రంగులరాట్నం (సినిమా)
రంగుల రాట్నం,1967 న విడుదలైన తెలుగు చిత్రం. వాహినీ పిక్చర్స్ పతాకంపై నిర్మాత, దర్శకుడు బి. ఎన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.నటుడు చంద్రమోహన్ ఈ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయం అయినాడు.రామ్మోహన్ , వాణీశ్రీ, అంజలీ దేవి తదితరులు ఈ చిత్రంలో నటించారు.సంగీతం సాలూరి రాజేశ్వరరావు, బి. గోపాలం అందించారు.
రంగులరాట్నం (1967 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.యన్.రెడ్డి |
---|---|
నిర్మాణం | బి.యన్.రెడ్డి |
తారాగణం | అంజలి దేవి , రామ్మోహన్, వాణిశ్రీ, నీరజ, చంద్రమోహన్ (పరిచయం), త్యాగరాజు |
సంగీతం | యస్.రాజేశ్వర రావు, బి.గోపాలం |
కళ | ఎ. కె. శేఖర్ |
నిర్మాణ సంస్థ | వాహిని పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- అంజలీదేవి - పార్వతమ్మ
- రామ్మోహన్
- చంద్రమోహన్
- విజయనిర్మల - జయ
- వాణిశ్రీ
- నీరజ
- త్యాగరాజు - వాణిశ్రీ తండ్రి
- రాధారాణి
- సంజీవి
- రేఖ - బాలనటి
పాటలు
మార్చుపాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
కనరాని దేవుడే కనిపించినాడే కనిపించి అంతలో కన్నుమరుగాయె | దాశరథి కృష్ణమాచార్య | సాలూరు రాజేశ్వరరావు | పి.సుశీల |
కలిమి నిలవదు లేమి మిగలదు కలకాలం ఒకరీతి గడవదు నవ్విన కళ్ళే చెమ్మగిల్లవా వాడిన బ్రతుకే పచ్చగిల్లదా ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగులరాట్నం | భుజంగరాయ శర్మ | సాలూరు రాజేశ్వరరావు, బి.గోపాలం | ఘంటసాల |
నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో, తిరుమల శిఖరాలు దిగివచ్చునో | దాశరథి కృష్ణమాచార్య | సాలూరు రాజేశ్వరరావు, బి.గోపాలం | ఘంటసాల, ఎస్.జానకి |
- కన్నుల దాగిన అందాలు పెదవులపై విరబూయాలి - పి.బి. శ్రీనివాస్,సుశీల, రచన: సి నారాయణ రెడ్డి
- కోయిల కోయని పిలిచినది కోయని నా మది పలికినది ఎవరి రూపో - సుశీల, దాశరథి
- దేశభక్తులం మేమండి దేహీ అంటు - మాధవపెద్ది,పిఠాపురం, బి. గోపాలం బృందం, రాఘవులు, వెంకట్రావు, రఘురాం, సరోజిని, స్వర్ణలత, రచన: కొసరాజు
- పన్నగశయన పంకజనయన నల్లని స్వామి నారాయణా - బి.వసంత, ఎ.పి. కోమల, రచన: దాశరథి
- వందేమాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం - ఘంటసాల బృందం
- వెన్నెలరేయి చందమామ వెచ్చగనున్నది మావా మనసేదోలాగున్నది - ఎస్.జానకి,బి.గోపాలం , రచన: కొసరాజు.
- ఆగదు వలపు ఆగదు , ఘంటసాల బృందం, రచన: ఎస్ వి. భుజంగరాయ శర్మ
- త్యాగమొకరుది ఫలితం , ఘంటసాల బృందం , రచన: ఎస్.వి.భుజంగరాయ శర్మ
- శ్రీమన్మ నభీష్ట లోక భందో,(సుప్రభాతమ్), ఎస్ జానకి, బి. గోపాలం
- శ్రీ శేష శైల సునికేతన దివ్యమూర్తే,(సుప్రభాతం), పి సుశీల
- సనిన నిస దమప సరిగమ, పి సుశీల.
పురస్కారాలు
మార్చు- ఈ సినిమా 1967లో భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో ఉత్తమ తెలుగు సినిమాగా ఎన్నికచేయబడింది.
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రధమ ఉత్తమ చిత్రంగా1966 వ సంవత్సరానికి గాను బంగారు నంది అవార్డు ప్రకటించింది
మూలాలు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- సి.హెచ్.రామారావు సంకలనం చేసిన ఘంటసాల 'పాట'శాల, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006