ముదిగొండ వీరభద్రయ్య

ముదిగొండ వీరభద్రయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాహితీవేత్త, ఆచార్యుడు. 1986 నుండి 2004 వరకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేశాడు.[1] 2015లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ సాహితీవేత్తగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం అందుకున్నాడు.[2]

ముదిగొండ వీరభద్రయ్య
Mudigonda Veerabhadraiah.jpg
ముదిగొండ వీరభద్రయ్య
జననంతెలంగాణ
నివాస ప్రాంతంహైదరాబాదు
వృత్తిఆచార్యుడు
ప్రసిద్ధిరచయిత సాహితీవేత్త
మతంహిందూ

జననం - విద్యాభ్యాసంసవరించు

ముదిగొండ వీరభద్రయ్య 1963లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎం.ఏ తెలుగు, 1981లో వరంగల్లులోని కాకతీయ విశ్వవిద్యాలయం నుండి సామాజిక సాంస్కృతిక దృక్పథం గల కవిగా శ్రీశ్రీ అన్న అంశంమీద పిహెచ్.డి. పూర్తిచేశాడు.

రచించిన గ్రంథాలుసవరించు

కింద పేర్కొన్న గ్రంథాలు-విమర్శ మౌలిక లక్షణాలు, అనువర్తిత విమర్శ, సాంఘిక విమర్శ, కళాతాత్త్విక బయోగ్రఫికల్ విమర్శ, నవల కథానికా విమర్శ, ప్రతీక భావ చిత్ర విమర్శ, చారిత్రక విమర్శ, మార్క్సిస్ట్ విమర్శ, నవ్య సంప్రదాయ విమర్శ- అన్న విభాగాలకు చెందుతవి.

 1. శివయోగి
 2. తెలుగు కవిత - సాంఘిక సిద్ధాంతాలు
 3. విమర్శ మౌలిక లక్షణాలు
 4. సాహిత్య విమర్శ - సూత్రం; అన్వయం అనువర్తిత విమర్శ - విలువల నిర్ణయం
 5. సాహిత్య విమర్శ-ఆలోచన: ఆలోచన
 6. Major Critics of Modern Telugu Literature
 7. జీవిఎస్ విమర్శ దర్శనం
 8. సంపత్ కుమార విమర్శ-దేశీయతా భూమిక
 9. సుప్రసన్న- సమన్విత విమర్శ
 10. వేయి పడగలు - నవలా శిల్పం వేయి పడగలు-ఒక పరిశీలన
 11. రావిశాస్త్రి గారి ధర్మేతిహాసం-మూడు కథల బంగారం సినారె - మట్టి మనిషి ఆకాశం
 12. నా దేశం నా ప్రజలు (విప్లవకావ్య విమర్శ)
 13. శేషేంద్రుని కవిత్వం పై కవిత్వం (చిన్న పుస్తకం)
 14. కొందరు మానవతా కవులు - ఒక పరిశీలన
 15. జాతీయ కావ్యేతిహాసం వందేమాతరం వస్తు శిల్ప విమర్శ
 16. కళాతత్వ శాస్త్రం[3]
 17. విశ్వనాథ సాహిత్య తత్వ వివేచన

సంపాదకత్వంసవరించు

 1. సంజీవ దేవ్ వ్యాసాలు - సంపుటం 1 (తెలుగు అకాడెమి)
 2. సంజీవ దేవ్ వ్యాసాలు - సంపుటం 2 (తెలుగు అకాడెమి)
 3. మన వసు చరిత్ర రచనా విమర్శనం (తెలుగు విశ్వవిద్యాలయం) (తెన్నేటి రామచంద్రరావు)
 4. మన వసు చరిత్ర రచనా విమర్శనం (తెలుగు విశ్వవిద్యాలయం) (కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి)
 5. పింగళి సూరన (డి. దక్షిణామూర్తి)తెలుగు విశ్వవిద్యాలయం) & పింగళి సూరనామాత్యుడు (వింజమూరి రంగాచార్యులు)
 6. అన్నమయ్య సర్వేశ్వర శతకం (అర్ధ తాత్వర్య వ్యాఖ్యానాలు)
 7. సనాతన సారథి (మాస పత్రిక-ప్రశాంతి నిలయం) భగవాన్ శ్రీ సత్య సాయి బాబా దివ్య జీవిత చరిత్ర (రా.గణపతి రచన) (ముద్రణ)

