ఉడుపి రామచంద్రరావు, (యు.ఆర్.రావు) అంతరిక్ష శాస్త్రవేత్త, భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ చైర్మన్. ఆయన అహ్మదాబాద్ లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీలో చైర్మన్ గానూ పని చేసాడు. ఆయన 1976 లో ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషన్ పురస్కారాన్ని భారత ప్రభుత్వంనుండి పొందాడు. ఆయన వాషింగ్టన్ లోని శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేం (ఉపగ్రహ కీర్తిప్రతిష్టులు) లో 2013 మార్చి 19 న జరిగిన సొసైటీ ఆఫ్ శాటిలైట్ ప్రొఫెషనల్స్ ఇంటర్నేషనల్ సంస్థ చేర్చినందున, అటువంటి గుర్తింపు పొందిన మొదటి భారతీయుడుగా చరిత్రపుటల్లోకెక్కాడు.[1][2][3]

ఉడుపి రామచంద్రరావు
2008 లో రావు చిత్రం
జననం(1932-03-10)1932 మార్చి 10
అడమూరు, ప్రస్తుత కాలపు ఉడుపి జిల్లా, భారత దేశము
మరణం2017 జూలై 24(2017-07-24) (వయసు 85)
బెంగళూరు
జాతీయతభారతీయుడు
రంగములుఅంతరిక్ష విజ్ఞానం , ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం.
వృత్తిసంస్థలుభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ
ఫిజికల్ రీసర్చ్ లేబరేటరీ
ప్రసిద్ధిభారత అంతరిక్ష పరిశోధన
ముఖ్యమైన పురస్కారాలు

ప్రారంభ జీవితం

మార్చు

ఆయన భారతదేశము లోని కర్ణాటక రాష్ట్రంలో అడమరులో జన్మించాడు. ఆయన తండ్రి లక్షీనారాయణ తల్లి కృష్ణవేణి అమ్మ. ఆయన ప్రాథమిక విద్యను అడమూరులో పూర్తిచేశాడు. ఉడిపి లోని క్రిస్టియన్ పాఠశాలలో ఉన్నత విద్యను పూర్తి చేశాడు. అనంతపురం లోని ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో బి.యస్సీ డిగ్రీని పొందాడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయమందు ఎం.యస్.సి చేశారు. అహ్మదాబాద్లో ఫిజికల్ లాబొరేటరీలో పి.హెచ్.డిని చేశారు. పి.హె.డిని విక్రం సారభాయి అధ్వర్యంలో పూర్తి చేశాడు.[4]

విద్య

మార్చు

MIT లో ఫ్యాకల్టీ సభ్యునిగా, డల్లాస్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసిన తరువాత అక్కడ అంతరిక్ష నౌకలపై ప్రధాన ప్రయోగాత్మకంగా పరిశోధనలలో అతను మార్గదర్శి, అన్వేషకునిగా ఉన్నాడు. అతను భారతదేశానికి 1966లో తిరిగి వచ్చి అహ్మదాబాద్ లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీలో ప్రొఫెసర్ గా పనిచేసాడు.

జీవిత విశేషాలు

మార్చు

అతను తన పరిశోధనా జీవితాన్ని కాస్మిక్ కిరణాల శాస్త్రవేత్తగా ప్రారంభించాడు. విక్రమ్ సారాభాయ్ ఆధ్వర్యంలో MIT లో తన పరిశోధనలను కొనసాగించాడు. జెపిఎల్ గ్రూపు సహకారంతో, సౌర పవనాల యొక్క నిరంతర స్వభావాన్ని, భూ అయస్కాంతత్వంపై దాని ప్రభావాన్ని రెండు పరిశీలనల ద్వారా స్థాపించిన మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు.

అంతరిక్ష నౌకలపై అతను చేసిన ప్రయోగాల అనేక పథనిర్దేశాలు, అన్వేషణలు సౌర విశ్వ కిరణాల దృగ్విషయం, అంతర గ్రహ స్థలం విద్యుదయస్కాంత స్థితిపై పూర్తి అవగాహనకు దారితీసింది. వేగవంతమైన అభివృద్ధికి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉందని గ్రహించిన రావు 1972 లో భారతదేశంలో ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని స్థాపించే బాధ్యతను చేపట్టాడు.[6] అతని మార్గదర్శకత్వంలో, 1975 లో మొట్టమొదటి భారతీయ ఉపగ్రహం "ఆర్యభట్ట"తో ప్రారంభించి, భాస్కర, ఆపిల్, రోహిణి, ఇన్సాట్ -1, ఇన్సాట్ -2 సిరీస్ బహుళార్ధసాధక ఉపగ్రహాలు, ఐఆర్ఎస్ -1 ఎ, ఐఆర్ఎస్ -1 బి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు సహా 18 కి పైగా ఉపగ్రహాలు ఉన్నాయి. కమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్, వాతావరణ సేవలను అందించడానికి ఇవి రూపొందించబడినవి. ఇస్రో నుండి వైదొలగినతరువాత ప్రసారభారతి ఛైర్మన్ గా పనిచేసాడు. [7] కర్ణాటక వైజ్ఞానిక అకాడమీ అధ్యక్షుడిగా పనిచేశారు.

