వాడుకరి చర్చ:S172142230149/పాత చర్చ 2
|
నేను హాకీని తెలుగులోకి అనువాదిస్తున్నాను, వికీకి నా పునరాగమనాన్ని స్మరించుకుంటూ. నేను అనువదించిన తరువాత మీరు దానిని దిద్ద గలరు. ధన్యుడు రాకేశ్వర్
చర్చాపేజీలో ప్రాజెక్టు పేరు పెట్టడం
మార్చుపుణ్యక్షేత్రాల చర్చా పేజీలో {{వికిప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్|పుణ్యక్షేత్రం=అవును}} అని రాస్తే సరిపోతుంది. ఇది కేవలం పుణ్యక్షేత్రాలకే --వైఙాసత్య 12:50, 9 జూన్ 2007 (UTC)
కుశలమే
మార్చుమాటల బాబూ, కుశలమే. ఒమన్ లో వచ్చిన పెనుతుఫాను వలన పని వత్తిడి ఎక్కువయ్యింది. కాస్త విరామం కోసం వికీ వంక చూస్తున్నాను. ఆడియో "చూశాను" గాని ఇంకా "వినలేదు". నా చర్చా పేజీని త్వరలో నిక్షేపం చేస్తాను. నీకు నాపై ఉన్న సహృదయతకు చాలా సంతోషం. --కాసుబాబు 16:28, 11 జూన్ 2007 (UTC)
- మాటలలబాబూ నేను కుశలమే. బిజీగా ఉన్నమాట నిజమే. వికీలో ప్రస్తుతం ఉన్న రామాయణం వ్యాసాన్ని దాదాపు పూర్తిగా నేనే వ్రాశాను (ఇది తెలుగు వికీలో నా మొదటి వ్యాసం!). కాండాల వారీగా ప్రత్యేక వ్యాసాలు వ్రాయాలన్న కోరికతో వేరు వేరు వ్యాసాలు మొలకలుగా మొదలుపెట్టాను. మీ లక్ష్యం కూడా అదే గనుక వాటిని పూర్తి చేస్తే చాలా బాగుంటుంది..--కాసుబాబు 20:19, 15 జూన్ 2007 (UTC)
- నక్షత్రం ప్రశ్నకు పైన సమాధానం చెప్పాననుకొన్నాను! ఒమన్‌లో తుఫాను వల్ల నాకు పని వత్తిడి పెరిగింది. ఇంటర్నెట్ కూడా సరిగా పని చేయడంలేదు. --కాసుబాబు 14:48, 17 జూన్ 2007 (UTC)
శాంతి శాంతి
మార్చుమాటలబాబూ, సదరు అజ్ఞాత సభ్యుడు ఆయన అభిప్రాయాన్ని ఆయన వెలిబుచ్చాడు..వికీలో ఎవరి అభిప్రాయాన్ని వాళ్లు వెలిబుచ్చే అవకాశముంది..కానీ మీ పేరుతో ఆ వ్యాఖ్య చేసిఉండాల్సింది కాదు. వికీలో అంతోకొంత అనుభవమున్న సభ్యునిగా మీరు కొంత సంయమనం పాటించమని అభ్యర్ధన --వైజాసత్య 15:12, 12 జూన్ 2007 (UTC)
తొలగించు
మార్చుమీకు తొలగించవలసిన వ్యాసాల చిట్టా రెడి చేశాను, వాటి పని కానియండి--మాటలబాబు 15:07, 15 జూన్ 2007 (UTC)
- తప్పకుండా తొలగిస్తా. మీ కొక చిట్కా {{తొలగించు}} మూసకు ఒక పెరామీటరు కూడా ఇవ్వవచ్చు ఇలా {{తొలగించు|కారణం}} --వైజాసత్య 15:12, 15 జూన్ 2007 (UTC)
- ఇంకో విషయం కూడా తొలగించు సాధారణంగా చర్చా పేజీలో కాకుండా వ్యాసం పేజీలోనే అతికించాలి. అప్పుడు తొలగించాల్సింది చర్చాపేజీని కాదు వ్యాసాన్ని అని స్పష్టంగా తెలుస్తుంది --వైజాసత్య 15:16, 15 జూన్ 2007 (UTC)
కోరుకొల్లులో బొమ్మలు