సంగీత గ్రంథాలుసవరించు

 1. మన సంగీత కళావిద్యానిధులు
 2. వీణ:వీణా పాణులు
 3. ఈమని శంకరశాస్త్రి (చిన్న పుస్తకం)
 4. వీణాపాణి విశ్వేశ్వరన్ (చిన్న పుస్తకం)

ఆధ్యాత్మిక గ్రంథాలుసవరించు

 1. శ్రీ సత్యసాయి అవతార తత్త్వం లక్ష్యం
 2. షిరిడి సాయి సచ్చరిత-అంతరార్థం
 3. భగవాన్ స్వీయ కథనాలతో శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర (శ్రీ రమణాశ్రమం)
 4. శ్రీ సత్యసాయి జ్ఞాన మననం (సాధనా ట్రస్ట్-ప్రశాంతి నిలయం)
 5. శ్రీ సత్య సాయి వాహిని;వేద రసవాహిని (సాధనా ట్రస్ట్-ప్రశాంతి నిలయం)
 6. ఆత్మ శాస్త్రం (సాధనా ట్రస్ట్-ప్రశాంతి నిలయం)
 7. భగవాన్ శ్రీ సత్యసాయి దివ్యలీలా మకరందం. (సి.పి.బ్రౌన్ అకాడమీ) (ముద్రణలో)

అనువాద రచనలుసవరించు

 1. సాధన-నివృత్తి మార్గం
 2. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారితో సంభాషణ (హి స్లాప్ )
 3. 45 శ్రీ సత్యసాయి ఆర్తత్రాణ పరాయణుడు (కస్తూరి)
 4. దివ్య గురువు (జెన్నీ సోక్రాట్)
 5. సమస్త లోకాః సుఖినోభవంతు (పి.పి.ఎస్.శర్మ)
 6. లీలామోహన సాయి (టి.ఆర్.సాయి మోహన్)
 7. శ్రీ సాయి మహిమలు (ఎ.చిదంబర కృష్ణన్)
 8. 50 దివ్యస్మృతి (డయానాబాస్కిన్)
 9. రసో వై సః (బ్రహ్మానంద పాండా)
 10. సత్యం శివం సుందరం (6వ సంపుటం) (బి.ఎన్.నరసింహ మూర్తి)
 11. భగవాన్ శ్రీ సత్యసాయి-జీసస్ క్రైస్ట్ (సంకలనం, అనువాదం)

పురస్కారాలుసవరించు

 1. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం
 2. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం
 3. దిగుమర్తి సాహిత్య పురస్కారం
 4. జి.వి.ఎస్. కళాపీఠ పురస్కారం

ఇతర వివరాలుసవరించు

 1. సిద్దిపేటలో ముదిగొండ వీరభద్రయ్య ఉపాధ్యాయుడిగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాఠాలు బోధించాడు.[4]

మూలాలుసవరించు

 1. నమస్తే తెలంగాణ, సంపాదకీయం (20 September 2020). "మహా మౌనమే కవిత్వం". ntnews. డా॥ పి. భాస్కర యోగి. Archived from the original on 20 September 2020. Retrieved 8 October 2020.
 2. సాక్షి, తెలంగాణ (31 May 2015). "రాష్ట్రావతరణోత్సవాల్లో ప్రతిభకు పట్టం". Sakshi. Archived from the original on 19 December 2015. Retrieved 9 October 2020.
 3. ఆంధ్రభూమి (24 May 2019). "నేడు ముదిగొండ వీరభద్రయ్యకవిత్వకళాతత్వం గ్రంథావిష్కరణ". andhrabhoomi.net. Archived from the original on 8 October 2020. Retrieved 8 October 2020.
 4. తెలుగు వెలుగు, భాషోద్యమం. "భాషాభివృద్ధికి నిబద్దులం!". www.teluguvelugu.in. Archived from the original on 8 October 2020. Retrieved 8 October 2020.

ఇతర లంకెలుసవరించు