మూస చర్చ:తెలుగుభాషాసింగారం

అక్షరక్రమ పేజీలు వికీబుక్స్ కు తరలింపు

మార్చు

 Y సహాయం అందించబడింది

ఈ మూస వాడబడిన అక్షరక్రమ సామెతలు, జాతీయాలు, పొడుపుకథల పేజీలు (ప్రత్యేక:ఇక్కడికిలింకున్నపేజీలు/మూస:తెలుగుభాషాసింగారం లో అక్షరమాల లో అక్షరంతో అంతమయ్యే పేజీలు) వికీపీడియాకు సరిపడే వ్యాసాలు కాలేవు. వీటిని వికీబుక్స్ కు తరలించాలి. సభ్యులు స్పందించవలసినది. ఇంతకు ముందు సామెతల గురించి మాత్రమే జరిగిన చర్చ చూడండి. --అర్జున (చర్చ) 22:59, 25 మార్చి 2021 (UTC)Reply

వికీబుక్స్ కు తరలించాలి. యర్రా రామారావు (చర్చ) 03:09, 26 మార్చి 2021 (UTC)Reply
వికీ బుక్స్ కు తరలించాలి.-- K.Venkataramana -- 2021-04-03T18:45:01‎
యర్రా రామారావు, కె వెంకటరమణ గార్లకు, మీ స్పందనలకు ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 04:00, 16 ఏప్రిల్ 2021 (UTC)Reply

ఇంకొన్ని స్పందనలు

మార్చు

 Y సహాయం అందించబడింది

నా అభిప్రాయాలివి:

  1. కొన్ని సామెతలకు, జాతీయాలకూ ప్రత్యేకంగా సమాచారంతో పేజీలున్నాయి. ఉదాహరణకు "పంచపాండవులెందరంటే మంచం కోళ్ళలాగ ముగ్గురు అని రెండు వేళ్ళు చూపినట్లు", "అత్తలేని కోడలుత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు", "తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి". ఇవి వికీపీడియా యోగ్యమైనవేనని నా అభిప్రాయం.
  2. మరొక రకం - సామెతల గురించి ఏ సమాచారం లేకుండా ఒక్కో సామెతకు ఒక్కో విభాగాన్ని సృష్టించిన పేజీలు. వీటిలో కొన్ని సామెతలకు కొంత సమాచారం చేర్చి ఉండవచ్చు. ఇలాంటి పేజీల్లో విభాగాలను తీసేసి, సామెతలన్నిటినీ జాబితాగా మార్చి, అ పేజీలను ఉంచెయ్యవచ్చు. ఉదా: "సామెతలు - ఇ"
  3. కొన్ని భాషా భాగాల పేజీలు కూడా ఉన్నట్టున్నాయి. ఉదాహరణకు "తెలుగులో ఆశ్చర్యార్థకాలు" ఈ పేజీ వికీపీడియాలో ఉండదగినదే అని నా అభిప్రాయం. అయితే దీనికి కొంత "గురించి"న సమాచారం చేర్చాలి.
  4. పొడుపు కథలు పేజీ గురించి: పొడుపు కథల "గురించి" రాయడానికి ఈ పేజీని పరిమితం చేసి, పొడుపు కథలను ఒక జాబితా పేజీగా తయారు చెయ్యవచ్చు.

పై కారణాల వలన ఈ మూసలో ఉన్న పేజీలన్నిటినీ గంపగుత్తగా వికీబుక్స్‌కు తరలించకూడదని నేను భావిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 05:30, 16 ఏప్రిల్ 2021 (UTC)Reply

