మేరా భారత్ మహాన్

మేరా భారత్ మహాన్ 2019లో విడుదలైన తెలుగు సినిమా. ప్ర‌థ ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్ పై డా. శ్రీధర్‌ రాజు ఎర్ర, డా. తాళ్ల రవి, డా. టిపిఆర్‌ నిర్మించిన ఈ సినిమాకు భరత్‌ దర్శకత్వం వహించాడు. అఖిల్‌ కార్తీక్, ప్రియాంకాశర్మ , త‌ణికెళ్ల భ‌ర‌ణి, పోసాని కృష్ణ ముర‌ళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 26, 2019 న విడుదలైంది.

మేరా భారత్ మహాన్
దర్శకత్వంభరత్
నిర్మాతడాక్టర్ శ్రీధర్ రాజు , డాక్టర్ తాళ్ల రవి , డాక్టర్ పల్లవి రెడ్డి
తారాగణంఅఖిల్ కార్తీక్ , ప్రియాంక శర్మ , డాక్టర్ శ్రీధర్ రాజు
ఛాయాగ్రహణంముజీర్ మాలిక్‌
కూర్పుమేన‌గ శ్రీను
సంగీతంలలిత్ సురేష్
నిర్మాణ
సంస్థ
ప్ర‌థ ప్రొడ‌క్ష‌న్స్
విడుదల తేదీ
2019 ఏప్రిల్ 26 (2019-04-26)
సినిమా నిడివి
132 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

చిత్ర నిర్మాణం మార్చు

మేరా భారత్ మహాన్ సినిమా షూటింగ్ 29 నవంబర్ 2017న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించారు.[1] ఈ సినిమా ఆడియోను 21 జులై 2018న హన్మకొండ ములుగు రోడ్ లోని వజ్ర గార్డెన్స్ లో ఎమ్మెల్యే బాబూమోహ‌న్, వ‌రంగ‌ల్ మేయ‌ర్ నన్నపనేని నరేందర్‌ విడుదల చేశారు.[2]

కథ మార్చు

మహాన్‌ (శ్రీధర్‌రాజు) ఓ ప్రొఫెసర్‌. ఆయన భార్య ఆమని. ఓ కుమార్తె. హాయిగా సాగిపోతున్న వారి జీవితంలో జరిగిన ఓ సంఘటన సమాజంపై తిరుగుబాటు చేసేలా చేస్తుంది. అస్తవ్యస్తంగా ఉన్న పాలకులన్ని ఎండగట్టడంతోపాటు అవసరమైతే శిక్షించడం చేస్తుంటాడు. అతని భావాలకు కొంతమంది యువత ఆకర్షితులవుతారు. ఓ దశలో అఖిల్‌ కార్తిక్‌ అనే యువకుడిపై మహాన్‌ పెద్ద బాధ్యత పెడతాడు. ఆ తర్వాత ఏమయింది? కథ ఎటువైపు తిరిగింది? అనేది మిగతా సినిమా కథ.

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: ప్ర‌థ ప్రొడ‌క్ష‌న్స్
  • నిర్మాతలు:డా.శ్రీధ‌ర్ రాజు ఎర్ర, డా.తాళ్ల ర‌వి, డా. టిపిఆర్
  • కథ: డా.శ్రీధ‌ర్ రాజు ఎర్ర‌
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భ‌ర‌త్
  • సంగీతం: ల‌లిత్ సురేష్‌
  • పాట‌లు:చంద్ర‌బోస్, పెద్దాడ‌మూర్తి, చిల‌క‌రెక్క గ‌ణేష్‌
  • సినిమాటోగ్రఫీ: ముజీర్ మాలిక్‌
  • ఎడిట‌ర్: మేన‌గ శ్రీను
  • ఫైట్స్: విజ‌య్‌
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: సోమ‌ర్తి సాంబేష్‌
  • కొరియోగ్రాఫ‌ర్స్: స్వ‌ర్ణ‌, దిలీప్‌

మూలాలు మార్చు

  1. Vaartha (29 November 2017). "`మేరా భార‌త్ మ‌హాన్‌` షూటింగ్ ప్రారంభం!". Archived from the original on 11 ఆగస్టు 2021. Retrieved 11 August 2021.
  2. Mana Telangana (23 July 2018). "డబ్బున్న వాళ్లకే విద్య, వైద్యం". Archived from the original on 11 ఆగస్టు 2021. Retrieved 11 August 2021.