వాడుకరి చర్చ:S172142230149/పాత చర్చ 1

తాజా వ్యాఖ్య: సంతోషం టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: S172142230149
S172142230149/పాత చర్చ 1 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. సభ్యుల పట్టికకు మీ పేరు జత చేయండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
  • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదవండి.
  • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

కాసుబాబు 15:14, 20 మే 2007 (UTC)Reply

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాలు
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు

వికీలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామాల గురించి సమాచారం పొందుపరచే ప్రయత్నం జరుగుతున్నది. వివరాలకు ఇక్కడ మరియు ఇక్కడ చూడండి. మీ వూరు గురించి, మీకు తెలిసిన వూళ్ళగురించి వికీలో వ్రాయండి. అలాగే ఇతర మిత్రులను కూడా ప్రోత్సహించండి --కాసుబాబు 15:14, 20 మే 2007 (UTC)Reply

ఖాతా తెరచినందుకు సంతోషం!

మార్చు

ఖాతా తెరచినందుకు సంతోషం. మీరన్నట్లు ఇక రచనలు ప్రవహించనివ్వండి. (అయితే, మీ ఈ పేరు కంటే మీ ఐపీఅడ్రసే చిన్నదిగా, చదవ వీలుగా ఉంది! :) అన్ని అంకెలను ఎలా గుర్తుపెట్టుకుంటారండీ బాబూ! ;)) __చదువరి (చర్చ, రచనలు) 19:49, 20 మే 2007 (UTC)Reply

బాటు హోదా గురించి

మార్చు

బాటు స్టేటస్ గురించి వివరాలు ఇక్కడ చూడండి. నాకు బాటు చేత కాదు గనుక ఎలా చేయాలో చెప్పలేను. మీరు మైలు రాళ్ళకూ, బాటుకూ మరీ ఎక్కువ లింకు పెడుతున్నారు. కాని అది మన ఉద్దేశ్యం కాదు.-- ఇక పది లక్షో మార్పు అన్న పదాలు చూస్తేనే నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. అందరమూ కృషి చేస్తే అనతికాలంలోనే అది సాధించవచ్చు. కాని దానికి బాటు సాధనం కాదు. ఉత్సాహంగా, చెత్త వ్రాయకుండా, ఎక్కువ మంది సభ్యులు రచనలు చేయాలి. తెలుగు వికీ గురించి బయట ప్రచారం చాలా తక్కువగా జరుగుతున్నది. అలాంటి పని ఏదైనా మీరు పెట్టుకొంటే చాలా బాగుంటుంది ఆని నా అభిప్రాయం.--కాసుబాబు 04:42, 24 మే 2007 (UTC)Reply
మీరు చెప్పింది అక్షరాల నిజం తెవికీ కి ప్రచారం చాలా అవసరం నేనే MaatRbhaasha maadhuryam‎, సభ్యుడు:మృత్యుంజయరావు గారిని తెవికీ లో చేర్పించాను.--S172142230149 16:49, 25 మే 2007 (UTC)Reply

మూస చర్చ:ఈ బొమ్మను తొలగించాలి పేజీలో మీ వ్యాఖ్య గురించి

మార్చు

మూస చర్చ:ఈ బొమ్మను తొలగించాలి పేజీలో మీ వ్యాఖ్య గురించి.. ఏదైనా బొమ్మ అనుచితంగా ఉందని భావించి, దాన్ని తొలగించాలని మీరు భావిస్తే ఆ మూసను (మూస:ఈ బొమ్మను తొలగించాలి) ఆ పేజీలో పై భాగాన పెట్టాలి (మూసను పేజీలో పెట్టే పద్ధతి ఇది.. {{ఈ బొమ్మను తొలగించాలి}}). దానితో మీ ఉద్దేశ్యం అందరికీ తెలుస్తుంది. ఇతర సభ్యులు ఆ విషయమై తమ తమ అభిప్రాయాలు కలబోసుకుంటారు. ఓ వారం తరువాత, ఆ చర్చ పర్యవసానాన్ని బట్టి నిర్వాహకుడెవరైనా బొమ్మను తొలగించడమో, ఉంచెయ్యడమో చేస్తారు. __చదువరి (చర్చ, రచనలు) 17:04, 25 మే 2007 (UTC)Reply

