లుధియానా జిల్లా

పంజాబ్ లోని జిల్లా

పంజాబు లోని 22 జిల్లాలలో లుధియానా జిల్లా ఒకటి. లుధియానా నగరం ఈ జిల్లాకు కేంద్రం. ఇక్కడ సైకిళ్ళు, హోసియరీ ఉత్పత్తి అవుతున్నాయి. లుధియానా నగరం రాష్ట్రంలోకెల్లా అతిపెద్ద నగరం. జిల్లాలో 8 తాలూకాలు, 7 ఉప తాలూకాలు, 12 మండలాలు ఉన్నాయి.[1]2011 గణాంకాల ఆధారంగా పంజాబు రాష్ట్రం లోని 12.9% ప్రజలు ఈ జిల్లాలోనే నివసిస్తున్నారు.[2]

లుధియానా జిల్లా
ਲੁਧਿਆਣਾ ਜ਼ਿਲ੍ਹਾ
జిల్లా
District map of East Punjab
పంజాబు జిల్లాలు
దేశం India
రాష్ట్రంపంజాబ్
ముఖ్య పట్టణంలుధియానా
విస్తీర్ణం
 • Total3,767 కి.మీ2 (1,454 చ. మై)
జనాభా
 (2011)‡[›]
 • Total34,87,882
 • జనసాంద్రత975/కి.మీ2 (2,530/చ. మై.)
భాషలు
 • అధికారికపంజాబీ
Time zoneUTC+5:30 (IST)
టెలిఫోన్ కోడ్0161
లింగ నిష్పత్తి1000/869 /
అక్షరాస్యత82.50%
లోక్‌సభ నియోజకవర్గం1
శాసనసభ నియోజకవర్గం14
^ ‡: Population increase (2001–2011): 15%

పేరు వెనుక చరిత్ర

మార్చు

లోడి రాజవంశం కారణంగా నగరానికి లుధియానా అనే పేరు వచ్చింది. 1480లో లుధియానా రాజవంశీకులు ఈ నగరాన్ని స్థాపించారని భావిస్తున్నారు.

చరిత్ర

మార్చు

మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలనాకాలంలో జిల్లాప్రాంతం సిర్హింద్ సర్కారులో భాగంగా ఉండేది. జిల్లాలోని పశ్చిమప్రాంతం రాయ్ (రాజ్కోట్) కు లీజుకు ఇవ్వబడింది. 18వ శతాబ్దంలో అవి మొఘల్ పాలనలో పార్షికంగా స్వతంత్రంగా వ్యవహరించాయి. 1707 - 1835 మద్యకాలంలో శక్తివంతమైన సిక్కు సైనికాధికారుల ఆధీనంలో జిల్లాలోని గ్రామాలు స్వతంత్రంగా వ్యవహరించాయి. 1747లో " అహ్మద్ షా దుర్రానీ " ఖన్నా నగర సమీపంలో యుద్ధంలో పాల్గొని ఇంపీరియల్ సైన్యాలను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ మొఘల్ సైన్యం అహ్మద్ షాహ్ దుర్రానీని నియంత్రించడంలో సఫలీకృతులయ్యారు. ఆయన తరువాత దాడులు మొఘలులను బలహీనపరచిన కారణంగా 1760లో రాయ్‌లు లుధియానా నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు.[3]

సా.శ. 1478లో చకర్ తల్వండి రాయ్ రాయ్ కోటను స్థాపించాడు.అలాగే సా.శ. 1688లో రాయ్ కుటుంబం జగ్రావును స్థాపించింది.మహరాజా రంజిత్ సింగ్ పాలనాకాలంలో బ్రిటిష్ కంటోన్మెంటులో లుధియానా ప్రాధాన్యత సంతరించుకుంది. 1805లో రంజిత్ సింగ్ లుధియానా ఆక్రమించుకున్నాడు. 1809లో బ్రిటిష్ రంజిత్ సింగ్‌ను నియంత్రించడానికి నిర్ణయించి సైన్యాలను పంపింది. బ్రిటన్ రంజిత్ సింగ్‌ను ఒత్తిడికి గురిచేసి " పర్పెచ్యుయల్ ఫ్రెండిషిప్ " మిద్ద సంతకం చేయించింది.తరువాత లుధియానా లూధియానాలో బ్రిటిష్ సైన్యబృందాలు స్థిరపడ్డాయి.

