మైరావణ (1940 సినిమా)

కుబేరా ఫిల్మ్స్ పతాకంపై ఘంటసాల బలరామయ్య నిర్మించిన 1940 నాటి సినిమా మైరావణ. ప్రముఖ నటుడు వేమూరి గగ్గయ్య మైరావణ పాత్రలో నటించాడు. కాంచనమాల, వేమూరి గగ్గయ్య తదితరులు నటించగా చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించాడు..[2]

మైరావణ
(1940 తెలుగు సినిమా)

మైరావణ సినిమాపోస్టర్
దర్శకత్వం చిత్రపు నారాయణమూర్తి
నిర్మాణం ఘంటసాల బలరామయ్య
తారాగణం చిత్తజల్లు కాంచనమాల,
వేమూరి గగ్గయ్య,
రామిరెడ్డి
రాయప్రోలు సుబ్రహ్మణ్యం,
టి.రామకృష్ణ శాస్త్రి,
వై.ఆర్.సూరి,
ఘంటసాల శేషాచలం,
కె.సుబ్రహ్మణ్య కుమారి,
జయగౌరి[1]
సంగీతం గాలిపెంచల నరసింహారావు
ఛాయాగ్రహణం గోవింద్‌రావ్ భడ్‌సావ్లే
నిర్మాణ సంస్థ కుబేర పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సాంకేతిక విలువల కారణంగా మైరావణ పెద్ద హిట్ అయ్యింది.[3] ట్రిక్ ఛాయాగ్రహణం (గోవింద్రావ్ భడ్‌సావ్లే), మేకప్ (మంగయ్య) కు తోడు, సంపన్నమైన సెట్లు (టివిఎస్ శర్మ) కూడా చిత్రవిజయానికి దోహదపడ్డాయి.

పాతాళాన్ని పరిపాలించిన మైరావణుని కథ ఇది. రావణుడు సీతను లంకలో చెరలో ఉంచాడు. వానరుల ప్రమేయంతో యుద్ధం జరుగుతుంది. సీతను విడుదల చేయమని రావణుని భార్య మండోదరి అతనిని వేడుకుంటుంది. రాముడితో శత్రుత్వం కూడదని ఆమె అతన్ని హెచ్చరిస్తుంది. రావణుడు ఆమె సలహాను పెడచెవిన పెట్టి, రామ లక్ష్మణులను చంపడానికి మైరావణుడి సహాయం తీసుకుంటాడు. అంజనేయుడు తన తోకతో ఒక కోటను నిర్మిస్తాడు. కానీ మైరావణుడు తన మంత్ర శక్తులను ఉపయోగించి వాళ్ళిద్దరినీ పాతాళ లోకానికి తీసుకువస్తాడు. పాతాళ రాణి దేవి బందిని రాముడి భక్తురాలు. అతనిని పెళ్ళి చేసుకోవాలని కోరుకుంటుంది. ఆమె సాయంతో రాముడు మైరావణుడిని చంపుతాడు. ఆమె రాబోవు జన్మలలో పెళ్ళి చేసుకుంటానని వాగ్దానం చేస్తాడు.

తారాగణం

మార్చు
  • అహిరావన్ పాత్రలో వేమూరి గగ్గయ్య
  • చంద్రసేనగా కాంచనమల
  • రామిరెడ్డి
  • రావణుడిగా రాయప్రోలు సుబ్రహ్మణ్యం
  • రాముడిగా టి.రామకృష్ణ శాస్త్రి
  • ఆంజనేయగా వైఆర్ సూరి
  • లక్ష్మణగా జి. శేషాచలం
  • కె. సుబ్రహ్మణ్య కుమారి
  • మత్స్యవల్లాభాగా నెల్లూరు కృష్ణయ్య