సంయమనం

మార్చు

ఆయ్యా మీరు తెవికీ మాంత్రికుడు కావచ్చు, మీరు మాలాంటి క్రొత్త సభ్యులతో సంయమనం పాటిస్తే బాగుంటుందేమో!!!!!!!--S172142230149 18:10, 25 మే 2007 (UTC)Reply
ఏదో నిర్వాహక హోదా ఉంది కదా అని మీసభ్యత్వ పేజిని రక్షించుకోవడం ఏమి బాగాలేదు. మీ పేజి దండయాత్రలు జరుగుతున్నాయి అంటే మీలొ ఏదో తేడా ఉంది. --S172142230149 18:10, 25 మే 2007 (UTC)Reply

edit=sysop:move=sysop

S172142230149 గారూ, ఇలా వ్యక్తిగత దూషణకు దిగటం వికీనియమాలకు విరుద్ధం. ప్రదీపు తన సభ్యుని పేజీని పరిరక్షంచుకోవటం ఆయన వ్యక్తిగత విషయం. దయచేసి వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టి తెలుగు భాషా అభివృద్ధి కలసి పనిచేద్దాం రండి. ఇలాంటి వ్యాఖ్యలు మీ,మా అందరి సమయాన్ని వృధా చేస్తాయి. --వైఙాసత్య 18:17, 25 మే 2007 (UTC)Reply
  • సమయాన్ని వృధా చేయడం ఎంత మాత్రం నా అభిమాతం కాదు. ప్రదీపు గారు అధికార దుర్వినియౌగం చేసారు అని నాకు అనిపించింది. అయినా నిర్వహకులు గా మీలాంటి వారు ఉండగా నేను ఇంక కల్పించుకోంటే బాగుండదేమౌ అని కాడా అనిపిస్తోంది.--S172142230149 20:02, 25 మే 2007 (UTC)Reply

వ్యసనం

మార్చు

తెవికీ నాకు ఒక వ్యసనం లా తయారైంది అన్నారు.

ఆశ్చర్యం! ఇదేమాట నేను ఐదారు నెలల క్రితం రచ్చబండలో వ్రాశాను. మీరు వ్రాసింది నిజం. తెలుగు వికీ నాలా చాలా మందికి వ్యసనంగా తయారైంది. అందుకు రెండు కారణాలున్నాయనుకొంటాను (1) కొడిగడుతున్న తెలుగుభాషకు ఆదరణ లభించడం వల్ల మనకు కలిగే ఉత్సాహం (2) వికీలో ఉన్న స్వేచ్ఛ. ఇక్కడ బలవంతపు టార్గెట్‌లు లేవు. పని పూర్తి చేయకపోతే బాసు తిడతాడన్న భయం లేదు.

ఇక ఎవరెలా ఉంటారనే విషయం గురించి. నేను ఇంతవరకూ ఒక్క సభ్యుడిని కూడా వ్యక్తిగతంగా కలుసుకోలేదు. అంతా ఒక విధంగా ఉండాలనుకోవడం ఉచితం కాదు (ఉదాహరణ మీరే!). కనుక వ్యక్తిగతం వదిలేయడం మంచిదని నా విన్నపం.

క్రొత్త సభ్యులను చేర్పిస్తున్నందుకు అభినందనలు.

