వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 21
- జాతీయ పౌర సేవల దినోత్సవం
- 1891: భారతీయ రిజర్వ్ బ్యాంక్ రెండవ గవర్నర్ జేమ్స్ టేలర్ జననం.
- 1910: అమెరికన్ రచయిత, మానవతావాది మార్క్ ట్వేయిన్ మరణం.(ప్రక్క చిత్రంలో)
- 1938: ఉర్దూ, పారశీక భాషా కవి, ముహమ్మద్ ఇక్బాల్ మరణం. (జ. 1877).
- 1939: తెలుగు నాటక కళాకారుడు, చలనచిత్ర నటుడు భాను ప్రకాష్ జననం. (మ.2009)
- 1944: ఫ్రాన్స్‌లో మహిళలు వోటు వేయడానికి అర్హత పొందారు.
- 1945: భారతదేశానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు వెంకట రాఘవన్ జననం.
- 1994: సౌర మండలం బయట ఇతర గ్రహాలను కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
- 1997: భారత ప్రధానమంత్రిగా ఐ.కె.గుజ్రాల్ నియమితుడైనాడు.
- 2013: గణిత, ఖగోళ, జ్యోతిష్య శాస్త్రవేత్త శకుంతలా దేవి మరణం.(జ.1929)