1901 గణాంకాల ఆధారంగా హిందువుల సంఖ్య 2,69,076 (40%), ముస్లిములు 2,35,937 (35%), సిక్కులు 1,64,919 (24%) ఉన్నారు.[4] 1947లో లుధియానాలో సంభవించిన మతకలహాల కారణంగా ముస్లిములు పాకిస్తాన్కు చేరుకున్నారు.[5]

సిఖ్ సైనికాధికారులు

మార్చు
  • సర్దార్ భగవంత్ సింగ్ (బహదూర్ గ్రామం), సిధు జాట్ సంతతి.
  • సర్దార్ బదాన్ సింగ్ (మలౌద్ గ్రామం) సిధు జాట్ సంతతి.
  • సర్దార్ భాయ్ అర్జున్ సింగ్ (బగ్రియన్ గ్రామం), రాంగర్హియా సిఖ్
  • సర్దార్ బహదూర్ సర్దార్ రఘ్బీర్ సింగ్ (లధ్రన్ గ్రామం), గురాన్ జాట్.
  • సత్గురు రాం సింగ్ జీ బహైనీ సాహిబ్ (లూధియానా జిల్లా), రాంగర్హియా సిఖ్.
  • సర్దార్ గండా సింగ్ (ధిరు మజ్రా గ్రామం) జాట్.
  • సర్దార్ హర్నం సింగ్ (బహ్రీ గ్రామం) భంగు జాట్, భాయి మెహతాబ్ సింగ్ (1740)

స్థానం

మార్చు

పంజాబు రాష్ట్ర కేంద్రస్థానంలో ఉన్న నగరాలలో లుధియానా ఒకటి. ఇది గ్రాండ్ ట్రంకు రోడ్డు సమీపంలో ఢిల్లీ నుండి అమృతసర్ మార్గంలో ఉంది. ఇది 30-55 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 75-54 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా పంజాబు రాష్ట్రంలోని మాల్వా ప్రాంతంలో ఉంది. జిల్లా పాటియాలా డివిషన్‌లో భాగంగా ఉంది.

సరిహద్దులు

మార్చు

జిల్లా ఉత్తర సరిహద్దులో జలంధర్ జిల్లాను విభజిస్తూ సట్లెజ్ నది ప్రవహిస్తుంది, తూర్పు సరిహద్దులో రూప్‌నగర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో మోగా జిల్లా జిల్లా, దక్షిణ, ఆగ్నేయ సరిహద్దులో బర్నాలా జిల్లా, సంగ్రూర్, పటియాలా జిల్లాలు ఉన్నాయి.[1]

నైసర్గికం

మార్చు

నైసర్గికంగా జిల్లా సారవంతమైన సట్లెజ్ నదీ మైదానం, ఎగువ భూములుగా విభజించబడింది. ఉగ్రంగా ప్రవహించే సట్లైజ్ నది విస్తారమైన సారవంతమైన మట్టిని జిల్లాలో పోగుచేస్తూ ఉంది. పోగుపడిన సారవంతమైన మట్టి గాలివీచడం కారణంగా జిల్లాలో చిన్నచిన్న దిబ్బలు, ఇసుక గుట్టలు ఏర్పడ్డాయి. ఈ దిబ్బలు అనేకం వ్యవసాయదారుల చేత చదును చేయబడుతూ ఉంది.

వాతావరణం

మార్చు

జిల్లా వాతావరణం పొడిగానూ అతివేడిగా ఉండే వేసవి, స్వల్పమైన చలితో శీతాకాలం ఉంటుంది. నవంబరు మద్య నుండి మార్చి ఆరంభం వరకు శీతాకాలం ఉంటుంది. తరువాత జూన్ మాసం వరకు వేడిగా ఉంటుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబరు సగం వరకు నైరుతీ ఋతుపవనాల కారణంగా వర్షపాతం ఉంటుంది.సెప్టెమర్ సగం నుండి నవంబరు వరకు వర్షాకాలం తరువాత వాతావరణం నెలకొని ఉంటుంది.జూన్ అత్యంత ఉష్ణం, వేసవిలో ధూళితో కూడిన వాయువులు సంభవిస్తుంటాయి. డిసెంబరు, జనవరి మాసాలు అతిశీతల మాసాలుగా ఉంటాయి.

శీతోష్ణస్థితి డేటా - Ludhiana
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 19
(66)
21
(69)
26
(78)
34
(94)
38
(101)
39
(103)
34
(94)
33
(91)
33
(92)
32
(89)
26
(79)
21
(69)
30
(85)
సగటు అల్ప °C (°F) 7
(44)
8
(47)
13
(55)
18
(65)
23
(73)
26
(79)
26
(79)
24
(76)
23
(74)
17
(63)
11
(52)
7
(45)
17
(63)
సగటు అవపాతం mm (inches) 20
(0.80)
38
(1.50)
30
(1.20)
20
(0.80)
20
(0.80)
61
(2.40)
229
(9.00)
188
(7.40)
86
(3.40)
5.1
(0.20)
13
(0.50)
20
(0.80)
730.1
(28.8)
Source: [6]

వర్షపాతం

మార్చు

జిల్లాలో వర్షపాతం నైరుతీ ఋతుపవనాలలో ఆరంభమై ఈశాన్య ఋతుపవనాలతో ముగుస్తుంటాయి. జూలై నుండి సెప్టెంబరు వరకు 70% వర్షపాతం సంభవిస్తూ ఉంటుంది. డిసెంబరు నుండి మార్చి మాసాల మద్య 16% వర్షపాతం ఉంటుంది. మిగిలిన 14% వర్షపాతం మిగిలిన మాసాలలో సంభవిస్తూ ఉంటుంది.

