యముడికి మొగుడు, 1988లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం చేశాడు. ఇది బాగా విజయనంతమైంది. తరువాత రజనీకాంత్ హీరోగా తమిళంలో పునర్నిర్మింపబడింది. ఇలాంటి కథానేపథ్యంలో తెలుగులో దేవాంతకుడు, యమగోల, యమదొంగ లాంటి అనేక సినిమాలు విజయనంతమయ్యాయి.

యముడికి మొగుడు
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం రవిరాజా పినిశెట్టి
నిర్మాణం హరిప్రసాద్,
నారాయణరావు,
సుధాకర్
కథ సత్యానంద్
తారాగణం చిరంజీవి,
విజయశాంతి ,
రాధ,
సుత్తివేలు,
కోట శ్రీనివాసరావు,
కైకాల సత్యనారాయణ (యముడు),
అల్లు రామలింగయ్య (చిత్రగుప్తుడు),
గొల్లపూడి మారుతీరావు,
సూర్యకాంతం,
రావుగోపాలరావు,
బేతా సుధాకర్,
సుత్తివేలు (విచిత్రగుప్తుడు),
అన్నపూర్ణ,
ప్రసాద్ బాబు,
వై. విజయ్
సంగీతం రాజ్ - కోటి
నేపథ్య గానం పి. సుశీల,
ఎస్. జానకి,
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం,
మనో
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కాళి (చిరంజీవి) ఒక చిన్న పట్టణంలో చిన్నపాటి రౌడీ. తన సంపాదనతో సమాజానికి కొంత సేవ చేస్తుంటాడు కూడా. అలా అందరి అభిమానం సంపాదించుకొంటాడు. అతని బాస్ కోటయ్య (కోట శ్రీనివాసరావు). కోటయ్య ప్రత్యర్థి కైలాసం (గొల్లపూడి). కైలాసం కూతురు (రాధ)తో కాళీ ప్రేమలో పడతాడు. వారు పెళ్ళి చేసుకొందామనుకొంటారు. ఇది తెలిసిన కైలాసం కాళీని చంపిస్తాడు. చనిపోయిన కాళీ నరకానికి వెళతాడు. అక్కడ తనను అన్యాయంగా తెచ్చారని యముడితో (కైకాల సత్యనారాయణ) గొడవ పడతాడు. ఆ తరువాత కథ అనేక మలుపులు తిరుగుతుంది.

పాటలు

మార్చు
  • అందం హిందోళం, అధరం తాంబూలం , రచన వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • వానజల్లు గిచ్చుకుంటే ఎట్టాగమ్మా? రచన వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి . జానకి
  • నొ నొ నొ నొ నొ నొ నొ నొ నో నో నో నాట్యమిదా? రచన వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • కన్నెపిల్లతోటి పిల్లగాడికొచ్చెనమ్మ పీకులాట , రచన వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  • ఎక్కుబండెక్కుమామ, రచన: వేటూరి, గానం.మనో, పి సుశీల
  • బహుశా నిన్ను బందర్లోలో , రచన: వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

బయటి లింకులు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

చిరంజీవి నటించిన సినిమాల జాబితా