రక్త సంబంధాలు

రక్త సంబంధాలు 1975, ఆగష్టు 29వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. [1]

రక్త సంబంధాలు
(1975 తెలుగు సినిమా)
Rakta sambandhalu.jpg
దర్శకత్వం ఎం.మల్లికార్జునరావు
తారాగణం కృష్ణ,
మంజుల (నటి),
అంజలీదేవి,
పండరీబాయి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నేపథ్య గానం పి.సుశీల
గీతరచన ఆరుద్ర
నిర్మాణ సంస్థ రిపబ్లిక్ ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులుసవరించు

సాంకేతిక వర్గంసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రంలోని పాటలను ఆరుద్ర, సి.నా.రె.లు రచించగా సత్యం సంగీతం సమకూర్చాడు.[2]

  1. అనురాగ శిఖరాన ఆలయం, ఆ గుడిలోన ఆనంద జీవనం, సంసారదీపం సంతోషరూపం మురిపాల ఆరాధనం - పి.సుశీల, బృందం - రచన: ఆరుద్ర
  2. ఎవరో నోనీవు ఎవరో నేను అంతా మాయరా హరిఓం హరిఓం పాడరా - పి.సుశీల, ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం -రచన: సి.నా.రె
  3. ఇలారా మిఠారి బలేబార్ కఠారి అరె మాకీ మీకీ మంచి జోడా కలవాల - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రమోలా - రచన: ఆరుద్ర
  4. చినదాని చెవులను చూడు, తెలరాళ్ళ కమ్మల జోడు - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆరుద్ర
  5. జస్టే మినిట్ - పి.సుశీల, ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆరుద్ర

కథా సంగ్రహంసవరించు

వేణుగోపాలరావు ఫారెస్ట్ ఆఫీసర్. అతడు తన భార్య జానకి, పిల్లలు వినయ్, విజయ్, లతలతో ఆనందంగా జీవిస్తుంటాడు. అయితే ఒకరోజు ఆ పండంటి కుటుంబం ఛిన్నాభిన్నమై చెట్టుకొకరు పుట్టకొకరుగా విడిపోతారు. ఆ ఘాతుకాన్ని కళ్ళారా చూసిన విజయ్ మనసు పగతో నిండిపోయింది. ఇరవై ఏళ్ళ తర్వాత తన లక్ష్య సాధన కోసం విడిపోయిన తన తల్లి, చెల్లి, తమ్ముళ్ళ కోసం విజయ్ దొంగగా మారతాడు. చెల్లెలు లత గానమే తన ప్రాణంగా తనవారి కోసం ఆవేదనతో అలమటిస్తూ క్లబ్‌లో పాప్ సింగర్‌గా జీవిస్తూ ఉంటుంది. ఎప్పటికైనా తన అన్నను, చెల్లిని కలుసుకోగలననే ధైర్యంతో, పేదరికంతో పెనుగులాడుతూ తల్లిని పోషించడానికి టాక్సీడ్రైవర్‌గా మారతాడు తమ్ముడు వినయ్. ఒకే రక్తాన్ని పంచుకున్న వీరు ముగ్గురూ మూడు దారుల్లో సాగిపోతున్నా వారి మధ్యనున్న రక్త సంబంధాలు వీరిని ఒకటిగా ఎలా చేర్చిందనేది మిగిలిన కథ.

మూలాలుసవరించు

  1. web master. "Raktha Sambandalu (M. Mallikarjun Rao) 1975". indiancine.ma. Retrieved 14 November 2022.
  2. ఈశ్వర్ (1975). రక్త సంబంధాలు పాటల పుస్తకం. విజయవాడ: నవచిత్ర ఎంటర్‌ప్రైజస్. p. 8. Retrieved 14 November 2022.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.