చర్చల నకలు

మార్చు

ఇతర పేజీలనుండి సామెతలకు సంబంధించిన చర్చలను ఇక్కడికి కాపీ చేస్తున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:57, 20 డిసెంబర్ 2008 (UTC)

§మూస:Non hello everyone thankyou all for extending this - Kiran

అన్నం పెట్టేవాడు దగ్గరుండాలి దణ్ణంపెట్టేవాడు దూరంగావున్నా పర్వాలేదు

వికీవ్యాఖ్య

మార్చు

ఈ సామెతలన్నిటినీ వికీవ్యాఖ్యలోకి చేర్చవచ్చనుకుంటా. ప్రతీ సామెత పేజీలోనూ ఒకటి రెండు వాక్యాల కంటే ఎక్కువ సమాచారం లేదు. వికీవ్యాఖ్యలో ఒక్కొక్క అక్షరానికి ఒక్కోపేజీ చప్పున చేర్చి, ఆ అక్షరంతో మొదలయ్యే సామెతలన్నిటినీ అక్కడ చేర్చవచ్చు. సభ్యుల అభిప్రాయాలకై ఎదురు చూస్తున్నాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 12:13, 10 ఆగష్టు 2007 (UTC)

ప్రదీప్ గారూ, మీరు అనుకుంటున్న సూచన బాగున్నది. అక్షర క్రమంలో (alphabetical)సామెతల పుటలు ఏర్పరిస్తే 56 పుటలకు మించి ఉండవు. సామెతల గురించి వ్రాయటానికి 4-5 వ్యాక్యాలు వస్తే గొప్ప. చదవగానే అర్ధమయ్యేవే సామెతలు. పెద్దగా వివరణ ఇవ్వవలసిన అవసరం ఉండదు. ఎదో పాతబడిన ప్రస్తుతం వాడుకలో లేని పదాల సామెతలు (ఉదాహరణ శృంగనాదం జీలకర్ర - సింగినాధం జీలకర్రకు మూల సామెత)తప్పిస్తే, పాపులర్గా ఉన్న సామెతలన్నీ కూడ చదవగానే అర్ధమవ్వుతాయి. కాబట్టి, సామెతలను అక్షరక్రమంగా ఏర్పరిచి 56 పుటలలో ఉంచమని నా మనవి. ఆయా పుటలలో, సభ్యులు ఒక్కొక్క సామెత గురించి తగినంత ఆ సామెత సుబ్ హెడింగ్ కింద వ్రాయొచ్చును.--SIVA 05:35, 22 డిసెంబర్ 2008 (UTC)
ఇంగ్లీషులో సామెతల్లాంటివి విక్షనరీలో చేర్చారు. వికీకోట్లో చేర్చవచ్చో లేదో పరిశీలించాలి. (విక్షనరీలో మరియు వికీకోట్లో రెండిట్లో చేర్చినా ఫర్యాలేదనుకుంటా). కొన్ని కొన్ని అర్ధవంతమైన వ్యాసాలు (తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి లాంటివి) తప్ప మిగిలిన సామెతలన్నీ విక్షనరీకీ తరలించాలి. --వైజాసత్య 12:22, 10 ఆగష్టు 2007 (UTC)
ఆంగ్ల వికీఖోటులో ఉన్న en:q:Category:Proverbs అనే వర్గం చూసి నాకు అలా అనిపించింది. proverb అంటే నీతి వాక్యాలు అనే అర్ధం వస్తుంది, అలాగే సామెతలను కూడా నీతివాక్యాలకు మళ్లేనే చూడవచ్చని నా అభిప్రాయం. __మాకినేని ప్రదీపు (+/-మా) 12:47, 10 ఆగష్టు 2007 (UTC)
ఈ రోజు ఉదయం లేచి నప్పుడు నాకు అనే అనిపించింది. ఇది వికీ వ్యాఖ్యలొ ఉండవలసిన అంశంకదా అని. నేననుకోవడం ప్రకారం వికీ వ్యాఖ్య దీనికి సరైన ప్రదేశం. విషయం మీద దీర్ఘ చర్చ జరగాలి. అప్పుడప్పుడు మీరు నేను పంపినట్లు ఆహ్వానాలు కూడా పంపాలేమో, స్పందన రాక పోతే...--మాటలబాబు 12:26, 10 ఆగష్టు 2007 (UTC)
ఓ! వికీఖోట్లో ప్రావెర్బ్స్ కూడా ఉన్నాయా..అయితే ఇంకేం మనం నిక్షేపంగా సామెతలను వికీఖోట్లో చేర్చవచ్చు. సమయోచితంగా మంచి ఆలోచన చేశావు ప్రదీపు --వైజాసత్య 12:52, 10 ఆగష్టు 2007 (UTC)

