వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 26
- 1820: బెంగాలీ కవి, విద్యావేత్త, తత్త్వవేత్త, పారిశ్రామిక వేత్త, రచయిత, అనువాదకుడు, సమాజ సేవకుడు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ జననం (మ1891).
- 1867: తెలుగు రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం జననం (మ.1946).
- 1886: భారతదేశంలో బ్రిటిషు ఐ.సి.ఎస్. అధికారి, స్వాతంత్ర్యానికి పూర్వపు బీహారు రాష్ట్ర గవర్నరు థామస్ జార్జ్ రూథర్ఫర్డు జననం (మ.1957).
- 1895: భారత యోగీశ్వరుడు, మహావతార్ బాబాజీ కి శిష్యుడు లాహిరి మహాశయులు మరణం (జ.1828).
- 1907: స్వాతంత్ర్య సమరయోధుడు, చరిత్రకారుడు, చలనచిత్ర దర్శకుడు ఆమంచర్ల గోపాలరావు జననం (మ.1969).
- 1943: దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తరఫున ఆడిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఇయాన్ చాపెల్ జననం.
- 1960: వెస్ట్ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు, క్రికెట్ శిక్షకుడు గస్ లోగీ జననం.
- 1999: అనేక ప్రపంచ ఆర్థిక సంక్షోభాలకు ప్రతిస్పందనగా జీ20 స్థాపించబడింది.
- 2024: తెలుగు వికీపీడియా లక్ష వ్యాసాల మైలురాయిని దాటింది. (లక్షవ వ్యాసం: రతీంద్రనాథ్ ఠాగూర్)