ముగ్గురు మూర్ఖురాళ్ళు
ముగ్గురు మూర్ఖురాళ్ళు మహేష్ దర్శకత్వంలో నిర్మించబడిన వినోదభరిత తెలుగు హాస్యచలనచిత్రం. ఇది డిసెంబరు 30, 1978న విడుదలయ్యింది.
ముగ్గురు మూర్ఖురాళ్ళు (1978 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | మహేష్ |
తారాగణం | రాజబాబు, విజయలలిత |
నిర్మాణ సంస్థ | లావణ్య పిక్చర్స్ |
భాష | తెలుగు |
సంక్షిప్త చిత్రకథ
మార్చుపెద్ద, చిన్న, బుల్లి ముగ్గురు మూర్ఖురాళ్ళు. కర్రసాము, కత్తిసాము, నృత్యకళలో వీరు సిద్ధహస్తులు. అయినా వీరి చేష్టలన్నీ నవ్వు పుట్టించేవే. పోస్టుబాక్సులో వేయమని వాళ్ళ తాతయ్య ఒక పెద్ద కవరు ఇస్తే, అది పట్టలేదని, ముక్కలుగా చించి పెట్టెలో వేసిన ఘనులు వీళ్ళు. వాళ్ళ తాతయ్యకు జబ్బు చేస్తే మందులు కొనడానికి డబ్బులు లేకపోతే డాన్సు చేసి, కత్తియుద్ధంలో గెలిచి డబ్బులు సంపాదించిన ఘనత కూడా వీరిదే. ఒకరోజు కొందరు రౌడీలు ఒక మనిషికి మత్తుమందు ఇచ్చి తీసుకుపోతుంటే ఈ ఆకతాయిలు ఆ రౌడీలను వెంబడించి ఆ మనిషిని విడిపిస్తారు. ఆ సమయంలో గంగాళమ్మ వీరికి తారస పడుతుంది. ఆ గంగాళమ్మ డబ్బుకోసం తమ్ముడి కుటుంబానికే ద్రోహం తలపెట్టిన మనిషి. గంగాళమ్మ వెనకల ఒక ముఠా వుంటుంది. ఈ ముగ్గురు ఆడపిల్లలు గంగాళమ్మ ఆటకట్టించి ఆమె దుర్మార్గాన్ని ఎలా బయట పెట్టింది అనేది పతాక సన్నివేశం[1].
నటీనటులు
మార్చు- జయమాలిని
- విజయలలిత
- రమాప్రభ
- సూర్యకాంతం
- రాజబాబు
- సత్యనారాయణ
- మిక్కిలినేని
- నాగేష్
- అశోక్‌కుమార్
- రాధికాకిరణ్
- మాదాల రంగారావు
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకుడు, నిర్మాత: మహేష్
- సంగీతం: చక్రవర్తి
- ఛాయగ్రహణం: జి.కె.రాము
- కూర్పు: సత్యం
- కళ: కళాధర్
పాటలు
మార్చుఈ సినిమాలో ఈ క్రింది పాటలు, పద్యాలు ఉన్నాయి[2].
- ఓ భర్తా (సావిత్రి నాటకం ) - ఎస్.జానకి, జి. ఆనంద్,ఎం. రమేష్,చంద్రశేఖర్ - రచన: వీటూరి
- తమలపాకుకు మూలలు మూడు - పి.సుశీల,ఎస్. జానకి, ఎస్.పి.శైలజ - రచన: మల్లెమాల
- భజన చేసే విధము చెప్పవే ఓ భామ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.వి. కృష్ణ, జి.వి. రమణ - రచన: వీటూరి
- కాళ్ళాగజ్జా కంకాళమ్మ - ఎస్.జానకి, వేదవతి ప్రభాకర్, బి.వసంత - రచన: సినారె
- చెల్లియో చెల్లకో మునుపు చేసిన తప్పులు ( పద్యం ) - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: వీటూరి
- జెండాపై పులిరాజు గాండ్రుమనుచున్ ( పద్యం ) - మాధవపెద్ది సత్యం - రచన: వీటూరి
మూలాలు
మార్చు- ↑ గాంధి (5 January 1979). "చిత్రసమీక్ష - ముగ్గురు మూర్ఖురాళ్ళు". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 65, సంచిక 271. Retrieved 8 December 2017.[permanent dead link]
- ↑ కొల్లూరి, భాస్కరరావు. "ముగ్గురు మూర్ఖురాళ్ళు - 1978". ఘంటసాల గళామృతము. Retrieved 8 December 2017.[permanent dead link]