రావివలస (టెక్కలి)
రాఅవివలస, శ్రీకాకుళం జిల్లా, టెక్కలి మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన టెక్కలి నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పలాస-కాశీబుగ్గ నుండి 33 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 813 ఇళ్లతో, 3167 జనాభాతో 594 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1588, ఆడవారి సంఖ్య 1579. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 348 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 4. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 580997[2].
రావివలస (టెక్కలి) | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 18°34′43.428″N 84°14′45.960″E / 18.57873000°N 84.24610000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం |
మండలం | టెక్కలి |
విస్తీర్ణం | 5.94 కి.మీ2 (2.29 చ. మై) |
జనాభా (2011)[1] | 3,167 |
• జనసాంద్రత | 530/కి.మీ2 (1,400/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 1,588 |
• స్త్రీలు | 1,579 |
• లింగ నిష్పత్తి | 994 |
• నివాసాలు | 813 |
ప్రాంతపు కోడ్ | +91 ( 08945 ) |
పిన్‌కోడ్ | 532212 |
2011 జనగణన కోడ్ | 580997 |
శ్రీ ఎండల మల్లికార్జునస్వామి
మార్చుశ్రీ ఎండల మల్లన్నగా పేరు పడిన ఇక్కడి దైవం మల్లికార్జునస్వామి. ఈ దేవుని దర్శించినవారికి దీర్ఘరోగాలు ముఖ్యముగా చర్మరోగాలు పోయి పూర్తిగా ఆరోగ్యవంతులవుతారని భక్తుల ప్రగాడనమ్మకం.
క్షేత్ర ప్రశస్తి
మార్చుశ్రీరాముడు రావణ సంహార అనంతరం తిరిగి అయోద్యకు వెళుతూ మార్గమధ్యంలో కల మహారణ్య ప్రాంతములో కల సుమంచ పర్వతగిరి శిఖరంపై తన అనుచరగణంతో విడిది చేసాడు. అనుచరగణంలో ఉన్న సుశేణుడు అనే దేవవైద్యుడు ఆ పర్వత ప్రాంతములో కల ఔషధ, మూలిక వృక్షజాతులను చూసి ఆనంద పరవశుడయ్యాడు. కాని చుట్టూ ఔషధాలున్నా అక్కడి జనులంతా రోగగ్రస్తులై ఉండుట అతనిని ఆశ్చర్యపరచింది. ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాది ఈతిబాధల నివారణార్ధం తను ఏదైనా చేయలని తలంచాడు. బొందితో కైలాసం చేరుకోవాలనే తన పూర్వవాంఛితము నెరవేర్చుకొనుటకు కూడా ఇదేమంచి ప్రదేశముగా అతనికి అనిపించింది. శ్రీరామునికి తన నిర్ణయాన్ని తెలియపరచి తను ఈ సుమంచ పర్వత ప్రాంతంలోనే తపమాచరించాలనుకొంటున్నట్లుగా చెప్పాడు. శ్రీరాముడు అతని వాంఛితం నెరవేరాలని ఆశీర్వదించి తన పరివార, అనుచరజనాలతో తరలి వెళ్ళీపోయాడు. తరువాత సుశేణుడు సుమంచ పర్వతంపై శివుని గూర్చి ఘోర తపస్సు చేయనారంబించాడు.
కొంతకాలం తరువాత సుశేణుడు ఎలా ఉన్నాడో క్షేమసమాచారాలు చూసిరమ్మని హనుమంతుని పంపించాడు శ్రీరాముడు. హనుమంతుడు సుమంచ పర్వతప్రాంతానికి వచ్చి చూస్తే అక్కడ సుశేణుడు కనిపించలేదు కాని అతని కళేభరం కనిపించింది. సుశేణుడు తపమాచరిస్తూ శివసాయుజ్యం పొందినట్టు భావించి అక్కడ ఒక పెద్ద గొయ్యి ఏర్పరచి సుశేణుని యొక్క కళేబరమును అందులో ఉంచి గొయ్యి పూడ్చి అక్కడ దొరకిన మల్లెపూలను ఆప్రదేశంలో ఉంచి దానిపై జింక చర్మాన్ని కప్పి శ్రీరామునికి విషయాన్ని చెప్పేందుకు వెళ్ళీపోతాడు. హనుమ ద్వారా విషయము తెలిసిన రాముడు సీత, లక్ష్మణ హనుమలతో కలసి సుమంచ పర్వతానికి వస్తాడు. సుశేణుని కళేబరమును రామునికి చూపుటకు జింక చర్మాన్ని పైకి లేపుతాడు హనుమ. జింక చర్మం తీసేసరికి అక్కడ కళేబరం స్థానంలో శివలింగము ఉంటుంది. దానిపై పువ్వులుంటాయి. శ్రీరాముడు సీతా లక్ష్మణ సహితుడై ప్రక్కన గల కొలనులో స్నానించి శివలింగాన్ని పూజించుట ప్రారంబించగానే ఆ శివలింగము క్రమముగా పెరుగుతూ ఆ ప్రాంతాలలో ఔషధ,మూలికల సువాసనలతో కూడిన గాలి శివలింగాన్ని తాకి ప్రచండ పవనాలుగా మారి వీచినంత మేర అందరికీ అనారోగ్యాలు మొత్తంగా తుడిచిపెట్టినట్లుగా పోవడం, ఒకరకమైన శక్తి తేజస్సు రావడం గమనిస్తారు. శ్రీరాముడు ఈ శివలింగానికి గుడి కట్టాలని అనుకొన్నా అది పెరుగుతుండటంతో ఆలోచన విరమిస్తాడు.
అప్పటి నుండి ఈ శివలింగము పెరిగి పెరిగి మహాలింగముగా ఆవిర్భవించింది. మల్లెపూలతో పూజింపబడి జినంతో{చర్మం} కప్పబడీ ఉన్నపుడు వెలసిన స్వామి కనుక మల్లికాజిన స్వామిగా పిలువబడుతుండేవాడు. క్రమముగా మల్లికార్జునినిగా మార్పు చెందినది.
శ్రీరాముని తరువాత ద్వాపర యుగంలో అజ్ఞాతవాసం చేస్తూ పాండవులు ఇక్కడికి వచ్చి అప్పటికి సీతా కుండముగా పిలవబడూతున్న అక్కడి కొలనులో స్నానించి స్వామిని పూజిస్తూ అక్కడ కల గుహలో కొంతకాలం నివసించారు.
దేవాలయ చరిత్ర
మార్చు1870 ప్రాంతములో టెక్కలి జమిందారు శ్రీ బృందావన హరిశ్చంద్ర జగద్దేవ్ దేవాలయం నిర్మింపగా అది తొందరలోనే కొంతకాలానికు శిథిలమైంది. మరికొంతకాలానికి ఆలయనిర్మాణమునకు పూనుకొనగా స్వామి భక్తుల కలలో కనబడి తనకు ఆలయం వద్దనీ వాతావరణ మార్పులలో ఆరుబయట ఉండటమే తనకు ఇష్టమనీ అదే లోక కళ్యాణమనీ తెలియజేసాడు. దానితో దేవాలయ నిర్మాణం విరమించుకొన్నాడు.
ప్రతి సంవత్సరం కార్తెకమాసంలో ఇక్కడ కల సీతాకుండములో స్నానం చేసి భక్తితో స్వామిని కొలిస్తే సర్వవ్యాధులు నివారించబడుతాయని విశ్వసిస్తారు. ఇక్కడ మహాశివరాత్రి, కార్తీకమాసము విశేషంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. కార్తీకమాసంలో ఇక్కడ కల అశ్వర్ధ వృక్షం క్రింద గడిపేందుకు, స్వామిని దర్శించేందుకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. ఉత్తరాంధ్ర జిల్లాల నండి చాలా మంది భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తూ ఉంటారు. రాష్ట్రము నలుమూలల నుండి కూడా యాత్రికులు వస్తుంటారు
విద్యా సౌకర్యాలు
మార్చుగ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి టెక్కలిలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల టెక్కలిలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ శ్రీకాకుళంలో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల టెక్కలిలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలు శ్రీకాకుళంలోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
మార్చుప్రభుత్వ వైద్య సౌకర్యం
మార్చురవివలసలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. అలోపతి ఆసుపత్రి, పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
మార్చుగ్రామంలో 2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు.
తాగు నీరు
మార్చుగ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
పారిశుధ్యం
మార్చుమురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
మార్చురవివలసలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
మార్చుగ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
మార్చుగ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం, అసెంబ్లీ పోలింగ్ కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి.
విద్యుత్తు
మార్చుగ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
మార్చురావివలసలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 129 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 1 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 24 హెక్టార్లు
- బంజరు భూమి: 50 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 388 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 203 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 259 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
మార్చురావివలసలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 257 హెక్టార్లు
- బావులు/బోరు బావులు: 2 హెక్టార్లు
ఉత్పత్తి
మార్చురావివలసలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
మార్చుపారిశ్రామిక ఉత్పత్తులు
మార్చుఇనుము మిశ్రమ లోహాలు, బియ్యం
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
వెలుపలి లంకెలు
మార్చుసమాచార సేకరణ: ధరణీ ప్రగడ సత్యమూర్తి గారి కార్తీక కైలాసం రావివలస వ్యాసం నుండి.