మార్చుకోరుకొల్లులో బొమ్మలు ఆ ఎర్ర లింకుల మీద నొక్కి ఒక్కొక్కటి అప్లోడ్ చెయ్యాల్సిందే. ఈ బొమ్మలో ఆంగ్ల వికీపీడియాలో స్థానికంగా ఉన్నట్టున్నాయి. అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసుకోవాల్సిందే --వైజాసత్య 16:15, 15 జూన్ 2007 (UTC)
- క్షమించాలి ఈ వ్యాసంలో మీరిచ్చిన ఆంగ్ల వికీలోని లింకులతో పాటు చూసుకోకుండా అనువాదాలు కూడా తిరిగవేసినట్టున్నాను. వాటికి మళ్లీ చేరుస్తాను --వైజాసత్య 16:20, 15 జూన్ 2007 (UTC)
బాటు నడుస్తోంది
మార్చుబాటు చేర్చిన మార్పులు సాధారణంగా కనిపించవు. ఇటీవల మార్పులులో బాటు మార్పులు చూపించు అని నొక్కితే తప్ప. కాబట్టి బాటు మార్పుల వల్ల మామూలు మార్పులు కనిపించుకుండా పోయే అవకాశమే లేదు. అంతెందుకు ఇప్పుడు కూడా నేనిది రాస్తుంటే బాటు నడుస్తుంది. గమనించారా!!! --వైజాసత్య 14:40, 16 జూన్ 2007 (UTC)
- జూన్ 1వ తారీఖున నా బాటు పెద్దగా రచనలే చేయలేదు. కానీ ఆ రోజు అంతముందు కొన్ని రోజులు నేను చాలా మార్పులు చేర్పులు చేసాను. మీరు నా మార్పులు చేర్పులను బాటు చేసిన మార్పులు చేర్పులుగా పొరపాటు పడి వుంటారు. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 14:58, 16 జూన్ 2007 (UTC)
బాటు
మార్చు- మీరు మీరు మాట్లాడేసుకొని బాటు ని నడపడం అన్యాయం నాకు చెప్పచ్చు కదా నేను సహాయం చేస్తాను. మీరే చూస్తున్నారు గా నేను తెవికీ కోసం అకుంఠిత దీక్షతో శ్రమిస్తున్నాను --మాటలబాబు 15:28, 16 జూన్ 2007 (UTC)
- అలాగే చెబుతాం. లక్ష్యం అన్ని భారతీయ తాలూకాలకు పేజీలు తయారు చెయ్యటం. ఇప్పుడు చేతిలో ఉన్న పని ఏంటంటే వికీపీడియా:WikiProject/భారతదేశం మండలాలు/అన్ని మండలాలు ఇక్కడి తాలూకాల జాబితాను తెలుగులో తర్జుమా చెయ్యాలి. ఈ పని జాగ్రత్తగా చెయ్యాలి. లేకపోతే ఆ తరువాత బాటు నడిపినప్పుడు చాలా పేజీల్లో తప్పులు దొర్లే అవకాశముంది. ఒక్కొక్క సారి ఒక చిన్న విభాగాన్ని మాత్రమే తీసుకొని అనువదించండి. అలా అందరూ ఒకే ఫైలుపై పనిచేయవచ్చు. ఇక మిషన్ ప్రారంభం --వైజాసత్య 15:34, 16 జూన్ 2007 (UTC)
విశ్వామిత్రుడు
మార్చుమాటలబాబూ! 'విశ్వామిత్రుడు' వ్యాసంలో చిన్న మార్పులు చేశాను. అభ్యంతరం ఉండదనుకొంటాను. పరిశీలించు- --కాసుబాబు 20:10, 16 జూన్ 2007 (UTC)