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: చిత్రపు నారాయణ మూర్తి

సంగీతం:గాలి పెంచల నరసింహారావు

నిర్మాత:ఘంటసాల బలరామయ్య

నిర్మాణ సంస్థ: కుబేర పిక్చర్స్

ఛాయా గ్రహణం: గోవిందరావ్ భడ్ సావ్ల్లె

మేకప్: మంగయ్య

గాయనీ గాయకులు:కాంచనమాల,రామిరెడ్డి, టి.రామకృష్ణ శాస్త్రి, జయగౌరి, వై.ఆర్.సూరి, వై.రాజు, జి.శేషాచలం, సుబ్రహ్మణ్య కుమారి

విడుదల:27:01:1940

పాటల జాబితా

మార్చు

1.ఈ సుమ కుంజావాసమే నాకు భాసుర సౌధము, గానం .రామకృష్ణ శాస్త్రి,జయగౌరీ

2.శ్రీరఘునందన రామా జై హర సురేంద్రనుతనామా,

3.శ్రీరామచంద్ర అసురారి భక్త జనావనా, గానం.వై.ఆర్.సూరి

4.శ్రీశస్వప్రకాశ పరేశా కేశవా ప్రాకృత వేషి, గానం.జి.శేషాచలం

5.సార విచారము సేయుమా మన, గానం:రామకృష్ణ శాస్త్రి

6.స్వాగతమొసగెదవా శయ్యా స్వామికి నన్నే కానుక చేసి, గానం.కాంచనమాల

7.ఈ మధుర సాయనమే సుధారస సారమే సఖీ, గానం.సుబ్రహ్మణ్యకుమారీ

8.ఏనాటికి ఏగతియో యేప్రాణికీ కానగలేరు ఘనురే ఇలలో, గానం.రామకృష్ణ శాస్త్రి

9.కనవే పని వినవే సఖీ చనవే స్వామికి పాద్యము, గానం.చిత్తజల్లు కాంచనమాల

10.కనుగొనగా గలుగునా కరుణామయా నా ప్రియ, గానం.కాంచనమాల

11.కలలో గాంచిన కథగా కడతేరే నాదు ప్రేమగాధ, గానం.కాంచనమాల

12.జగదబిరామా జయ శ్రీరామా తారకనామా, గానం.కాంచనమాల

13.జయరామా తారకనామా రామా రఘువంశ సోమా, గానం కాంచనమాల

14.జీవనాధార శ్రీరఘువీరా వర, గానం.వై.ఆర్.సూరి

15. జై జయశ్రీరామా ఆశ్రిత సుధామా జై,

16.జై జై అజహర సుర వినుతా శ్రీనివాసా ఈసా శేషశయనా,

17 . జై రఘురామా జై రణభీమా భూరిపరా,

18.నినుగొలుచుట కిదియా ఫలితము దేవా, గానం.వై.రాజు.

19.పావనరామా పతిత పావనరామా, గానం.వై.ఆర్.సూరి

20.పిబ మధురం మనోహరందేవి చరణ తీర్థం, గానం.రామిరెడ్డి

21.మధురస మిదే సుమధురసమిదే త్రావిన క్షణమే, గానం. సుబ్రహ్మణ్య కుమారి

22.రఘుకుల భూషణ శ్రీరామా జై జై,గానం. వై.ఆర్.సూరి

23.లలిత మృదురసాల పల్లవము కన్న కోమలాతి, గానం.కాంచనమాల

24.నిలుచున్ కాలము మంచిచెడ్డలకు తానే,(పద్యం), గానం.రామకృష్ణ శాస్త్రి

25 . అనిలుడు భూమిదేవి జలజాప్తుడు చంద్రుడు,(పద్యం), గానం.జయగౌరి .

సినిమా

మార్చు

ఈ చిత్రాన్ని బిఎ సుబ్బారావు 1964 లో మళ్ళీ తీసాడు. ఇందులో రాముడిగా కాంతారావు, ఆంజనేయుడిగా రేలంగి వెంకటరామయ్య, మైరావణుడిగా ధూళిపాళ, లక్ష్మణుడిగా శోభన్ బాబు, చంద్రసేనగా కృష్ణ కుమారి నటించారు. సాలూరి రాజేశ్వరరావు సంగీతం ఇచ్చాడు.

మూలాలు

మార్చు

. 3.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.