యశ్వంతరావ్ చవాన్
యశ్వంతరావు బలవంతరావు చవాన్ (1913 మార్చి 12-1984 నవంబరు 25) ఒక భారతీయ రాజకీయవేత్త. అతను బొంబాయి రాష్ట్ర విభజన ద్వారా సృష్టించబడిన తరువాత బొంబాయి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా, మహారాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 1979లో చరణ్ సింగ్ ప్రభుత్వంలో స్వల్పకాలిక భారత ఉప ప్రధాన మంత్రిగా అతని ముఖ్యమైన చివరి మంత్రి పదవి. అతను బలమైన కాంగ్రెస్ నాయకుడు, సహకార నాయకుడు, సామాజిక కార్యకర్త, రచయిత. అతను సాధారణ ప్రజల నాయకుడిగా ప్రసిద్ధి చెందాడు. అతను తన ప్రసంగాలు, వ్యాసాలలో సామాజిక ప్రజాస్వామ్యాన్ని సమర్థించాడు. రైతుల అభ్యున్నతి కోసం మహారాష్ట్రలో సహకార సంఘాలను స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడు. అతడిని సాధారణంగా ఆధునిక మహారాష్ట్ర శిల్పిగా భావిస్తారు. [1]
Yashwantrao Chavan | |||
| |||
భారతదేశ ఉప ప్రధానమంత్రి
| |||
పదవీ కాలం 28 July 1979 – 14 January 1980 | |||
ప్రధాన మంత్రి | చరణ్ సింగ్ | ||
---|---|---|---|
ముందు | చరణ్ సింగ్ జగ్జీవన్ రామ్ | ||
తరువాత | Chaudhary Devi Lal | ||
భారతదేశ హోం శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 28 July 1979 – 14 January 1980 | |||
ప్రధాన మంత్రి | చరణ్ సింగ్ | ||
ముందు | Hirubhai M. Patel | ||
తరువాత | జ్ఞాని జైల్ సింగ్ | ||
పదవీ కాలం 14 November 1966 – 27 June 1970 | |||
ప్రధాన మంత్రి | ఇందిరా గాంధీ | ||
ముందు | గుల్జారి లాల్ నందా | ||
తరువాత | ఇందిరాగాంధీ | ||
భారత దేశ రక్షణ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 10 October 1974 – 24 March 1977 | |||
ప్రధాన మంత్రి | ఇందిరా గాంధీ | ||
ముందు | స్వరణ్ సింగ్ | ||
తరువాత | అటల్ బిహారి వాజపేయి | ||
భారత ఆర్థిక శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 27 June 1970 – 10 October 1974 | |||
ప్రధాన మంత్రి | ఇందిరాగాంధీ | ||
ముందు | ఇందిరా గాంధీ | ||
తరువాత | చిదంబరం సుబ్రహ్మణ్యం | ||
పదవీ కాలం 14 November 1962 – 13 November 1966 | |||
ప్రధాన మంత్రి | జవహర్ లాల్ నెహ్రూ గుల్జారిలాల్ నందా (Acting) లాల్ బహుదూర్ శాస్త్రి గుల్జారిలాల్ నందా (Acting) ఇందిరా గాంధీ | ||
ముందు | జవహర్ లాల్ నెహ్రూ | ||
తరువాత | స్వరణ్ సింగ్ | ||
మహారాష్ట్ర ముఖ్యమంత్రి
| |||
పదవీ కాలం 1 May 1960 – 14 November 1962 | |||
గవర్నరు | శ్రీ ప్రకాష్ సుబ్రహ్మణ్యం విజయలక్ష్మి పండిట్ | ||
తరువాత | Marotrao Kannamwar | ||
పదవీ కాలం 1 November 1956 – 30 April 1960 | |||
గవర్నరు | Harekrushna Mahatab Sri Prakasa | ||
ముందు | Morarji Desai | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | Deorashtre, India | 1913 మార్చి 12||
మరణం | 1984 నవంబరు 25 New Delhi, India | (వయసు 71)||
విశ్రాంతి స్థలం | Yashwantrao Chavan Samadhi, Karad | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ 1977; 1981–1984) | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ (యు) (1977) Janata Party (1977–1978) Indian National Congress-Socialist (1978–1981) | ||
జీవిత భాగస్వామి | Venutai Chavan | ||
పూర్వ విద్యార్థి | University of Mumbai, ILS Law College |
జీవితం తొలిదశ
మార్చుయశ్వంతరావు చవాన్ కుంబి - మరాఠా [2] [3] కుటుంబంలో 1913 మార్చి 12 న భారతదేశం, మహారాష్ట్రలోని సతారా జిల్లా, (ఇప్పుడు సాంగ్లి జిల్లా) దేవరాష్ట్రే గ్రామంలో జన్మించాడు. అతనికి ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు. చవాన్ తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు.అతని మామ, తల్లి ద్వారా పెరిగాడు. అతని తల్లి అతనికి స్వీయ ఆధారం, దేశభక్తి గురించి నేర్పింది. అతను బాల్యం నుండి భారత స్వాతంత్ర్యపోరాటం పట్ల ఆకర్షితుడయ్యాడు.