- మీరు వ్రాసింది సరిగానే ఉంది కాని దానికి మెరుగు దిద్దవలసిన పని ఉంది. అందువల్ల దానిని ప్రస్తుతానికి ఉంచి వ్యాసం పుర్తయ్యక మార్చేస్తాను. మీరు రామాయణం తొ తెవికీ అరంగెట్రం చెయడం వల్లె మీ తెవికీ యాత్ర నిర్విఘ్నం గా సాగుతోంది.రామాయణం శుభసూచకం కదా మరి. నేనేమౌ రాక్షస ప్రవృత్తి తొ రాక్షాస వ్యాసాలు వ్రాశాను ఇప్పుడేమౌ కోపాగ్ని పూరిత ఋషుల వ్యాసాలు వ్రాస్తున్నను. దేవుడు నామీద దయ ఉంచి అంతా మంచి జరగేట్లు చూడాలని కోరుకొంటున్నాను. నక్షత్రం ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేదు. --మాటలబాబు 20:58, 16 జూన్ 2007 (UTC)
రామాయణము మూస
మార్చుమూస:రామాయణంలో సర్గలకు "ము"ను ఎందుకు తొలగింగించారు. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 06:19, 17 జూన్ 2007 (UTC)
- వ్యాసం పేరును మార్చాలని అనుకుంటే మీరు పైన ఉన్న "తరలించు" అనే లింకును ఉపయోగించవచ్చు. పేరు మాత్రమే మార్చాలని అనుకుంటే వ్యాసాన్ని తొలగించాల్సిన అవసరం లేదు. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 16:09, 17 జూన్ 2007 (UTC)
తనిఖీలు
మార్చుతనిఖీలు చేసేటప్పుడు, గ్రామాన్ని మండలం పేరుతోను, మండలాన్ని జిల్లాపేరుతోను విడగొట్టాలి. మీరు కొన్ని చోట్ల గ్రామాలనే జిల్లాపేరుతో ప్రత్యేకంగా పేరును తయారు చేయటానికి ప్రయత్నించారు. ఉదాహరణకు ఈ పేజీని దీని చరిత్రను ఒక సారి పరిశీలించండి. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 11:18, 18 జూన్ 2007 (UTC)
- అంతేకాదు కొత్త పేరు తయారు చేస్తునప్పుడు అసలు పేరుకు '('కు మధ్యన ఒక ఖాళీ వదలండి. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 11:23, 18 జూన్ 2007 (UTC)
శాంతిమంత్రం
మార్చుసహనౌ భునక్తు అనుకుంటాను! సరి చూడండి. __చదువరి (చర్చ • రచనలు) 02:56, 20 జూన్ 2007 (UTC)
- మీరు చెప్పిందే సరి.చదువరి గారికి ధన్యవాదాలు శ్లోకాన్ని సరిచేస్తాను--మాటలబాబు 23:31, 20 జూన్ 2007 (UTC)
సెర్బియన్ బెబ్బులి బొమ్మ
మార్చుమీరు ఆ బొమ్మను ఎక్కడి నుండి సేకరించారో తెలుపగలరా. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 15:38, 22 జూన్ 2007 (UTC)
- చెప్పేస్తున్నా.. చెప్పేస్తున్నా... ఈ బొమ్మ ఆంగ్ల వికీ పీడీయాలొ విశేష చిత్రం గా ప్రదర్శించబడ్డ బొమ్మ ఆవిషయాన్ని ఇక్కడ చూడవచ్చు. టాగు ఎలా పెట్టాలో తెలియక తికమక పడి ఏదో ఒక టాగు అంటించాను--మాటలబాబు 16:23, 22 జూన్ 2007 (UTC)
- ఈ బొమ్మ ఇప్పటికే కామన్సులో ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఎక్కించాల్సిన అవసరం లేదు. మీరు [[Image:Siberischer tiger de edit02.jpg]] అని మీ సభ్య పేజీలో పెట్టుకుంటే సరి. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 17:36, 22 జూన్ 2007 (UTC)