--కాసుబాబు 20:41, 25 మే 2007 (UTC)Reply

బాటు గురించి మరియూ ఇతరములు

మార్చు

బాటు అనే వ్యాసంన్ని మీరు పదే పదే సృష్టించి అందులో రాస్తున్న విషయం అర్ధంలేనిది. రచనల సంఖ్య పెంచటానికి కాదు బాటును ఉపయోగించేది. మనుషులు చేయలేని పనులు అనగా చాలా ఒకే పనిని పలుమార్లు చేయటం వంటివి, అవి చేస్తూ ఉంటాయి. తెలుగు వికీపీడియాలో సభ్యులు బోలెడన్ని ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు, వాటిలో భాగంగా చాలా చాలా మంచి వ్యాసాలు తయారవుతున్నాయి. ఈ వ్యాసాలన్నిటినీ సమన్వయపరచటానికి బాటు ఉపయోగపడుతుంది. వేలసంఖ్యలో ఉన్న వ్యాసాలన్నిటినీ మనుషులే పూనుకుని చేయటానికి నెలలు పట్టవచ్చు. అదే బాటు ఉండటం వలన ఇలాంటి పనులన్నిటికీ ఒక starting point వస్తుంది. ఆ starting point నుండి సభ్యులు ఇంకొంత సమన్వయ పరచవచ్చు. ఉదాహరణకు, నా సభ్యపేజీలో "వికీప్రాజెక్టు భారతదేశం గణాంకాలు" అనే విభాగంలో ఉన్న గణాంకాలు చూడండి. అక్కడి గణాంకాలు తెలుగు వికీపీడియాలో భారతదేశానికి సంభందించి తయారయి ఉన్న వ్యాసాల స్థాయిని సూచిస్తుంది. ఆ పట్టిక బాటు వలనే సాధ్యమయినది. అలాగే తెలుగు వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతీ జిల్లాకు, మండలానికి, గ్రామానికి ఒక పేజీ తయారయి ఉన్నది. ఇది కూడా బాట్ల వలనే సాధ్యమయినది. బాట్లు ఉన్నవి మార్పుల సంఖ్య పెంచటానికి కాదు, మనుషులకు తోడ్పాటు అందించటానికి మాత్రమే. బాట్లు మనుషులకంటే చాలారెట్లు వేగంగా పని చేయటం వలన మార్పులు సహజంగానే పెరుగుతూ ఉంటాయి. కానీ మార్పులు పెంచటానికి మాత్రమే బాట్లు నడపటమనేది పిచ్చిపని.

సైక్లోస్టైల్, కార్బన్ పేపర్ లాంటి కొన్ని వ్యాసాలలో మీ కృషి బాగుంది. అలా అని మీరు అక్కడక్కడా చేస్తున్న పిల్లచేష్టలు నేను సమర్ధించటంలేదు. ఉదాహరణలు:

  • సభ్యుడు:Mpradeep/సూచనలు - ఇది నా సభ్య పేజీకి అనుబంధ పేజీ. ఇలాంటివి మీరు మీ సభ్య పేజీకి కూడా తగిలించుకోవచ్చు.
  • సభ్యుడు:srinivsa పేజీ - ఇది దుస్చర్య కాకపోయినా కూడా మీకు సంబంధంలేని ఇంకో సభ్యుని పేజీ. ఇతర సభ్యుల పేజీలను మార్చకుండా ఉండటం ఒక వికీసాప్రదాయం.
  • పలు సంధర్భాలలో మీరు వ్యక్తిగత దూషనలకు కూడా దిగుతున్నారు. ఇలాంటి పిల్ల చేష్టలను మాత్రం దుశ్చర్యలుగానే భావిస్తారు. మీకు నేనేమయినా అధికార దుర్వినియోగం లాంటివి చేస్తున్నానని అనిపిస్తే వాటికి మొదట కొన్ని ఉదాహరణలు చూపించండి. నేను చేసిన మార్పులన్నీ మీరు ఇక్కడ చూడవచ్చు. ఒక వేళ అవి నిజంగానే అధికార దుర్వినియోగమయితే నేను సరిదిద్దికోవటానికి ప్రయత్నిస్తాను. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 09:48, 26 మే 2007 (UTC)Reply

వ్యక్తిగత దూషణలకు దిగడం నా అభిమతం ఎంత మాత్రంకాదు. మీరు చేసే కృషి చాలా అద్భుతం,తెవికీ మీలాంటి ఐ.టి. రంగం వారు సభ్యులుగా ఉండడం తెవికీ అదృష్టం.కాని నేను పరిశీలించినప్పుడు మీరు సభ్యులు వ్రాసిన వ్యాసాలలో అవసరం లేని మర్పులు చేస్తారు. ఒకసారి కాదు నేను చాలా సార్లు చూశాను. మీదే పై చేయి గా ఉండాలని అనుకంటారు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.--S172142230149 12:32, 26 మే 2007 (UTC)Reply