వికీవ్యాఖ్య కి తెవికీ తేడా ఏమిటో చూసి వస్తా.. అక్షరక్రమంలో ఒక చోట పెడితే బావుంటుంది.నా అభిప్రాయం కూడా వ్యాసాల స్థాయికి చేరవనే .. రెండు మూడు లైన్లకు మించి రాయగలిగినవి ఎక్కువ ఉండవురాజశేఖర్ 17:34, 10 ఆగష్టు 2007 (UTC) hmm...వికీవ్యాఖ్య అంటే సినిమా డైలాగులు కూడా ఉంటాయన్న మాట!.వైజాసత్య గారు అన్నట్లు రెండిట్లో ఉన్నా ఫర్వాలేదనుకుంటా..రాజశేఖర్ 17:42, 10 ఆగష్టు 2007 (UTC)



మొత్తానికి సామెతలను వికీవ్యాఖ్యలో చేర్చడానికి అధికులు సుముఖంగా ఉన్నట్లనిపిస్తున్నది. నా సూచనలు:

  • వికీ వ్యాఖ్యలలో సామెతలను వెంటనే చేరుద్దాము.
  • కాని వికీ పీడియాలోంచి వాటిని ప్రస్తుతానికి తీసివేయవద్దు. ఎందుకంటే
  • వికీ వ్యాఖ్యలో ఒకో అక్షరంతో మొదలయ్యే సామెతకూ ఒకో పేజీ కేటాయించవచ్చును.

--కాసుబాబు 07:39, 18 ఆగష్టు 2007 (UTC)

ఇంకా కొన్ని సామెతలు

మార్చు

నా దగ్గర ఓ రెండువేల సామెతలు ఉన్నాయి. ప్రతి దానికి ఆంగ్లంలో ఒకటి రెండు లైన్ల వివరణ ఉంది. నాకేమో అవన్నీ వికీపిడియాలోనే చేరుస్తామని ఉంది. జనాలేమంటారో --నవీన్ 09:18, 6 ఫిబ్రవరి 2008 (UTC)Reply

నవీన్, నీ రెండు వేల సామెతల కలెక్షన్ చర్చ ఇప్పుడే చూశాను. (ఫిబ్రవరిలో నేను సెలవులో ఉన్నాను). రెండువేల నిధిని వికీలో ఎక్కడో ఒకచోట పెట్టకుండా నీ దగ్గరే ఉంచుకోవడం పీనాసితనం కాదా! సామెతలు, జాతీయాలు పేజీలను పరిశీలించి తరువాత కొన్ని సూచనలను ప్రతిపాదిస్తాను. ఒక వారం ఆగు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:06, 7 జూన్ 2008 (UTC)Reply
వ్యవసాయ సామెతలు

స్తోత్ర లహరి వెబ్ సైట్ లో http://www.stotralahari.com/ తెలుగు సామెతలు చాలా వున్నాయి. అవి కూడా పరిశీలింఛి, మన తెవికీ లో లేని, సామెతలను అందులోనుంచి కాపీ చేసుకునే అవకాశం వుందేమో పరిశీలించండి. అలాగే, చాలాకాలం క్రితం నేను 'వ్యవసాయ సామెతలు' అనే చిన్న పుస్తకమ్ చూసాను. అందులో వ్యవసాయం గురించిన సామెతలు వున్నాయి. నాకు గుర్తు వున్న సామెత (ఉత్తర (ఉత్తర నక్షత్రం ను చూసి) చూసి ఎత్తర గంప ). ఈ సామెతలు మన రైతు సోదరులకు పనికి వస్తుంది. ఎవరికైనా, ఆ 'వ్యవసాయ సామెతలు' అనే చిన్న పుస్తకం దొరుకుతుందేమో చూడండి. నేను కూడా పుస్తకాల షాపులో చూస్తాను. Talapagala VB Raju 19:37, 9 ఫిబ్రవరి 2008 (UTC)సభ్యులు:తలపాగల విబి రాజుReply

సామెతలకు ప్రత్యేక పేజీలు

మార్చు

సామెతలకు ప్రత్యేక పేజీల గురించి ఇంతకు ముందు జరిగిన చర్చ పైన చూడగలరు. ఈ విషయాన్ని తిరిగి పరిశీలించవలసిన అవుసరం కనిపిస్తున్నది. ప్రస్తుత ప్రతిపాదన ఏమంటె.

  • ఒక్కో సామెతకూ ఒక్కో పేజీ అవుసరం కనిపించడంలేదు. అధికంగా సామెతలు ఒక వాక్యం నుండి ఒక పేరా వరకు మాత్రమే ఉంటున్నాయి. ఇంతవరకు ఒక్కటి కూడా "సమగ్ర వ్యాసాలు" అనబడే రేంజిలో విస్తరింపబడలేదు.

