అన్వేషిత 1997, ఆగస్టు 27న ఈటీవీలో ప్రారంభమైన ధారావాహిక. ఇలియాస్ జ్యోత్స్న రాసిన ఈ సీరియల్ కు ఇలియాస్ అహ్మద్ (ప్రద్యుమ్న) దర్శకత్వం వహించారు. రామోజీ గ్రూప్ అధినేత, అప్పటి ఈటీవీ అధిపతి రామోజీరావు నిర్మాణ సారథ్యంలో 100 ఎపిసోడ్లు పూర్తిచేసుకున్న ఈ సీరియల్ 1999లో చివరి ఎపిసోడ్ ప్రసారమయ్యే సమయానికి, తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందింది. అంతేకాకుండా వివిధ విభాగాలలో ఎనిమిది టీవి నంది అవార్డులను గెలుచుకుంది.[1]

అన్వేషిత
జానర్పారానార్మల్, బ్లాక్ మ్యాజిక్, ఫాంటసీ, హర్రర్, మిస్టరీ, డ్రామా
రచయితడా. ఇలియాస్ జోత్స్న
దర్శకత్వంఇలియాస్ అహ్మద్ (ప్రద్యుమ్న)
తారాగణంఅచ్యుత్
యమున
Opening themeఅన్వేషిత (గానం: కె.ఎస్.చిత్ర)
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సిరీస్‌లసంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య100
ప్రొడక్షన్
ప్రొడ్యూసర్రామోజీరావు
నిడివి18–24 నిముషాలు
ప్రొడక్షన్ కంపెనీరామోజీ గ్రూప్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్ఈటీవీ
చిత్రం ఫార్మాట్480ఐ
వాస్తవ విడుదల27 ఆగస్టు 1997 (1997-08-27) –
1999 (1999)

ప్రతి ఎపిసోడ్ సుమారు 18-24 నిమిషాల పాటు కొనసాగింది. పారానార్మల్, బ్లాక్ మ్యాజిక్, ఫాంటసీ, హర్రర్, మిస్టరీ, డ్రామా నేపథ్యాలతో తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది. మంత్రవిద్య, చేతబడి, జ్యోతిష్య ప్రపంచం, జ్యోతిష్య ప్రయాణం, ఆత్మలు, దెయ్యాలు, ఓయిజా బోర్డు, ఎక్స్‌ట్రాసెన్సరీ పర్సెప్షన్, స్పిరిట్ గైడ్స్, జాంబీస్, టెలిపతి, సీయాన్స్ వంటి అనేక అతీంద్రియ అంశాలు ఇందులో చూపబడ్డాయి.[2]

నటవర్గం

మార్చు

పాటలు

మార్చు

నంది అవార్డు సాధించిన అన్వేషిత టైటిల్ సాంగ్‌ను మాధవపెద్ది సురేష్ స్వరపరచగా, కె.ఎస్.చిత్ర పాడింది.[3]

చిత్రీకరణ

మార్చు

హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సీరియల్ షూటింగ్ జరిగింది. దీనికోసం భారీస్థాయిలో కరాకింకర సెట్ నిర్మించబడింది.

స్పందన

మార్చు

ప్రత్యేకమైన, ఆసక్తికరమైన, గ్రిప్పింగ్ స్టోరీ లైన్‌తో ఈ సీరియల్ విమర్శకుల నుండి, ప్రేక్షకుల నుండి ప్రశంసలను అందుకుంది. 'ఖబీస్' పాత్ర, కరాకింకర విగ్రహం సీరియల్ కు ప్రత్యేకతంగా ఉండడంతో భయానకం విషయంలో పిల్లలు, పెద్దలకు ఇది ఇష్టమైన సీరియల్ గా నిలిచింది. ప్రధాన నటులైన, యమున, అచ్యుత్ నటనకు అనేక ప్రశంసలు లభించాయి. ఇద్దరు నటులు పేర్లు రాష్ట్రవ్యాప్తంగా ప్రాచూర్యం పొందాయి. [4] [5]

అవార్డులు

మార్చు
సంవత్సరం విభాగం గ్రహీత ఫలితం మూలాలు
1998 ఉత్తమ స్క్రీన్ ప్లే ఇలియాస్ జ్యోత్స్న గెలుపు
ఉత్తమ దుస్తులు కె. కోటేశ్వర్ రావు గెలుపు [6]
ఉత్తమ విలన్ రాజా గెలుపు
ఉత్తమ కళా దర్శకుడు వి. భాస్కర రాజు గెలుపు
1999 రెండవ ఉత్తమ మెగా సీరియల్ రామోజీరావు గెలుపు
ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ – ఆడ కె. ఎస్. చిత్ర గెలుపు [7]
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ పి. మురళి గెలుపు
ఉత్తమ గ్రాఫిక్స్ ఈనాడు టెలివిజన్ గెలుపు

మూలాలు

మార్చు
  1. http://www.nettv4u.com/about/Telugu/tv-serials/anveshitha
  2. https://www.youtube.com/watch?v=hqpTp1lXhlw
  3. https://www.youtube.com/watch?v=lNKpVPXH1Gc
  4. http://www.aakaankshacreations.com/#page_5/
  5. https://www.facebook.com/AnveshithaSerial/info?tab=page_info
  6. "Nandi TV Awards G.O and Results 1998". APSFTVTDC. Archived from the original on 2021-01-25.
  7. "Nandi TV Awards G.O and Results 1999". APSFTVTDC. Archived from the original on 2021-01-25.
"https://te.wikipedia.org/w/index.php?title=అన్వేషిత&oldid=3559749" నుండి వెలికితీశారు