మాయా మచ్ఛీంద్ర 1945లో విడుదలైన తెలుగు చలనచిత్రం. స్టార్‌ కంబైన్స్‌ పతాకంపై సి. పుల్లయ్య దర్శకత్వంలో రామయ్య నిర్మించాడు. ఈ చిత్రానికి మాటలు, పాటలు వూటుకూరు సత్యనారాయణ సమకూర్చగా, భీమవరపు నరసింహరావు సంగీతాన్నందించాడు. జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి, అద్దంకి శ్రీరామమూర్తి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సుబ్బారావు ఛాయాగ్రహణం చేసాడు.[1]

మాయా మచ్చీంద్ర
(1945 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.పుల్లయ్య
రచన ఊటుకూరి సత్యనారాయణరావు
తారాగణం కన్నాంబ,
జంధ్యాల గౌరీనాథశాస్త్రి,
అద్దంకి శ్రీరామమూర్తి,
మాలతి,
వల్లభజోస్యుల శివరాం,
కళ్యాణి,
సుందరమ్మ,
గౌరీపతిశాస్త్రి,
ముక్కామల కృష్ణమూర్తి
సంగీతం భీమవరపు నరసింహారావు
ఛాయాగ్రహణం ఎస్.నాయక్
నిర్మాణ సంస్థ ఫేమస్ సినీ & స్టార్ కంబైన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • జంధ్యాల గౌరీనాథశాస్త్రి,
  • అద్దంకి శ్రీరామమూర్తి,
  • ముక్కామల కృష్ణమూర్తి,
  • వి.శివరాం,
  • కె. గౌరీపతి శాస్త్రి,
  • కె.వి.సుబ్బారావు,
  • వి.విశ్వనాథం,
  • గండికోట,
  • కన్నాంబ,
  • మాలతి,
  • మంగళం,
  • జోషి,
  • కళ్యాణి,
  • కమల,
  • అంజనీబాయి,
  • బేబి వసుంధర,
  • బేబి శరత్‌

కథా సంగ్రహం

మార్చు

జగత్తు ప్రేమమయం అని, స్త్రీ పురుషులు ఇరువురూ సమానులే అని, ఒకరి ప్రేమ అభిమానం మరొకరికి దక్కితేనే ఆనంద హేతువు అవుతుందని వివరించే చిత్రం మాయామచ్ఛీంద్ర. మోహినీ అవతారం ఎత్తిన మహావిష్ణువు దేవదానవులకు అమృతం పంచడం గురించి తెలిశాక శివుడు ఆ విషయాన్ని నమ్మకపోవడంతో మళ్ళీ మోహిని కానడం, శివుడు శపించి, తన వల్లనే శాప విమోచన జరుగుతుందని చెప్పడం, విష్ణువు మచ్ఛీంద్రుడుగా భూలోకంలో చేరడం జరుగుతుంది. మచ్ఛీంద్రుడు చేసే మాయలతో ఓడిపోయిన రాణి తిలోత్తమతో వివాహం జరుగుతుంది. మచ్ఛీంద్రుని శిష్యుడు గోరఖ్‌నాథ్‌ గురువు కోసం వెతుకుచూ హనుమంతుని ద్వారా విషయం తెలుసుకుని, రాజనర్తకి సహాయంతో రాజ్యంలోకి ప్రవేశించి మచ్ఛీంద్రుని తీసుకెళ్ళే ప్రయత్నంలో మచ్ఛీంద్రుని కుమారున్ని పాము కాటుకు గురి చేసి మరణింప చేయడం, మచ్ఛీంద్రుడు తన శక్తితో ప్రయత్నించినా కుమారుడు బతకకపోవడంతో గోరఖ్‌నాథ్‌ షరతులకు తలొగ్గుతాడు. గోరఖ్‌నాథ్‌ కూడా మచ్ఛీంద్రుని కుమారుడుని బతికించలేక, అవమానంతో అగ్నికి ఆహుతి అయితే హనుమంతుడు ఆ శవాన్ని బయటకు తెచ్చాక మచ్ఛీంద్రుడు గోరఖ్‌నాథుడుకి ప్రాణం పోస్తాడు. బతికిన గోరఖ్‌నాథ్‌ మళ్లీ ప్రయత్నించి మచ్ఛీంద్రుని కుమారుని బతికిస్తాడు. అలా శివునికి, లక్ష్మీదేవికి మహావిష్ణువు ప్రేమ తత్వాన్ని వివరిస్తాడు ఈ చిత్రం ద్వారా.[2]

పాటలు

మార్చు
  • ఆహా ! ప్రకృతి అనందమేగా మిల మిల కులుకే ఆ సెలయేరు - మాలతి, వి. శివరాం
  • ఈ వియోగ జ్వాల , హృదయాని కెగబ్రాకె ఎద కాల్చి - మాలతి
  • ఓ మాలతీ నీ స్వామి శయనమున పరవశమొంది కను మూసెదవా - కన్నాంబ
  • గిరిజా ప్రియ శంభో భవ తరణా శిత భరణా - మాలతి, వి. శివరాం
  • జై జై జై కామరూప దేశార్చితరాణీ ! జయ సామ్రాజ్య విశాల - బృందం
  • తనువే అమృత కలశమురా త్రాగుము యవ్వన జీవన సుధ - బృందం
  • ధన్యంబయ్యెను జన్మము దేవా ! నీ పద సేవను  - కన్నాంబ
  • మేలుకో మేలుకో తెలవారి పగడాల తెరలు దిగెనో కొల కొల విహంగాలు - కన్నాంబ
  • వినవోయీ హృదయాలాపన వినవోయీ - ఆర్. బాలసరస్వతి దేవి
  • హాయిగ పాడెదను హృదయేశా హాయిగా పాడెదను - కన్నాంబ
  • కలకాలంబుగ రాజ్యభారము భుజస్కంధంబు (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
  • కలహంబుల్ విడనాడి , శాత్రవభుజా గర్వంబు బోకార్చి - (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
  • చక్కని చుక్కా ! అటుకొన్న ప్రేమ నే నాటాలె నీలోన - కె.గౌరీపతి శాస్త్రి,సుందరమ్మ
  • నను పరిహాసము సేయగ నేలా ఓ కలువరేడా - కన్నాంబ
  • హరహర ! ప్రమధగణాధిప ! దేవా ! భవహర శంకర - బృందం

మూలాలు

మార్చు
  1. "Maya Machindra (1946)". Indiancine.ma. Retrieved 2021-06-09.
  2. 1945లో కాసులు కురిపించిన స్వర్గసీమ,మాయాలోకం - ఆంధ్రప్రభ మార్చి 24, 2011[permanent dead link]