సౌరమండలము

సౌర గ్రహాల వ్యవస్థ
(సౌర మండలం నుండి దారిమార్పు చెందింది)
సౌరమండలానికి చెందిన గ్రహాలు, మరుగుజ్జు గ్రహాలు. వీటి సైజులు, సూర్యుడి నుండి సాపేక్ష దూరాలు కొలబద్దం కావు (స్కేలు ప్రకారం చూపబడలేదు).

సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, ఇతర అంతరిక్ష పదార్ధాల సముదాయమే సౌరమండలం, లేదా సౌరకుటుంబం (Solar system). ఇందులో సూర్యుడు మరియు ఇతర అంతరిక్షపదార్థాలు తమలోతాము గురుత్వాకర్షణ శక్తికిలోబడి వుంటాయి: 8 గ్రహాలూ, వాటి 166 ఉపగ్రహాలూ,[1] 3 మరుగుజ్జు గ్రహాలు (సెరిస్, ప్లూటో మరియు ఎరిస్ మరియు వాటి నాలుగు చంద్రులు) మరియు బిలియన్ల కొద్దీ చిన్నశరీరాలు. ఆఖరు వర్గం గ్రహ శకలాలు, క్యూపర్ బెల్ట్ పదార్థాలూ తోకచుక్కలు ఉల్కలు మరియు గ్రహాంతర ధూళి (అంతరిక్ష ధూళి).

సౌర వ్యవస్థ సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక పెద్ద పరమాణు మేఘం కూలిపోవటంవలన ఏర్పాటు ఇయింది.

సంగ్రహంగా చెప్పాలంటే, సౌరమండలంలో సూర్యుడు, నాలుగు ఈవలి గ్రహాలు, ఒక గ్రహ శకలాల పట్టీ, దీనియందు చిన్న రాళ్ళ శరీరాకృతులూ, నాలుగు వాయు రాక్షస ఆవలి గ్రహాలు, మరియు రెండవ పట్టీ, క్యూపర్ బెల్ట్, వీటియందు మంచుతో కూడిన శరీరాకృతులూ. క్యూపర్ బెల్ట్ ఆవల విసరబడ్డ డిస్క్, హీలియోపాజ్, మరియు ఆఖరున ఊర్ట్ మబ్బు ఉన్నాయి.

సౌరమండల జోన్లు,: ఈవలి (లోతట్టు) సౌరమండలము, ఆస్టెరాయిడ్ పట్టీ, రాక్షస గ్రహాలు (జోవియన్లు) రాక్షస గ్రహాలు మరియు క్యూపర్ బెల్ట్. ఇవన్నీ స్కేలు ప్రకరాం చూపబడలేదు.

సూర్యుని నుండి దూరాన్ని బట్టి ఈవలి గ్రహాలు:

ఆవలి వాయు రాక్షసులు (జోవియన్లు) :

మూడు మరుగుజ్జు గ్రహాలు :

ఆరు గ్రహాలకునూ రెండు మరుగుజ్జు గ్రహాలకునూ వీటి చుట్టూ పరిభ్రమించే సహజసిద్ధ ఉపగ్రహాలు సాధారణంగా వీటికి "చంద్రులు" అంటారు, మరియు ప్రతి ఆవలి గ్రహానికి కి ధూళితో కూడిన "రింగు" మరియు రేణువులు ఉన్నాయి.

ఇవీ చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. Scott S. Sheppard. "The Jupiter Satellite Page". University of Hawaii. Retrieved 2006-07-23. 

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=సౌరమండలము&oldid=1955706" నుండి వెలికితీశారు