వికీపీడియా:తెలుగు వికీపీడియా కరదీపిక/మొత్తం పుస్తకం
చిన్నప్పుడు మీరు వామన గుంటలు, కోతి కొమ్మచ్చి, ఏడుపెంకులాట ఆడుకున్నారా? అయితే అదృష్టవంతులే! మరి మీ పిల్లలు? వాళ్ళకసలు వాటి పేర్లు కూడా తెలీదేమో! మరి మనం ఆడుకున్న ఆ ఆటలు మనతో అంతరించిపోవాల్సిందేనా? మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వాటి గురించి చెప్పాలంటే ఎలా? ఎక్కడో ఒకచోట వాటి గురించి రాసి పెడితే, ముందు తరాల వాళ్ళు వాటి గురించి తెలిసికోగలుగుతారు. ఇలా లోకంలోని ప్రతీ విషయం గురించీ ఒక పుస్తకంగా రాస్తే.. అదే విజ్ఞాన సర్వస్వం!
తెలుగులో విజ్ఞాన సర్వస్వాలు చాలా అరుదు. అందునా ఎన్సైక్లోపీడియా బ్రిటానికా లాంటి బృహత్తర విజ్ఞాన సర్వస్వం అసలు లేనేలేదు. సాహిత్య అకాడమీ ప్రచురించిన విజ్ఞాన సర్వస్వం ఉన్నా, అది సాహిత్య విషయాలకే పరిమితమైంది. ఆవకాయ నుండి అంతరిక్షం దాకా, అటుకుల దగ్గర నుండి అణుబాంబు దాకా ప్రతీ విషయాన్ని వివరిస్తూ సాగే విశాల, విశిష్ట విజ్ఞాన సర్వస్వాన్ని తయారుచెయ్యడమంటే మామూలు విషయం కాదు. అపార ధనవ్యయం, అశేషమైన పనిగంటలు, అనంతమైన పరిశోధన కావాలి. సకల వనరులూ ఉన్న ప్రభుత్వమో, డబ్బును గుమ్మరించగల పోషకులో పూనుకుంటే తప్ప, ఇలాంటి మహత్కార్యాలు సాధ్యం కావు. అటువంటి బృహత్కార్యాన్ని సాధించేందుకు నడుం కట్టారు, తెలుగువారు. ఐతే ఈ పనికి పూనుకున్నది ప్రభుత్వము, లక్ష్మీ పుత్రులూ కాదు.., కేవలం మనలాంటి సామాన్యులే భుజం భుజం కలిపి ఈ పని చేస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. వందల మంది ఇందులో భాగస్తులు. పదిహేను వందల పైచిలుకు ఉత్సాహవంతులు నిరంతరం శ్రమిస్తూ కోట్ల మందికి ఉపయోగపడగల ఒక విజ్ఞాన కోశాన్ని తయారు చేస్తున్నారు. ఇంతకీ ఏమిటీ విజ్ఞాన కోశం? ఎక్కడ రాస్తున్నారు, ఎవరు రాస్తున్నారు?
అసలు వికీపీడియా అంటే ఏమిటంటే..
మార్చుఅప్పుడెప్పుడో 2001 లో మొదలైంది ఈ కథ. లోకం లోని విజ్ఞానాన్నంతటినీ ఒకచోట చేర్చి ప్రజలంతా స్వేచ్ఛగా వాడుకునే వీలు కల్పించాలనే సంకల్పంతో మొదలైంది. ఎక్కడుంది ఈ విజ్ఞానం.. భాండాగారాల్లో ఉంది, సైన్సు పేపర్లలో ఉంది, పుస్తకాల్లో ఉంది, వార్తా పత్రికల్లో ఉంది, పెద్దపెద్ద సర్వర్లలో ఉంది, పర్సనల్ కంప్యూటర్లలో ఉంది, మెమరీ చిప్‌లలో ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ కొందరో అందుకోగలిగే తావుల్లో ఉంది. దీన్నంతటినీ ఎలా తెస్తారు? ఎవరు తెస్తారు? ఎక్కడ పెడతారు?
- ఎలా తెస్తారు: ఈ సమాచారాన్నంతటినీ చదివి, తేనెటీగలు మకరందాన్ని సేకరించినట్లు వాటిలోని సారాన్ని సేకరించి తెస్తారు.
- ఎవరు తెస్తారు: స్వచ్ఛందంగా పనిచేసే చదువరులు, లేఖకులు.
- ఎక్కడ చేరుస్తారు: ఇదిగో ఈ వికీపీడియాలో.
- వికీపీడియానా.. అంటే?
వికీపీడియా అనే పేరు ఎలా వచ్చిందనే కథాక్రమం బెట్టిదనిన..
చకచక, పకపక, గబగబ, సలసల, టపటప, తపతప అంటూ జమిలి పదాలున్నాయి కదా మనకు. విడిగా వాటికి అర్థం లేదు, కానీ జంటగా చక్కటి అర్థాన్నిస్తాయి. అలాంటి జమిలిపదాలే హవాయీ భాషలో కూడా ఉన్నాయి. వాటిలో వికివికి అనే మాట ఒకటి. దాని అర్థం చకచక/గబగబ అని. ఆశ్చర్యంగా ఉందా? ఔను, నిజమే!
హవాయి విమానాశ్రయంలో ఈ మాట విన్న వార్డ్ కన్నింగ్‌హామ్ అనే పెద్దాయనకు అది నచ్చి, 1995 లో తన వెబ్‌సైటుకు ఆ పేరు పెట్టాడు. ఎవరైనా మార్పుచేర్పులు చేసేలా, ఆ మార్పులు కూడా చకచకా చెయ్యగలిగేలా ఆ వెబ్‌సైటును తయారుచేస్తూ దానికి వికివికివెబ్ అని పేరు పెట్టాడు. ఆ వికీ అనే పేరునే తరువాత వికీపీడియాకు కూడా వాడారు. వికివికి+ఎన్‌సైక్లోపీడియా = వికీపీడియా అన్నమాట! వికీపీడియా ప్రస్తుతం 353 భాషల్లో ఉంది. తెలుగులో వికీపీడియా 2003 డిసెంబరులో మొదలైంది. మనం దీన్ని గబగబపీడియా అనో చకచకవిజ్ఞానం అనో కూడా అనుకోవచ్చు. తెలుగు వికీపీడియాకు అది ప్రత్యేకం!
వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
మార్చువికీపీడియా - ఎన్సైక్లోపీడియా పేరును అనుసరిస్తూ పెట్టిన పేరిది. 2001 లో జిమ్మీ వేల్స్ అనే అమెరికనుకు వచ్చిందీ స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం ఆలోచన. ఎవరైనా రాయగలిగేదీ, దిద్దుబాట్లు చెయ్యగలిగేదీ, చదువుకునేందుకు ఇంటర్నెట్లో అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండేదే స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. కార్య సాధకుడవడం చేత ఆలోచన వచ్చాక ఇక ఊరుకోలేదు, జిమ్మీ. తన ఆలోచనకు ఆకారమిస్తూ వికీపీడియాకు శ్రీకారం చుట్టాడు. అప్పటికే తాను రూపొందిస్తూ ఉన్న నుపీడియా అనే విజ్ఞాన సర్వస్వాన్ని పేరు మార్చి వికీపీడియాగా మొదటగా ఇంగ్లీషు భాషలో మొదలుపెట్టాడు. వికీపీడియా చాలా త్వరగా ప్రజల మన్నలను పొందింది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరిగి విశ్వవ్యాప్తమైంది. జర్మను, జపనీసు, స్పానిషు, ఫ్రెంచి, ఇటాలియను, రష్యను, చైనీసు ఇలా ప్రపంచ వ్యాప్తంగా అనేక ఇతర భాషల్లోనూ వికీపీడియాలు మొదలయ్యాయి. గొప్ప గొప్ప వ్యాసాలెన్నో తయారయ్యాయి, అవుతూ ఉన్నాయి. ఇంటర్నెట్లో వివిధ భాషలకు ప్రత్యేకించిన వెబ్ సైట్లలో ఈ విజ్ఞాన సర్వస్వాన్ని రాస్తున్నారు.
