రమేష్ సిప్పీ
రమేష్ సిప్పీ (జననం 1947 జనవరి 23) హిందీ చలనచిత్ర దర్శకుడు, నటుడు, నిర్మాత. భారతదేశంలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ప్రభావవంతమైన చిత్రాలలో ఒకటిగా పరిగణించబడే షోలే (1975)కు దర్శకుడిగా ఆయన ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందారు.[2] భారత ప్రభుత్వం 2013లో అతన్ని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.[3] 2017లో ఇతను ముంబైలో రమేష్ సిప్పీ అకాడమీ ఆఫ్ సినిమా అండ్ ఎంటర్టైన్మెంట్ను స్థాపించారు.
రమేష్ సిప్పీ | |
---|---|
జననం | రమేష్ సిపాహిమాలనీ 1947 జనవరి 23 కరాచీ, సింధ్, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం పాకిస్తాన్లోని సింధ్) |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | |
భార్య / భర్త | గీతా సిప్పీ (divorced) |
పిల్లలు | 3 (వీళ్ళలో రోహన్ సిప్పీ ఒకడు) |
తండ్రి | జి.పి.సిప్పీ |
Honors | పద్మశ్రీ (2013) |
వ్యక్తిగత జీవితం
మార్చురమేష్ సిప్పీ 1947 జనవరి 23న బ్రిటిష్ ఇండియాలోని కరాచీ నగరంలో సింధీ హిందూ కుటుంబంలో సినీ నిర్మాత అయిన జి. పి. సిప్పీ కుమారునిగా జన్మించాడు. రమేష్ సిప్పీ రెండుసార్లు వివాహం చేసుకున్నాడు, ప్రస్తుతం రెండవ భార్య, నటి కిరణ్ జునేజాతో జీవిస్తున్నాడు. మొదటి భార్య గీతాకీ, ఆయనకీ ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన కుమారుడు రోహన్ సిప్పీ సినిమా దర్శకుడు.
అతని కుమార్తె షీనా శశి కపూర్ కుమారుడు కునాల్ కపూర్ ను వివాహం చేసుకున్నది. వారు 2004లో విడాకులు.[4] అతని మరో కుమారుడు జహాన్ కపూర్ హిందీ సినీ, రంగస్థల నటుడు.[5]
కెరీర్
మార్చురమేష్ సిప్పీ తన తండ్రి తీసిన సినిమా "సజా" సెట్లలోకి 6 సంవత్సరాల వయసులో వెళ్ళి చూసేవాడు. తొమ్మిదేళ్ల వయసులో 1953లో షహెన్షా చిత్రంలో అచలా సచ్దేవ్ కొడుకు పాత్రలో నటించాడు. తన తండ్రి నిర్మిస్తున్న జోహార్-మెహమూద్ ఇన్ గోవా, మేరే సనమ్ వంటి చిత్రాలలో నిర్మాణ, దర్శకత్వం విభాగాలలో పనిచేశాడు. ఏడు సంవత్సరాల పాటు సినిమాలకు సహాయకునిగా పనిచేశాకా 1971లో షమ్మీ కపూర్, హేమమాలిని, రాజేష్ ఖన్నా నటించిన అందాజ్ చిత్రానికి దర్శకుడు అయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. అతని దర్శకత్వంలో రెండవ సినిమాగా హేమమాలిని ద్విపాత్రాభినయం చేసిన సీతా ఔర్ గీతా (1972) విడుదలైంది. ఇది అత్యంత విజయం సాధించి, హేమమాలినికి సూపర్ స్టార్ డమ్ అందింది.[6][7]
