మెండు శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు

మెండు శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు. ఆంధ్రజ్యోతి పత్రిక స్టేట్‌ బ్యూరోచీఫ్‌గా, సీఎంవో బీట్ రిపోర్టర్‌గా పనిచేశాడు.[1]

మెండు శ్రీనివాస్
జననం
మరణం2022 జూన్ 5
మరణ కారణంగుండెపోటు
వృత్తిజర్నలిస్టు
పిల్లలుఇద్దరు కుమారులు

శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రం, వ‌రంగ‌ల్ జిల్లాలోని పరకాల పట్టణంలో జన్మించాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

పత్రికారంగం

మార్చు

ప్రైవేట్ టీచర్ గా పనిచేసిన శ్రీనివాస్, 1993 జూలైలో భూపాలపల్లి కేంద్రంలో ఈనాడు మండల విలేఖరిగా తన పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తరువాత 1994లో కొత్తగా ప్రారంభిన వార్త దినపత్రికలో మండల విలేఖరిగా చేరాడు. 1998లో వార్త జగిత్యాల ఆర్ సీ ఇన్ చార్జిగా వెళ్ళాడు. 2000లో వార్త కరీంనగర్ బ్యూరోగా నియామకమై అక్కడ మూడేళ్ళపాటు పనిచేశాడు. ఆ తరువాత గుంటూరు వార్త బ్యూరోగా అక్కడ నాలుగేళ్ళు పనిచేశాడు. కొద్దికాలం ఓ పత్రికలో డెస్క్ కూడా పనిచేశాడు. 2008లో ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరోలో రిపోర్టర్ గా చేరి, ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరో చీఫ్ స్థాయికి ఎదిగాడు.[2] 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడిన నాటినుండి ఆ పార్టీకి సంబంధించిన బీట్ న్యూస్ నుంచి ప్ర‌ధాన వార్త‌ల వరకు రాశాడు.[3]

ఆంధ్రజ్యోతి క్రికెట్ టీమ్ పీసీసీ క్రికెట్ క్లబ్ ఫ్రెండ్లి మ్యాచ్ కోసం శ్రీనివాస్ తన స్వగ్రామం పరకాలకు వెళ్ళాడు. 2022, జూన్ 5న క్రికెట్ అటలో ఓఎనర్‌గా బ్యాటింగ్‌కు వెళ్ళి 12 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశాడు.[4] బాగా అలసిపోయిన శ్రీనివాస్‌కు గుండెపోటు రావడంతో స్నేహితులు ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు.[1] శ్రీనివాస్‌ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్, టి. హరీష్ రావు, ఎంపి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తదితరులు సంతాపం తెలిపారు.[5][6]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "సీనియర్ జర్నలిస్టు మెండు శ్రీనివాస్ హఠాన్మరణం". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-06-05. Archived from the original on 2022-06-05. Retrieved 2022-06-05.
  2. Web, Disha (2022-06-05). "ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ మెండు శ్రీనివాస్ హ‌ఠాన్మర‌ణం". www.dishadaily.com. Archived from the original on 2022-06-05. Retrieved 2022-06-05.
  3. "గుండెపోటుతో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు మెండు శ్రీ‌నివాస్ మృతి". Prabha News. 2022-06-05. Archived from the original on 2022-06-05. Retrieved 2022-06-05.
  4. Desam, A. B. P. (2022-06-05). "ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లో విషాదం - గుండెపోటుతో సీనియర్ జర్నలిస్ట్ మృతి". telugu.abplive.com. Archived from the original on 2022-06-05. Retrieved 2022-06-05.
  5. telugu, NT News (2022-06-05). "సీనియర్‌ జర్నలిస్ట్‌ మెండు శ్రీనివాస్‌ మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం". Namasthe Telangana. Archived from the original on 2022-06-05. Retrieved 2022-06-05.
  6. Telugu, Tnews (2022-06-05). "క్రికెట్ ఆడుతూ సీనియర్ జర్నలిస్టు మెండు శ్రీనివాస్ మృతి". TNews Telugu. Archived from the original on 2022-06-05. Retrieved 2022-06-05.