ఇస్రో ఛైర్మన్‌గా

మార్చు

1985 లో అంతరిక్ష శాఖ ఛైర్మన్, అంతరిక్ష కమిషన్, కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత, రావు రాకెట్ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిని వేగవంతం చేశాడు. ఫలితంగా 1992 లో ASLV రాకెట్ విజయవంతంగా ప్రయోగించబడింది.[8] 1995 లో 850 కిలోల ఉపగ్రహాన్ని ధ్రువ కక్ష్యలోకి విజయవంతంగా ప్రయోగించిన కార్యాచరణ, పిఎస్‌ఎల్‌వి ప్రయోగ వాహనం అభివృద్ధికి కూడా అతను బాధ్యత వహించారు. రావు జియోస్టెషనరీ లాంచ్ వెహికల్ జిఎస్ఎల్వి, క్రయోజెనిక్ టెక్నాలజీ అభివృద్ధిని 1991 లో ప్రారంభించాడు. ఇస్రోలో పనిచేసిన కాలంలో INSAT ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించడానికి అతను బాధ్యత వహించాడు. ఇన్సాట్ ఉపగ్రహాల ప్రయోగం 1980, 1990 లలో భారతదేశంలో సమాచార మార్పిడికి ఉత్సాహాన్నిచ్చింది. ఇన్సాట్ విజయవంతంగా ప్రారంభించడం భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు టెలికమ్యూనికేషన్ సౌకర్యాలను అందించింది. ఈ దశాబ్దాలలో భూమిపై వివిధ ప్రదేశాలలో ఉపగ్రహ లింకుల లభ్యత కారణంగా ల్యాండ్‌లైన్ ఫోన్లు దేశవ్యాప్తంగా విస్తరించాయి. కనెక్షన్ పొందడానికి గంటలు వేచి ఉండటానికి బదులుగా STD (సబ్‌స్క్రయిబర్ ట్రంక్ డయలింగ్) ఉపయోగించడం ద్వారా ప్రజలు ఎక్కడి నుండైనా సులభంగా మాట్లాడగలరు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్‌గా భారతదేశం అభివృద్ధి చెందడానికి భవిష్యత్తులో ఈ అభివృద్ధి కీలక పాత్ర పోషించింది. అతను ఆంత్రిక్స్(Antrix) కార్పొరేషన్ మొదటి ఛైర్మన్.

పురస్కారాలు

మార్చు

పద్మ విభూషణ్ తో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. :[9][10]


అంతర్జాతీయ రంగంలొ వృత్తిపరమైన చర్యలు

మార్చు
  • 1986-1992 ఉపాధ్యక్షుడు, ఇంటర్నేషనల్ ఆష్ట్రోనాటికల్ ఫెడరేషన్
  • 1997-2000 అధ్యక్షుడు, అంతరిక్ష శాంతి ఉపయోగాల మండలి,ఐక్యరాజ్యసమితి UN-COPUOS (United Nations - Committee on Peaceful Uses of Outer Space)

రచనలు

మార్చు
  • U. R. Rao, K. Kasturirangan, K. R. Sridhara Murthi. and Surendra Pal (Editors), "Perspectives in Communications", World Scientific (1987). ISBN 978-9971-978-76-1
  • U. R. Rao, "Space and Agenda 21 - Caring for Planet Earth", Prism Books Pvt. Ltd., Bangalore (1995).
  • U. R. Rao, "Space Technology for Sustainable Development", Tata McGraw-Hill Pub., New Delhi (1996)

మూలాలు

మార్చు
  1. "U.R. Rao inducted into Satellite Hall of Fame". The Hindu. 29 March 2013. Retrieved 3 April 2013.
  2. "SSPI Announces the 2013 Satellite Hall of Fame Inductees". Society of Satellite Professionals International. Archived from the original on 2013-04-15. Retrieved 2013-02-25.
  3. "Prof U R Rao inducted into the Satellite Hall of Fame, Washington" (Press release). isro.org. 28 March 2013. Archived from the original on 20 April 2013. Retrieved 3 April 2013.
  4. "India's Pioneer Space Scientist – Professor Udupi Ramachandra Rao". karnataka.com. 2011-11-17. Retrieved 2013-02-25.
  5. "Prof. Udupi Ramachandra Rao - Biodata". ISRO. Archived from the original on 2009-08-16. Retrieved 2013-02-25.
  6. "Indian Fellow". Indian National Science Academy. Archived from the original on 24 జూన్ 2013. Retrieved 21 June 2013.
  7. "DD to improve quality of programmes". Archived from the original on 2010-08-20. Retrieved 2014-03-10.
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-01-07. Retrieved 2014-03-10.
  9. "Prof. Udupi Ramachandra Rao - Awards Honours". ISRO. Archived from the original on 2013-02-11. Retrieved 2013-02-25.
  10. "PANDIT GOVIND BALLABH PANT MEMORIAL LECTURE - IV" (PDF). Govind Ballabh Pant Institute of Himalayan Environment and Development. Archived from the original (PDF) on 30 మే 2015. Retrieved 21 June 2013.

ఇతర లింకులు

మార్చు