రూపిన్ కనుమ

హిమాచల్ ప్రదేశ్ లోని కనుమ

 

రూపిన్ కనుమ
రూపిన్ కనుమ దృశ్యం
సముద్ర మట్టం
నుండి ఎత్తు
4,650 m (15,250 ft)
ఇక్కడ ఉన్న
రహదారి పేరు
రూపిన్ లోయ నుండి హిమాచల్ లోని సంగ్లా లోయ వరకు
ప్రదేశంభారతదేశం
శ్రేణిధౌలాధార్
Coordinates31°20′41″N 78°09′52″E / 31.344722°N 78.164444°E / 31.344722; 78.164444
రూపిన్ కనుమ is located in Himachal Pradesh
రూపిన్ కనుమ

రూపిన్ కనుమ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వత శ్రేణులలో ఉన్న కనుమ మార్గం. ఇది, సాంప్రదాయికంగా గొర్రెల కాపరుల మార్గంలో, హైకింగ్ చేసే మార్గంలో ఉంది. ఈ మార్గం ఉత్తరాఖండ్‌లోని ధౌలా నుండి మొదలై హిమాచల్ ప్రదేశ్‌లోని సాంగ్లాలో ముగుస్తుంది. ఇది సముద్ర మట్టం నుండి 15,250 అడుగుల ఎత్తున హిమాలయ శ్రేణులలో ఎక్కువగా జనావాసాలు లేని ప్రాంతాలలో ఉంది. ఈ కనుమ వద్ద ఉన్న సరస్వోత్రి వద్ద ఉన్న సరస్వతి హిమానీనదం, చారిత్రిక సరస్వతీ నది ఉద్భవ స్థానంగా భావిస్తారు. అది పాంటా సాహిబ్, ఆది బద్రి, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌ల గుండా ప్రవహించేది.[1]

వివరణ

మార్చు

రూపిన్ కనుమ ట్రెక్‌లో రాతి పలకలు, చెక్క వంతెనల గుండా వెళ్ళే దారులు ఉంటాయి. పర్వతాలలో లోతైన మడతలు, హిమానీనదాలు, మంచుతో కూడిన వాలులు, మంచు పొలాలు ఈ దారులకు అడ్డుగా నిలుస్తాయి. దారి పొడవునా తెల్లని రోడోడెండ్రాన్లు, పచ్చని పచ్చికభూములు కనిపిస్తాయి.

రూపిన్ కనుమను చేరుకోడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి హిమాచల్ ప్రదేశ్‌లో చివరి దోడ్డు మజిలీ అయిన గోసాంగు అనే గ్రామం వద్ద ప్రారంభమవుతుంది. సాధారణంగా, ట్రెక్కర్లు, సాహస యాత్రికులు సిమ్లా నుండి రోహ్రు మీదుగా రోడ్డు మార్గంలో గోసాంగుకు వెళతారు. రూపిన్ కనుమకి ప్రత్యామ్నాయ మార్గం నైట్వార్ నుండి ప్రారంభమవుతుంది. డెహ్రాడూన్ నుండి ధౌలా మీదుగా అక్కడికి చేరుకోవచ్చు. పై రెండు ప్రదేశాలలో ఎక్కడి నుండి బయలుదేరినా, మొదటి శిబిర ప్రదేశం మాత్రం ఝాకా గ్రామం. ఆహారం వగైరా సరంజామాను సమకూర్చుకోడాణికి ఇది చివరి స్థలం. రూపిన్ కనుమలో ప్రయాణించడం అనేది కొద్దిపాటి కష్టంతో కూడిన అధిరోహణ. కాలిబాటలు రూపిన్ నదిని ఎగువ (ఎగువ జలపాతం శిబిరం) వరకు ఉంటాయి.

కనుమకు ఒకవైపు మంచు కరుగుతున్న రూపిన్ నది యమునా నదిలో కలిసి చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. కనుమకు సాంగ్లా వైపున కరిగే మంచు, సట్లెజ్‌ నది లోకి ప్రవహించి, ఆపై అరేబియా సముద్రంలో కలుస్తుంది.

గ్యాలరీ

మార్చు
  1. Haryana Samvad Archived 2018-08-27 at the Wayback Machine, Jan 2018.
ఉల్లేఖన లోపం: <references> లో "Cunningham 1854 p. 71" అనే పేరుతో నిర్వచించిన <ref> ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.