వెంకట రాఘవన్

1945, ఏప్రిల్ 21చెన్నైలో జన్మించిన శ్రీనిసరాఘవన్ వెంకటరాఘవన్ (Srinivasaraghavan Venkataraghavan) భారతదేశానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ లో ఇతడు డెర్బీషైర్ తరఫున ఆడినాడు. భారత క్రికెట్ జట్టు నుంచి రిటైర్ అయిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఎలైట్ టెస్ట్ ప్యానెల్ అంపైర్ గా నియమించబడ్డాడు.

వెంకట రాఘవన్
Cricket no pic.png
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి కుడిచేతి బ్యాట్స్‌మన్
బౌలింగ్ శైలి రైట్-ఆర్మ్ ఆఫ్‌బ్రేక్
కెరీర్ గణాంకాలు
TestsODIs
మ్యాచ్‌లు 57 15
పరుగులు 748 54
బ్యాటింగ్ సగటు 11.68 10.80
100లు/50లు 0/2 -/-
అత్యుత్తమ స్కోరు 64 26*
ఓవర్లు 2479.5 144.6
వికెట్లు 156 5
బౌలింగ్ సగటు 36.11 108.4
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 3 0
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు 1 n/a
అత్యుత్తమ బౌలింగ్ 8/72 2/34
క్యాచ్ లు/స్టంపింగులు 44/- 4/-

As of ఆగష్టు 14, 2007
Source: [1]

1970 దశాబ్దంలో భారత జట్టులో ప్రముఖ స్పిన్నర్లయిన చంద్రశేఖర్, బిషన్ సింగ్ బేడీ, ఎరపల్లి ప్రసన్న లతో బాటు వెంకట రాఘవన్ ఒకరు. ఇతను ఫీల్డింగ్ లో మంచి నేర్పరి. అంతేకాకుండా చివరి వరుస బ్యాట్స్‌మెన్ లలో ఇతను ప్రయోజనకారిగా ఉండేవాడు. 20 సంవత్సరాల ప్రాయంలోనే భారత్ తరఫున న్యూజీలాండ్ పై టెస్ట్ మ్యాచ్ ఆడి, సీరీస్ చివరి నాటికి ప్రపంచ శ్రేణి స్పిన్నర్ గా అవతరించాడు. ఢిల్లీ టెస్టులో 12 వీకెట్లు సాధించి భారత విజయానికి దోహదపడ్డాడు. 1970-71 లో ఇంగ్లాండు పర్యటించిన భారత జట్టుకు ఉప నాయకుడిగా వ్యవహరించాడు. ఆ సీరీస్ లో భారత్ గెల్వడమే కాకుండా చరిత్ర సృష్టించింది. ఇందులో వెంకట రాఘవన్ కీలక పాత్ర వహించాడు. ట్రినిడాడ్ టెస్టులో 5 వికెట్లు సాధించడమే కాకుండా 3 టెస్టులలో మొత్తం 13 వికెట్లు పడగొట్టాడు.

1975లో జరిగిన మొదటి ప్రపంచ కప్ క్రికెట్ లో, 1979 రెండో ప్రపంచ కప్ క్రికెట్ లో ఇతను భారత జట్టుకు నాయకత్వం వహించాడు. 1979లో ఇంగ్లాండుతో జరిగిన 4 టెస్టుల సీరీస్ కు కూడా ఇతను నాకకత్వం వహించాడు. దేశవాళీ క్రికెట్ లో ఇతను సౌత్ జోన్ కు, తమిళనాడుకు దశాబ్దం పైగా నేతృత్వం వహించాడు.

1985లో వెంకట రాఘవన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు. ఆ తర్వాత భారత టెస్ట్ జట్టుకు అడ్మినిస్ట్రేటర్ గా నియమించబడ్డాడు. 2003లో ఇతనికి పద్మశ్రీ బిరుదును భారత ప్రభుత్వం ప్రధానం చేసింది. వృత్తిరీత్యా ఇతను మెకానికల్ ఇంజనీరు.

అంపైర్ గా క్రీడా జీవితంసవరించు

మొదటిసారిగా 1993, జనవరి 18జైపూర్లో జరిగిన భారత-ఇంగ్లాండు వన్డే మ్యాచ్ కు అంపైర్ గా బాధ్యతలు నిర్వహించాడు. అప్పటి నుంచి 73 టెస్టు మ్యాచ్ లకు, 52 వన్డే మ్యాచ్ లకు అతను అంపైరింగ్ బాధ్యతలు చేపట్టాడు. అతని అంపైర్ క్రీడా జీవితంలో ముఖ్యఘట్టాలు 1996, 1999, 2003 ప్రపంచ కప్ లలో అంపైరింగ్ విధులను నిర్వహించడం.

బయటి లింకులుసవరించు

ఇవి కూడా చూడండిసవరించు