రంజని-గాయత్రి

కర్ణాటక సంగీత విద్వాంసులు, వాయులీన విద్వాంసులు

రంజని, గాయత్రి కర్ణాటక సంగీత విద్వాంసులు, వాయులీన విద్వాంసులు.

రంజని-గాయత్రి
రంజని-గాయత్రి
జననంరంజని-గాయత్రి
ఇతర పేర్లురంజని-గాయత్రి
ప్రసిద్ధిక్లాసికల్ సంగీతం, కర్ణాటక సంగీతం
మతంహిందూ మతము
తండ్రిఎన్.సుబ్రహ్మణ్యం
తల్లిమీనాక్షి
వెబ్‌సైటు
ranjanigayatri.com

బాల్య జీవితం

మార్చు

రంజని, గాయత్రి ల తల్లిదండ్రులు బాలసుబ్రమణ్యం,[1] మీనాక్షి. తల్లి మీనాక్షి కర్నాటక సంగీత విద్వాంసురాలు. వారు క్లాసికల్ సంగీతంలో ప్రసిద్ధమైన పాలక్కడ్ అయ్యర్ కుటుంబంలో జన్మించారు. వయొలిన్ విద్వాంసులుగా తమ 9వ ఏటనుంచే నేర్చుకోవడం ఆరంభించారు.[2] ఈ సోదరీమణులు. ముంబాయి షన్ముఖానంద సంగీత విద్యాలయానికి చెందిన టి.ఎస్‌.కృష్ణస్వామి గురువు వద్ద ఈ ఇద్దరు అక్కచెల్లెళ్లు తమ సంగీత సాధన ఆరంభించారు[3]

వయోలిన్ యుగళ కళాకారులుగా

మార్చు

1997 సంవత్సరం నుంచి ఈ అక్కచెల్లెళ్లు తమ ప్రదర్శనలివ్వడం ఆరంభించారు. అచిరకాలంలోనే ఈ అక్కచెల్లెళ్లు తమ వయోలిన్ కృతులతో అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు. లెక్కకు మిక్కిలిగా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇటీవల సౌత్‌ ఇండియన్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ రవీందభ్రారతిలో నిర్వహించిన సంస్థాగత వార్షికోత్సవాలలో రంజని - గాయత్రి గాత్రం రాగ రంజితంగా సాగింది. రంజని-గాయత్రి ద్వయం తమ సంగీత శిక్షణలో మెళకువలు ప్రఖ్యాత సంగీత విద్వాంసులు పద్మభూషణ్ పి.యస్.నారాయణస్వామి వద్ద నేర్చి సంగీతంలో ఇంతటి కీర్తినార్జించారు. ఈ సోదరీమణులు వయోలిన్ ను యుగళంగా కచేరీలు యివ్వడమే కాక, వయోలిన్ విద్వాంసులుగా ప్రసిద్ధులైనారు. వీరిరువురూ ప్రముఖ వయోలిన్ విద్వాంసులు డి.కె.పట్టమ్మాళ్తో కూడా కలసి కచేరీలు చేశారు.

వోకల్ కళాకారులుగా

మార్చు

1997 నుండి అక్కాచెల్లెళ్ళు వోకల్ వాద్యం పై కూడా ప్రదర్శనలివ్వడం ప్రారంభించారు. తర్వాత వారు పద్మ భూషణ సంగీత కళా ఆచార్య పి.ఎస్.నారాయణస్వామి[4] గారికి శిష్యులైనారు. గురువుగారి ప్రోత్సాహ సహకారాలతో గాత్రయుగళంగా రూపొందటం, పరిణామక్రమం కాదు, కేవలం ప్రతిభా వ్యుత్పత్తులకే చక్కని ఉదాహరణ. సీతానారాయణన్ వద్ద భజనలు, విశ్వాస్ జోషి వద్ద హిందుస్థాని సంగీతం నేర్చి భారతీయ సంగీత రాయబారులుగా విరాజిల్లుతున్నారనే విషయం జగద్విదితం. ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి పలు సీడీలు కూడా విడుదల చేశాడు. కళాసాగరమ్ సంస్థ 45 సంగీత నృత్య నాటక వార్షికోత్సవాలో 6వ రోజు ప్రఖ్యాత శాస్ర్తియ సంగీత విద్వాంసులు రంజని, గాయత్రి యుగళ గాత్ర కచేరీ వార్షికోత్సవాలకు ప్రధాన ఆకర్షణగా నిలిచి, రసజ్ఞ ప్రేక్షకులను రసానంద డోలికల్లో ముంచెత్తారనవచ్చు.

