యమజాతకుడు 1999 లో విడుదలైన ఫాంటసీ కామెడీ చిత్రం మోహన్ బాబు తన శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై [1] ఎన్ శంకర్ దర్శకత్వంలో ఈ చుత్రాన్ని నిర్మించాడు.[2] ఇందులో మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, సాక్షి శివానంద్ ముఖ్య పాత్రల్లో నటించారు. వందేతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.[3]

యమజాతకుడు
(1999 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎన్. శంకర్
నిర్మాణం మోహన్ బాబు
కథ పరుచూరి సోదరులు
చిత్రానువాదం ఎన్. శంకర్
తారాగణం మోహన్ బాబు ,
సాక్షి శివానంద్
సంభాషణలు పరుచూరి సోదరులు
ఛాయాగ్రహణం అజయ్ విన్సెంట్
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్
భాష తెలుగు

శివాజీ (మోహన్ బాబు) న్యాయవాది. డబ్బు కోసం న్యాయాన్ని తప్పుదోవ పట్టించడం అతడు చేసే పని. స్త్రీలోలుడు. అతని మేనకోడలు చింటు (బేబీ నిహారికా) అంటే గారాబం, ప్రేమ. ఒకసారి అతడు ఎంపి నరసింహమ్ (తనికెళ్ళ భరణి) కుమారుడు శ్రీనాథ్ (శ్రీహరి) కేసును తీసుకుంటాడు. అతను తన పనిమనిషిపై అత్యాచారం చేసి చంపాడని అతడిపై ఆరోపణ. శివాజీ ఆ కేసును తారుమారు చేసి డ్రైవర్ బాబ్జీ (నవీన్) కి శిక్ష వేయిస్తాడు ఆ తరువాత, శివాజీ నిజంగా ఒక అందమైన అమ్మాయి శిరీష (సాక్షి శివానంద్) ప్రేమలో పడతాడు. ఆమె పరిచయంలో, అతను తన గత జీవితాన్ని విడిచిపెడతాడు. శిరీష ఇంట్లో పనిచేసే బాబ్జీ తల్లి రాములమ్మ (అలపాటి లక్ష్మి) వారి నిశ్చితార్థం సందర్భంగా అతన్ని చూస్తుంది. వాళ్ళ బంధం నిలబడదని శపిస్తుంది.

ప్రస్తుతం, శివాజీ బాబ్జీని రక్షించాలని నిర్ణయించుకుంటాడు, కాబట్టి, అతను కేసును తిరిగి తెరుస్తాడు. ఎంపి నరసింహం, శ్రీనాథ్ లు శివాజీని చంపుతారు. అతను నరకానికి చేరుకుంటాడు. అదే సమయంలో, వారు కొత్త యమధర్మరాజు (రాజేంద్ర ప్రసాద్) పట్టాభిషేక వేడుకను జరుపుకుంటున్నారు. ప్రస్తుతం, శివాజీ తన జీవితకాలం ఇంకో 11 రోజులు మిగిలే ఉందని తెలుసుకుని నరకంలో గందరగోళం, అల్లకల్లోలం సృష్టిస్తాడు. కాబట్టి, రహస్యంగా ఉంచటానికి యమ అతన్ని ఒక అందమైన అమ్మాయి పూతన (సాధిక) తో పాటు వెనక్కి భూమికి పంపిస్తాడు. ఆ తరువాత, దుష్టులు మళ్లీ తిరిగి ప్రవేశించినప్పుడు శివాజీ గెలవటానికి దాదాపు అంచున ఉన్నాడు. పోరాటంలో, చింటు కంటి చూపును కోల్పోతుంది. రాములమ్మ తన కళ్ళను ఆమెకు పెట్టమని కోరుతుంది. ఇంతలో, శివాజీ శిరీషల పెళ్ళి ఏర్పాట్లు తిరుమల వద్ద జరుగుతూంటాయి. తాను బతికుండే రోజులు తక్కువగా ఉన్నందున పెళ్ళి రద్దు చేయాలని శివాజీ నిర్ణయించుకున్నాడు. కాబట్టి, అతను తన మాజీ ప్రియురాలు స్వర్ణ (చాందిని) తో కలిసి శీరిష తన పట్ల ద్వేషాన్ని పెంచుకునేలా ఒక నాటకం ఆడతాడు. పూతన కూడా అతని ధర్మాన్ని అర్థం చేసుకుంటుంది. ఆమె కూడా అతనికి సహాయపడుతుంది. యముడు దానిని గమనిస్తాడు, అతను భూమిపైకి వస్తాడు. తన జీవిత భాగస్వామికి దీర్ఘాయువు ఉందని శిరీష జాతకం గురించి ఒక రహస్యాన్ని పొరపాటున వెల్లడిస్తాడు. ఇప్పుడు శివాజీ తిరుమల వైపు పరుగెత్తుతుండగా యముడు అతన్ని వెంబడిస్తాడు. తిరుమల చేరుకుని యమపాశం తనను చేరేలోగానే శిరీష మెళ్ళో తాళి కడతాడు. చివరగా, వెంకటేశ్వర స్వామి (ఎన్.టి.రామారావు), యమధర్మరాజులు కొత్తగా పెళ్ళైన జంటను ఆశీర్వదిస్తూ ఉండగా సినిమా ముగుస్తుంది.

తారాగణం

మార్చు

సాంకేతిక సిబ్బంది

మార్చు

పాటలు

మార్చు
  • డింగ్ డాంగ్ డింగ్ డాంగ్
  • హే సంగ ఇవ్వాలని ఉంది
  • నవ్వాలమ్మ నవ్వాలి
  • నీ చెవులకు పెట్టిన
  • వందనాలు వందనాలు

మూలాలు

మార్చు
  1. "Yamajathakudu (Banner)". Filmibeat.
  2. "Yamajathakudu (Review)". Pluz Cinema.com. Archived from the original on 2015-04-26. Retrieved 2020-08-28.
  3. "Yamajathakudu (Cast & Crew)". The Cine Bay. Archived from the original on 2021-03-01. Retrieved 2020-08-28.