ఏమిటి వికీపీడియా విశిష్టత?
మార్చువికీ అంటే ఎవరైనా దిద్దుబాటు చెయ్యగల వెబ్సైటు అని అర్థం. వికీపీడియా అంటే ఎవరైనా దిద్దుబాటు చెయ్యగల ఎన్సైక్లోపీడియా. వికీపీడియా విజయ రహస్యమంతా ఈ వికీ అనే మాటలోనే ఉంది. వికీపీడియాలో రాసేది ఎవరో ప్రముఖ విద్యావంతులో, ప్రత్యేకంగా అందుకోసం నియమితులైన రచయితలో కాదు. మనలాంటి వారంతా అక్కడ రాస్తున్నారు. వికీపీడియాలో ఎవరైనా రాయవచ్చు, ఏ విషయం గురించైనా రాయవచ్చు. కొన్ని నిబంధనలకు, కట్టుబాట్లకు లోబడితే చాలు. అలాగే వికీపీడియాలోని వ్యాసాలను ఎవరైనా ఉచితంగా చదువుకోవచ్చు, డబ్బు కట్టక్కరలేదు. అంతేనా, ఆ వ్యాసాలను మీరు ప్రింటు తీసుకోవచ్చు. అసలు వికీపీడియా మొత్తాన్ని మీ కంప్యూటరు లోకి డౌనులోడు చేసుకోవచ్చు - పైసా డబ్బు చెల్లించకుండా!! ఇంకా అయిపోలేదు, ఈ మొత్తం వికీపీడియాను ప్రింటు తీసేసి, పుస్తకాలుగా కుట్టేసుకోవచ్చు. ఆగండి, ఇంకా ఉంది.. ఈ పుస్తకాలను పెద్దసంఖ్యలో ప్రింటేసి, వెల కట్టి అమ్ముకోనూ వచ్చు!!!! వికీపీడియా మిమ్మల్ని పన్నెత్తి మాటనదు, పైసా డబ్బడగదు. ఒకే ఒక్కమాట - దీన్ని నేను వికీపీడియా నుండి సేకరించాను అని రాస్తే చాలు.
భారతీయ భాషల్లో వికీపీడియా:
మార్చు2001 లో ఇంగ్లీషుతో మొదలైన వికీపీడియా, నిదానంగా ఇతర భాషలకూ విస్తరించి, ఇప్పుడు 350 కు పైగా భాషల్లో తయారవుతోంది. అందులో తెలుగూ ఒకటి. దాంతోపాటు హిందీ, సంస్కృతం, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, ఒరియా, అస్సామీ, ఉర్దూ, ఇలా దాదాపుగా అన్ని ప్రముఖ భారతీయ భాషల్లోనూ వికీపీడియా తయారవుతోంది. వ్యాసాల సంఖ్య పరంగా ఉర్దూ, తమిళం, హిందీ, బెంగాలీ మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఒకప్పుడు 7 వ స్థానంలో ఉన్న తెలుగు వికీపీడియా 2024 లో పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ముందుకు సాగి ఐదవ స్థానానికి చేరింది. ఈ క్రమంలో లక్ష వ్యాసాల మెట్టును కూడా అధిరోహించింది. చకచకా రెండవ లక్ష చేరుకోడానికి, మరో రెండు స్థానాలు ముందుకు వెళ్ళడానికీ ఒకటే మార్గం - మీరు కూడా వికీపీడియాలో రాయడమే.
తెలుగు వికీపీడియాలో ఏమేం రాస్తున్నారు:
మార్చుతెలుగు వికీపీడియా (తెవికీ) వెబ్ అడ్రసు: http://te.wikipedia.org. చరిత్ర, సంస్కృతి, ప్రముఖ వ్యక్తులు, సినిమా, భాష, నగరాలు, పట్టణాలు, గ్రామాలు, రచయితలు, కంప్యూటర్లు, సైన్సు, రాజ్యాంగ వ్యవస్థ, నదులు.. ఇలా ఎన్నో విషయాలపై రాస్తున్నారు. లక్షా ముప్పై వేలకు పైగా వాడుకరులు (అంటే యూజర్లు) లక్షకు పైగా వ్యాసాల మీద ప్రస్తుతం పని చేస్తున్నారు. ప్రఖ్యాత రచయితలు, సంఘసేవకులూ కూడా వికీపీడియాలో రాస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ల్లోని ప్రతీ ఒక్క గ్రామానికీ సంబంధించిన విలువైన సమాచారం తెవికీలో లభిస్తుంది. మరే ఇతర వెబ్‌సైటులోనూ ఒకేచోట ఇంత సమాచారం లభించదు.
అది సరే...
మార్చు- అంతా ఉచితమే అంటున్నారు, ఇంత శ్రమపడి, అష్టకష్టాలు పడి తయారుచేసేది, ఊరికినే ఎవరికిబడితే వాళ్ళకు ఇచ్చెయ్యడానికేనా?
- అవును, సరిగ్గా అందుకే!! లోకంలో లభించే విజ్ఞానాన్నంతా ప్రజలందరికీ ఉచితంగా అందించాలనే సదాశయంతోనే వికీపీడియా మొదలయింది. వికీపీడియా స్థాపనకు ప్రాతిపదికే అది. అన్నట్టు అష్టకష్టాలు ఏమేంటో మీకు తెలుసా? తెలియకపోతే తెలుగు వికీపీడియాలో చూడండి.
- ఎవరైనా రాయవచ్చంటున్నారు, మరి, నేనూ రాయవచ్చా?
- నిక్షేపంగా రాయవచ్చు, ఇతరులు రాసిన వ్యాసాలను సరిదిద్దనూ వచ్చు.
- దేని గురించి రాయవచ్చు?
- మీకు తెలిసిన ఏ విషయం గురించైనా రాయవచ్చు. మీ ఊరి గురించి రాయండి. మీ ఊరి ఫోటోను పేజీలో పెట్టండి. ఈ మధ్య మీరు చదివిన పుస్తకం గురించో, మీరు చూసిన సినిమా గురించో రాయండి. అన్నట్టు మాయాబజారు సినిమా గురించి, చందమామ పుస్తకం గురించి వికీపీడియాలో వ్యాసాలు చూడండి. ఈ వ్యాసాల్లోని సమాచారాన్ని తీసుకుని కొన్ని పత్రికల్లో వాడుకున్నారు కూడాను.
- మరి, నాకు కంప్యూటర్లో తెలుగు టైపు చెయ్యడం ఎలాగో రాదే, ఎలాగా?
- ఏం పర్లేదు, తెవికీలో వివిధ రకాల తెలుగు టైపింగు ఉపకరణాలు ఉన్నాయి. మీకు తెలుగు చదవడం రాయడం వస్తే చాలు, టైపింగు మీచేత అదే చేయిస్తుంది.
- కానీ నా ఆఫీసు పనులు, ఇంటి పనులతో బిజీగా ఉంటాను కదా, వికీపీడియాలో రాస్తూ ఉంటే ఆ పనులేం గాను?
- మీ పనులన్నీ వదిలేసి, అక్కడ రాయనవసరం లేదు. మీ తీరిక సమయంలోనే రాయండి. హాయిగా రాయండి. అక్కడ రాసే సభ్యులంతా అలా రాసేవాళ్ళే! రోజూ రాయండి. వారాంబిఉకి ఒక్కసారే రాయండి, నెలకోసారి రాయండి.. మీ ఇష్టం, మీ వెసులుబాటు, మీ తీరిక, మీ ఓపిక.
- కానీ రాయడం నాకు కొత్త, తప్పులు దొర్లుతాయేమో!?