చవాన్ భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్నాడు. 1930 లో కరాడ్‌లో పాఠశాల విద్యార్థిగా , మహాత్మా గాంధీ నేతృత్వంలోని సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందుకు అతనికి జరిమానా విధించారు. 1932 లో, సతారాలో భారత జెండాను ఎగురవేసినందుకు అతనికి 18 నెలల జైలు శిక్ష విధించారు. ఆ కాలంలో, అతను స్వామి రామానంద్ భారతి, ధూలప్ప భౌరావ్ నవలే, గౌరిహర్ (అప్పాసాహెబ్) సిహాసనే, విఎస్ పేజ్, గోవింద్ కృపారామ్ లాంటి వారితో పరిచయమయ్యాడు.
1934లో కరాడ్ తిలక్ ఉన్నత పాఠశాల నుండి తన ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసిన తరువాత, అతను కొల్హాపూర్ రాజారామ్ కళాశాలలో చేరాడు. 1938లో, చరిత్ర, రాజకీయ శాస్త్రంలో బొంబాయి విశ్వవిద్యాలయం బిఎ డిగ్రీ పొందాడు. అతను పూణేలోని న్యాయ కళాశాలలో చేరాడు.1941లో తన న్యాయవాద పట్టాను బొంబాయి విశ్వవిద్యాలయం ప్రదానం చేసిన తరువాత, అతను కరాడ్‌లో క్రిమినల్ న్యాయవాది వృత్తిని ప్రారంభించాడు. 1942లో వారి కుటుంబసభ్యులు ఏర్పాటు చేసిన సతారా జిల్లా, ఫల్టన్ పట్టణానికి చెందిన వేణుతాయ్ తో వివాహం జరిగింది.
