జి. వి. సుధాకర్ నాయుడు
జి. వి. సుధాకర్ నాయుడు తెలుగు సినీ పరిశ్రమ లో "జీవి" గా గుర్తింపు పొందిన నటుడు, దర్శకుడు.[1] [2]2008 లో నితిన్, భావన ప్రధాన పాత్రలలో వచ్చిన హీరో అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. 2010 లో శ్రీకాంత్ కథానాయకుడిగా రంగ ది దొంగ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. అతను 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ తరపున గాజువాక శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసాడు.
జి. వి. సుధాకర్ నాయుడు | |
---|---|
![]() | |
విద్య | న్యాయవిద్య |
వృత్తి | లాయర్, నటుడు, దర్శకుడు |
వ్యక్తిగత జీవితంసవరించు
ఈయన అసలు పేరు సుధాకర్ నాయుడు. దాసరి నారాయణరావు ఈయనకు బంధువు అవుతాడు. ఆయన కోరిక మేరకు సినిమా రంగంలోకి వచ్చాడు. చిరంజీవి అంటే ఇష్టం ఉండటంతో దాసరి ఆయన పేరు ముందు జీవి చేర్చాడు. ఆ పేరు సినిమాల్లో అలాగే స్థిరపడిపోయింది.[3] సినిమాల్లోకి రాక మునుపు జీవి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య పూర్తి చేశాడు. తర్వాత హైదరాబాదు హైకోర్టులో లాయరుగా రెండు సంవత్సరాలు ప్రాక్టీసు చేశాడు. తర్వాత అమెరికాలో ఇంటర్నేషనల్ లా విభాగంలో ఎం. ఎస్. చేశాడు.
సినీరంగంసవరించు
జీవి తెలుగు సినిమాలలో ఎక్కువగా ప్రతినాయకుడి గా నటించాడు. ఢిల్లీ లో పన్నెండు సంవత్సరాలు నివాసం ఉన్నాడు కాబట్టి హిందీ బాగా మాట్లాడగలడు.[1] 1998 లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన అంతఃపురం సినిమాలో ప్రతినాయక పాత్రతో సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు. తొలి సినిమాతోనే ఈయనకు మంచి గుర్తింపు లభించింది. నితిన్ ప్రధాన పాత్రలో వచ్చిన హీరో అనే చిత్రానికి, శ్రీకాంత్ నటించిన రంగ ది దొంగ అనే చిత్రానికి కూడా దర్శకత్వం వహించాడు.[4]
నటించిన సినిమాలుసవరించు
- అంతఃపురం (సినిమా) - 1998
- బలరాం- 2020
- అయోధ్య రామయ్య - 2002
- ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం - 2001
- సీమ సింహం - 2002
- వాసు (సినిమా) - 2002
- ఇంద్ర (సినిమా) - 2002
- ఒక్కడు - 2003
- సింహాద్రి (సినిమా) - 2003
- సాంబ (సినిమా) - 2004
- ఆంధ్రావాలా (సినిమా) - 2004
- శివ్ శంకర్ (2004)
- ఇంక అంతా శుభమే పెళ్ళి జరిపించండి (2004)
- కాశి (2004)
- అతనొక్కడే - 2005
- హ్యాపీ - 2006
- రణం - 2006
- అసాధ్యుడు (2006 సినిమా) - 2006
- పోకిరి - 2006
- ఆడవారి మాటలకు అర్థాలే వేరులే - 2007
- చిరుత (సినిమా) - 2007
- కంత్రి (సినిమా) - 2008
- బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం - 2010
- రంగ ది దొంగ - 2010
- ఊసరవెల్లి (సినిమా) - 2011
- ఒక్కడినే - 2013
- ఎవడు (సినిమా) - 2014
- లెజెండ్ - 2014
- పొగ - 2014
- డిక్టేటర్ - 2016
- సరైనోడు - 2016
- జక్కన - 2016
- హైపర్ (సినిమా) - 2016
- అప్పట్లో ఒకడుండేవాడు - 2016
- జయ జానకి నాయక - 2017
- వినయ విధేయ రామ - 2019
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 "GV Sudhakar Naidu to direct Bolly multistarrer". indiaglitz.com. Retrieved 16 September 2016.
- ↑ "GV Sudhakar Naidu to direct Bolly multistarrer".
- ↑ "'చిరంజీవి' పేరులోని చివరి రెండు అక్షరాలే..!". Samayam Telugu. Retrieved 2020-11-20.
- ↑ Reporter, Staff (2017-12-27). "Web series, mega serial on Vangaveeti Ranga's life announced". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-11-20.