- నిజమే, మొదట్లో తప్పులు దొర్లవచ్చు. కానీ రాసుకుంటూ పోతుంటే ఆ తప్పులన్నీ సద్దుమణిగి, మీ భాష వికసిస్తుంది. వికీపీడియా సభ్యులకిది అనుభవమే. అంతేగాక, మీ రచనలోని భాషా దోషాలను సరిదిద్దడానికి ఇతర సభ్యులు సదా సిద్ధంగా ఉంటారు. కాబట్టి దోషాల గురించి మీకు చింత అక్కరలేదు. “వెనకాడవద్దు, చొరవ చెయ్యండి” అనేది వికీపీడియా విధానాల్లో ఒకటి. చొరవ చేసి రచనలు చెయ్యండి. అనుభవజ్ఞులైన సభ్యులు మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీకు అవసరమైన సాయం చేస్తారు.
- పది కోట్ల మంది మాట్లాడే భాష మనది, మరీ ఐదో స్థానంలో ఉండడమేంటీ..
- ప్రచారం లేక. తెలుగులో వికీపీడియా అనే బృహత్తర విజ్ఞాన సర్వస్వం తయారౌతోంది అనే సంగతి చాలామందికి తెలియదు. 2006 నవంబరు 5 నాడు ఈనాడు దినపత్రిక ఆదివారం సంచికలో తెలుగు వికీపీడియా గురించి వ్యాసం వచ్చింది. దాంతో తెలుగు వికీపీడియాకు ఎంతో ప్రచారం లభించింది. ఆ వ్యాసం కారణంగా సభ్యుల సంఖ్య 12 రోజుల్లోనే రెట్టింపైంది. ఆ తరువాతి కాలంలో మరిన్ని వ్యాసాలు వివిధ పత్రికల్లో వచ్చాయి. అలా తెవికీని మరింత మందికి చేర్చే ఉద్దేశమే ఈ పుస్తకం కూడా.
మీరూ వికీపీడియాలో చేరండి. మీ స్నేహితులనూ చేర్పించండి. భావి తరాల వారికి ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వాన్ని అందించడంలో చేయి కలపండి.
- ఇంతటి గొప్ప పనికి ఖర్చు కూడా గొప్ప గానే అవుతుంది కదా, మరి ఆ ఖర్చుకు డబ్బులెలా సమకూరుస్తున్నారు?
- సాఫ్టువేరు అభివృద్ధికీ, సర్వర్లు, ఇతర మిషన్లు కొనడానికి, హోస్టింగుకూ అవసరమైన ఖర్చుల కోసం విరాళాలు సేకరిస్తారు. ఈ విరాళాల సేకరణకు, తెలుగు వికీపీడియా లాంటి వెయ్యి పైచిలుకు ప్రాజెక్టుల నిర్మాణ నిర్వహణ, పోషణకూ వెన్నుదన్నుగా నిలబడిన సంస్థ ఒకటి ఉంది. అదే..
వికీమీడియా ఫౌండేషన్
మార్చువికీమీడియా ఫౌండేషన్ 2003 జూన్‌లో అమెరికాలో స్థాపించబడిన లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ. ప్రపంచం నలుమూలల నుండి సేకరించే విరాళాల ద్వారా ఈ సంస్థ పనిచేస్తుంది. విశ్వం లోని విజ్ఞానాన్ని ప్రపంచం లోని ప్రజలందరికీ స్వేచ్ఛగా, ఉచితంగా అందుబాటులోకి తేవడం దాని ప్రధాన లక్ష్యం. ఇందుకోసం పలు విజ్ఞాన సర్వస్వ ప్రాజెక్టులను నెలకొల్పింది. ఈ ప్రాజెక్టులను నడీపేందుకు మీడియావికీ అనే నాలెడ్జి మేనేజిమెంటు సాఫ్టువేరును అభివృద్ధి చేసి, దాన్ని ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. ఫౌండేషను, ఈ సాఫ్టువేరును నిరంతరం మెరుగుపరుస్తూ, కొత్త కొత్త అంశాలను ప్రవేశపెడుతూ ఉంటుంది. ఈ సాఫ్టువేరును ఉచితంగా డౌన్‌లోడు చేసుకుని ఎవరైనా తమ స్వంత వికీ వెబ్‌సైటును నెలకొల్పుకోవచ్చు. వికీమీడియా ఫౌండేషను ఈ సాఫ్టువేరును అభివృద్ధి చెయ్యడమే కాకుండా, దాని ఆధారంగా పలు విజ్ఞాన సర్వస్వ ప్రాజెక్టులను నిర్మించింది. వికీపీడియా, వికీసోర్సు, విక్షనరీ, వికీకామన్స్, వికీడేటా వంటి పలు ప్రాజెక్టులను వందలాది భాషలలో స్థాపించి, నిర్వహిస్తూ వాటి పురోగతికి కృషిచేస్తోంది.
మీడియావికీ సాఫ్టువేరు
మార్చుఫౌండేషను కార్యకలాపాల్లో మీడీయావికీ సాఫ్టువేరు అభివృద్ధి ఒక ప్రధానమైన అంగం. ఈ సాఫ్టువేరును ఎవరైనా ఉచితంగా డౌన్‌లోడు చేసుకుని వాడుకోవచ్చు. పాఠకులే రచయితలై కలిసిమెలిసి (కొలాబొరేషను పద్ధతిలో) కంటెంట్ మేనేజిమెంట్ వెబ్‌సైట్లను అభివృద్ధి చేసుకోవడం ఈ సాఫ్టువేరు ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ఈ సాఫ్టువేరు ద్వారా తమ ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఈ సాఫ్టువేరు ద్వారా అందిస్తున్నారు. తెలుగుతో సహా 400 కు పైగా భాషల్లో ఈ సాఫ్టువేరు అందుబాటులో ఉంది. నేరుగా అనేక లక్షల వెబ్‌సైట్లు ఈ సాఫ్టువేరుపై ఆధారపడి ఉండగా, వెబ్‌సైట్లను హోస్టు చేసే వివిధ హోస్టింగు సైట్లు కూడా ఈ సాఫ్టువేరును స్థాపించుకుని వాటిపై 75 వేల వెబ్‌సైట్లను హోస్టు చేస్తున్నాయి. వీటిలో ఫౌండేషను స్వయంగా నిర్వహిస్తున్న 900 సైట్లు కూడా భాగం.
ఈ సైట్లలో 125 కోట్ల పేజీలు పాఠకులకు అందుబాటులో ఉన్నాయి. 120 కోట్ల వాడుకరులు నమోదై ఉన్నారు. 43 లక్షల మందికి పైగా రోజూ ఈ సైట్లలో సమాచారం చేరుస్తూంటారు. 20 కోట్లకు పైగా ఫొటోలు, చిత్రాలు, ఇతర ఫైళ్ళూ ఉన్నాయి.
ఫౌండేషను స్థాపించిన వికీ ప్రాజెక్టులు
మార్చుమీడియావికీ సాఫ్టువేరును అభివృద్ధి చెయ్యడంతో పాటు, ఆ సాఫ్టువేరు పునాదులపై అనేక విజ్ఞానసర్వస్వ వెబ్‌సైట్లను కూడా ఫౌండేషను నిర్వహిస్తోంది. వీటిలో వికీపీడియా మొదటిది, అత్యంత ప్రసిద్ధి పొందినదీ, అత్యంత ప్రజాదరణ పొందినదీను. ఇది 352 భాషలలో 6 కోట్ల పైచిలుకు వ్యాసాలతో ప్రపంచంలో కెల్లా అత్యంత ప్రజాదరణ పొందిన అన్ని రకాల వెబ్‌సైట్లలో 7 వ స్థానంలో ఉంది. ఈ వికీపీడియాల్లో తెలుగు వికీపీడియా లక్షకు పైగా వ్యాసాలతో 72 వ స్థానంలో, భారతీయ భాషా వికీపీడియాల్లో 5 వ స్థానంలో ఉంది. వికీపీడియాతో పాటు, వికీసోర్సు, వికీకోట్, విక్షనరీ, వికీవాయేజ్, వికీవార్సిటీ, వికీబుక్స్, వికీడేటా, వికీకామన్స్ వంటి అనేక ఇతర వెబ్‌సైట్లను కూడా నిర్వహిస్తోంది.