1975లో, ఇతని దర్శకత్వంలో ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, సంజీవ్ కుమార్, గబ్బరు సింగ్ అన్న ఐకానిక్ గజదొంగ పాత్రలో అమ్జద్ ఖాన్ వంటి నటీనటులతో షోలే విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద పేలవంగా మొదలైన ఈ సినిమా క్రమేపీ బాలీవుడ్ సినిమా చరిత్రలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. హిందీ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రసిద్ధ చిత్రాలలో ఒకటిగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందీ చలనచిత్ర ప్రేక్షకులకు అత్యంత ఇష్టమైన చిత్రంగా ఇప్పటికీ షోలే నిలుస్తోంది.[8]
ఆయన తరువాతి చిత్రాలు ఏవీ షోలే విజయానికి దరిదాపుల్లోకి రాలేదు.[9] షోలే వెస్టర్న్ చిత్రాలకు ట్రిబ్యూట్ కాగా, 1980లో ఆయన తదుపరి చిత్రం షాన్ జేమ్స్ బాండ్ చిత్రాల నుండి ప్రేరణ పొంది, ఒక మాదిరి విజయాన్ని మాత్రమే సాధించింది.[10] 1982లో ఆయన ప్రముఖ నటుడు దిలీప్ కుమార్, ఆ కాలపు సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ లను నటింపజేసి శక్తి సినిమా తీసుకువచ్చారు. ఈ చిత్రం ఒకమాదిరిగా మాత్రమే విజయం సాధించినప్పటికీ, ఇది ఫిల్మ్ఫేర్ ఉత్తమ సినిమా అవార్డును గెలుచుకుంది. 1985లో, రిషి కపూర్, కమల్ హాసన్ నటించిన సాగర్ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించాడు. తన తొలి చిత్రం బాబీ తర్వాత 12 సంవత్సరాల పాటు సినిమాల్లో నటించని డింపుల్ కపాడియా ఈ సినిమాతో తిరిగి సినిమాల్లోకి వచ్చింది.
భారత విభజన సమయాన్ని నేపథ్యంగా తీసుకుని తీసిన బునియాద్ అనే టెలివిజన్ ధారావాహికానికి దర్శకత్వం వహించాడు. ఇది చాలా విజయవంతం అయి 1986-87లో దూరదర్శన్లో ప్రసారమైంది. ఆయన దర్శకత్వం వహించిన చివరి మూడు చిత్రాలు, భ్రష్టాచార్ (1989), అకల్య (1991), జమానా దీవానా (1995) బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి.
అమితాబ్ బచ్చన్ తో ఆయన సాధించిన విజయాల పరంపర ఆయనను ఆ నటుడితో ప్రత్యేకమైన అనుబంధం కలిగి ఉన్న యాష్ చోప్రా, ప్రకాష్ మెహ్రా, మన్మోహన్ దేశాయ్, హృషికేశ్ ముఖర్జీ వంటి సుప్రసిద్ధ దర్శకులలో ఒకరిగా నిలిపింది. 2005లో ఆయన తన సుప్రసిద్ధ షోలే కోసం ఫిల్మ్ఫేర్ 50 సంవత్సరాల ఉత్తమ చిత్రం అవార్డును అందుకున్నాడు.
రమేష్ సిప్పీ తన కుమారుడు రోహన్ సిప్పీ దర్శకత్వం వహించిన కుచ్ నా కహో (2003) బ్లఫ్మాస్టర్ (2005), దమ్ మారో దమ్ (2011) వంటి చిత్రాలను నిర్మించాడు. 2006లో మిలన్ లుథ్రియా దర్శకత్వం వహించిన టాక్సీ నంబరు 9211 చిత్రాన్ని, 2008లో కునాల్ రాయ్ కపూర్ దర్శకత్వంలో ది ప్రెసిడెంట్ ఈజ్ కమింగ్, నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో అక్షయ్ కుమార్-దీపికా పదుకొనే నటించిన చాందిని చౌక్ టు చైనా సినిమాలను కూడా నిర్మించాడు.