- (ఏడుస్తూ) అయితే నేను ఎక్కించిన నా బెబ్బులి ని తొలగించేస్తారా!! అది తెలుగు వికీపీడీయా కామన్స్ లో లేదు కదా...సరే ఏం చేస్తాం తొలగించండి, డౌన్ లోడ్ కి 5 నిమిషాలు , అప్ లోడ్ కి 10 నిమిషాలు పట్టింది.--మాటలబాబు 17:40, 22 జూన్ 2007 (UTC)
- చెప్పేస్తున్నా.. చెప్పేస్తున్నా... ఈ బొమ్మ ఆంగ్ల వికీ పీడీయాలొ విశేష చిత్రం గా ప్రదర్శించబడ్డ బొమ్మ ఆవిషయాన్ని ఇక్కడ చూడవచ్చు. టాగు ఎలా పెట్టాలో తెలియక తికమక పడి ఏదో ఒక టాగు అంటించాను--మాటలబాబు 16:23, 22 జూన్ 2007 (UTC)
Greetings మాటలబాబు,
Could you please help write a stub http://te.wikipedia.org/wiki/Auckland_Grammar_School - just a few sentences based on http://en.wikipedia.org/wiki/Auckland_Grammar_School? Only 2-5 sentences enough. Please. --Per Angusta 21:49, 22 జూన్ 2007 (UTC)
రామాయణం గురించి
మార్చుమాటల బాబూ!
- కుంభకర్ణుడు వ్యాసంలో నువ్వు చేసిన మార్పులు బాగున్నాయి. సాగించు.
- రామాయణం మూసలో 'కాండము'ల పేర్ల నుండి 'ము' తొలగించావు. ఇందువలన నువ్వే రాస్తున్న సుందరకాండము వ్యాసానికి రామాయణం మూసనుండి లింకు పనిచేయడంలేదు. అవి సినిమా పేర్లకు వెళుతున్నాయి. రెండు స్పెల్లింగులూ సరైనవే అయినా 'కాండము' అనేది సంప్రదాయ గ్రంధాలలో ఎక్కువగా వాడుతారు (అనుకొంటున్నాను). కనుక మూసను మళ్ళీ మారిస్తే బాగుంటుంది. ఏమయినా అయోమయ నివృత్తి పేజీలను తయారు చేద్దాం.
- 'సుందరకాండము' వ్యాసాన్ని రాయాలని చాలారోజులనుండి అనుకొంటున్నాను కాని కాలేదు. ఆ భాగ్యం నీకు దక్కింది. శుభమస్తు. విజయోస్తు.
- నీ వ్యాసాలలో చాలా చోట్ల Full stop, Comma ల తరువాత Space రావడం లేదు. ఇది పొరపాటున జరుగుతున్నదనుకొంటాను. కాని మరి కొంచెం శ్రద్ధ వహిస్తే బాగుంటుంది.
అయోమయ నివృత్తి పేజీలు + బొమ్మలు
మార్చు- ప్రదిప్ గారు నేను బాగా అయౌమయ నివృత్తి పేజి ల లొ నివృత్తి చేస్తున్నానా--మాటలబాబు 16:55, 24 జూన్ 2007 (UTC)
- అయోమయ నివృత్తి బాగానే చేస్తున్నారు. అలాగే మీరు ఏవయినా కొత్త బొమ్మలు ఎక్కించేటప్పుడు, ఆ బొమ్మలను ఎక్కడి నుండి తెస్తున్నారో తప్పక పేర్కొనండి. అప్పుడు వాటి లైసెన్సు వివరాలు తెలుసుకోవడం కొంచెం సులభమవుతుంది. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 17:04, 24 జూన్ 2007 (UTC)
- మీరు గ్రామ పేజీ పేరులో మండలం పేరు మరియు, జిల్లా పేరును రెండిటినీ ఉంచారు. నేను జిల్లా పేరు తేసేసి "గ్రామం (మండలం)" పేరుతో పేజీని సృష్టించాను. ఇప్పుడే ఈ పనంతా చేయటానికి ఒక బాటును తయారు చేయటం పూర్తయింది. ఇది చాలా మట్టుకు గ్రామాలకు అయోమయ న్వృత్తి చేసేస్తుంది. మిగిలిన వాటీని మనం చేయాలి. ఇంకో 5-10 నిమిషాలలో మొదలు పెడతాను దానిని. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 19:11, 25 జూన్ 2007 (UTC)