సభ్యుల అభిప్రాయాలను కోరుతున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:31, 28 నవంబర్ 2008 (UTC)

మీ ఆలోచన బాగుంది. అయితే నేననుకుంటున్న కొన్ని చిన్న సవరణలు. సామెతలు అ, సామెతలు ఆ లాంటి వ్యాసాలు సృష్టించకుండా సామెతల జాబితా పేజీలోనే వివరణలున్న సామెతలకు మాత్రం ఒక డ్రాప్ డౌన్ ఉండేట్టు అందులో వివరణ ఉండేట్టు చేద్దాం. అలా వివరణ కోసం ప్రత్యేక పేజీలకు వెళ్ళాల్సిన అవసరముండదూ మరియు సామెతలు ఋ లాంటి పేజీలు ఖాళీగా ఉండే అవకాశం తొలగించనూ వచ్చు. --వైజాసత్య 07:50, 28 నవంబర్ 2008 (UTC)
బాగానే ఉంటుంది. ఎలా వీలుగా ఉంటుందో చూడండి. మీరు మూస తయారు చేస్తున్నారని గమనించాను. అయితే వ్యాసం సైజు మరీ పెద్దది కాకూడదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:58, 4 డిసెంబర్ 2008 (UTC)
మొలకల్లో సామెతల వ్యాసాలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి ఒక్కో సామెతకు ఒక్కో వ్యాసం లేకుండా కొద్ది వ్యాసాలతో సరిపెట్టే పై ప్రతిపాదన బాగానే ఉంది. రవిచంద్ర(చర్చ) 07:18, 4 డిసెంబర్ 2008 (UTC)

సామెతల పేజీల పునర్వ్యవస్థీకరణ

మార్చు

కానీ ఈ ఐదు వేలల్లో కూడా సామెతలు 10% దాకా ఉండవచ్చు. వీటి కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్రతిపాదన చేయాలి. ఇదివరకే చిన్న సామెతలన్నింటినీ కలిపి ఒక పేజీలో పెట్టవచ్చన్న ప్రతిపాదన ఒకటి వచ్చింది. రవిచంద్ర(చర్చ) 08:17, 17 డిసెంబర్ 2008 (UTC)

ఇదివరకు కూడ అనుకున్నట్టు సామెతలను విక్షనరీకి తరలించాలి. ఇక్కడ ఒక జాబితా లాంటిది మాత్రం ఉంటుంది. దానిపై నేను ఇక్కడ ఒక ప్రయత్నం చేస్తున్నాను చూడండి. వాడుకరి:వైజాసత్య/సామెతల జాబితా --వైజాసత్య 09:05, 17 డిసెంబర్ 2008 (UTC)
వాడుకరి చర్చ:వైజాసత్య/సామెతల జాబితా - ఇది మరియు చర్చ:సామెతలు- ఇది కూడా చూడండి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:57, 17 డిసెంబర్ 2008 (UTC)

వైజా సత్యా!

  • ముందుగా నువ్వు చేస్తున్న ప్రయోగం బాగానే అనిపించింది. కాని మరో అభిప్రాయం కూడా గమనించవలెను....
  • నా అంచనా ఏమంటే సామెతల జాబితా చాలా పేద్దగా పెరిగే ఆస్కారం ఉంది. వేలల్లో. కనుక నువ్వు చేస్తున్న ప్రయోగం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చును (నాకు సరిగ్గా అర్ధమయితే). ఎందుకంటే వివరణ దాచినా గాని పేజీ సైజు బాగా ఎక్కువే అవుతుంది..
  • విక్షనరీకి తరలించే విషయం - ఇవి వికీలోనూ, విక్షనరీలోనూ కూడా ఉండవచ్చును. (వికీలో "సంవత్సరం వారీగా తెలుగు సినిమాల జాబితా" మరియు "అక్షర క్రమంలో తెలుగు సినిమాల జాబితా" ఉన్నట్లు.) అర్ధం తెలుసుకోవాలని చూసేవారు విక్షనరీ చూడవచ్చును. ఏమేమి సామెతలున్నాయో చూడదలచినవారు వికీ చూడవచ్చును. ఇందులో ఇంకా చాలా క్రొత్త పేజీలకు అవకాశం ఉందనిపిస్తున్నది. ఉదాహరణకు రహమతుల్లా గారు సాయిబులు వ్యాసంలో "సాయిబుల మీద సామెతలు" వ్రాశారు. ఒకసారి నవీన్ "వ్యవసాయ సామెతలు" గురించి ప్రస్తావించాడు. ఇల్లాలి గురించిన సామెతలు ఒక విభాగం అనుకోవచ్చును. ఇవన్నీ ఒక విశిష్టమైన compilation అవుతుందనుకొంటున్నాను.
  • కనుక నేను ముందు ప్రతిపాదించిన విధమే (అక్షరానికో పేజీ వివరణలతో సహా + సబ్జెక్టుకో పేజీ) బెటర్ అనిపిస్తున్నది.
  • ఏమయినా త్వరగా ఒక నిర్ణయం తీసుకొంటే మంచిది. ఎందుకంటే మొలకల తగ్గింపులో భాగంగా సామెతల పేజీలు తీసేయాలని నేను భావిస్తున్నాను.

