వాడుకరి చిత్రం మరియు పేరు (మూల్యాంకనం స్కోర్ క్రమంలో)(User Name, as per Evaluation Score)
పురస్కారం ఎంపికకు ప్రధానాంశాలు(Main factors of Wiki Contribution qualifying for Award in Telugu)
(Main factors of Wiki Contribution qualifying for Award in English Translation of the previous cell)
1
వికీలో సహాయం, వికీ విధానాలలో, అనువాదాలలో విస్తృత కృషి. తెలుగు అన్నిచోట్ల వాడుటకు గొప్ప ప్రేరణ, వికీలో కీలక మార్పు. బ్లాగుల ద్వారా ప్రచారం, భౌతిక సమావేశాలు ద్వారా కృషినిర్వహణ బాధ్యతలు చక్కగా ప్రోత్సహించారు.మండల గ్రామాలు పేర్లు తర్జుమాలో విశేషకృషి. మూడు పతకాలు పొందారు
Extensive contribution to Wiki Policies, Wiki help and Translations from English wiki. Pioneeed extensive use of Telugu on Wiki.Significant translation of interface. Promoted Wiki via blogs and blogger meets. Contributed to Blocks and Village name article project by translations. Received three medals
2
విస్తృతమైన కృషికి ఆదర్శం, గ్రామాల పేజీలు, విక్షనరీ లో బ్రౌణ్య నిఘంటువు చేర్పులు వలన తెవికీ ప్రథమ స్థాయిలో వుండి ఆకర్షించడానికి వీలైంది. నకలుహక్కులపై ప్రత్యేక శ్రద్ధ, స్వేచ్ఛాగాలేనివాటికి తొలగింపు హెచ్చరికలు చేశారు.బాట్ తో రకరకాల గణాంకాలు, మరియు ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు ఆద్యుడు. మండలాల పటాలు, పేజీలు చేర్చారు. ఒక పతకం పొందారు
Role model for extensive contribution to Wiki. Played key role in creating mandal articles, mandal location maps and also for uploading Brown dictionary (English-Telugu) entries to Telugu Wiktionary. Bot scripts to assess project progress, article status and statistics
3
విస్తృతమైన కృషి, ఇతరులకు ఆదర్శం, తెలుగు భాషాభిమాని.చాలా స్వేచ్ఛానకలు హక్కుల బొమ్మలు చేర్చారు. తెలుగులో మొదటి బ్లాగరు, బ్లాగు సమాజంలోప్రచారం, సైబర్ కేఫ్ లలో ప్రచారంగ్రామాల వ్యాసాలపై ఆసక్తి. పుస్తకాల ప్రాజెక్టుల సమన్వయం.సాంవత్సరీక సమావేశంలో వికీపీడియన్ల కృషి గుర్తింపుకి తోడ్పాటు
Role model for extensive contribution to Wiki. Passionate about Telugu language. Uploaded several copy left images. Recognised as the first blogger in Telugu. Promoted Wiki via blogs, blogger meets and in Cybercafes. Coordinated Books project. Supported recognition of Wikipedians in annual meetings.
4
సాంకేతికంగా దిట్ట, అందరికి ఆదర్శం, లేఖినిని వికీలో రాయటానికి ఇంకా కొత్త మంది వాడుతూనే వున్నారు. శుద్ది కృషి, గ్రామాల్లో, మండలాల్లో కొంత కృషి. వికీలో కొత్త సాంకేతికాలు వాడడం మొబైల్ పేజీ, నరయం తరువాత ULS స్థాపనకు, లోగో సహాయం, మొదటి పేజీ తొలిదశలో రూపలావణ్యం కృషి. వీవెన్ పై తెవికీలో వ్యాసం. భౌతిక మరియు ఆన్లైన్ ప్రచారంలో విశేష కృషి (తెలుగు మహాసభలలో తెవికీ ప్రచారం). ఖతులపై సమాచారం
Technology Expert and role model. Developed Lekhini for easy typing in Telugu, which is still used by many. Contributed to Copy edits, introduction of new technologies like mobile page, Narayam, use of ULS and updation of Logos. Designed the Main page in the early days. He has an article in his name in Telugu wiki. He promoted Telugu wiki through blogs, blogger meets and also conducted the first e-academy. He contributed to articles on Fonts.
