వికీపీడియా:మూలాలు

(వికీపీడియా:SOURCES నుండి దారిమార్పు చెందింది)
అడ్డదారి:
WP:REF
WP:CITE

వికీపీడియాలో వ్యాసాలలో చేరుస్తున్న వివరాలకు మూలాలు (రిఫరెన్సులు) ఎలా చేర్చాలో ఈ పేజీ వివరిస్తుంది.

మూలాలను ఎందుకు తెలుపాలి

మార్చు
  • చదివేవారు ఇక్కడ ఉన్న సమాచారము సరయినదా కాదా అనే విషయాన్ని నిర్ధారించుకోవటానికి.
  • వికీపీడియా యొక్క నాణ్యతా ప్రమాణాలను మెరుగు పరిచేందుకు.
  • అక్కడ ఉన్న సమాచారం మీ సొంత అభిప్రాయం కాదు అని తెలుపటానికి. వికీపీడియా మీ వ్యాసాలలో మీ సొంత అభిప్రాయాలకు తావులేదు. అలాంటివి ఏమయినా ఉంటే గనక వాటిని చర్చా పేజీలలో ఉంచండి.
  • ఇతర సభ్యులు మీరు రాసిన దానిని వ్యతిరేకించకుండా ఉండేందుకు కూడా మూలాలు అవసరం.
  • మూలాలను తెలుపటం వలన అసలు సమాచారం అందించిన వారికి తగిన గుర్తింపు/గౌరవం ఇచ్చినట్లుంటుంది.

గమనిక: సాధ్యమయినంత వరకు వికీపీడియాలో ఉన్న ఇతర వ్యాసములను మూలాలలో చేర్చవద్దు. అలాంటి వాటిని "ఇవికూడా చూడండి" జాబితాలో ఉంచండి.

మూలాలను చేర్చే విధాలు

మార్చు
  • పూర్తి ఉల్లేఖన: విశ్వసనీయ మూలపు పూర్తి వివరాలు చూపించడం. అవసరమైతే సంబంధిత సమాచారం ఆ మూలంలో ఎక్కడ ఉందో కూడా (పేజీ నంబరు లాంటివి) చూపించాలి. ఉదాహరణకు: Rawls, John. A Theory of Justice. Harvard University Press, 1971, p. 1. ఇలాంటి సమాచారం సాధారణంగా పాదపీఠికలో ఇస్తారు. వికీపీడియా వ్యాసాల్లో ఇది సర్వ సాధారణంగా వాడే పద్ధతి.
  • ఇన్‌లైన్ ఉల్లేఖన: పాఠ్యంలోనే ఎక్కడైతే మూలాన్ని చూపించాలో అక్కడే - ఆ వక్యం పక్కనే, లేదా పేరాగ్రాఫు పక్కనే చూపించడం. సాఅధారణంగా ఇది పాదపీఠిక లాగా కనిపిస్తుంది.
  • చిరు ఉల్లేఖన: ఇది కూడా ఇన్‌లైన్ ఉల్లేఖనే. మూలంలో సంబంధిత సమాచారం ఎక్కడ ఉందో చూపించాలి; కానీ మూలపు పూర్తి వివరాలు ఇవ్వకుండా. ఈ పూర్తి వివరాలు అంతకు ముందు వేరే పాదపీఠికలో ఇచ్చి ఉండవచ్చు. లేదా వేరే విభాగంలో ఇచ్చి ఉండవచ్చు.ఉదాహరణకు: Rawls 1971, p. 1. చిరు ఉల్లేఖనను పాదపీఠికలాగా ఇవ్వవచ్చు, లేదా పాఠ్యంలోనే బ్రాకెట్లలో ఇవ్వవచ్చు.
  • పాఠ్యంలోనే ఉల్లేఖించడం వ్యాసపు పాఠ్యంలోనే మూలాన్ని చేర్చడం, Rawls argues that X.[5] - ఇలాగ. సాధారణంగా ఎవరైనా వ్యక్తిని ఉదహరిస్తూ వాళ్ళు చెప్పినది రాసేటపుడు, అభిప్రాయాలను రాసేటపుడు, అంతగా దృవీకరింపబడని వాస్తవాలను రాసేటపుడు ఇలా రాయాలి. ఈ పద్ధతిలో మూలానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వరు – ఇది మాఅమూలు పద్ధతిలో పాదపీఠికలో ఇస్తారు.
  • సామాన్య మూలాలు: పాఠ్యాన్ని ధృవీకరిస్తూ ఉండే మూలాలు. కానీ వ్యాసంలో ఎక్కడా ఇన్‌లైన్ ఉల్లేఖన ద్వారా లింకు చెయ్యనివి. వీటిని వ్యాసం అడుగున మూలాలు విభాగంలో చేరుస్తారు. ఇంకా బాగా అభివృద్ధి చెందని వ్యాసాలకు ఇలాంటి మూలాలు ఉంటాయి; మరీ ముఖ్యంగా వ్యాసంలోని పాఠ్యం మొత్తం ఒకే మూలంపై ఆధారపడి ఉన్నపుడు. అభివృద్ధి చెందిన వ్యాసాల్లో ఇన్‌లైన్ మూలాలకు తోడుగా ఇవి కూడా ఇస్తారు.