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:51, 17 డిసెంబర్ 2008 (UTC)

నేను ఈ ప్రయోగం మొదలుపెట్టిన తర్వాత దీని సాధ్యాసాధ్యాలపై కొంత నాక్కూడా అనుమానం కలిగింది వివరణలను సామెతలు/అడగందే అమ్మైనా పెట్టడు మొదలైన ఉపపేజీల్లో పెడదామనుకున్నాను. కానీ ఉపపేజీలను కూడా వికీ పేజీలు, మెలకలలాగానే పరిగణిస్తుంది. కాబట్టి మీరు చెప్పిన పద్ధతి ప్రకారమే వెళదాం. ఒక అక్షరానికి చెందిన సామెతలు (వివరణలతో సహా) ఒక పేజీలో చేర్చటం బాటుతో చేయించగలను. ఇక విషయం ప్రకారం అయితే మనమే చెయ్యాలి. సామెతల పేజీలన్నీ విక్షనరీలో చేర్చటం కూడా బాటు చెయ్యగలదు --వైజాసత్య 20:36, 17 డిసెంబర్ 2008 (UTC)
ఒక్కొక్క అక్షరం వారిగా సామెతల పేజీలను బాటు ఇప్పుడు సృష్టిస్తోంది. కానీ నేను చిన్న చిన్న సామెతల పేజీలను విక్షనరిలోకి తరలించేవరకు ఏ సామెత పేజీని తుడిచివెయ్యవద్దు --వైజాసత్య 09:11, 19 డిసెంబర్ 2008 (UTC)
ప్రస్తుతం బాటు సామెతల పేజీలను విక్షనరీకి చేర్చుతున్నది. అది పూర్తయిన తర్వాత ఇక్కడ సామెతలు పేజీలను తొలగించవచ్చు. కానీ సమాచారం ఒక మోస్తరుగా ఉన్న కొన్ని సామెతలను మాత్రం అట్టే ఉంచేద్దామనుకున్నాం కదా. అలాంటివాటిలో [[వర్గం:తొలగించవద్దు]] అని చివరన చేర్చండి. అవి తప్ప మిగిలినవన్నీ తొలగించేస్తాను. ఇవన్నీ పనులు పూర్తయ్యేవరకు మూల జాబితాను మాత్రం తుడిచెయ్యకండి --వైజాసత్య 09:46, 19 డిసెంబర్ 2008 (UTC)
విక్షనరీకి తరలింపు పూర్తయ్యింది. ఏవి ఉంచవలసినవో గుర్తిస్తే తక్కినవన్నీ తుడిచేస్తాను --వైజాసత్య 10:12, 19 డిసెంబర్ 2008 (UTC)
అలాగే చేస్తాను పూర్తి చేశాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:45, 19 డిసెంబర్ 2008 (UTC)

అక్షరక్రమ సామెతల పేజీలు వికీబుక్స్ కు తరలింపు

మార్చు

 Y సహాయం అందించబడింది

అక్షరక్రమ సామెతల పేజీలు వికీపీడియాకు సరిపడే వ్యాసం కాదు. వీటిని వికీబుక్స్ కు తరలించాలి. సభ్యులు స్పందించవలసినది. అర్జున (చర్చ) 01:22, 12 మార్చి 2021 (UTC)Reply

వికీబుక్స్ కు తరలించటానికి నేను అంగీకరిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 15:41, 20 మార్చి 2021 (UTC)Reply
యర్రా రామారావు గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. తదుపరి చర్య గురించి ఆలోచించినపుడు, సామెతలతో పాటు, జాతీయాలు, పొడుపుకథలు కూడా తరలించవలసినవి కావున, ఈ చర్చను మరల మూస చర్చ:తెలుగుభాషాసింగారం లో చేర్చుతున్నాను. అక్కడ కూడా మీరు స్పందించవలసినదిగా కోరుతున్నాను. ఈ చర్చని ముగిస్తున్నాను.--అర్జున (చర్చ) 22:55, 25 మార్చి 2021 (UTC)Reply
తరలింపు ముగిసింది. చూడండి సామెతలు (వికీబుక్స్)--అర్జున (చర్చ) 03:05, 5 జూలై 2021 (UTC)Reply
Return to "సామెతలు" page.