చవాన్ కళాశాలలో చదివేకాలంలో అనేక సామాజిక కార్యకలాపాలలో పాల్గొన్నాడు. కాంగ్రెస్ పార్టీతో, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, కేశవరావు జేధే వంటి నాయకులతో సన్నిహితంగా ఉండేవాడు.1940లో, అతను సతారా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాడు. 1942లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, బొంబాయి సెషన్‌లో క్విట్ ఇండియా కోసం పిలుపునిచ్చిన ప్రతినిధులలో చవాన్ ఒకడు. ఉద్యమంలో పాల్గొన్నందుకు నిర్బందించేముందు అతను "భూగర్భంలోకి" వెళ్లాడు. [4] అతను దాదాపు రెండు సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు.1944లో మాత్రమే విడుదలయ్యాడు. [5]
రాజకీయ జీవితం
మార్చు1946 లో, యశ్వంతరావు మొదటిసారిగా దక్షిణ సతారా నియోజకవర్గం నుండి బొంబాయి రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. అదే సంవత్సరంలో అతను బొంబాయి రాష్ట్ర హోం మంత్రికి పార్లమెంటరీ సెక్రటరీ అయ్యాడు.తదుపరి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో పౌర సరఫరాలు, సాంఘిక సంక్షేమం, అటవీ మంత్రిగా నియమితులయ్యాడు. 1953లో మహారాష్ట్ర రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి హామీ ఇచ్చేనాగపూర్ ఒప్పందంలో ప్రభుత్వం తరుపున చవాన్ సంతకం చేసాడు.1950లలో సంయుక్త మహారాష్ట్ర సమితి (యునైటెడ్ మహారాష్ట్ర ఉద్యమం) బొంబాయి (ఇప్పుడు ముంబై) రాజధానిగా యునైటెడ్ మహారాష్ట్ర కోసం ప్రముఖ పోరాటాన్ని చవి చూసింది. చవాన్ ఎన్నడూ సంయుక్త మహారాష్ట్ర సమితిలో (యునైటెడ్ మహారాష్ట్ర ఉద్యమం) చేరలేదు.వాస్తవానికి భాషా ఆధారిత రాష్ట్ర పునర్వ్యవస్థీకరణను వ్యతిరేకించిన ప్రధాని నెహ్రూను "మహారాష్ట్ర కంటే గొప్పది" అని వక్కాణించాడు. [6] 1957 అసెంబ్లీ ఎన్నికల్లో యశ్వంతరావు చవాన్ కరాడ్ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు.అతను ఈసారి కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడిగా, ద్విభాషా బొంబాయి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యాడు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మహారాష్ట్ర సమితికి మరాఠీ మాట్లాడే ప్రాంతాల్లో ఘోరంగా ఓడిపోయింది. ఏదేమైనా అతను మహారాష్ట్రను ఏర్పాటు చేయడానికి నెహ్రూను ఒప్పించాడు.అందువల్ల మరాఠీ మాట్లాడే మహారాష్ట్ర రాష్ట్రం ఏర్పడటానికి అతను ప్రధాన వాస్తుశిల్పిగా పరిగణించారు.1960 మే 1న, యశ్వంతరావు చవాన్ మహారాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు. [7] 1957 నుండి 1960 వరకు అతను భారత జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో పనిచేశాడు. చవాన్ మహారాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో పారిశ్రామిక, వ్యవసాయ రంగాల సమాన అభివృద్ధికి ప్రయత్నించాడు.అతను సహకార ఉద్యమం ద్వారా ఈ దృష్టిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నాలు సాగించాడు.అతను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజాస్వామ్య వికేంద్రీకృత సంస్థలు, వ్యవసాయ భూమి పరిమితి గురించి చట్టాలు ఆమోదంపొందాయి.
కేంద్ర ప్రభుత్వంలో పాత్రలు
మార్చు1962లో భారత-చైనా సరిహద్దు సంఘర్షణ నేపథ్యంలో కృష్ణ మీనన్ రక్షణ మంత్రిగా రాజీనామా చేసిన తరువాత, యశ్వంతరావుకు ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఆ శాఖను ఇచ్చాడు. [8] అతను యుద్ధానంతరం సున్నితమైన పరిస్థితిని దృఢంగా నిర్వహించాడు.సాయుధ దళాలను శక్తివంతం చేయడానికి అనేక దృఢమైన నిర్ణయాలు తీసుకున్నాడు. చైనాతో శత్రుత్వాలను అంతం చేయడానికి నెహ్రూతో చర్చలు జరిపాడు.లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వంలో 1965 సెప్టెంబరులో ఇండో-పాకిస్తాన్ యుద్ధం జరిగే సమయంలో కూడా రక్షణ శాఖ మంత్రిగా పనిచేసాడు.
