ముందడుగు 1958, జూలై 11న విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో బహుళ జనాదరణ పొందిన ముదలాళి చిత్రాన్ని ముందడుగుగా పునర్నిర్మించారు.

ముందడుగు
(1958 తెలుగు సినిమా)
Mundadugu 1958.jpg
దర్శకత్వం కృష్ణారావు
నిర్మాణం యం.ఎ.వేణు
తారాగణం కొంగర జగ్గయ్య ,
జమున
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ ఎం.ఏ.వీ.పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులుసవరించు

సాంకేతికవర్గంసవరించు

కథసవరించు

ఒకానొక గ్లాస్ ఫ్యాక్టరీ యజమాని కొడుకు విదేశాలలో చదువుకునివచ్చి బొంబాయిలో దిగుతాడు. ఒక హోటల్ బట్లర్ ద్వారా తన ఫ్యాక్టరీ కార్మికుల కష్టాలను విని అదేదో తెలుసుకోవాలని మారు వేషంలో తనవూరు వెళ్ళి తనఫ్యాక్టరీలోనే కూలీగా చేరతాడు. అక్కడ తోటి పనివాళ్ల కష్టాలతో పాటు, మేనేజర్ దౌర్జన్యాలను, తనను పెళ్ళి చేసుకోవలసిన మేనకోడలు కుత్సితాన్నీ తెలుసుకుంటాడు. తరువాత అసలు వేషంలో ఇంటిలో ప్రవేశించి ఫ్యాక్టరీ ఆధిపత్యం స్వీకరించి దుష్టులకు బుద్ధి చెబుతాడు[1].

పాటలుసవరించు

ఈ చిత్రంలోని పాటలను ఆత్రేయ రచించగా కె.వి.మహదేవన్ సంగీతాన్ని సమకూర్చాడు[2].

క్ర.సం పాట పాడినవారు
1 సంబరమే బలే బలే సంబరమే అంబరాన చుక్క కన్నె ఎస్.జానకి
2 ఆనందం ఎందుకో అనుబంధం ఏమిటో ఎవరో ఏమో ఎరుగను గాని ఎస్.జానకి
3 అందాన్ని నేను ఆనందాన్ని నేను అందీ అందక నిన్ను ఆడించుతాను కె.జమునారాణి
4 కోడెకారు చిన్నవాడా వాడిపోని వన్నెకాడా కోటలోన పాగా వేశావా ఎస్.జానకి,
మాధవపెద్ది
5 చినదానా చినదానా సరుగు తోటలో పరుగులు తీసే ఉరకలు వేసే మాధవపెద్ది
6 మాబాబు మామంచి బాబు మనసిచ్చి జి.కస్తూరి,
డి.ఎల్.రాజేశ్వరి,
స్వర్ణలత,
పిఠాపురం బృందం
7 అప్పన్నా తన్నామన్నా మారోరి భైరన్నా జి.కస్తూరి,
డి.ఎల్.రాజేశ్వరి

మూలాలుసవరించు

  1. సంపాదకుడు (13 July 1958). "ఎం.ఎ.వి.వారి 'ముందడుగు '". ఆంధ్రపత్రిక దినపత్రిక. Retrieved 28 January 2020.
  2. కొల్లూరి భాస్కరరావు. "ము౦దడుగు - 1958". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 28 January 2020.