ఫౌండేషను నిర్వహించే వెబ్‌సైట్లలో నెలకు 2300 కోట్ల పేజీవ్యూలు ఉంటాయి. ఒక్క భారతదేశం లోనే నెలకు అన్ని రకాల వికీలకూ కలిపి 70 కోట్ల పేజీవ్యూలు ఉంటాయి. ఒక్క తెలుగు వికీపీడియాలో నెలకు కోటీ 30 లక్షల పేజీవ్యూలుంటాయి.
ఈ వెబ్‌సైట్లను హోస్టింగు చెయ్యడం, సాంకేతిక నిర్వహణ చెయ్యడం, సాఫ్టువేరును మెరుగుపరచడం వంటివి మాత్రమే ఫౌండేషను బాధ్యత. ఈ ఖర్చుల కోసం విరాళాలు సేకరిస్తుంది. ఫౌండేషను నిర్వహించే ఏ వెబ్‌సైట్లలోనూ వ్యాపార ప్రకటనలుండవు. మీడియావికీ సాఫ్టువేరుతో సహా ఫౌండేషను అభివృద్ధి చేసి నిర్వహించే ఉత్పత్తులు సేవలూ అన్నీ ఉచితమే, సార్వజనీనమే, ఎవరైనా స్వేచ్ఛగా వాడుకోవచ్చు. ఎంత స్వేచ్ఛ అంటే, వికీపీడియా లోని సమాచారాన్ని ఉచితంగా డౌన్‌లోడు చేసుకుని వాటిని పుస్తకాలుగా ముద్రించి అమ్ముకోవచ్చు. ఈ సమాచారాన్ని వికీపీడియా నుండి సేకరించామని వెల్లడిస్తే చాలు. విరాళాల ద్వారా అందే సొమ్ము నుండి కొంత భాగాన్ని వివిధ ప్రాజెక్టుల్లో వాడుకరులు చేపట్టదలచిన ప్రత్యేక ప్రాజెక్టులు, సమావేశాలు, గోష్ఠులు, వగైరాల కోసం గ్రాంటులుగా అందిస్తుంది.
వీటిలో చేర్చే సమాచారంపై ఫౌండేషనుకు ఎలాంటి నియంత్రణా లేదు. సమాచారాన్నంతా స్వచ్ఛందంగా పనిచేసే వాడుకరులే పరస్పరం సహకరించుకుంటూ, సంప్రదించుకుంటూ సమాచారం చేరుస్తారు. ఈ వాడుకరులందరినీ కలిపి సముదాయం అంటారు. సమాచారపు ఎంపిక, విశ్వసనీయత, కాపీహక్కుల పాలన, వాడుకరుల పరస్పర వ్యవహార సరళి వంటి పలు అంశాలకు సంబంధించి ఈ సముదాయాలే నియమ నిబంధనలను ఏర్పరచుకుని పనిచేస్తాయి. ఈ వెబ్‌సైట్లలో సమాచారాన్ని చేర్చే వాడుకరులకు కూడా ఈ సమాచారంపై ఏ హక్కూ ఉండదు. ప్రచురితమైన సమాచారమంతా సర్వ మానవాళికీ చెందుతుంది.
2022 లో ఫౌండేషను వికీమీడియా ఎంటర్‌ప్రైస్ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. దీనిద్వారా వికీ ప్రాజెక్టుల్లో ఉచితంగా లభించే సమాచారాన్నే సంస్థలు నేరుగా పెద్దయెత్తున API ల ద్వారా అందుకునే సౌలభ్యాన్ని కల్పించింది. ఫౌండేషను ఈ సేవను ఉచితంగా ఇవ్వదు, విక్రయిస్తుంది. గూగుల్ వంటి సంస్థలు దీన్ని వాడుకుంటున్నాయి.
ఫౌండేషన్ చరిత్ర
మార్చువికీమీడియా ఫౌండేషన్ [1] జూన్ 2003లో ప్రారంభించబడింది. వికీపీడియా వ్యవస్థాపకులలో ఒకరైన జిమ్మీ వేల్స్, తన సంస్థ ద్వారా ప్రారంభించిన వికీపీడియా, ఇతర సోదర ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను దీనికి అప్పగించాడు. బహుభాషలలో విజ్ఞాన సర్వస్వాలు, సోదర ప్రణాళికల పెంపు, అభివృద్ధి, వీటిలో సమాచారాన్ని ఉచిత పంపిణీ చేయటం దీని ముఖ్యోద్దేశం. దీని నిర్వహణకు ధర్మకర్తల (ట్రస్టీల) మండలి ఉంది. ఇది మూడు చోట్ల కొన్ని వందల కంప్యూటర్ సర్వర్లు నడుపుతూ, ఈ ప్రాజెక్టులను వీక్షించే దాదాపు నెలసరిగా అరకోటి ప్రజలకు సేవలందిస్తున్నది. దాదాపు 38 స్వతంత్ర స్థానిక వికీమీడియా సంఘాలతో, ఔత్సాహిక స్వచ్ఛంద కార్యకర్తలతో సమన్వయం చేస్తూ ప్రజల నుండి, సంస్థలనుండి ధన, వనరుల సేకరణ, ప్రాజెక్టులలో వాడబడే మీడియావికీ సాఫ్ట్వేర్ నిర్వహణ, అభివృద్ధి చేస్తుంది. అవగాహన పెంచే కార్యక్రమాలు, కొత్త వాడుకరుల సంఖ్యను అభివృద్ధి చేయటం, మొబైల్, జాలసంపర్కంలేని పద్ధతులలో వికీ ప్రాజెక్టుల సమాచారాన్ని అందచేయటం, శిక్షణా వీడియోలు తయారి, ప్రాజెక్టుల గణాంకాలలో మార్పులను విశ్లేషించి కొత్త తరహా ప్రాజెక్టులను చేపట్టటం, దీని ఇతర కార్యక్రమాలు.
వికీమీడియా సంఘాలు
మార్చువికీమీడియా సంఘాలు (చాప్టర్లు) ఒక దేశం ప్రాతిపదికగా వికీమీడియా ప్రాజెక్టుల పురోగతికి స్థాపించబడిన లాభాపేక్షరహిత స్వతంత్ర సంస్థలు. ఇవి వికీమీడియా ఫౌండేషన్ తో ఒప్పందం ప్రకారం సహకరించుకుని పనిచేస్తాయి.
వికీమీడియా భారతదేశం
మార్చుభారతదేశంలో ఈ వికీమీడియా చాప్టర్ [2] సంఘం 2011 జనవరి 3 న బెంగుళూరులో నమోదైంది. డిసెంబరు 2011 నాటికి దాదాపు 170 పైగా సభ్యులు నమోదైయ్యారు. సెప్టెంబరు 24 న సర్వసభ్య సమావేశం జరుపుకొని, కార్యవర్గంలో కొత్త సభ్యులను ఎన్నుకుంది. జూలై 30 న నకలుహక్కులు, స్వేచ్ఛా పంపకషరతులు అనబడేదానిపై సదస్సు ఆ తరువాత సెప్టెంబరు 12 న కర్ణాటక రాష్ట్ర ప్రజా గ్రంథాలయాల శాఖ వారికి వికీ అవగాహన కార్యక్రమము నిర్వహించింది. ఇటువంటి కార్యక్రమాలు [3] ఇంకా దేశంలో పలుచోట్ల స్థానిక సభ్యులు లేకఅనుభవజ్ఞులైన వికీపీడియన్ల సహకారంతో నిర్వహించే పనిలో ఉంది.
ముంబయి సముదాయంతో కలసి వికీ కాన్ఫరెన్స్ ఇండియా [4] అనబడే జాతీయ స్థాయి సమావేశాన్ని నవంబరు 18-20, 2011 లలో నిర్వహించింది.