దయచేసి మీరు పరిశీలించిన ఆ అవసరం లేని మార్పులు ఉన్న వ్యాసాలను కొన్ని ఎత్తి చూపించండి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 12:41, 26 మే 2007 (UTC)Reply

మీ సభ్యుల పేజీలో మార్పులు గురించి

మార్చు

ఆ ఇంకో అజ్ఞాత సభ్యుడు కూడా మీలాగే పిల్ల చేష్టలు చేస్తున్నాడని చూసి చూడనట్టు ఊరుకున్నాను. వైజాసత్యగారికి అలా అనిపించలేదు మరి :) మీరు చర్చా పేజీలలో ఏదయినా విషయం రాసేటప్పుడు కొంచెంభాషను అదుపులో పెట్టుకోండి. మీరు నాచర్చా పేజీలో చేరిన కొన్ని అనుచిత వాఖ్యాలను తొలగించాను. ఇప్పుడే మీరు చేసిన రచనలన్నీ ఒకసారి పరిశీలిణ్చాను, వికీపీడియాలో సభ్యుల సహనాన్ని పరీక్షించటానికే ఎక్కువ సమయంకేటాయించారారి నాకు అనిపించింది. అసలు మిమ్మల్ని ఎందుకు బహిష్కరించకూడదో సెలవిస్తారా. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 15:50, 27 మే 2007 (UTC)Reply

బహిష్కరణ

మార్చు

నన్ను బహిష్కరిస్తే తెవికీ ఒక మంచి రచయితను చేతులారా జారవిడుచు కొన్నట్లు.. మీ ఇష్టం బహిష్కరిస్తే ఏంచేస్తాను , ఇంతే ప్రాప్తం అనుకొని చేతులు కట్టు కొని కూర్చోంటాను.--S172142230149 15:54, 27 మే 2007 (UTC)Reply

నిర్వాహకులు

మార్చు

తెవికి బాగా అలవాటు అయ్యింది, వ్యసనం లాగ బాగుంది అని అనుకొన్నాను.. ఏంచేస్తాం బహిష్కరణ జరిపితే.. జరపడమే... అయినా మీరు నిర్వాహకులు మీరు ఏదైనా చెయ్యగలరు.--S172142230149 15:57, 27 మే 2007 (UTC)Reply

ఏదయినా ఎందుకుచేస్తాను? అలా నా ఇష్టం వచ్చింది చేసుకుంటూ పోతే మిగతా వారు నన్ను బహిష్కరిస్తారు కదా. ఇంకో విషయం, నేను మీలాగా నా పేరును దాచుకోలేదు, ప్రదీపు అనే పేరు నిక్షేపంగా ఉంది. నన్ను దానితో పిలవండి చాలు, కొత్త కొత్త పేర్లు అవసరం లేదులేండి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 16:05, 27 మే 2007 (UTC)Reply

మీ దుశ్చర్యలు

మార్చు

గత కొన్ని రోజులుగా మీరు వికీపీడియాలో చేస్తున్న రచనలను పరిశీలిస్తూ ఉన్నాను. మీరు కొన్ని ఆకతాయి పనులకు పాల్పడ్డారు.

  1. నా గురించి, నేను చేసిన నిరోధం గురించి రాసారు, నేను దానికి వివరణ ఇచ్చాక మీ తప్పును గ్రహించానన్నారు.
  2. నా సభ్యుని పేజీలో అవాంఛనీయమైన మార్పు చేసారు.
  3. రెడ్డి పేజీని పూర్తిగా ఖాళీ చేసారు.
  4. ప్రదీప్ దురుసుగా ఉన్నారంటూ వేరే సభ్యుని పేజీలో రాసారు. ఆ విషయాన్ని ఆయనతోటే చర్చించి ఉంటే బాగుండేది.
  5. ప్రదీప్ సభ్యుని పేజీలను మార్చారు. ([1], [ http://te.wikipedia.org/w/index.php?title=సభ్యుడు:Mpradeep/సూచనలు&diff=prev&oldid=111656])
  6. శ్రీనివాస్ పేజీ (సభ్యుడు:Srinivasa&diff=prev&oldid=111848)

