మహ్మద్ హబీబ్

తెలంగాణకు చెందిన ఫుట్‌బాల్ ఆటగాడు, కెప్టెన్

మహ్మద్ హబీబ్ (1949, జూలై 17 - 2023, ఆగస్టు 15) తెలంగాణకు చెందిన ఫుట్‌బాల్ ఆటగాడు, కెప్టెన్. భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు ఫార్వర్డ్‌గా ఆడాడు.[2] భారతదేశ అత్యుత్తమ ఫుట్‌బాల్ క్రీడాకారులలో ఒకడిగా గుర్తింపు పొందాడు.[3]

మహ్మద్ హబీబ్
వ్యక్తిగత సమాచారం
జనన తేదీ (1949-07-17)1949 జూలై 17
జనన ప్రదేశం హైదరాబాదు, తెలంగాణ
మరణ తేదీ 2023 ఆగస్టు 15(2023-08-15) (వయసు 74)
ఆడే స్థానం ఫార్వర్డ్
సీనియర్ కెరీర్*
సంవత్సరాలు జట్టు Apps (Gls)
? సిటీ కాలేజ్ ఓల్డ్ బాయ్స్ క్లబ్
1966–1968 ఈస్ట్ బెంగాల్
1968–1969 మోహన్ బగన్
1970–1974 ఈస్ట్ బెంగాల్
1975 మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్
1976–78 మోహన్ బగన్
1979 మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్
1980–81 ఈస్ట్ బెంగాల్
1982–84 మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్
జాతీయ జట్టు
1965–1975[1] భారతదేశం
  • Senior club appearances and goals counted for the domestic league only.
† Appearances (Goals).

మహ్మద్ హబీబ్ 1949, జూలై 17l తెలంగాణలోని హైదరాబాదులో జన్మించాడు.

క్లబ్ కెరీర్

మార్చు

1968లో హబీబ్ కలకత్తా ఫుట్‌బాల్ లీగ్ క్లబ్ మోహన్ బగాన్‌లో చేరాడు. "డైమండ్ కోచ్" అమల్ దత్తా,[4] ఆధ్వర్యంలో ఆడాడు. ఫైనల్‌లో ఈస్ట్ బెంగాల్‌పై 3-1 విజయంతో 1969 ఐఎఫ్ఏ షీల్డ్‌ను గెలుచుకున్నాడు.[5]

తెలంగాణ రాష్ట్రానికి చెందినప్పటికీ, ఇతను సంతోష్ ట్రోఫీలో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించాడు.[6] 1969లో బెంగాల్‌తో శాంటో మిత్ర, హబీబ్ నేతృత్వంలోని జట్టు టైటిల్ గెలుచుకుంది.[7] మద్రాస్, సర్వీసెస్‌పై రెండు హ్యాట్రిక్‌లతో సహా పదకొండు గోల్‌లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.[7]

అంతర్జాతీయ కెరీర్

మార్చు

హబీబ్ అంతర్జాతీయ టోర్నమెంట్లలో భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 1970 బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా క్రీడలలో సయ్యద్ నయీముద్దీన్ నేతృత్వంలో,[8][9] పికె బెనర్జీ నిర్వహించిన జట్టుతో కలిసి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.[10][11][12]

నిర్వాహక వృత్తి

మార్చు

ఫుట్‌బాల్ ఆడిన తర్వాత, హబీబ్ టాటా ఫుట్‌బాల్ అకాడమీకి కోచ్ అయ్యాడు. హల్దియాలోని ఇండియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ అకాడమీకి చీఫ్ కోచ్‌గా కూడా పనిచేశాడు.[13]

1999 నుండి 2000, 2000-2003, 2005 వరకు జరిగిన దేశీయ పోటీలలో మొహమ్మదీన్ స్పోర్టింగ్‌కు మార్గనిర్దేశం చేశాడు.[14][15] 2007 నుండి 2008 వరకు ముంబై ఫుట్‌బాల్ లీగ్‌లో బెంగాల్ ముంబై ఎఫ్.సి.ని కూడా నిర్వహించాడు.[16][17]

సన్మానాలు

మార్చు

బెంగాల్

  • సంతోష్ ట్రోఫీ: 1969[7]

తూర్పు బెంగాల్

  • ఐఎఫ్ఏ షీల్డ్: 1970, 1974
  • ఫెడరేషన్ కప్: 1980–81

భారతదేశం

  • ఆసియా క్రీడల కాంస్య పతకం: 1970[18]
  • మెర్డెకా టోర్నమెంట్ మూడవ స్థానం: 1970[19]
  • పెస్టా సుకాన్ కప్ (సింగపూర్): 1971[20]

మోహన్ బగాన్

  • ఫెడరేషన్ కప్: 1978–79

వ్యక్తిగత

  • సంతోష్ ట్రోఫీ టాప్ స్కోరర్: 1969 (11 గోల్స్‌తో)[7]

అవార్డులు

మహమ్మద్ హబీబ్ తన 74 ఏళ్ళ వయసులో 2023, ఆగస్టు 15న మరణించాడు.[3]

