రాచకొండ పోలీస్ కమీషనరేట్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పోలీసు కమిషనరేట్

రాచకొండ పోలీస్ కమీషనరేట్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పోలీసు కమిషనరేట్.[2] హైదరాబాదులోని మూడు పోలీసు కమిషనరేట్లలో ఇదీ ఒకటి.[3] ఈ కమిషనరేట్ కు ప్రస్తుతం జి. సుధీర్ బాబు కమిషనర్‌‌గా ఉన్నాడు.[4]

రాచకొండ పోలీస్ కమీషనరేట్
నినాదంమీతో - మీకోసం
ఏజెన్సీ అవలోకనం
ఏర్పాటు2016
ఉద్యోగులుకమీషనర్ ఆఫ్ పోలీస్
డిప్యూటి కమీషనర్
అడిషనల్ డిప్యూటి కమీషనర్
పోలీస్ ఇన్స్పెక్టర్స్
అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్స్
సబ్ పోలీస్ ఇన్స్పెక్టర్స్
అధికార పరిధి నిర్మాణం
కార్యకలాపాల అధికార పరిధిమల్కాజిగిరి జోన్, ఎల్.బి. నగర్ జోన్, భువనగిరి జోన్, తెలంగాణ, భారతదేశం
రాచకొండ పోలీస్ కమీషనరేట్ is located in Telangana
రాచకొండ పోలీస్ కమీషనరేట్
రాచకొండ పోలీస్ కమీషనరేట్ (Telangana)
చట్టపరమైన అధికార పరిధిమేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా, రంగారెడ్డి జిల్లా
ప్రధాన కార్యాలయంనేరెడ్‌మెట్‌, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, తెలంగాణ[1]
ఏజెన్సీ అధికారులు
మాతృ ఏజెన్సీతెలంగాణ రాష్ట్ర పోలీస్
వెబ్‌సైట్
http://rachakondapolice.telangana.gov.in/

చరిత్ర

మార్చు

2016 జూన్ నెలలో సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీసు నుండి విడిపోయి ఈ కమీషనరేట్ ఏర్పడింది. గతంలో దీనిని సైబరాబాద్ ఈస్ట్ అని పిలిచేవారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ అధికార పరిధి 5091.48 చ.కి.మీ. జనాభా సుమారు 42 లక్షలు. దీని పరిధిలో 42 - పోలీస్ స్టేషన్లు, 2 - మహిళా పోలీస్ స్టేషన్, 1 - సైబర్ క్రైమ్ సెల్, 8 - సహాయక పోలీసు విభాగాలు ఉన్నాయి.[5]

జోన్స్

మార్చు

రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో ప్రస్తుతం నాలుగు డీసీపీ మండలాలు ఉన్నాయి.

మల్కాజిగిరి డీసీపీ జోన్

మార్చు
  1. మల్కాజిగిరి ఏసిపి జోన్: మల్కాజిగిరి, నాచారం, ఉప్పల్, మేడిపల్లి, ఘట్కేసర్, పోచారం, మహిళా పోలీస్ స్టేషన్ - ఉప్పల్
  2. కుషాయిగూడ ఏసిపి జోన్: కుషాయిగూడ, నేరెడ్‌మెట్, జవహర్ నగర్, కీసర, చెర్లపల్లి

ఎల్.బి. నగర్ డీసీపీ జోన్

మార్చు
  1. ఎల్.బి. నగర్ ఏసిపి జోన్: ఎల్.బి. నగర్, సరూర్ నగర్, చైతన్యపురి, మహిళా పిఎస్
  2. వనస్థలిపురం ఏసిపి జోన్: వనస్థలిపురం, మీర్‌పేట్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, పహాడీషరీఫ్, బాలాపూర్
  3. ఇబ్రహీంపట్నం ఏసిపి జోన్: ఇబ్రహీంపట్నం, మంచాల్, యాచారం, మహేశ్వరం, కందుకూరు, ఆదిబట్ల, మద్గుల్

భువనగిరి డీసీపీ జోన్

మార్చు
  1. భువనగిరి ఏసిపి జోన్: భువనగిరి టౌన్, మహిళా పిఎస్ (భువనగిరి), భువనగిరి సర్కిల్ (భువనగిరి రూరల్, బొమ్మలరామారం, బీబీనగర్)
  2. యాదాద్రి ఏసిపి జోన్: యాదాద్రి, యాదగిరిగుట్ట సర్కిల్ (తుర్కపల్లి, రాజాపేట, ఆలేరు, మోటకొండూర్, గుండాల)
  3. చౌటుప్పల్ ఏసిపి జోన్: చౌటుప్పల్, చౌటుప్పల్ సర్కిల్ (పోచంపల్లి, నారాయణపూర్), రామన్నపేట సర్కిల్ (రామన్నపేట, వలిగొండ, ఆత్మకూరు, మోత్కూర్, అడ్డగూడూరు)

మహేశ్వరం డీసీపీ జోన్[6]

మార్చు
  1. మహేశ్వరం ఏసీపీ జోన్: మహేశ్వరం, కందుకూరు, ప‌హాడీ ష‌రీఫ్, బాలాపూర్
  2. ఇబ్రహీంపట్నం ఏసీపీ జోన్: ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, ఆదిభట్ల, మాడ్గుల, గ్రీన్ ఫార్మా సిటీ

పోలీస్ కమిషనర్లు

మార్చు
  • మహేశ్‌ భగవత్‌
  • దేవేంద్ర సింగ్‌ చౌహాన్‌ (డీఎస్‌ చౌహాన్‌)[7][8]
  • జి. సుధీర్ బాబు - 13 డిసెంబర్ 2023 నుండి 12 ఫిబ్రవరి 2024 వరకు [9]
  • తరుణ్ జోషి - 12 ఫిబ్రవరి 2024 నుండి ప్రస్తుతం [10]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "New commissionerate bldg for Rachakonda cops | Hyderabad News - Times of India". The Times of India.
  2. Hindustantimes Telugu (24 December 2022). "రాచకొండ పరిధిలో కొత్త పోలీస్ స్టేషన్లు.. ఎక్కడంటే..?". Archived from the original on 2 September 2023. Retrieved 2 September 2023.
  3. "Rachakonda Police Commissionerate". rachakondapolice.telangana.gov.in. Retrieved 2021-09-21.
  4. Andhrajyothy (27 December 2023). "Rachakonda Crime Report: 2023 ఇయర్ ఎండింగ్ రాచకొండ క్రైమ్ రిపోర్ట్ ఇదే..." Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  5. "About Us - Rachakonda Police Commissionerate". rachakondapolice.telangana.gov.in. Retrieved 2021-09-21.
  6. Sakshi (26 December 2022). "రాచకొండ పోలీసు కమిషనరేట్‌ మరింత బలోపేతం!". Archived from the original on 2 September 2023. Retrieved 2 September 2023.
  7. Namaste Telangana (30 December 2022). "'రాచకొండ' కొత్త బాస్‌ డీఎస్‌ చౌహాన్‌". Archived from the original on 30 December 2022. Retrieved 30 December 2022.
  8. Eenadu (30 December 2022). "రాచకొండ సీపీగా డీఎస్‌ చౌహాన్‌". Archived from the original on 30 December 2022. Retrieved 30 December 2022.
  9. Andhrajyothy (13 December 2023). "ముగ్గురు కొత్త కమిషనర్లు". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  10. A. B. P. Desam (12 February 2024). "తెలంగాణలో 12 మంది ఐపీఎస్‌ల బదిలీ, రాచకొండ సీపీగా తరుణ్‌ జోషి". Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.

బయటి లంకెలు

మార్చు