కార్యక్రమాలను మరింత చురుకుగా చేయటానికి, విస్తరించటానికి, కార్యనిర్వహక జట్టులోని సభ్యుల నేతృత్వంలో నగర, భాషా ప్రత్యేక ఆసక్తి జట్టులు, బహుళ వికీ ప్రాజెక్టులన సమన్వయంచేపట్టటం అలాగే రోజు వారి కార్యకలాపాలను సమర్థవంతంగా చేయటానికి నిర్వహణ, ధనసేకరణ, సమాచార, ప్రజాసంబంధాల జట్టులను ఏర్పాటుచేసింది.
అయితే విదేశీ ద్రవ్యం పొందేందుకు అవసరమైన చట్టపరమైన ఇబ్బందుల వలన, నేరుగా, సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ ద్వారా వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలు మరి ఇతరచర్యల వలన వికీమీడియా భారతదేశం బలోపేతం కాలేకపోయింది, ఇతర కారణాలవలన సోదర సంస్థగా కొనసాగుటకు కావలసిన నిబంధనలను పాటించలేకపోయింది. 2019 సెప్టెంబరు 14 నుండి అమలు అయ్యేటట్లు వికీమీడియా భారతదేశం గుర్తింపు వికీమీడియా ఫౌండేషన్ రద్దుచేసింది.[5]
వికీమీడియా ఫౌండేషన్ భారతీయ ప్రణాళికల జట్టు
మార్చువికీమీడియా ఫౌండేషన్ తన దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా, భారతీయ వికీ ప్రాజెక్టుల [6] అభివృద్ధి వేగవంతం చేయడానికి, కొద్ది మంది ఉద్యోగస్తులను జనవరి 2011లో నియమించటం ప్రారంభించింది. సంవత్సరాంతానికి ఈ జట్టులో భారతీయ ప్రణాళికల సలహాదారు, ఆయనతో పాటు, భారతీయ భాషల సలహాదారు, విద్యావిషయక సలహాదారు, అవగాహన సదస్సుల సలహాదారు ఉన్నారు. ఇంకా ప్రజాసంబంధాల సలహదారుని నియమించవలసివుంది. పూనెలో భారతీయ విద్యా ప్రణాళికలో భాగంగా వివిధ కళాశాల విద్యార్థులతో వికీ వ్యాసాల ప్రణాళిక చేపట్టింది. కొంతకాలం తరువాత సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ అనే లాభనిరపేక్షసంస్థ ద్వారా కార్యకలాపాలు కొనసాగించింది.
వనరులు
మార్చు- ↑ వికీమీడియా ఫౌండేషన్
- ↑ "వికీమీడియా చాప్టర్". Archived from the original on 2014-10-06. Retrieved 2020-01-08.
- ↑ "వికీ అవగాహనా కార్యక్రమాలు". Archived from the original on 2012-01-11. Retrieved 2011-09-26.
- ↑ వికీ కాన్ఫరెన్స్ ఇండియా
- ↑ "Derecognition of Wikimedia India". Wikipedia Signpost. 2019-07-31. Retrieved 2019-10-22.
- ↑ వికీమీడియా ఫౌండేషన్ భారతీయ వికీ ప్రాజెక్టులు
వికీమీడియా సంఘాలు
మార్చువికీమీడియా సంఘాలు (చాప్టర్లు) ఒక దేశం ప్రాతిపదికగా వికీమీడియా ప్రాజెక్టుల పురోగతికి స్థాపించబడిన లాభాపేక్షరహిత స్వతంత్ర సంస్థలు. ఇవి వికీమీడియా ఫౌండేషన్ తో ఒప్పందం ప్రకారం సహకరించుకుని పనిచేస్తాయి.
వికీమీడియా భారతదేశం
మార్చుభారతదేశంలో ఈ వికీమీడియా చాప్టర్ [1] సంఘం 2011 జనవరి 3 న బెంగుళూరులో నమోదైంది. డిసెంబరు 2011 నాటికి దాదాపు 170 పైగా సభ్యులు నమోదైయ్యారు. సెప్టెంబరు 24 న సర్వసభ్య సమావేశం జరుపుకొని, కార్యవర్గంలో కొత్త సభ్యులను ఎన్నుకుంది. జూలై 30 న నకలుహక్కులు, స్వేచ్ఛా పంపకషరతులు అనబడేదానిపై సదస్సు ఆ తరువాత సెప్టెంబరు 12 న కర్ణాటక రాష్ట్ర ప్రజా గ్రంథాలయాల శాఖ వారికి వికీ అవగాహన కార్యక్రమము నిర్వహించింది. ఇటువంటి కార్యక్రమాలు [2] ఇంకా దేశంలో పలుచోట్ల స్థానిక సభ్యులు లేకఅనుభవజ్ఞులైన వికీపీడియన్ల సహకారంతో నిర్వహించే పనిలో ఉంది.
ముంబయి సముదాయంతో కలసి వికీ కాన్ఫరెన్స్ ఇండియా [3] అనబడే జాతీయ స్థాయి సమావేశాన్ని నవంబరు 18-20, 2011 లలో నిర్వహించింది.
కార్యక్రమాలను మరింత చురుకుగా చేయటానికి, విస్తరించటానికి, కార్యనిర్వహక జట్టులోని సభ్యుల నేతృత్వంలో నగర, భాషా ప్రత్యేక ఆసక్తి జట్టులు, బహుళ వికీ ప్రాజెక్టులన సమన్వయంచేపట్టటం అలాగే రోజు వారి కార్యకలాపాలను సమర్థవంతంగా చేయటానికి నిర్వహణ, ధనసేకరణ, సమాచార, ప్రజాసంబంధాల జట్టులను ఏర్పాటుచేసింది.
అయితే విదేశీ ద్రవ్యం పొందేందుకు అవసరమైన చట్టపరమైన ఇబ్బందుల వలన, నేరుగా, సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ ద్వారా వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలు మరి ఇతరచర్యల వలన వికీమీడియా భారతదేశం బలోపేతం కాలేకపోయింది, ఇతర కారణాలవలన సోదర సంస్థగా కొనసాగుటకు కావలసిన నిబంధనలను పాటించలేకపోయింది. 2019 సెప్టెంబరు 14 నుండి అమలు అయ్యేటట్లు వికీమీడియా భారతదేశం గుర్తింపు వికీమీడియా ఫౌండేషన్ రద్దుచేసింది.[4]
వనరులు
మార్చు- ↑ "వికీమీడియా చాప్టర్". Archived from the original on 2014-10-06. Retrieved 2020-01-08.
- ↑ "వికీ అవగాహనా కార్యక్రమాలు". Archived from the original on 2012-01-11. Retrieved 2011-09-26.
- ↑ వికీ కాన్ఫరెన్స్ ఇండియా
- ↑ "Derecognition of Wikimedia India". Wikipedia Signpost. 2019-07-31. Retrieved 2019-10-22.