ఈ పనులన్నిటి విషయంలో ఎప్పటికప్పుడు మీకు సభ్యులు తెలియజేస్తూ వస్తూనే (సభ్యులపై చర్చ:172.142.230.149) ఉన్నారు. వికీపీడియా కొత్త కావడం చేత, ఉత్సాహంతో, కుతూహలంతో ఇలా రాస్తున్నారని నేను భావించాను. ఇతర సభ్యులూ అలాగే భావించారు. ఎప్పటికప్పుడు మీరూ మీ తప్పులను గ్రహించినట్లుగా రాస్తూనే ఉన్నారు. (సభ్యులపై చర్చ: 172.142.230.149#ఓదార్యం). 172.142.230.149 ఐపీఅడ్రసు నుండి రాస్తున్నపుడు, ఆ చర్చాపేజీలో ఇలా రాసారు.. "నా రాక్షసప్రవృత్తి కి సిగ్గు పడుతూ, ఒక ఖాతా ని ఏర్పాటు చేసుకోంటున్నాను. ఇంత కన్నా ఎక్కువ చెత్త రాతలు వ్రాయను.". కొత్త ఖాతా సృష్టించాక మీ పద్ధతి మారుతుందని ఆశించాను. "నేను పూర్తిగా పరివర్తన చెందిన మనిషి ని, రాక్షస పవృత్తి వదులుకొన్నమనిషిని!!" అని కొత్త ఖాతా సభ్యుని పేజీలో రాసుకున్నారు కూడాను.

అయినా ఆ తరువాత బాటు పేజీలో వ్యక్తిగత నింద చేసారు. బాటు ద్వారా చేసే దిద్దుబాట్లు, ఆ బాటుకే చెందుతాయని, దాన్ని సృష్టించిన వారికి చెందవన్న విషయాన్ని తెలుసుకోకుండా, వికీపీడియా అభివృద్ధికి దోహదం చేస్తున్న ఒక చురుకైన సభ్యుని నిందించేందుకు అత్యుత్సాహం ప్రదర్శించారు. మీ ఈ చర్య కొత్తలో ఉండే కుతూహలం కొద్దీ చేసినట్లుగా అనిపించడం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు సభ్యుల ఉత్సాహాన్ని నీరుగారుస్తాయి.

మళ్ళీ ఈరోజు సభ్యులపై చర్చ:Mpradeep పేజీలో నిందాపూర్వకంగా రాసారు. ఇది కేవలం దుశ్చర్య తప్ప మరోటి కాదు. వికీపీడియాకు మీరు చేస్తున్న సేవ కంటే చెరుపే ఎక్కువగా ఉందని గ్రహించాను. మరొక్కసారి దుశ్చర్యకు పాల్పడితే, మీపై చర్య తీసుకోవలసి ఉంటుంది. ఇది చివరి హెచ్చరికగా భావించగలరు. _చదువరి (చర్చ, రచనలు) 16:09, 27 మే 2007 (UTC)Reply

నా సభ్యపేజీ నా ఇష్టం

మార్చు

S172142230149 గారూ, ఎవరి సభ్య పేజీలో వారి ఇష్టం అయినవి రాసుకోవచ్చు (కొన్ని పరిమితులకు లోబడి). అంతేగానీ ఇలా ప్రత్యేక వ్యాసంలా రాయకూడదు. -- శ్రీనివాస 22:09, 30 మే 2007 (UTC)Reply

చివరిసారి మందలింపు

మార్చు

అయ్యా మీరెవరో కానీ, వికీలో అందరినీ అరే ఒరే అంటూ సంబోధించటం బాగాలేదు. మీరు ఈ తెలుగు యజ్ఞానికి విఘ్నంలా తగిలి మంచి కంటే చెడే చేస్తున్నారని పలువురు సభ్యులు మొరపెట్టుకొనిన మీదట మిమ్మల్ని వికీ నుండి శాశ్వతంగా బహిష్కరించాలని నేను ప్రతిపాదిస్తున్నా. నిర్వాహాకుల మీద మీరు ప్రత్యేకంగా నిర్వాహకత్వం చెయ్యవలసిన అవసరం లేదు. మీరు దుశ్చర్యలు, అనుచిత వ్యాఖ్యలు మానకపోతే రెండురోజుల్లో శాశ్వతంగా బహిష్కరించబడుదురు --వైఙాసత్య 22:19, 30 మే 2007 (UTC)నేను దుశ్చర్యలు మానేశా.. అనుచిత వ్యాఖ్యలు అంటే ఎమిటో నాకు తెలియదు.--S172142230149 22:22, 30 మే 2007 (UTC)Reply