1962లో జరిగిన ఉప ఎన్నికల్లో, చవాన్ నాసిక్ నుండి లోక్‌సభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.1966 నవంబరు 14న, ప్రధాన మంత్రి ఇందిరాగాంధీచే భారత హోంమంత్రిగా నియమించబడ్డాడు. 1969 లో మొదటిసారి కాంగ్రెస్ విడిపోయిన సమయంలో యశ్వంతరావు విమర్శలకు గురయ్యాడు. రాష్ట్రపతి ఎన్నికల్లో అధికారిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంజీవ రెడ్డికి ఓటు వేయాలనే తను ముందు నిర్ణయించుకున్న నిబద్ధతకు కట్టుబడి ఉన్నాడు.అలా చేయడం ద్వారా ఇందిరాగాంధీ ఆగ్రహానికి గురైయ్యాడు. కానీ తరువాత అతని మనస్సు మార్చుకుని ఇందిరాగాంధీకి మద్దతు పలికాడు. అలా చేయడం ద్వారా, అతను తనను తాను ద్వంద్వత్వం ఫెన్స్-సిట్టర్ అనే ఆరోపణకు గురయ్యాడు. హతల్కర్ ప్రకారం, కాంగ్రెస్ పార్టీకి చెందిన సిండికేట్ వర్గంతో తనకు ఏమాత్రం సమానత్వం లేదని, కానీ ఇందిరాగాంధీతో పూర్తిగా సన్నిహిత అనుబంధం ఉందని అతను అనుకూలంగా చెప్పాడు.ఇందిరాగాంధీ అభిప్రాయాలు, ఆమె పద్ధతులు నచ్చకపోయినా, కాంగ్రెస్ ఐక్యతను కాపాడుకోవడమే అతని ప్రధాన ఆందోళనఅని, కానీ చీలిక అనివార్యమని అతను గుర్తించినప్పుడు, సిండికేట్‌లోని కొంతమంది సభ్యులు అతని ముందు చేసిన దూషణలకు అతను లొంగలేదు. . [9]
చవాన్ ను 1970 జూన్ 26 న, ఇందిరాగాంధీ భారత ఆర్థిక మంత్రిగా నియమించింది.1966 తర్వాత, అతని పదవీకాలంలో మొదటిసారిగా 1972 లో స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 0.55%నికి పడిపోయి భారత ఆర్థిక వ్యవస్థలో మాంద్యం ఏర్పడింది.1974 అక్టోబరు 11 న విదేశాంగ మంత్రిగా నియమితులయ్యాడు.1975 జూన్ లో, ఇందిరాగాంధీ ప్రభుత్వం భారతదేశంలో అంతర్గత అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇందిరాగాంధీ పాలనలో ఆమెకు వ్యతిరేకంగా ఉన్న నాయకులు, పార్టీలపై తీవ్ర అణిచివేత జరిగింది. యశ్వంతరావు ఆ సమయంలో ఆమె ప్రభుత్వంలో కొనసాగాడు. ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో 1977లో, ఇందిరాగాంధీ తన పార్లమెంటు స్థానాన్ని కోల్పోయింది.అందువల్ల కొత్త పార్లమెంటులో, చవాన్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా ఎన్నికయ్యాడు. చవాన్ ఆ సమయంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెసుకు ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు.
వారసత్వం
మార్చుఅతను దేశంలోని ఉప ముఖ్య మంత్రి, ఆర్థిక మంత్రి, రక్షణ మంత్రి నుండి హోం మంత్రి, విదేశాంగ మంత్రి వరకు అన్ని ముఖ్యమైన పదవులను నిర్వహించాడు. అతను అధికారంలో ఉన్న కాలంలో అన్ని రంగాలలో ముఖ్యమైన మార్పులను తీసుకువచ్చాడు. 1962 చైనా ఇండియా యుద్ధం తర్వాత తిరిగి భారత సైన్యాన్ని పునర్నిర్మించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. అతను రక్షణ మంత్రిగా నియమితులైన తర్వాత, భారత సైన్నాన్ని వేగంగా విస్తరణ, ఆధునికీకరణ చేసాడు.1971 యుద్ధంలో భారతదేశానికి ప్రత్యక్షంగా సహాయపడిన సైన్యం గౌరవాన్ని పునరుద్ధరించాడు. [10] [11] కేంద్ర ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన నాలుగు హోం, విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆర్థికశాఖలను నిర్వహించిన ఏకైక మహారాష్ట్ర నేతగా యశ్వంత్ రావు చవాన్ రికార్డు సృష్టించాడు.1960లు, 70వ దశకం ప్రారంభంలో చవాన్ తన శక్తి, ప్రభావం శిఖరాగ్రంలో ఉన్నప్పుడు, అతన్ని ప్రతిశివాజీ లేదా కొత్త శివాజీ అని పిలిచారు. [12]
చవాన్ పేరుమీద ఉన్న స్థలాలు
మార్చు- 1980లో షోలాపూర్ జిల్లాలోని బీమా నది గ్రామమైన ఉజ్జనిపై ఉజ్జని బ్యాక్ వాటర్‌కి యశ్వంత్ సాగర్ అని పేరు పెట్టారు.