5
వికీపీడియాలో ఆయిల్ వ్యాసాలలో విస్తృత కృషి, విక్షనరీ లో కూడా కృషి. వివిధ భాషలలో కృషి. ఉగాది ఉత్సవాలలో పాల్గొన్నారు. మూడు పతకాలు, ఒక సంవత్సరం టాప్ 10లో స్థానం. విశాలాంధ్ర దినపత్రిక లో వచ్చిన వికీపీడియా వ్యాసాలు రెండు.
Extensively contributed articles on oil seeds in Telugu, Kannada wikis. Received three medals, His articles in Wiki have been used by Visalandhra Telugu newspaper sunday supplement.
6
గ్రామాలు, వ్యక్తులు, సాంకేతికాంశాల వ్యాసాలలో కృషి మరియు వాడుకరులను స్వాగతించడం, ప్రోత్సహించడంలో విశేషకృషి. వీరి కృషితో ఉత్తేజం పొంది కొత్త సభ్యులు చేరారు. చేరిన 5-6 నెలలలోనే 1000కి పైగా దిద్దుబాట్లను చేసాడు. కొత్త సభ్యులను చాలా ఉత్సాహంగా ఆహ్వానించేవారు. రోజుకో కొత్త చిట్కాను ఇతర సభ్యులకు అందించారు. తెవికీవార్తకు సహకారం, వెక్టర్ పై వ్యాసం సాంకేతిక నైపుణ్యత. బ్లాగుల ద్వారా ప్రచారం, రెండు పతకాలు మరియు రెండు సంవత్సరాలు టాప్ 10 లో ఒకరుగా వున్నారు.
Contributed extensively to Villages, Personalities and technology articles. Welcomed new editors and encouraged them to contribute. Did 1000's of edits in the initial 5-6 months. Expert on Wiki Tips.
7
ముస్లిం ఆచార వ్యవహారాలు మరియు అన్ని మతాల చరిత్ర పై, రాయలసీమ వ్యాసాలు వీరు లోతుగా విశ్లేశించి రాసిన పెద్ద వ్యాసాలు నియోజక వర్గాల వ్యాసాలు, తెవికీలో వుండవలసిన వ్యాసాలలో సభ్యునిగా విశేషకృషి. ఇటీవల ప్రారంభించిన పూనా తెలుగు సముదాయ పేజీ. ఉర్దూలో ర్యాంకు 11
Contributed to religion and caste articles on customs and culture, Rayalaseema region related articles, Assembly constituency articles. Supported in forming the essential articles required for Wiki. Started Pune Telugu Facebook community. Extensive contribution to Urdu Wiki
దుస్తులపై, రాయలసీమ, సినిమా అంశాలపై విశేష కృషి. ఛాయాగ్రహణంపై విశేష కృషి. బెంగుళూరులో స్థానిక సమావేశాలకు నాయకత్వం. మూడు మెడళ్లు పొందారు.
Lot of contribution to articles on Fashion, Rayalaseema region and Photography. Anchored Telugu Wiki meetups in Bangalore and promoted them online and through media houses. Received three medals.
9
విక్షనరీలో విస్తృత కృషి. వికీపీడియా లో ప్రధానంగా వ్యాసాలు మరియు స్వాగతం. 2011 లో వికీపీడియాలో వ్యాస మరియు వ్యాసేతరములలో టాప్ 10 లో ఒకరు.బ్రౌన్ పదాల సవరణకు మెడల్. ఆంధ్రప్రదేశ్ జిల్లాల ప్రాజెక్టులో భాగంగా కృషి చేశారు.
Extensive contribution to Wiktionary. Contributed articles on Wikipedia apart from welcoming new editors. One of the top 10 contributors in 2011. Improved wiktionary by fixing bugs in Brown dictionary entries that were created by Bot. Contributed to AP Districts project
10
వికీసోర్స్, వికీపీడియా మరియు విక్షనరీలో విశేష కృషి. తెలుగు నాట జాన పద కళారూపాలు, యోగాసనాలు, అంటు వ్యాదులు పుస్తకాలకు యూనికోడ్ తెలుగు రూపం కృషి. విజయనగర చరిత్ర అనువాదం. తెలుగు సంస్కృతికి సంబంధించి స్వేచ్ఛానకలుహక్కులతో 1000 పైగా బొమ్మలు ఎక్కింపు.
Extensive contribution to Wikisource, Wikipedia and Wiktionary. His work on Transcription of several books into Unicode helped popularise Wikisource. He also translated Vijayanagara history book from English.Uploaded more than 1000 photos with copyleft license.