అనుచిత వ్యాఖ్యలంటే మీడియావికీ చర్చ:TeTranslit.jsలో మీరు చేసిన ఇలాంటి వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యకు ఆ పేజీకి ఏమాత్రం సంబంధం లేదు. మీరు ఒక సభ్యుని ప్రేరేపించడానికే చేసిన వ్యాఖ్యలు. ఇలాంటివి చాలా చేశారు. --వైఙాసత్య 23:06, 30 మే 2007 (UTC)Reply
ఢీ వ్యాసంలో కూడా మీరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాసంలో ప్రేమాయణం అని ఉంటే ప్రక్కెనే 'ప్రేమభారతం నడపదా? అని వ్రాశారు. ఇది చాలా అనుచితం. ఒకవేళ ఆ వ్యాఖ్య తప్పనిపిస్తే దాన్ని మీరు సరిదద్దాలి. అంతే కానీ ఇలా వ్యాసాల్లో అనుచిత వ్యాఖ్యలు వ్రాయడం వికీ స్పూర్తికే విరుద్దం. --నవీన్ 05:53, 31 మే 2007 (UTC)Reply

కష్టం

మార్చు

నీ కష్టాన్ని చూస్తున్నాను రా.. ఎదోకటి రాయరా బాబు.. రాయి--S172142230149 21:51, 30 మే 2007 (UTC)Reply

మీరు ప్రారంభించిన వ్యాసాలు

మార్చు

మీరు ప్రారంభించిన వ్యాసాలలో కార్బన్ పేపర్, సైక్లోస్టైల్, ఫోటో కాపీ వ్యాసాలు బాగున్నాయి. వీటిని వికీసోర్స్ కు తరలించమని అడగలేదే!! ఎందుకంటే ఇవి విజ్ఞాన సర్వస్వంలో ఉండదగినవి. ఇలాగే మరిన్ని వ్యాసాలకు తోడ్పడి అందరి మన్ననలు అందుకుంటారని ఆశిస్తున్నా --వైఙాసత్య 16:54, 31 మే 2007 (UTC)Reply

మీ ధోరణి

మార్చు

ప్రకాశం బ్యారేజి చర్చ పేజీలో మీరు రాసింది చూసాక..: మీ ధోరణి ఇంకా పూర్తిగా మారలేదు. సభ్యుడిని సభ్యనామంతో గాని, ఆయనే పెట్టుకున్న ముద్దుపేరుతో గానీ మాత్రమే పిలవడం సభ్యత, మర్యాద. అనేకానేక హెచ్చరికల తరవాత కూడా మారకపోతే ఎలా? కనీసం తోటి సభ్యుల ప్రవర్తన చూసైనా నేర్చుకోవాలి! __చదువరి (చర్చరచనలు) 05:06, 1 జూన్ 2007 (UTC)Reply

లాగిన్ పేరు

మార్చు

మీ లాగిన్ పేరు మాటలబాబు అనిమార్చమంటారా? కావాలంటే చెప్పండి (ఈ అంకెలపేరుకంటే అదే బాగుంటుందేమో..సూచన మాత్రమే) --వైఙాసత్య 10:28, 2 జూన్ 2007 (UTC)Reply

ఇంకొన్ని రోజులు ఈ పేరు S172142230149 ఉంచుకొని మంచి పేరు సంపాదించి పేరు మాటలబాబు గా మర్చుకొంటాను.--మాటలబాబు 16:24, 2 జూన్ 2007 (UTC)Reply