నదులు

మార్చు

జిల్లాలో సట్లైజ్, దాని ఉపనదులు బుద్ధ నలా ప్రధాన జలవనరులుగా ఉన్నాయి.

సట్లైజ్ నది టిబెట్ లోని మానసరోవర్‌లో జనించి జిల్లా గుండా ప్రవహిస్తుంది. సట్లైజ్ నది హిమాచల్ ప్రదేశ్లో ప్రవహించి శివాలిక్ లోయలో ప్రవేశిస్తుంది. తరువాత ఈనది రూప్‌నగర్ జిల్లాలో సంరలా తాలూకా తూర్పు సరిహద్దులో 32కి.మీ ప్రవహించి జిల్లా పశ్చిమంలో 96 కి.మీ దూరం ప్రవహిస్తుంది. తరువాత జరావ్ తాలూకా నుండి జిల్లాను వదిలి ఉత్తరంగా ప్రవహించి నదీ సంగమం వైపు సాగిపోయి హరికే వద్ద బియాస్ నదితో సంగమిస్తుంది. ఇది వరదల ద్వారా పెద్ద నష్టం కలిగిస్తూ ఉంటుంది. నదీతీరంలో బహ్లుపూర్, మచ్చివారా, కుంకలన్ మొదలైన పురాతన నగరాలు నిర్మించబడ్డాయి.సట్లైజ్ నది మీద నిర్మించబడిన భక్రా ఆనకట్ట వరదల తీవ్రతకు ఆటకం కలిగించింది.

బుద్ధా నలా :- ఇది సట్లైజ్ నదికి దక్షిణంగా సమాంతరంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇది అధికంగా జిల్లాలో ప్రవహించి జిల్లా నైరుతీ భూభాగంలో గోరిషన్ కదార్ బక్ష వద్ద సట్లైజ్ నదిలో సంగమిస్తుంది. వర్షాకాలంలో నదికి వరదలు సంభవిస్తుంటాయి. వేసవి కాలంలో ఈ నదిలో కొన్ని కేంద్రాల వద్ద కాలినడకతో దాటిపోవడానికి వీలౌతుంది. బుద్ధా నలా నదికి దక్షిణ తీరంలో లుధియానా మచ్చివారా నగరాలు ఉన్నాయి. నది లుధియానాలో ప్రవేశించగానే కలుషితం కావడం ఆరంభిస్తుంది.

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,487,882,[2]
ఇది దాదాపు. పనామా దేశ జనసంఖ్యకు సమానం.[7]
అమెరికాలోని. కనెక్టికట్ నగర జనసంఖ్యకు సమం..[8]
640 భారతదేశ జిల్లాలలో. 87 వ స్థానంలో ఉంది..[2]
1చ.కి.మీ జనసాంద్రత. 975 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 15% [2]
స్త్రీ పురుష నిష్పత్తి.
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 82.5 75%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

ఆసక్తి ఉన్న ప్రాంతాలు

మార్చు
  • మంజీ సాహిబ్ ( ఆలంగీర్)
  • భైని సాహిబ్
  • చాపర్ మేళా (చాపర్)
  • డోరహ
  • ఘుడాని కలాన్
  • హథూర్
  • జగ్రయన్
  • గురుసర్ సాహిబ్ ( కటన సాహిబ్)
  • లుధియానా
  • ఖన్నా
  • కిలా రాయ్పూర్
  • మచ్చివర
  • నానక్సర్
  • పాయల్ (భారతదేశం)
  • సేరి లషరి ఖాన్
  • సుధార్
  • సునెత్

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Administrative Set-Up". District official website. Archived from the original on 2021-01-30. Retrieved July 19, 2012.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "Ludhiana : Census 2011". Indian census 2011. census2011.co.in Census2011]. November 30, 2011. Retrieved July 19, 2012.
  3. Imperial Gazetteer of India, v. 16, p. 200.
  4. Ludhiāna District - Imperial Gazetteer of India, v. 16, p. 202
  5. "Violence, Displacement and the Issue of Identity — 1947". Archived from the original on 2005-03-09. Retrieved 2014-08-25.
  6. "Average Weather for Ludhiana - Temperature and Precipitation". The Weather Channel. Retrieved February 25, 2008.
  7. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Panama 3,460,462 July 2011 est.
  8. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Connecticut 3,574,097

వెలుపలి లింకులు

మార్చు