- 1984లో నాగ్‌పూర్‌లో యశ్వంతరావు చవాన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ పేరుతో ఒక ఇంజనీరింగ్ కళాశాల స్థాపించబడింది.
- 1989లో, మహారాష్ట్రలోని నాసిక్‌లో 'యశ్వంతరావు చవాన్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్శిటీ ' పేరుతో ఒక ఓపెన్ యూనివర్సిటీ స్థాపించబడింది.
- సతారాలోని రాయత్ శిక్షన్ సంస్థ ప్రసిద్ధ 'సైన్స్ కళాశాల' 1986లో సతారాలోని యశ్వంత్ రావు చవాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌గా నామకరణం చేయబడింది. Archived 2021-11-03 at the Wayback Machine
- పూణే, ముంబై మధ్య ఎక్స్‌ప్రెస్‌వేకి అతని పేరు పెట్టబడింది, అలాగే పూణేలోని కోత్రుడ్ శివారులోని ఆడిటోరియంలు, ముంబైలోని నారిమన్ పాయింట్ వద్ద, కరాడ్‌లోని టౌన్ హాల్ ఉన్నాయి.
- పింప్రిలోని సంత్ తుకారాం నగర్ ప్రాంతంలోని యశ్వంతరావు చవాన్ మెమోరియల్ అనే పేరుతో ఒక ఆసుపత్రి అతని పేరు పెట్టారు.
- శివాజీ యూనివర్సిటీ, కొల్హాపూర్ 'యశ్వంతరావు చవాన్ స్కూల్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్'ని స్థాపించింది.
- 2009లో, ముంబై పూణే ఎక్స్‌ప్రెస్ వే, భారతదేశపు మొదటి ఎక్స్‌ప్రెస్-వే, యశ్వంతరావ్ చవాన్ ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్-వే అని పేరు పెట్టారు
సాహిత్యం
మార్చుయశ్వంతరావు చవాన్ సాహిత్యం పట్ల అమితమైన ఆసక్తిని కనబరిచాడు. అతను మరాఠీ సాహిత్య మండలిని స్థాపించాడు. మరాఠీ సాహిత్య సమ్మేళనానికి (సమావేశం)కి మద్దతు ఇచ్చాడు. అతను చాలా మంది కవులు, సంపాదకులు, అనేక మంది మరాఠీ, హిందీ రచయితలతో చాలా సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు. అతను మరాఠీ విశ్వకోష్ (మరాఠీ భాషా విజ్ఞానం) సంకలనాన్ని ప్రారంభించాడు. ఇందుకోసం అతను లక్ష్మణ్ శాస్త్రి జోషిని చైర్మన్‌గా ప్రతిపాదించాడు.
జనాదరణ పొందిన సంస్కృతిలో
మార్చుయశ్వంతరావు చవాన్ బఖర్ ఎకా వాదలాచి, 2014 లో జబ్బర్ పటేల్ రూపొందించిన భారతీయ మరాఠీ భాషా జీవిత చరిత్ర చిత్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా అతని పాత్రను వివరిస్తుంది. అశోక్ లోఖండే చవాన్ పేరుఉన్న పాత్రను పోషించాడు.