2024 అక్టోబరు 17 నాటి స్థూల గణాంకాలు
మార్చుపేజీ గణాంకాలు | |
విషయపు పేజీలు | 1,00,593 |
పేజీలు | 3,64,387 |
(ఈ వికీలోని అన్ని పేజీలు (చర్చా పేజీలు, దారిమార్పులు, మొదలైనవన్నీ కలుపుకొని).) | |
ఎక్కించిన దస్త్రాలు | 13,877 |
మార్పుల గణాంకాలు | |
వికీపీడియా మొదలుపెట్టినప్పటినుండి జరిగిన మార్పులు | 42,94,261 |
పేజీకి సగటు మార్పులు | 11.78 |
వాడుకరులు | |
నమోదైన వాడుకరులు (సభ్యుల జాబితా) | 1,32,373 |
క్రియాశీల వాడుకరులు (సభ్యుల జాబితా) | 172 |
(గత 30 రోజులలో పని చేసిన వాడుకరులు) | |
బాట్లు (సభ్యుల జాబితా) | 52 |
నిర్వాహకులు (సభ్యుల జాబితా) | 11 |
ఇంటర్‌ఫేసు నిర్వాహకులు (సభ్యుల జాబితా) | 0 |
అధికారులు (సభ్యుల జాబితా) | 4 |
సప్రెసర్లు (సభ్యుల జాబితా) | 0 |
స్టీవార్డులు (సభ్యుల జాబితా) | 0 |
ఖాతా సృష్టికర్తలు (సభ్యుల జాబితా) | 1 |
దిగుమతిదార్లు (సభ్యుల జాబితా) | 0 |
ట్రాన్స్ వికీ దిగుమతిదారులు (సభ్యుల జాబితా) | 0 |
ఐపీ నిరోధపు మినహాయింపులు (సభ్యుల జాబితా) | 6 |
చెక్‌యూజర్లు (సభ్యుల జాబితా) | 0 |
Push subscription managers (సభ్యుల జాబితా) | 0 |
Structured Discussions bots (సభ్యుల జాబితా) | 2 |
Temporary account IP viewers (సభ్యుల జాబితా) | 0 |
Users blocked from the IP Information tool (సభ్యుల జాబితా) | 0 |
నిర్ధారిత వాడుకరులు (సభ్యుల జాబితా) | 2 |
ఇతర గణాంకాలు | |
కంటెంటు పేజీలన్నిటి లోనూ పదాలు | 4,67,12,470 |
మైలురాళ్ళు
మార్చువికీపీడియా:వికీపీడియా మైలురాళ్ళు వికీపీడియా ఎవరైన చేర్చగల, సవరించగల,వాడుకోగల మరియు పంచుకోగల ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు. నకలుహక్కుల చట్టాలను గౌరవించండి, మూలాలను దొంగిలించకండి. ఉచితం కాని సమాచారం సముచిత వినియోగ విధానాన్నుసరించి, చేర్చబడింది, కాని వాటికి బదులు ఉచితమైన వాటినే వికీపీడియాలో చేర్చడానికి ప్రయత్నించండి. మీ చేర్పులు,మార్పులు ఉచితంగా ప్రజలకు అందచేయబడుతున్నది. కావున ఏ వాడుకరి, ఏ వ్యాసానికి హక్కుదారులు కాదు; మీ మార్పులు చేర్పులు, నిర్దాక్షిణ్యంగా సవరించబడతాయి, పంపిణీ చేయబడతాయి.
[వికిపీడియా ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. ఇది అనేక మంది రచయితల సమష్టి కృషితో తయారవుతూంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే రచయితలు మరెవరో కాదు, పాఠకులే రచయితలు. మీరు కూడా రచయితలు కావచ్చు. ఈ సైటు ముఖ్య ఉద్దేశ్యం కూడా సభ్యులందరి కృషితో వ్యాసాలను అభివృద్ది చేయడమే! చాలామంది వ్యక్తులు ప్రతి రోజూ వందల కొద్దీ మార్పుచేర్పులు చేస్తూ, నిరంతరం మెరుగు పరుస్తున్నారు. ఈ దిద్దుబాట్లన్నీ పేజీ చరిత్ర, ఇటీవలి మార్పులు పేజీలలో నమోదు అవుతాయి. అప్రసంగాలు, దుశ్చర్యలు వెంటనే తొలగించబడతాయి, వాటిని సృష్టించిన వారు నిషేధించబడతారు.]
ఇదు మూలస్థంభాలు
మార్చువికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం. ఇది మౌలిక డాక్యుమెంట్లు దొరికే వనరు కాదు , వార్తాపత్రిక కాదు, ఉచితంగానో, వెలకో వెబ్‌లో స్థలం ఇచ్చే సంస్థ కాదు. ప్రజాస్వామ్యంపైనో, అరాచకత్వంపైనో చేసే ప్రయోగమేమీ కాదు. మీ స్వంత అభిప్రాయాలు, అనుభవాలు, వాదనలు ప్రచురించుకునే స్థలం అంతకంటే కాదు. | |
వికీపీడియా తటస్థ దృక్కోణాన్ని అనుసరిస్తుంది. అంటే వ్యాసాలు ఏ ఒక్క దృక్కోణాన్నీ ప్రతిబింబించవు. దీనికోసం ఒక్కోసారి వివిధ దృక్కోణాలను చూపవలసి రావచ్చు; విషయానికి సంబంధించిన అన్ని దృక్కోణాలను నిష్పాక్షికంగా, అది ఎవరి దృక్కోణమో వివరంగా తెలిసేలా సందర్భశుద్ధిగా ప్రతిబింబించాలి. దీనివలన చదువరులకు అది ఎవరి దృక్కోణమో తెలుస్తుంది. ఫలానా దృక్కోణం నిజమనీ, సరైనదనీ చూపించరాదు. అవసరమైనచోట మీ వ్యాస మూలాలను, వనరులను ఉటంకించాలి. మరీ ముఖ్యంగా, వివాదాస్పద విషయాల్లో ఇది చాలా అవసరం. | |
వికీపీడియా స్వేచ్ఛగా పంచుకోగల విజ్ఞానసర్వస్వం. ఎవరైనా మార్చవచ్చు. వాడటం, సవరించటం, పంపిణి చేయటం చెయ్యవచ్చు.: సంపాదకులందరూ సమాజానికి ఉచితంగా తమ కృతులను అందచేస్తారు కాబట్టి, ఇక్కడి వ్యాసాలు ఏ ఒక్క సంపాదకునికీ సొంతం కాదు. రచనలు నిర్దాక్షిణ్యంగా మార్పులకు లోనవుతాయి. పంపిణీ కూడా అవుతాయి. నకలు హక్కుల చట్టాలను గౌరవించండి. మూలాల నుండి దొంగతనం చేయవద్దు. ఉచితం కాని మాధ్యమాలను సముచిత వినియోగం నిబంధన క్రింద వాడుకోవచ్చు. కాని స్వేచ్ఛగా పంచుకోగల మూలాల కోసమే ముందు వెతకాలి. | |
వికీపీడియా తోటి సభ్యులను - వారితో మీరు ఏకీభవించకపోయినా - గౌరవించండి. వ్యక్తిగతమైన దాడికి దిగకండి. వ్యర్థ వివాదాలకు తావివ్వకండి. మీ వాదనను నిరూపించుకునేందుకు వికీపీడియాలో అడ్డంకులు సృష్టించక, నిబద్ధతతో ఉండండి. ఇతరులు కూడా అంతే నిబద్ధతతో ఉన్నారని భావించండి - అలా లేరనేందుకు మీదగ్గర తిరుగులేని సాక్ష్యం ఉంటే తప్ప. కొత్తవారిని ఆహ్వానించండి. వివాదాలేమైనా తలెత్తితే, సరైన చర్చాపేజీలో మృదువుగా చర్చించండి. మీరు కృషి చేసేందుకు వికీపీడియాలో ఇంక బోలెడు పేజీలున్నాయని గుర్తుంచుకోండి. మీ వాదనకు అనుకూలంగా బలం పెంచుకునేందుకు మిథ్యా సభ్యులను సృష్టించకండి. | |
వికీపీడియాలో విధానాలు, మార్గదర్శకాలూ ఉన్నాయి. అయితే ఏవీ కూడా శిలాశాసనాలు కాదు; నిరంతరం రూపుదిద్దుకుంటూ ఉంటాయి. అక్షరాలు, మాటల కంటే వాటి స్ఫూర్తి, ఆదర్శమూ ముఖ్యం. కొన్ని సందర్భాల్లో వికీపీడియాను మెరుగుపరచేందుకు, నియమాలను పక్కన పెట్టాల్సి ఉండొచ్చు. వ్యాసాలలో మార్పులు చేర్పులు చేసేందుకు చొరవగా ముందుకు రండి, అయితే నిర్లక్ష్యంగా ఉండకండి. వ్యాసాన్ని చెడగొడతామేమోనని వెనకాడవద్దు. పాత కూర్పులన్నీ జాగ్రత్తగానే ఉంటాయి కాబట్టి, తిరిగి సరిదిద్దలేనంతగా చెడగొట్టే అవకాశం లేదు. అయితే, ఒక్క విషయం..మీరు ఇక్కడ రాసేది శాశ్వతంగా ఉండే అవకాశం ఉందని గ్రహించండి. |
వికీపీడియాలో సమాచారమంతా వ్యాసాల రూపంలో ఉంటుంది. విజ్ఞాన సర్వస్వంలో ఉండదగిన అర్హతలు కలిగి, చదవడానికి వీలుగా సమాచారాన్ని కలిగివున్న దానిని వికీపీడియా వ్యాసం అంటారు. వ్యాస విషయానికే ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. మన అభిప్రాయాలను, సభ్యుల పేర్లను ఇక్కడ రాయకూడదు.