మూలాలను ఏ ఏ సమయాలలో తెలుపాలి

మార్చు

వ్యాసంలో కొత్త సమాచారాన్ని చేర్చినప్పుడు

మార్చు

మీరు ఏదయినా కొత్త సమాచారాన్ని సేకరించి, దానిని ఇక్కడ ఉన్న వ్యాసాలలో చేర్చాలనుకున్నప్పుడు, మొదట ఆ సమాచారం యొక్క మూలాన్ని తెలుపండి. అది ఒక పుస్తకం కావచ్చు, ఒక వెబ్‌సైటులోని పేజీ లాంటివి ఏదయినా కవచ్చు, కాకపోతే మీరు పొందుపరచిన మూలాన్ని ఇతర సభ్యులు లేదా చదివేవారెవరయినా నిర్ధారించగలిగేటట్లు ఉండాలి. ఒక వేళ మీరు రాసే సమాచారం గురించి మీకు ముందే తెలిసినట్లయితే మీరు ఎటువంటి మూలాలను చూడాల్సిన అవసరం రాకపోవచ్చు, కానీ అలాంటి సమయాలలో ఇతరులకు మీరు రాసిన దానిపై సందేహాలుంటే వాటిని తీర్చటానికి కావలిసిన మూలాలను చేర్చండి, అప్పుడు ప్రతీ ఒక్కరి సందేహాలను తీర్చాల్సిన అవసరం ఉండదు.

మూలాల యొక్క అసలు అవసరం, ఏదయినా విషయంపై అభిప్రాయాలను తెలుపుతున్నప్పుడు ఉంటుంది. అలా అభిప్రాయాలను తెలుపుతున్నప్పుడు, దానిని ధృవపరచటానికి సరయిన మూలం చూపించారంటే, ఇంక అందరూ మీ వాదననే ఒప్పుకుంటారు (దానికి వ్యతిరేకంగా ఇంకో మంచి మూలం చూపించే దాకా). "కొంతమంది ఇలా భావిస్తారు", "కొంతమంది అలా భావిస్తారు", లాంటి వాక్య నిర్మాణాలను సాధ్యమయినంతవరకు తగ్గించండి. సాధారణంగా అలాంటి వాక్యాలు, చదివేవారి మదిలో వ్యతిరేక ప్రభావం చూపుతాయి. దానికి బదులుగా "వీరందరూ ఇలా అన్నారు", "వారు అలా అన్నారు", అని రాసి ఆ వారు లేదా వీరందరూ ఎవరో తెలిపి, ఎప్పుడు, ఎక్కడ అన్నారో కూడా తెలిపారంటే ఆ రచన యొక్క ప్రామాణికత ఎన్నోరెట్లు మెరుగుపడుతుంది. మరొకసారి గుర్తుంచుకోండి, వికీపీడియా మీ అభిప్రాయాలను తెలుపటానికి ఒక వేదిక కాదు.

ఇది తెలుగు భాషలో ఉన్న వికీపీడియా కాబట్టి మీ మూలాలను సాధ్యమయినంత వరకూ తెలుగులో ఉండేటట్లు చూడండి. ఒక వేళ తెలుగులో సరయిన మూలాలు దొరకకపోతే, అప్పుడు ఆంగ్లంలో ఉండే మూలాలను సూచించండి.