- అయోమయ నివృత్తి ఇక నుండి బాటు చేస్తుందా!! భలే భలే.. బావుంది--మాటలబాబు 19:15, 25 జూన్ 2007 (UTC)
గమనిక
మార్చుమాటలబాబు గారూ, మీరు దిద్దుతున్న వ్యాసాలలో ప్ర"యో"గం (prayOgam) వంటి పదాలలో ప్ర"యౌ"గం (prayaugam) అని తరచూ రాస్తుండటం గమనించాను. జాగ్రత్త వహించగలరు --వైజాసత్య 15:52, 26 జూన్ 2007 (UTC)
- నన్ను భయపెడుతున్నారా జాగ్రత్త వహించగలరు అని వ్రాస్తున్నారు, ఏదొవచ్చిరాని తెలుగులొ వ్రాస్తున్నాను, సరిచేయాలి కాని జాగ్రత్తఅంటే ఎలా.. --మాటలబాబు 15:56, 26 జూన్ 2007 (UTC)
- అయ్యో, నేను సరిగా వ్యక్తపరిచినట్లు లేను. తప్పుగా అర్ధం చేసుకోవద్దని మనవి..ఇది హెచ్చరిక ఏమాత్రం కాదు. మీరు గమనించలేదేమోనని తెలియజేశానంతే..నా వచ్చీరానీ తెలుగుతో చాలా ఇబ్బందులే వస్తున్నాయి..నేనే జాగ్రత్తగా ఉండాలి --వైజాసత్య 16:03, 26 జూన్ 2007 (UTC)
- "జాగ్రత్తపడగలరు" అంటే మిమ్మల్ని బయపెట్టటానికి కాదు. ఇకముందు చేసే మార్పులలో మొదటిదానిని (prayOgam)ను వాడేటట్లు కొంచెం జాగ్రత్త వహించమంటున్నారు. వేరేవాళ్ళు సరిచేస్తారు సరే మీరు అలా తప్పులు మళ్ళీ మళ్ళీ చేయకుండా ముందే చెపేస్తే దానిన్ని సరిచేయడానికి ఇంకొకళ్ళు అవసరం లేదు కదా. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 16:08, 26 జూన్ 2007 (UTC)
- అయ్యో, నేను సరిగా వ్యక్తపరిచినట్లు లేను. తప్పుగా అర్ధం చేసుకోవద్దని మనవి..ఇది హెచ్చరిక ఏమాత్రం కాదు. మీరు గమనించలేదేమోనని తెలియజేశానంతే..నా వచ్చీరానీ తెలుగుతో చాలా ఇబ్బందులే వస్తున్నాయి..నేనే జాగ్రత్తగా ఉండాలి --వైజాసత్య 16:03, 26 జూన్ 2007 (UTC)
మాటలబాబు బొమ్మ
మార్చు- సత్యా గారు బాగున్నారా!! నేను ఒక బొమ్మ చిత్రించాను బాగా రాలేదు కాని ఎదో వచ్చింది, కాని విశ్వామిత్రుడి వ్యాసం బొమ్మ లేకుండా ఉండడం చూసి తాత్కాలికంగా అక్కడ బొమ్మ చేర్చాను, నాకు తెవికీ లొ పని చేయడం భలే సరదా గా ఉంది--మాటలబాబు 15:52, 26 జూన్ 2007 (UTC)
- నన్ను, గారు అనక్కర్లేదు. రవి అంటే చాలు. బొమ్మ గీయటంలో మంచి ప్రయత్నం చేశారు. వీలైతే రంగులు దిద్దండి. అవును, తెవికీలో బాలారిష్టాలు దాటి కొంత ఇక్కడి పద్ధతులు అవగాహన కొస్తే పనిచేయటం సరదాగానే కాక విజ్ఞానదాయకముగా కూడా ఉంటుంది. --వైజాసత్య 16:04, 26 జూన్ 2007 (UTC)