జి.వి.సుధాకర్ నాయుడు దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం రంగ ది దొంగ. ఇందులో శ్రీకాంత్, రమకృష్ణ, సుమన్, జయప్రకాష్ రెడ్డి, విమలా రామన్ నటించారు . ఈ చిత్రం 2010 డిసెంబరు 30న విడుదలైంది.

రంగ ది దొంగ
(2010 తెలుగు సినిమా)
నిర్మాణం సి.ఆర్.మనోహర్
కథ మదన్
తారాగణం శ్రీకాంత్, విమలా రామన్, రమ్యకృష్ణ, జయప్రకాష్ రెడ్డి, చలపతి రావు, సుమన్, తెలంగాణ శకుంతల, శివాజీ రాజా, నాగేంద్ర బాబు, గౌతంరాజు, భువనేశ్వరి
నిర్మాణ సంస్థ గాడ్ ఫాదర్ ఫిల్మ్స్
విడుదల తేదీ 30 డిసెంబర్ 2010
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

రంగా (శ్రీకాంత్) స్టూవర్ట్ నగర్ లో నివసించే దొంగ. అతన్ని తన అమ్మమ్మ (శకుంతల) పెంచింది. అవినీతిపరులైన పోలీసు అధికారుల ఇళ్ళలో దొంగతనాలు చేసేవవాడు. తమ ఇళ్ల లోనే దొంగతనం జరిగిందని వాళ్ళు ఫిర్యాదు చేయలేరు కాబట్టి అతడు ఈ పని చేసేవాడు. అతను వారి ఇళ్లలో క్లోరోఫామ్ అనే మత్తుమందును పిచికారీ చేసి డబ్బూ, విలువైన వస్తువులనూ దొంగిలించేవాడు. వారి యూనిఫారం చొక్కాల భుజాలపై ఉన్న నక్షత్రాలకు అనర్హులని నిరూపించడానికి అతను వాటిని కూడా దొంగిలించేవాడు. రంగాకు ఫ్యాక్షన్ సినిమాలంటే ఇష్టం. అలాంటి నాయకులలో ఒకరిలా నటించాలని కలలు కనేవాడు. అదే సమయంలో, అతను సబ్ ఇన్స్పెక్టర్ మంగమ్మ (విమల రామన్) తో ప్రేమలో పడతాడు. ఒకానొక సమయంలో, రంగా, అతని స్నేహితులు పోలీసు కమిషనర్ (నాగేంద్ర బాబు) ఇంటిని దోచుకోవడానికి ప్రయత్నిస్తారు, కాని పట్టుబడతారు. వారు కోర్టులో ఉన్నప్పుడు, రంగా నిజమైన ఫ్యాక్షను నాయకురాలు భవానీ ప్రసాద్ (శ్రీకాంత్) ను కలుస్తాడు. భవానీ ప్రత్యర్థి అతనిపై తీవ్రంగా దాడి చేయడంతో, అతడు మరణిస్తాడు. అయితే, రంగా భవానీ లాగా కనిపిస్తున్నాడని గమనించి, అతడి భార్య (రమ్యకృష్ణ) అతను నిజంగా జీవించి ఉన్నాడని అందరికీ నిరూపించడానికి తన దివంగత భర్త స్థానాన్ని తీసుకోవాలని అతణ్ణి ఒప్పిస్తుంది. తాను వాస్తవానికి భవానీ ప్రసాద్ సొంత సోదరుడేనని రంగా తెలుసుకుంటాడు. చివరకు అతను నిజమైన ఫ్యాక్షన్ నాయకుడిలా మారతాడు.

నటీనటులు

మార్చు

పాటలు

మార్చు
క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "వెంటాడే సింగమల"  చక్రి  
2. "గిచ్చి గిచ్చి వేస్తూ"  చక్రి, మాళవిక  
3. "నా ఒళ్ళే"  చక్రి, విజయ లక్ష్మి  
4. "ఓ మీనాచ్చీ"  ఆదర్శిని, సింహా  
5. "మనసా మనసా తొందర"  కౌసల్య  

మూలాలు

మార్చు