ఇక, వికీపీడియా వ్యాసానికి వస్తే... వ్యాసం పైన కొన్ని ట్యాబ్స్ ఉంటాయి. ఆయా ట్యాబ్స్ లో వ్యాసం, చర్చ, చదువు, సవరించు, చరిత్ర, తరలించు, వీక్షించు/వీక్షించవద్దు అనే భాగాలు ఉంటాయి. ఇప్పుడు ఆయా విభాగాల గురించి తెలుసుకుందాం...
- వ్యాస చర్చాపేజీ
- వ్యాసాలనికి సంబంధించిన మార్పులు, ఇతర అంశాల గురించి వికీపీడియా వాడుకరులు చర్చలు జరిపే పేజీని చర్చాపేజీ అంటారు. వ్యాసాన్ని మెరుగుపరచడానికి సంబంధించి ఏదైనా ప్రశ్న లేదా వ్యాఖ్య ఉంటే వ్యాసపు చర్చాపేజీలో రాయవచ్చు. ఈ వ్యాసానికి సంబంధించి, సభ్యుల అభిప్రాయాలు, వాదనను ఇక్కడ చూడవచ్చు
- సవరించు
- వికీపీడియా వ్యాసంలో సవరించు అనగా వ్యాసంలో సవరణలు చేయడం అని అర్థం. వికీపీడియా వ్యాసంలోని ఏదైనా సమాచారాన్ని మార్చడంగానీ, చేర్చడంగానీ చేయాలనుకుంటే సవరించు అనే ట్యాబ్ నొక్కడం ద్వారా ఎవరైనా వ్యాసంలో సవరణలు చేయవచ్చు.
- చరిత్ర
- వ్యాసం పేజీలోగానీ, చర్చా పేజీలోగానీ ఆది నుండి జరిగిన మార్పుచేర్పుల జాబితా చరిత్ర విభాగంలో ఉటుంది. ఎవరెవరు, ఏయే మార్పులు, ఎప్పుడెప్పుడు చేసారో తెలిపే జాబితా ఇది.
- వ్యాస శీర్షిక, ఉప శీర్షిక
- వికీపీడియా వ్యాస పేజీ పేరును వికీపీడియా వ్యాస శీర్షిక అని, వికీపీడియా వ్యాసంలో వివిధ విభాగాలు ఉన్నప్పుడు వాటికి పేర్లు పెట్టడాన్ని ఉప శీర్షిక అంటారు. ఈ శీర్షికల వల్ల వ్యాసం ఒకే విధమైన పాఠ్యంతో కాకుండా ఓ క్రమపద్ధతిలో అమర్చడానికి శీర్షికలు, ఉపశీర్షికలు ఉపయోగపడతాయి.
- సమాచారపెట్టె
- వికీపీడియా వ్యాసంలో కుడివైపు పైభాగంలో వ్యాసపు విషయానికి సంబంధించిన ముఖ్య విషయాలను కలిగివుండే దానిని సమాచారపెట్టె అంటారు. వ్యాసానికి సంబంధించి ముఖ్య విషయాలను తెలుసుకోవడానికి ఈ సమాచారపెట్టె ఉపయోగపడుతుంది.
- మూలాలు, వనరులు
- వికీపీడియాలో రాసిన సమాచారం ధృవీకరించడానికి చేర్చే వాటిని మూలాలు లేదా వనరులు అంటారు. చేర్చిన మూలాన్ని ఇతర సభ్యులు లేదా పాఠకులు నిర్ధారించగలిగేటట్లు ఉండాలి.
- ఇవికూడా చూడండి
- పాఠకుడు చదువుతున్న వికీపీడియా వ్యాస అంశానికి సంబంధించి ఉన్న ఇతర వ్యాసాల లింకులు ఈ విభాగంలో చేర్చబడుతాయి. దానివల్ల, పాఠకుడు మరింత సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది.
- బయటి లంకెలు/బాహ్య లింకులు
- కాపీహక్కుల కారణంగా వికీపీడియా వ్యాసం పేజీలో పెట్టలేని విషయాన్ని కలిగిఉండి, ఆ విషయంపై ఖచ్చితమైన సమాచారం అందించే వాటిని వ్యాసంలో మూలంగా చేర్చలేము. అలాంటి వాటికోసం వ్యాసం కింది భాగంలో బయటి లంకెలు/బాహ్య లింకులు అనే ఒక విభాగం పెట్టి అందులో ఆ లింకులను చేర్చవచ్చు.
- వర్గాలు
- ఒక అంశానికి సంబంధించిన లేదా ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యాసాలు అన్ని ఒకచోటే ఉంటూ పాఠకులకు సులభంగా లభించడానికి వ్యాసంలో అడుగున చేర్చే లింకును వర్గం అంటారు. పాఠకులు తమకు కావలసిన సమాచారం కొరకు వెదికేటపుడు ఈ వర్గాలు ఉపయోగపడతాయి.
- నేటి సమాజానికే కాకుండా భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడేలా ఏదైనా చేద్దామని అనుకుంటున్నారా?
- వివిధ రంగాలకు చెందిన విజ్ఞానాన్ని తెలుగు భాషలో అందించేందుకు మీవంతుగా తోడ్పడాలని భావిస్తున్నారా?
- రాబోయే తరాల తెలుగుబిడ్డల కోసం ఒక విష్ణుశర్మ అవ్వాలనుకుంటున్నారా?
- దశాబ్దాల పాటు పాఠాలు చెప్పి, వేలాది మంది పిల్లలను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులుగా మీ మేథను, మీ శక్తియుక్తులను లక్షల మంది కోసం వినియోగిస్తారా?
- తెలుగులో విజ్ఞాన భూమిలో ఒక మొక్క నాటడంతో సరిపెట్టకుండా, ఏకంగా ఒక విజ్ఞాన వనాన్నే పెంచాలని అనుకుంటున్నారా?
అయితే వికీపీడియా మీకోసమే ఉంది. మీవంటి స్వచ్ఛంద సేవకుల కోసం ఎదురుచూస్తోంది. తెలుగు వికీపీడియాలో రాయండి. విశాలమైన, విస్తారమైన విశ్వ విజ్ఞానాన్ని తెలుగులో చేర్చే కృషిలో మీరూ పాలు పంచుకోండి. వ్యాసాలను సరిదిద్దే విషయమై అందరినీ చొరవగా, జంకు లేకుండా ముందుకు రమ్మని వికీపీడియా సభ్యులను ప్రోత్సహిస్తోంది. నిర్లక్ష్యంగా ఉండకండి! సరైన పద్ధతిలో రాయని మంచి వ్యాసం గానీ, మరీ పసలేని వ్యాసం గాని, చిన్న చిన్న పొరపాట్లు గానీ, తప్పుల తడక గాని, హాస్యాస్పదమైనది గాని, ఏదైనా మీకు కనిపిస్తే తప్పులు సరిదిద్దండి. వికీపీడియాలో మీరు చేసే దిద్దుబాట్ల వల్ల నష్టము వాటిల్లుతుందని భయపడవద్దు. ఎప్పుడైనా వాటిని సరిదిద్దడము లేదా మెరుగుపరచడము చేయవచ్చు. వ్యాసాల్లోని తప్పులను సరిదిద్దుతూ, వ్యాకరణ దోషాలను సవరిస్తూ, కొత్త విషయాలను జోడిస్తూ, భాషను మెరుగుపరుస్తూ ఉంటేనే వికీ చురుగ్గా వృద్ధి చెందుతుంది. అందరూ ఆశించేది అదే!