మూలాలు

మార్చు
  1. "Indian football legend Habib felicitated". Archived from the original on 8 June 2017. Retrieved 2023-08-16.
  2. Mukhopadhyay, Shoubhik (10 September 2015). "East Bengal & Calcutta Football League: A Sublime Romantic Saga – Hero I-League". i-league.org. I-League. Archived from the original on 25 September 2019. Retrieved 2023-08-16.
  3. 3.0 3.1 "Indian football legend Mohammed Habib passes away at 74". Sportstar. 15 August 2023. Retrieved 2023-08-16.
  4. Sengupta, Somnath (13 July 2011). "Tactical Evolution of Indian Football (Part Three): PK Banerjee – Amal Dutta – Nayeemuddin". thehardtackle.com. Kolkata: The Hard Tackle. Archived from the original on 14 July 2011. Retrieved 2023-08-16.
  5. "1960 to 1969". Mohun Bagan Club. Archived from the original on 5 May 2022. Retrieved 2023-08-16.
  6. 6.0 6.1 "Football Legend Mohamamed Habib Gets Bharat Gaurav Award". Archived from the original on 4 March 2016. Retrieved 2023-08-16.
  7. 7.0 7.1 7.2 7.3 Kapadia, Novy (27 May 2012). "Memorable moments in the Santosh Trophy". www.sportskeeda.com. Sportskeeda. Archived from the original on 12 April 2021. Retrieved 2023-08-16.
  8. Nizamuddin, Mohammed (14 July 2018). "Old-timers recollect past glory of city football". Hyderabad, Telangana: The Hans India. Archived from the original on 22 October 2021. Retrieved 2023-08-16.
  9. "Former India goalkeeper Bandya Kakade is no more". The Free Press Journal. 18 October 2012. Archived from the original on 13 July 2013. Retrieved 2023-08-16.
  10. Basu, Jaydeep (3 February 2020). "Indian football's finest: 50 years on, remembering the stars of 1970 Asian Games bronze-winning team". www.scroll.in. Scroll. Archived from the original on 24 March 2022. Retrieved 2023-08-16.
  11. Chaudhuri, Arunava. "The Indian Senior Team at the 1970 Bangkok Asian Games". IndianFootball.de. Archived from the original on 2 October 2011. Retrieved 2023-08-16.
  12. Ghoshal, Amoy (26 August 2014). "Indian football team at the Asian Games: 1970 Bangkok". www.sportskeeda.com. Sportskeeda. Archived from the original on 10 July 2018. Retrieved 2023-08-16.
  13. Roy, Gautam; Ball, Swapan (2007). "East Bengal Football Club – Famous Players". www.eastbengalfootballclub.com. Archived from the original on 21 February 2009. Retrieved 2023-08-16.
  14. "Habib, who once ruled Kolkata maidan, goes into seclusion in Hyderabad (Where Are They Now?)". outlookindia.com. Archived from the original on 9 July 2021. Retrieved 2023-08-16.
  15. Legends Of Indian Football : Mohammad Habib Archived 12 జనవరి 2019 at the Wayback Machine The Hard Tackle.
  16. Chaudhuri, Arunava. "Season ending Transfers 2007: India". indianfootball.de. Indian Football Network. Archived from the original on 21 May 2021. Retrieved 2023-08-16.
  17. Chaudhuri, Arunava. "Season ending Transfers 2008: India". indianfootball.de. Indian Football Network. Archived from the original on 16 July 2021. Retrieved 2023-08-16.
  18. Media Team, AIFF (15 August 2022). "Indian Football Down the Years: Looking back at the glorious moments". www.the-aiff.com (in ఇంగ్లీష్). New Delhi: All India Football Federation. Archived from the original on 21 September 2022. Retrieved 2023-08-16.
  19. Chaudhuri, Arunava (2003). "The Indian Senior Team at the 1970 Merdeka Cup". indiafootball.de. IndiaFootball. Archived from the original on 19 August 2016. Retrieved 2023-08-16.
  20. Chaudhuri, Arunava (2000). "The Indian Senior Team at the 1971 Singapore Pesta Sukan Cup". indianfootball.de. Archived from the original on 19 August 2016. Retrieved 2023-08-16.
  21. "LIST OF ARJUNA AWARD WINNERS - Football | Ministry of Youth Affairs and Sports". yas.nic.in. Ministry of Youth Affairs and Sports. Archived from the original on 25 December 2007. Retrieved 2023-08-16.
  22. "List of Arjuna Awardees (1961–2018)" (PDF). Ministry of Youth Affairs and Sports (India). Archived from the original (PDF) on 18 July 2020. Retrieved 2023-08-16.
  23. Chaudhuri, Arunava (2000). "National Award winning Footballers". indianfootball.de. IndianFootball. Archived from the original on 1 October 2018. Retrieved 2023-08-16.
  24. "Chief Minister's Office: Banga Bibhusan and Banga Bhusan – 2018". wbcmo.gov.in. The Government of West Bengal. 21 May 2018. Archived from the original on 9 August 2022. Retrieved 2023-08-16.

బయటి లింకులు

మార్చు