2015లో 20 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత దర్శకునిగా రాజ్ కుమార్ రావు, రకుల్ ప్రీత్ సింగ్, హేమమాలిని నటించిన హాస్య చిత్రం సిమ్లా మిర్చి సినిమాని తీశాడు.[11] ఈ చిత్రం బయ్యర్లను ఆకర్షించడంలో సమస్యలు ఎదుర్కోవడంతో ఐదేళ్ల పాటు విడుదల కాలేదు.[12] 2020 జనవరిలో ఇది చివరకు నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది.[13]
సినిమాల జాబితా
మార్చుదర్శకునిగా
మార్చు- సిమ్లా మిర్చి (2020)
- జమానా దీవానా (1995)
- అకల్యా (1991)
- భ్రష్టాచార్ (1989)
- జమీన్ (1987-అసంపూర్ణం)
- బునియాద్ (1986) దూరదర్శన్ టీవీ సీరియల్
- సాగర్ (1985)
- శక్తి (1982)
- షాన్ (1980)
- షోలే (1975)
- సీతా ఔర్ గీతా (1972)
- అందాజ్ (1971)
నిర్మాతగా
మార్చు- సోనాలి కేబుల్ (2014)
- నౌటంకి సాలా (2013)
- దమ్ మారో దమ్ (2011)
- చాందిని చౌక్ టు చైనా (2009)
- ఫియర్ (2007)
- టాక్సీ నెం. 9211 (2006)
- బ్లఫ్ మాస్టర్! (2005)
- కుచ్ నా కహో (2003)
- త్రిష్ణ (1978)
- బ్రహ్మచారి (1968)
నటునిగా
మార్చు- సిమ్లా మిర్చి (2020)లో అతిథి పాత్ర.
అవార్డులు
మార్చుసంవత్సరం. | అవార్డు | వర్గం | సినిమా | ఫలితం. | రిఫరెండెంట్. |
---|---|---|---|---|---|
1976 | ఫిల్మ్ఫేర్ అవార్డులు | ఉత్తమ దర్శకుడు | షోలే | నామినేటెడ్ | |
1983 | శక్తి | నామినేటెడ్ | |||
1986 | సాగర్ | నామినేటెడ్ | |||
2005 | 50 ఏళ్లలో ఉత్తమ చిత్రం | షోలే | విజయం |
మూలాలు
మార్చు- ↑ Aakanksha Naval-Shetye; Ram Kohli; Subhash K Jha (May 5, 2013). "The other woman". DNA India.
- ↑ Verma, Rahul. "Sholay: The Star Wars of Bollywood?". www.bbc.com.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 అక్టోబరు 2015. Retrieved 21 July 2015.
- ↑ "Kunal Kapoor". IMDb.
- ↑ "Bollywood: Kapoor family's new kid Zahan all set to debut in thriller 'Faraaz'". gulfnews.com. August 5, 2021.
- ↑ Raheja, Dinesh (May 28, 2003). "Seeta Aur Geeta: A rollicking entertainer". Rediff.
- ↑ (Chopra 2000)
- ↑ Verma, Rahul. "Sholay: The Star Wars of Bollywood?". www.bbc.com.
- ↑ "Remembering Sholay".
- ↑ Seta, Keyur. "Was Shaan a mistake after Sholay? Here's what Ramesh Sippy has to say". Cinestaan. Archived from the original on 29 June 2019.
- ↑ "Rajkummar Rao Wraps up Shoot For Shimla Mirchi – NDTV Movies". NDTVMovies.com. 12 May 2015. Retrieved 27 May 2018.
- ↑ "Ramesh Sippy's comeback film Shimla Mirchi starring Hema Malini has no buyers". Deccan Chronicle. 28 March 2016. Retrieved 3 July 2018.
- ↑ "Rajkummar Rao's film 'Shimla Mirch' goes straight to OTT".
ఆధారాలు
మార్చు- Chopra, Anupama (2000). Sholay: The Making of a Classic. Penguin Books, India. ISBN 0-14-029970-X.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రమేష్ సిప్పీ పేజీ