ఇప్పటికే ఉన్న వ్యాసంలో మార్పు చేర్పులు చెయ్యాలంటే రెండు పద్ధతులున్నాయి. ఒకటి, పైనున్న టాబుల్లోని మార్చు లింకును నొక్కడం. ఈ పద్ధతిలో మొత్తం వ్యాసమంతా మార్పుకు సిద్ధమౌతుంది. రెండో పద్ధతి.. వ్యాసంలోని ఏదో ఒక విభాగాన్ని మాత్రమే సరిదిద్దడం. వ్యాసంలోని ప్రతి విభాగానికి పక్కన మార్చు అనే లింకు కనిపిస్తుంది. ఆ లింకును నొక్కినపుడు కేవలం సదరు విభాగం మాత్రమే మార్పుకు సిద్ధమౌతుంది. క్లుప్తంగా దిద్దుబాటు చేసే విధానం ఇలా ఉంటుంది.
- దిద్దుబాటు చెయ్యదలచిన పేజీ లేదా విభాగపు "మార్చు" లింకును నొక్కండి.
- దిద్దుబాటు పేజీ ప్రత్యక్షమౌతుంది.
- అక్కడ మీరు చెయ్యదలచిన మార్పులు చెయ్యండి.
- మీరు చేసిన మార్పులను వివరిస్తూ ఒక చిన్న సారాంశాన్ని కిందనున్న పెట్టెలో రాయండి.
- మీరు చేసింది చిన్న మార్పయితే, చిన్నమార్పు పెట్టెను టిక్కు చెయ్యండి.
- ఆ పేజీ మీ వీక్షణ జాబితాలో చేర్చాలనుకుంటే.. ఆ పెట్టెను కూడా టిక్కు చెయ్యండి.
- పేజీని భద్రపరచేముందు, సరిచూడు మీటను నొక్కి, మీరు చేసిన మార్పులను ఒక్కసారి సరిచూసుకోండి.
- అంతా బాగుందనుకుంటే, భద్రపరచు మీటను నొక్కి, మీ మార్పులను భద్రపరచండి.
అయితే మీరు వ్రాసిన గద్యాన్ని ఒక ఆకృతిలో పెట్టదలిస్తే దానికి అనుగుణంగా తగు అలంకారాలు చెయ్యాల్సి ఉంటుంది. ఉదాహరణకు కొంత భాగాన్ని బొద్దుగా చెయ్యడం, ఇటాలిక్కుగా మార్చడం, ఒక కొత్త విభాగం తయారుచెయ్యడం, ఒక జాబితాను కూర్చడం, ఒక నిర్వచనాన్ని వ్రాయడం వంటి అనేక అలంకారాలు ఈ ఎడిటరు ద్వారా చెయ్యవచ్చు.
కొత్త పేజీని సృష్టించేందుకు, ఏదో ఒక పేజీలో మార్చు లింకును నొక్కండి. ఆ పేజీ లోని ఎడిట్ పెట్టెలో మీరు సృష్టించదలచిన పేజీ పేరును వ్రాసి దానికి లింకు ఇవ్వడి. ఉదాహరణకు మా ఊరు అనే పేజీని సృష్టించాలనుకుందాం.. ఏదో ఒక పేజీ మార్చు లింకును నొక్కి, ఆ పేజీలోని ఎడిట్ పెట్టెలో, అన్నిటి కంటె పైన మా ఊరు అని వ్రాసి, ఎడిట్ పెట్టెకు కింద ఉన్న సరిచూడు మీటను నొక్కండి. అప్పుడు ఎడిట్ పెట్టెకు పైన పేజీలో మా ఊరు అనే లింకు కనిపిస్తుంది. ఆ లింకును నొక్కండి, మా ఊరు పేజీ ఎడిట్ పెట్టె కనిపిస్తుంది. మీరు వ్రాయదలచింది వ్రాసేసి, భద్రపరచండి. అంతే.. పేజీ తయారు! వికీపీడియా:తెలుగు వికీపీడియా కరదీపిక/తెవికీలో ఎవరు రాస్తున్నారు వికీపీడియా:తెలుగు వికీపీడియా కరదీపిక/వికీపీడియా ద్వారా కొత్త కొటికీలు, కొత్త ద్వారాలు ఇతర భాషల వికీపీడీయాల్లోని వ్యాసాలను తెలుగు లోకి అనువదించేందుకు తెలుగు వికీపీడియాలో అంతర్భాగంగా ఒక అనువాద పరికరం ఉంది. యాంత్రికానువాద సౌకర్యం ఉన్న ఉపకరణం ఇది. ఈ పరికరంలో గూగుల్, యాండెక్స్, మిన్‌ట్ అనే మూడు అనువాద యంత్రాలున్నాయి. వాటిలో ఏ యంత్రాన్నైనా వాడి అనువాదం చెయ్యవచ్చు.
వికీపీడియాకు కొత్త అయినా ఈ పరికరాన్ని వాడొచ్చు. అనువాద పరికరం వాడాలంటే కనీస అనుభవం అంటూ పరిమితి ఏమీ లేదు. అయితే వికీ పద్ధతుల గురించి తెలుసుకునేందుకు కొన్నాళ్ళు నేరుగా దిద్దుబాట్లు చేస్తే మంచిది.
అనువాద యంత్రంతో ఉపయోగాలు
మార్చుఈ పరికరం మీ పనిని కొంత సులభతరం చేస్తుంది. యంత్రం ద్వారా చేసే ఈ అనువాదం కొంతవరకు బాగానే ఉంటుంది. దాన్ని సరిచేసి ప్రచురించవచ్చు. తొందరగా అయిపోతుంది. దాని వలన కింది ఉపయోగాలున్నాయి.
- యంత్రం చాలా వేగంగా అనువదిస్తుంది. అనువాద పరికరం వాడితే, మీరు మరింత వేగంగా అనువాదాలు చెయ్యవచ్చు.
- మూలం పేజీకి సంబంధించిన పేజీ తెలుగులో ఈసరికే ఉంటే, పరికరం అది చూపిస్తుంది.
- మూలం లోని మూసలు అనువాదం లోకి కూడా వస్తాయి
- మూలంలో ఉన్న వికీలింకులు అనువాదం లోకి కూడా వస్తాయి. ఒకవేళ లింకు లక్ష్యం పేజీ తెవికీలో లేకపోతే, ఆ లింకులు రావు. ఆ విధంగా ఎర్రలింకులు ఏర్పడకుండా ఉంటాయి
- మూలంలో ఉన్న వర్గాలు తెవికీలో కూడా ఉంటే అవి ఆటోమాటిగ్గా అనువాదం లోకి వచ్చేస్తాయి.
- మూలంలో ఉన్న పట్టికలు అనువాదం లోకి వచ్చేస్తాయి, పట్టిక లోని సమాచారం అనువాదమౌతుంది.
లోపాలు
మార్చుఈ యంత్రం వలన ఒకే ఒక్క ఇబ్బంది ఉంది -అసహజమైన భాష. యాంత్రికానువాదం అసహజంగా ఉంటుంది. మరియు లాంటి దోషాలతో పాటు, కర్మణి వాక్యాలను విరివిగా రాస్తుంది. వీటిని సవరించి భాషను సహజంగా ఉండేలా తీర్చిదిద్దాకనే ప్రచురించాలి. అయితే ఆ అనువాదాన్ని సవరించడం తేలిగ్గానే అయిపోతుంది. వికీపీడియా:తెలుగు వికీపీడియా కరదీపిక/వికీసోర్సు పరిచయం వికీపీడియా:తెలుగు వికీపీడియా కరదీపిక/వికీమీడియా కామన్స్ పరిచయం వికీపీడియా:తెలుగు వికీపీడియా కరదీపిక/ఇతర తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల పరిచయం