ప్రముఖ వోకల్ విద్వాంసుడు, చెన్నై వాసి అయిన "విశ్వజోషి" (వాషింగ్టన్ వరల్డ్ భ్యాంకు అధికారి) గారితో సమావేశమయ్యే అవకాశాన్ని పొందారు. కొల్హాపూర్ కు చెందిన "మానెక్ భైద్, అప్పాసాహెబ్" లనుండి కొన్ని అభంగాలు, జావళీలు నేర్చుకున్నారు.[4]. వారు ప్రపంచంలో విశేష ఖ్యాతి పొందారు. 1997 నుండి వారి ప్రదర్శనలు వివిధ సభలలో, సంగీత పండుగలలో, వివిధ సంగీత సంస్థలలో దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి.వారు అనేక అల్బమ్స్ విడుదల చేశారు. ఈ ఆల్బమ్స్ ను వయోలిన్, వోకల్ లలో విడుదల చేశారు. వీరు ప్రతి సంవత్సరం అనేక ప్రపంచ ప్రదర్శలనలో హాజరగుచున్నారు. వీరు యునైటెడ్ స్టేట్స్, కెనడా, సింగపూర్, మలేషియా, యు.కె., ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మొదలగు దేశాలలో ప్రదర్శనలిచ్చారు.

స్వరకర్తగా

మార్చు

రంజని, గాయత్రిలు గాత్ర కచేరీలు చేయటమే కాకుండా కొన్ని పాటలకు, ఆల్బం లకు స్వరకర్తగా కూడా ఉన్నారు. వారు చేసిన భజన్స్, అభాంగ్స్ కొన్ని ఈ క్రిందనీయబడినవి.

  • బోలావ విఠల - అభాంగ్ (భక్త తుకారాం) - భైతియార్ రాగం లోనికి మార్చారు.
  • పాగైవనుక్కరుల్వయి (సుబ్రహ్మణ్య భారతి) - రాగమాలిక
  • నాచ్‌కే ఆయే - భజన్ (అంభుజం కృష్ణ) - వసంత్ బహర్ రాగం
  • రాం నామ్‌ మనత - అబాంగ్ (తుకారాం) - ఝింకఝోటి రాగం
  • శరణ శరణ - అభాంగ్ (తుకారాం) - పిలు రాగం
  • ధన్య ధన్య - అభాంగ్ (ఏక్‌నాథ్) -దుర్గా రాగం
  • సదా మఝే - అభాంగ్ (తుకారాం) - మిశ్రమల్కాన్స్ రాగం

అవార్డులు

మార్చు

రంజని, గాయత్రిలు యుగళంగా అనేక అవార్డులు పొందారు. భారతదేశములో గల ప్రముఖ సంగీత విద్వాంసులనుండి గుర్తింపు పొందారు. యిటీవల ప్రముఖ సితార్ విద్వాంసుడు భారత రత్న అవార్డు గ్రహీత పండిట్ రవిశంకర్ చే ఢిల్లీలో కరిగిన గాత్ర కచేరీలో వారి ప్రతిభకు ముగ్ధుడైనారు. ఆ సోదరీమణుల అవార్డుల జాబితా దిగువనీయబడింది.

  • సంస్కృతి అవార్డులు, - సంస్కృతి ఫౌండేషన్, ఢిల్లీ.[5]
  • కల్కి కృష్ణమూర్తి మెమోరియల్ అవార్డు.
  • యోగం నారాయణ స్వామి అవార్డు
  • నేషనల్ ఎమినెంట్ అవార్డు. - షణ్ముకానంద సభ, ముంబయి.
  • డిసెంబరు 2005 లో కార్తీక్ ఫైన్ ఆర్ట్స్, చెన్నై వారిచే "ఈసాయీ పెరోలి" బిరుదం.
  • డా.ఎం.ఎల్. వసంథకుమారి ఎండోమెంట్ అవార్డు, యు.ఎస్.ఎ. - నారద గానసభ, చెన్నై.
  • సారద కృష్ణయ్యర్ మెమోరియల్ అవార్డు.
  • T.S.Sabesa and Thanjavur Ponniah Pillai Award for Viruttam/Sloka singing from The Music Academy, Chennai.
  • Performed their debut violin duet concert at the Indian Music Group Festival of Music when they were thirteen and ten years old respectively.
  • Recipients of the Government of India Talent Search Scholarship from the age of ten.
  • Winners of the First Prize in the All India Radio National Competition for Violin.
  • Recipients of the title of "Sangeeta Shanmukha Mani' conferred by Shanmukhananada Fine Arts and Sangeeta Vidyalaya, Mumbai.
  • Won The Outstanding Violinists Award for four consecutive years from the Music Academy, Chennai from 1994 to 1998. Won the Award for Best Kirtana Rendering for their vocal concert from Sri Krishna Gana Sabha in 1999.

సూచికలు

మార్చు
  1. "Semmangudi Srinivasa Iyer passes away: the end of an era". Asian Tribune. Indo-Asian News Service. 1 October 2003. Retrieved 6 April 2011.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-08-26. Retrieved 2013-05-29.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-03-10. Retrieved 2013-05-29.
  4. 4.0 4.1 Anima, P. (21 November 2008). "Sister act". The Hindu. Archived from the original on 26 ఆగస్టు 2009. Retrieved 6 April 2011.
  5. "'Virutham is our forte'". The Hindu. 6 March 2009. Archived from the original on 10 మార్చి 2009. Retrieved 6 April 2011.

యితర లింకులు

మార్చు