మీ కొత్త పేరు బాగానే ఉంది. నేను ప్రస్తుతం సూరత్కల్లో ఉండటం లేదు, బెంగళూరులో ఉంటున్నాను. నన్ను ప్రదీపు అని పిలవండి చాలు. మీకు నన్ను వికీపీడియాకు సంబందించి ఏదయినా అడగాలని అనుకుంటే నేరుగా నా చర్చా పేజీలోనే అడిగేయండి. అంతే కానీ నేను మీతో చర్చల్లో పాల్గొనే వరకూ నా చర్చా పేజీలను నింపటం అనవసరం. వికీపీడియాకు సంబందంలేని ఇతర విషయాలు నా చర్చా పేజీలో అడిగినా/ప్రస్తావించినా నేను వాటిని పెద్దగా పట్టించుకోను. మీరు ప్రారంభించిన కొన్ని వ్యాసాలు బాగున్నాయి వాటన్నిటినీ ఇంకొంచెం పెద్దవి చేయండి. మీరు వ్యాసాలలో రాస్తున్న ప్రతీ వాఖ్యానికీ మూలాలు తెలుపండి, మరీ ముఖ్యంగా మీరు ఆశ్చర్యకరమయిన విషయాలను వ్యాసాలలో రాస్తున్నప్పుడు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 18:47, 2 జూన్ 2007 (UTC)Reply

ఇసుకపెట్టె

మార్చు

మీరు ప్రయోగాలకు సొంత ఇనుకపెట్టె సృష్టించుకోవలెను. సభ్యుని పేజీలో [[సభ్యుడు:S172142230149/ఇసుకపెట్టె]] అని రాసి భద్రపరచుకుంటే ఇక ఆ లింకులోకి వెళ్ళి కావలిసిన్నని ప్రయోగాలు చేసుకోవచ్చు. సాధారణంగా సభ్యుని చర్చా పేజీలోతప్ప సభ్యునికి చెందిన ఏ పేజీలో నైనా అవి సభ్యుని వ్యక్తిగతం అని భావించి ఇతర సభ్యులు అందులో మార్పులు చేయకుండా ఉండటం వికీమర్యాద.--వైఙాసత్య 02:18, 3 జూన్ 2007 (UTC)Reply

పునస్వాగతం

మార్చు

మాటల బాబూ, పునస్వాగతం. నేను ఒకవారం దేశాంతరంలో ఉన్నాను. మీ వ్యాసాలకంటే చర్చాపేజీ పొడవుగా ఉంది? ఈ వివాదములేల? తగదు. గ్రహింపవలెను. - కాసుబాబు 17:39, 3 జూన్ 2007 (UTC)Reply

ఆడియో ఫైలు

మార్చు

ఆడియో ఫైలు ఏ వ్యాసంలో ఉంచదలిచారో ఆ వ్యాసంలో క్రింది భాగాన బయటి లింకులు విభాగంలో {{శ్రవణ తెవికీ|ఫైలుపేరు.ogg|ఈ ఆడియో ఫైలు వ్యాసం యొక్క ఏ సంపుటాన్ని ప్రతిబింబిస్తుందో ఆ తేదీ}} అన్న మూసను పెట్టండి. ఉదాహరణకు {{శ్రవణ తెవికీ|Wikipedia.ogg|2005-08-16}} --వైఙాసత్య 03:08, 5 జూన్ 2007 (UTC)Reply

దురుసు ప్రవర్తన - 2 గంటల నిరోధం

మార్చు

చర్చ:నడింపల్లి పేజీలో మీ దురుసు ప్రవర్తన కారణంగా మీపై నిరోధం విధించక తప్పడం లేదు. అనేకమార్లు అనేక మంది చేసిన సూచనల తరువాత కూడా ఇటువంటి పరిస్థితి రావడం దురదృష్టకరం. మీ ప్రవర్తన మార్చుకోవాల్సిన తక్షణావసరం ఉందని గ్రహించగలరు. మీపై 2 గంటల పాటు నిరోధం విధిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 10:17, 5 జూన్ 2007 (UTC)Reply

బహిష్క్రించరు

మార్చు

ఇది వైజా సత్యాగారికి మిరు నాసభ్యత్వ పేజీలకు లింకులు బాగా ఇచ్చారే.. నేను తెలియక రెండు పేజిలు తయారు చేశాను