@Chaduvari గారు, మీ సూచనలకు ధన్యవాదాలు. పై చర్చపై మీ అవగాహనలో కొంత లోపం వున్నట్లు నాకు అనిపించింది. పై విభాగంలో తెలిపినట్లు అక్షరమాల అక్షరంతో అంతమయ్యే పేజీలను మాత్రమే తరలించుటకు ప్రతిపాదించాము. జాబితా వ్యాసాలలో వికీవ్యాసాలకు లింకులు ముఖ్యం కదా. వ్యాసంగా అభివృద్ధి చేయగలిగే అవకాశం గలవి ప్రతిపాదించిన వాటిలో అతితక్కువ కావున ఇటువంటివి వికీబుక్స్ లో వుండడం మంచిదని నా అభిప్రాయం. సంబంధిత పేజీలనుండి వికీబుక్స్ కు లింకులు కూడా ఇస్తాము కావున ఇవి వికీపీడియాలో లేకపోవడం వలన వచ్చే నష్టమేమి లేదు. అర్జున (చర్చ) 00:25, 23 ఏప్రిల్ 2021 (UTC)Reply
@Arjunaraoc గారూ,
"అక్షరంతో అంతమయ్యే పేజీలు" అని మొదట చెప్పారు. ఇప్పుడు దాన్ని విశదీకరిస్తూ "అక్షరమాల అక్షరంతో అంతమయ్యే పేజీలను మాత్రమే" అని చెప్పారు.
అన్ని పేజీలూ అక్షరంతోనే కదా అంతమయ్యేది (ఎక్కడో ఒకటీ అరా పేజీలుంటాయ్, అంకెతో అంతమయ్యేవి). నాకు అర్థం కాలేదు వివరించగలరు. __ చదువరి (చర్చరచనలు) 03:22, 24 ఏప్రిల్ 2021 (UTC)Reply
చదువరి గారు, వ్యాసంపేరు చివరలో - తరువాత అక్షరం గలపేజీలు అన్నవి (ఉదాహరణ: సామెతలు - అ) మాత్రమే వికీబుక్స్ కు తరలించడానికి ప్రతిపాదన చేశాను. --అర్జున (చర్చ) 09:43, 17 మే 2021 (UTC)Reply
@Arjunaraoc గారూ, ఆ ముక్క ఇప్పుడు చెప్పారు. ఇంతకు ముందు చెప్పలేదు. ఏదైనా విషయాన్ని చెప్పేటపుడు అసందిగ్ధంగా, విస్పష్టంగా చెప్పాలి. మీ ఉద్దేశమేంటో రెండుసార్లు వివరించాల్సి వచ్చింది. అంటే చెప్పడంలో ఏదో లోపం ఉన్నట్టు గాని, నా అవగాహనలో లోపం ఉన్నట్టు కాదు. నన్ను అలా అనడం మీ తొందరపాటుగా నేను భావిస్తున్నాను. __ చదువరి (చర్చరచనలు) 10:00, 17 మే 2021 (UTC)Reply
చదువరిగారు, మీ స్పందనకు ధన్యవాదాలు. భావవ్యక్తీకరణలో పరిపూర్ణత్వం సాధించలేదండి. క్షమించండి. --అర్జున (చర్చ) 03:24, 19 మే 2021 (UTC)Reply
@Arjunaraoc గారూ, క్షమాపణలక్కర్లేదు లెండి. ఎవరూ పరిపూర్ణులు కారు. కానీ అవతలి వాళ్ళ "అవగాహనలో లోపముంది" లాంటి మాటలు మాట్టాడే ముందు కొంత ఆలోచిస్తే చాలు. __ చదువరి (చర్చరచనలు) 03:31, 19 మే 2021 (UTC)Reply

తరలింపు పురోగతి

మార్చు

సాంకేతిక సమస్య బగ్ T283472 వలన తరలింపులో అవాంతరం ఏర్పడింది.--అర్జున (చర్చ) 09:56, 1 జూలై 2021 (UTC)Reply

అక్షరక్రమంతో అంతమయ్యే సామెతల పేజీలు వికీబుక్స్ కు తరలింపు, వికీపీడియాలో తొలగింపు ముగిసింది. చూడండి సామెతలు (వికీబుక్స్)--అర్జున (చర్చ) 03:09, 5 జూలై 2021 (UTC)Reply
అక్షరక్రమంతో అంతమయ్యే జాతీయాల పేజీలు వికీబుక్స్ కు తరలింపు, వికీపీడియాలో తొలగింపు ముగిసింది. చూడండి జాతీయమలు (వికీబుక్స్)--అర్జున (చర్చ) 04:41, 5 జూలై 2021 (UTC)Reply
Return to "తెలుగుభాషాసింగారం" page.