మరణం
మార్చుఅతను 1965 ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో అతను కీలక పాత్ర పోషించాడు [13] [14] యశ్వంతరావు చవాన్ 1984 నవంబరు 25న ఢిల్లీలో అతని 71 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించాడు.నవంబరు 27న పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో కరాడ్‌లో అతని అంత్యక్రియలు జరిగాయి. అతని సమాధి (విశ్రాంతి స్థలం) కృష్ణ-కోయినా ప్రీతిసంగంలో ఉంది .అతను పోషించిన తన పాత్రలకు, తెలివికి ప్రసిద్ధి చెందాడు [15]
మూలాలు
మార్చు- ↑ "YB Chavan was Centre's troubleshooter: Pranab". Hindustan Times (in ఇంగ్లీష్). 2013-03-24. Retrieved 2021-08-23.
- ↑ R. D. Pradhan; Madhav Godbole (1999). Debacle to Revival: Y.B. Chavan as Defence Minister, 1962-65. Orient Blackswan. p. 95. ISBN 978-81-250-1477-5.
- ↑ Jadhav, V., 2006. Elite politics and Maharashtra's Employment Guarantee Scheme. Economic and Political Weekly, pp.5157-5162.
- ↑ Mariam Dossal; Ruby Maloni (1999). State Intervention and Popular Response: Western India in the Nineteenth Century. Popular Prakashan. p. 88. ISBN 978-81-7154-855-2.
- ↑ Hatalkar, VG; Ray, NR (1986). Dictionary of National Biography: Supplement (Vol. 1). Calcutta: Institute of Historical Studies. Retrieved 20 May 2020.
- ↑ Purandare, Vaibhav (2012). Bal Thackeray & the rise of the Shiv Sena. Roli Books. ISBN 9788174369581. Retrieved 6 March 2017.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2016-03-03. Retrieved 2021-11-03.
- ↑ Pradhan, R. D. (1999). Debacle to Revival: YB Chavan as Defence Minister, 1962-65. Orient Blackswan, 11.
- ↑ Hatalkar, V.G. (1986). Ray, N.R. (ed.). DICTIONARY OF NATIONAL BIOGRAPHY (Supplement) Volume I (A-D). Calcutta: N. R. Ray Director, Institute of Historical Studies. p. 245342. Retrieved 20 August 2017.
- ↑ "Debacle to Resurgence Y.B. Chavan Defence Minister (1962-66): Buy Debacle to Resurgence Y.B. Chavan Defence Minister (1962-66) by Pradhan R.D. at Low Price in India". Flipkart.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-08-23. Retrieved 2021-08-23.
- ↑ "India's Defence and Foreign Policy: Role of Yashwantraoji Chavan Dated: March 25, 2012 - Indian Council of World Affairs (Government of India)". www.icwa.in. Retrieved 2021-08-23.
- ↑ Sirsikar, V.M. (1999). Kulkarni, A.R.; Wagle, N.K. (eds.). State intervention and popular response : western India in the nineteenth century. Mumbai: Popular Prakashan. p. 9. ISBN 81-7154-835-0.
- ↑ Pradhan, R. D. "'I hate these Pakistanis'". Rediff (in ఇంగ్లీష్). Retrieved 2021-08-23.
- ↑ Pradhan, R. D. (2017-02-02). Pradhan, R. (ed.). 1965 War: The Inside Story (Defence Minister Y.B. Chavan's Diary of India-Pakistan War): Defence Ministers Diary of the India-Pakistan War.
- ↑ "Contribution of Yashawantrao Chavan in the development of Maharashtra". Contribution of Yashawantrao Chavan in the development of Maharashtra. Retrieved 2021-08-23.
బాహ్య లింకులు
మార్చు- యశ్వంతరావు చవాన్ ప్రతిష్ఠాన్, ముంబై Archived 2021-01-19 at the Wayback Machine