డిసెంబర్ 30
తేదీ
(డిసెంబరు 30 నుండి దారిమార్పు చెందింది)
డిసెంబర్ 30, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 364వ రోజు (లీపు సంవత్సరములో 365వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 1 రోజు మిగిలినది.
<< | డిసెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 | ||||
2024 |
సంఘటనలు
మార్చు- 1906: భారత్లో తమ ప్రయోజనాలు కాపాడుకోవడానికి జాతీయస్థాయిలో కాంగ్రెస్ లాంటి పార్టీ అవసరమని భావించిన ముస్లిం ప్రముఖులు ఢాకాలో సమావేశమై ముస్లిం లీగ్ పార్టీని స్థాపించారు.
- 1922: రష్యన్ సోవియట్ ఫెడరేషన్, ట్రాన్స్కకేషియన్, ఉక్రేనియన్, బెలారసియన్ సోవియట్ రిపబ్లిక్లు నాలుగూ కలిసి ద యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్గా ఏర్పడ్డాయి.
- 1968: ఐక్యరాజ్య సమితి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ట్రిగ్వేలీ మరణించాడు.
- 1985: తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా విడిపోవడానికి గల కారణాలలో ముఖ్యమైనది జీ.వో.610ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం జారీచేసింది.
- 2003: శ్రీజయ ఆర్ట్స్ సంస్థను హైదరాబాద్ లో ఇదేరోజున సినీ, టీవీ, రంగస్థల నటి, దర్శకురాలు, డాక్టర్ శ్రీజ సాధినేని గారు స్థాపించారు. ఈ సంస్థలో కళలపై ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇస్తూ నటులుగా తీర్చి దిద్దుతున్నారు. అలాగే శ్రీజయా ఆర్ట్స్ నాటక పరిషత్తు పేరిట అఖిల భారత స్థాయిలో నాటికల పోటీలను నిర్వహిస్తున్నారు.
- 2006: ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దామ్ హుసేన్ ను ఉరితీసారు.
- 2008: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రేమ్ కుమార్ ధుమాల్ ప్రమాణస్వీకారం.
- 2009: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా శిబూసోరెన్ ప్రమాణస్వీకారం చేశాడు.
జననాలు
మార్చు- 1865: రుడ్యార్డ్ కిప్లింగ్, ఆంగ్ల రచయిత, కవి. (మ.1936)
- 1879: రమణ మహర్షి, బోధనలలో ప్రధానమైనది "మౌనము" లేదా "మౌనముద్ర". వీరు చాలా తక్కువగా ప్రసంగించేవారు
- 1887: కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకటరమణ కవి, అవధానంలో పేరొందిన జంట సోదర కవులు
- 1898: యలమంచిలి వెంకటప్పయ్య, స్వాతంత్ర్య సమర యోధుడు. కాకినాడలో 1920 లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలలో బ్రాహ్మణులకు ప్రత్యేక భోజన శాల ఉండటానికి వీల్లేదని అందరూ కలిసే తినాలనీ తీర్మానం చేయించాడు,
- 1935: మాన్యువెల్ ఆరన్ భారతదేశపు చదరంగం ఆటగాడు.
- 1944: అంజనా భౌమిక్, బెంగాలీ సినిమానటి.(మ.2024)
- 1948: సురీందర్ అమర్నాథ్ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఎడమచేతి బ్యాట్స్మెన్.
- 1968: సబీర్ భాటియా హాట్ మెయిల్ ఈమెయిల్ సర్వీసు సహ-వ్యవస్థాపకుడు.
- 1984: లెబ్రాన్ జేమ్స్ అమెరికన్ బాస్కెట్బాల్ క్రీడాకారుడు.
మరణాలు
మార్చు- 1955: వేమూరి గగ్గయ్య, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (జ.1895)
- 1971: విక్రం సారాభాయ్, శాస్త్రవేత్త.
- 1973: చిత్తూరు నాగయ్య, తెలుగు సినిమా నటుడు.
- 1992: వడ్డాది పాపయ్య, చిత్రకారుడు.
- 2006: పేకేటి శివరాం, తెలుగు సినిమా నటుడు. (జ.1918)
- 2009: విష్ణువర్ధన్, దక్షిణ భారత చలన చిత్రాలతో పాటు హిందీ చిత్రాల్లో సహాయ పాత్రల నటుడు.(జ.1950)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- -
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2005-10-28 at the Wayback Machine
డిసెంబర్ 29 - డిసెంబర్ 31 - నవంబర్ 30 - జనవరి 30 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |