రావూరు వెంకట సత్యనారాయణరావు

తెలుగు రచయిత
(రావూరు వేంకటసత్యనారాయణరావు నుండి దారిమార్పు చెందింది)

రావూరు వెంకట సత్యనారాయణరావు (1913-) తెలుగు సినిమా మాటల, పాటల రచయిత.

విశేషాలు

మార్చు

ఇతడు కృష్ణా జిల్లా, ముచ్చిలిగుంట గ్రామంలో జన్మించాడు. ఇతడు కృష్ణా పత్రికలోను, ఆంధ్రప్రభ దినపత్రికలోను పాత్రికేయుడిగా పనిచేశాడు. కృష్ణాపత్రికలో "వడగళ్ళు" అనే శీర్షికలో వ్యంగ్య వ్యాసాలను, ఆంధ్రప్రభ దినపత్రికలో "ఆషామాషీ" అనే శీర్షికలో హాస్య వ్యాసాలను వ్రాశాడు. 1978లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ గౌరవాన్ని అందుకున్నాడు. ఆంధ్ర నాటక కళాపరిషత్తుకు పది సంవత్సరాలపాటు కార్యదర్శిగా పనిచేశాడు.

రచనలు

మార్చు

ఇతడు వ్రాసిన గ్రంథాలలో కొన్ని:

 1. వెన్నెల తెరచాప-నారాయణరెడ్డి
 2. ముట్నూరు కృష్ణారావు వ్యాసాలు (పరిష్కర్త)
 3. రాయప్రోలు వారి సాహిత్య సౌందర్య దర్శనం
 4. మన పట్టాభి (1980)[1]
 5. ఆషామాషీ[2] (రెండు సంపుటాలు)
 6. పొదరింటి కో పువ్వు
 7. పొంగిన తుంగభద్ర
 8. ఇచట వీచిన గాలి (నవలిక)
 9. హంసలదీవి (నవలిక)
 10. వెన్నెల ఏమన్నది
 11. మన ముట్నూరి
 12. ప్రియ జనని
 13. తెలుగు వీణ
 14. వడగళ్ళు
 15. అన్నిట నీవెరా...
 16. పాలవెల్లి
 17. నెలవంక

చిత్రసమాహారం

మార్చు

ఇతడు భరణి పిక్చర్స్ అధినేత రామకృష్ణ ప్రోత్సాహంతో సినిమారంగంలోనికి అడుగుపెట్టాడు.

మూలాలు

మార్చు
 1. కళాప్రపూర్ణ రావూరు (1980). మన పట్టాభి. హైదరాబాదు: వంశీ ఆర్ట్ థియేటర్స్.
 2. రావూరు వెంకట సత్యనారాయణరావు (1900). ఆషామాషీ. హైదరాబాదు: చేతనా పబ్లికేషన్సు. Retrieved 15 September 2020.

బయటి లింకులు

మార్చు