మార్చుశాసన సభ ఎన్నికలు
మార్చునం. | పార్టీ | జెండా | చిహ్నం | నాయకుడు | సీట్లలో పోటీ చేశారు | సీట్లు గెలుచుకున్నారు |
---|---|---|---|---|---|---|
1. | తెలుగుదేశం పార్టీ | ఎన్.చంద్రబాబు నాయుడు | 225 | 92 | ||
2. | తెలంగాణ రాష్ట్ర సమితి | కె. చంద్రశేఖర్ రావు | 45 | 10 | ||
3. | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | బివి రాఘవులు | 18 | 4 | ||
4. | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | కె. నారాయణ | 14 | 1 | ||
మొత్తం | 302 [a] | 107 |
గమనికలు
మార్చు- ↑ Seat agreements within the grand alliance differed as some members contested additional seats against each other.
మూలాలు
మార్చు- ↑ "Grand Alliance falling apart". The New Indian Express. 8 June 2009. Archived from the original on 18 December 2023. Retrieved 2023-12-18.
- ↑ "Grand Alliance takes shape". The New Indian Express. 16 January 2009. Archived from the original on 18 December 2023. Retrieved 2023-12-18.
- ↑ Sukumar, C. R. (2009-03-22). "Parties in AP go all out with populist promises". mint (in ఇంగ్లీష్). Archived from the original on 18 December 2023. Retrieved 2023-12-18.
- ↑ "Congress headache: TRS joins TDP-Left alliance for Andhra polls". The Indian Express (in ఇంగ్లీష్). 2009-02-01. Archived from the original on 18 December 2023. Retrieved 2023-12-18.
- ↑ "Grand alliance a morale booster: CPI". The Hindu. 4 February 2009. Archived from the original on 7 February 2009. Retrieved 2009-10-14.
- ↑ 6.0 6.1 "Incompatible allies". India Today (in ఇంగ్లీష్). 13 April 2009. Archived from the original on 18 December 2023. Retrieved 2023-12-18. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Sunni Ulema Board to go with Mahakutami". The Times of India. 2009-04-14. ISSN 0971-8257. Archived from the original on 18 December 2023. Retrieved 2023-12-18.
- ↑ "Grand alliance in maha trouble". The Times of India. 2009-03-26. ISSN 0971-8257. Archived from the original on 18 December 2023. Retrieved 2023-12-18.
- ↑ "The front runners". India Today (in ఇంగ్లీష్). 4 May 2023. Archived from the original on 18 December 2023. Retrieved 2023-12-18.
- ↑ "Andhra: YSR comes up trumps". India Today (in ఇంగ్లీష్). 17 May 2009. Archived from the original on 18 December 2023. Retrieved 2023-12-18.
- ↑ "KCR begins lobbying for separate Telangana". India Today (in ఇంగ్లీష్). 26 April 2009. Archived from the original on 18 December 2023. Retrieved 2023-12-18.
- ↑ "Incompatible allies". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 18 December 2023. Retrieved 2023-12-18.
- ↑ "TDP launches manifesto". The New Indian Express. 3 April 2009. Archived from the original on 18 December 2023. Retrieved 2023-12-18.