  • పిచ్చి రాజూ అని ఒకటి,[2]
  • ఇంకొకటి తుగక్ల్ అనే పేజి,[3]
దానిని మీరు నా సభ్యత్వా పేజికి ఎవరికీ తెలియకుండా లింకు బాగాకలిపారు. మాకు పేజిలు సృష్టించే అవకాశం తప్పితే నిర్మూలించే అవకాశం లేదు , ఆ పేజీల్ను నిర్మూలించలెకపోయాను.
దానిని మీరు ఈ అవకాశాన్ని జాగ్రత్త వినియౌగించుకొని నా పేజి కి జత చేశారు. నిర్వాహక హోదా లో ఊండి ఇటువంటి పను చెయ్యవచ్చా..దయచేసి మీకు కూడా ఒక విన్నపం నన్ను బహిష్కరించండి. అప్పుడెప్పుడొ బహిష్కరిస్తాను లేదా ఎందుకు బహిష్కరించకోడదొ అని ప్రదీపు గారు అన్నారు అదెదొ ఇప్పుడు చేసేయ్యంది. కాసుబాబు గారు విదేశాలనుండి తిరిగి వచ్చాకా నేను ఎఖ్కడ ఉన్నను అని చూస్తారు ఆ సమ్యానికి నెను బహిష్కరించబడి సేద తీరుతూ ఊంటాను. ప్లీజ్ ప్లీజ్ బహిష్క్రించరు... --మాటలబాబు 12:20, 5 జూన్ 2007 (UTC)Reply
అవి మీరు ప్రయోగాలకోసం చేసుకొన్న మూసలని మీ సభ్యుని పేజీకి తరలించా (నేను ప్రయోగాత్మక మూసలను అలానే నా సభ్య పేజీ కింద పరీక్షిస్తుంటా). అన్యధా భావించవద్దు. నాకింక ఏ దురుద్దేశము లేదు. క్షమాపణలతో అవి తొలగించేస్తా. మీరు ఇంతకు ముందే తొలగించాలని ప్రయత్నించి ఉంటే ఎవరైనా నిర్వాహకున్ని అడగాల్సింది. బహిష్కరణ నా ఇచ్ఛాపూర్వకంగా నేను చెయ్యలేను. అంతగా మీరు ఇక్కడ పనిచెయ్యకూడదని అనుకుంటే అది మీ ఇష్టం --వైఙాసత్య 12:33, 5 జూన్ 2007 (UTC)Reply

ఆడియో ఫైలు

మార్చు

మీ ఆడియో ఫైలు బాగుంది. వికీపీడియా సహాయ పేజీలను కూడా ఇలా వినగలిగేటట్లు తయారు చేసేయండి మరి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 03:04, 6 జూన్ 2007 (UTC)Reply

అభినందన

మార్చు

కొత్త సభ్యులను ప్రోత్సహిస్తున్నందుకు అభినందిస్తున్నాను. వికీ స్పూర్తిని, లక్ష్యాలను ఇలాగే అర్థం చేసుకొని తెవికి యఙ్ఞంలో అర్థవంతమైన భాగం కాగలవని ఆశిస్తాను :) --నవీన్ 10:59, 7 జూన్ 2007 (UTC)Reply

సంతోషం

మార్చు

మాటల బాబూ! కుశలమే. నా ప్రయాణం బాగానే జరిగింది. నాలుగు రోజులు అబూధాబీ వెళ్ళాను. తరువాత ఒమన్‌లో పెనుతుఫాను వచ్చినందున బిజీగా ఉన్నాను. (నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నందున). --కాసుబాబు 18:15, 7 జూన్ 2007 (UTC)Reply

కాసుబాబు గారు మాటలబాబు మిమ్మల్ని ఒక చిన్న సహాయం చేయమని కోరుతున్నాడు. నా చర్చా పేజి పూత్రిగా నిండింది. దానిని ఎలా భద్రపరచాలో తెలియం లేదు. మీ సహాయం తో వాటిని భద్ర పరచాలి అనుకొంటున్నాను. విషయం ఏమిటంటే మీరు వ్రాసిన మెదటి కామెంట్ బాసూ తప్పితే మిగతాది అంతా దయచేసి పాత చర్చా పెట్టె లో భద్ర పరచరూ... ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్...--మాటలబాబు 21:36, 7 జూన్ 2007 (UTC)Reply
Return to the user page of "S172142230149/పాత చర్చ 1".