రచన (నటి)

బెంగాలీ నటి
(రచన బెనర్జీ నుండి దారిమార్పు చెందింది)

రచనా బెనర్జీ బెంగాళీ చలనచిత్ర నటి. ఈమె దక్షిణణాది సినిమాలలో నటిచించే ముందు ఒరియా, బెంగాళీ భాషా సినిమాలలో నటించింది. ఈమెను నేను ప్రేమిస్తున్నాను సినిమా ద్వారా దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ తెలుగు తెరకు పరిచయం చేసాడు. దక్షిణణాదిన తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించడమే కాకుండా హిందీ సినిమా పరిశ్రమలో కూడా అడుగుపెట్టినది. రచన, హిందీ చిత్రము సూర్యవంశ్ లో అమితాబ్ బచ్చన్ సరసన నటించి మంచి పేరు తెచ్చుకొన్నది.

రచనా బెనర్జీ
Rachana Benerjee.jpg
రచనా బెనర్జీ, బెంగాళీ నటి
జననం (1974-10-02) 1974 అక్టోబరు 2 (వయసు 48)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1994-ప్రస్తుతం
జీవిత భాగస్వామిసిద్ధాంత్ మహాపాత్ర (2004-5)
ప్రొబల్ బాసు (2006-)
పిల్లలుప్రొణీల్ బాసు

రచన కొల్కతాలో ఆర్.ఎన్.బెనర్జీ, సీమా బెనర్జీ దంపతులకు జన్మించింది.[1] ఈమె ఒరియా సినిమా అగ్ర నటుడు సిద్ధాంత్ మహాపాత్రను పెళ్ళి చేసుకున్నది. కానీ వీరి వివాహము ఎంతో కాలము నిలువలేదు. 2004 లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. రచన, 2005లో ప్రొబల్ ని రెండవ వివాహము చేసుకొన్నది. వీరికి ప్రొణీల్ అనే కొడుకు పుట్టాడు.

1995 నుండి 2002 వరకు[2] రచనా బెనర్జీ ఒరియాలో యాభైకి పైగా సినిమాలలో నటించింది. అందులో నలభైకి పైగా సిద్ధాంత్ మహాపాత్రతో కలిసి నటించినవే. వ్యక్తిగత జీవితంలో సిద్ధాంత్ మహాపాత్రతో విభేదాలు రావటంతో, అప్పట్లో ఆయన తప్ప మరో హీరో లేని ఒరియా పరిశ్రమను తప్పనిసరి పరిస్థితుల్లో వదిలి వెళ్ళింది. బెంగాళీ పరిశ్రమలో ఈమె ప్రొసేన్‌జీత్ ఛటర్జీతో నటించిన అనేక సినిమాలు ఘనవిజయం సాధించాయి.

రచనా బుల్లితెరపై జీ బాంగ్లాలో దీదీ నెం.1 అనే గేమ్ షోకు సేతగా పనిచేస్తున్నది.[3]

నటించిన చిత్రాలుసవరించు

మూలాలుసవరించు

  1. "Rachana Ragalahari interview". Archived from the original on 2016-03-05. Retrieved 2013-07-10.
  2. "Tollywood's oomph factor - Kolkata on Wheels". Archived from the original on 2013-08-07. Retrieved 2013-07-10.
  3. "Rachana Banerjee had invited Bengali celebrities in Didi No. 1 in Zee Bangla". Archived from the original on 2012-04-26. Retrieved 2013-07-10.
"https://te.wikipedia.org/w/index.php?title=రచన_(నటి)&oldid=3587941" నుండి వెలికితీశారు