రామగుండం పోలీస్ కమీషనరేట్
రామగుండం పోలీస్ కమీషనరేట్, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో ఉన్న పోలీసు కమీషనరేట్.[2] మంచిర్యాల, రామగుండం, గోదావరిఖని పట్టణ ప్రాంతాలలో చట్ట అమలుకు, దర్యాప్తులో ప్రాథమిక బాధ్యతలను కలిగి ఉన్న ఒక నగర పోలీసు విభాగం.[3][4] రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలు ఉన్నాయి. ప్రస్తుత పోలీసు కమిషనర్ గా రెమా రాజేశ్వరి ఐపిఎస్ విధులు నిర్వర్తిస్తున్నాది.
రామగుండం పోలీస్ కమీషనరేట్ | |
---|---|
![]() రామగుండం పోలీస్ లోగో | |
మామూలుగా పిలిచే పేరు | రామగుండం నగర పోలీస్ |
నినాదం | సర్వీస్ ప్రైడ్ డెడికేషన్ |
Agency overview | |
ఏర్పాటు | 11 అక్టోబరు, 2016 |
ఉద్యోగులు | కమీషనర్ ఆఫ్ పోలీస్ డిప్యూటి కమీషనర్ అడిషనల్ డిప్యూటి కమీషనర్ పోలీస్ ఇన్స్పెక్టర్స్ అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్స్ సబ్ పోలీస్ ఇన్స్పెక్టర్స్ |
Jurisdictional structure | |
Operations jurisdiction | పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా, భారతదేశం |
పరిమాణం | 8670 చ.కి.మీ. |
జనాభా | సుమారు 16 లక్షలు |
Legal jurisdiction | రామగుండం గోదావరిఖని |
Primary governing body | తెలంగాణ ప్రభుత్వం |
Secondary governing body | తెలంగాణ రాష్ట్ర పోలీస్ |
ప్రధాన కార్యాలయం | రామగుండం |
Agency executive |
|
Parent agency | తెలంగాణ రాష్ట్ర పోలీస్ |
Facilities | |
Stations | 44 పోలీస్ స్టేషన్లు |
Website | |
http://ramagundampolice.in |
చరిత్రసవరించు
2016 అక్టోబరు 11న రామగుండం పోలీస్ కమిషనర్ నేతృత్వంలో రామగుండంలో హెడ్ క్వార్టర్స్‌తో ఈ కమీషనరేట్ ఏర్పడింది.[5] రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికార పరిధి 8,670 చ.కి.మీ. (మంచిర్యాల జిల్లా 4,056 చ.కి.మీ., పెద్దపల్లి జిల్లా 4,614 చ.కి.మీ) కాగా, జనాభా సుమారు 16,02,369 మంది (మంచిర్యాల జిల్లా 8,07,037 మంది, పెద్దపల్లి జిల్లా 7,95,332 మంది) ఉన్నారు. ఈ కమీషనరేట్ పరిధిలో 5 సబ్ డివిజన్లు, 12 సర్కిళ్ళు, 44 - పోలీస్ స్టేషన్లు ఉన్నాయి.[6]
జోన్స్సవరించు
రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ప్రస్తుతం రెండు డిసిపి జోన్స్ ఉన్నాయి.[7]
మంచిర్యాల జోన్సవరించు
- మంచిర్యాల: మంచిర్యాల, మంచిర్యాల రూరల్, లక్సెట్టిపేట్
- జైపూర్: శ్రీరాంపూర్, చెన్నూరు టౌన్, చెన్నూరు రూరల్
- బెల్లంపల్లి: బెల్లంపల్లి టౌన్, బెల్లంపల్లి రూరల్, తాండూర్, మందమర్రి
పెద్దపల్లి జోన్సవరించు
- పెద్దపల్లి: పెద్దపల్లి, సుల్తానాబాద్
- గోదావరిఖని: రామగుండం, మంథని, గోదావరిఖని- I, గోదావరిఖని- II, రామగుండం ట్రాఫిక్
కమిషనరేట్ భవనంసవరించు
రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో 28 ఎకరాల్లో 38.50 కోట్ల రూపాయలతో ఆధునిక సౌకర్యాలతో జి ప్లస్ -2 పద్ధతిలో నిర్మించిన పోలీస్ కమిషనరేట్ భవన సముదాయాన్ని 2023 మే 8న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించాడు.[8]
రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరిని సి.పి. ఛాంబర్ లో కుర్చీలో కూర్చోపెట్టి సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ఎస్సీ మైనార్టీ సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విఫ్ బాల్క సుమన్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[9]
ఇవి కూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ "Rema Rajeshwari takes charge as Ramagundam Commissioner of Police". 27 January 2023.
- ↑ "Telangana State Portal పోలీస్ శాఖ పునర్వ్యవస్థీకరణపై సిఎం సమీక్ష". www.telangana.gov.in. Retrieved 2021-09-22.
- ↑ "Khammam made police commissionerate". 10 October 2016 – via The Hindu.
- ↑ Dayashankar, K. M. (10 October 2016). "Minister reviews arrangements for police commissionerates" – via The Hindu.
- ↑ "Telangana Bill". www.telanganalegislature.org.in. Retrieved 2021-09-22.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link] - ↑ "Official Website of Ramagundam Police". ramagundampolice.in. Archived from the original on 2021-05-16. Retrieved 2021-09-22.
- ↑ "Official Website of Ramagundam Police". ramagundampolice.in. Archived from the original on 2022-05-28. Retrieved 2021-09-22.
- ↑ "8న కెటిఆర్ చేతుల మీదుగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రారంభోత్సవం". Prabha News. 2023-05-01. Archived from the original on 2023-05-01. Retrieved 2023-05-16.
- ↑ Telugu, Tnews (2023-05-08). "తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది..!". T News Telugu. Archived from the original on 2023-05-08. Retrieved 2023-05-16.