వ్యాసాలలో ఉన్న సమాచారాన్ని పరిశీలించినప్పుడు

మార్చు

మీరు చేర్చని విషయాలకు కూడా మీకు తెలిసిన మూలాలు ఏమయినా ఉంటే వాటిని కూడా చేర్చవచ్చు. చేర్చేముందు ఒక సారి పరిశీలించి చేర్చండి. అంతే కాదు వ్యాసానికి మూలాలను చేర్చడం వికీపీడియాలో చాలా గొప్ప కృషిగా భావిస్తారు. వాక్యాలకు పక్కనే మూలాలకు సంబందించిన లింకులు గానీ సమాచారం కానీ ఉంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అందుకనే, వాటిని మీరు రాస్తున్న వాక్యాల పక్కనే ఉంచటం మంచిది.

వ్యాసానికి సంబంధించిన గొడవలు జరుగుతున్నప్పుడు

మార్చు

గొడవకు కారణమయిన వ్యాస భాగాన్ని వెంటనే చర్చా పేజీకి తరలించండి. ఒకవేళ ఆ వ్యాస భాగం అంత కీడు తలపెట్టేది కాదు అని అనుకున్నప్పుడు, లేదా దానికి సంబంధించిన మూలాన్ని చేరిస్తే సరిపోతుంది అని భావించినప్పుడు {{మూలాలు అవసరం}} అనే మూసను ఆ వ్యాస భాగం తరువాత ఉంచండి. {{ మూలాలు సమీక్షించండి}} అనే మూస కొన్ని సందర్భాలలో మరింత ఉపయుక్తంగా ఉంటుంది.

వ్యాసానికి సంబందించి గొడవ జరుగుతుందని అనుకున్నప్పుడు

మార్చు

ముందుగానే ఊహించండి: మీరు చేర్చిన విషయం మీద ఎవరికయినా సందేహం కలుగవచ్చేమో అనే విషయాన్ని ఆలోచించండి. వికీపిడియాలో మీరు చేర్చిన సమాచారానికి ఊతంగా ఏదయినా మంచి మూలాన్ని చేర్చినట్లయితే అప్పుడు ఇతర సభ్యులు ఆ సమాచారాన్ని తొలగించే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

సమాచారం ఎక్కడ లభించిందో తెలుపండి

మార్చు

మూలాలను తెలిపేటప్పుడు సాదారణంగా జరిగే తప్పు.., అసలు సమాచారం ఇంకోదగ్గర ఉంది అని తెలిపిన మధ్యవర్తి గురించి తెలుపకపోవటం. ఉదాహరణకు మీరు ఒక వెబ్ సైటులో ఒక విషయాన్ని గురించి చదివారు, అదే వెబ్‌సైటులో ఆ సమాచారాన్ని ఫలానా పుస్తకం నుండి సేకరించబడినదని తెలుపుతారు, అలాంటప్పుడు మీరు స్వయానా ఆ పుస్తకాన్ని చదవందే, దానిని వికీపిడియా మూలాలలో చేర్చకూడదు, ఆ మధ్యవర్తి అయిన వెబ్‌సైటు యొక్క చిరునామాని మాత్రమే మూలాలలో చేర్చాలి. అలాంటి వాటిని మూలాలలో ఇలా చేర్చాలి:

  • <ఫలానా వెబ్‌పేజీ>, <ఫలానా పుస్తకం నుండి> ఈ సమాచారాన్ని సేకరించింది, లేదా
  • <ఫలానా పుస్తకం>, <ఫలానా వెబ్‌పేజీ> లో మూలంగా తీసుకున్నప్పుడు సమాచారం తెలిసింది.

మీరు ఆ పుస్తకాన్ని చదవనంత వరకూ దానినొక్క దానినే మూలాలలో ఉంచకూడదు. ఒక సారి మీరు ఆ పుస్తకాన్ని చదివేసిన తరువాత మాత్రం దానినొక్క దానినే మూలలలో ఉంచవచ్చు. కానీ వెబ్‌పేజీలో కూడా ఇంకొంచెం మంచి సమాచారం దొరుకుతుందని అనుకున్నప్పుడు పాఠకులకు దాని గురించి కూడా తెలుపవచ్చు. ఇలా:

  • <ఫలానా పుస్తకం> (<ఫలానా వెబ్‌పేజి> కూడా చూడండి).

దీని వెనుక ప్రధాన ఉద్దేశం మీరు సేకరించిన సమాచారం మొత్తం, మీ పాఠకులు ఎటువంటి సందేహాలు లేకుండా జీర్ణించేసుకోవడానికి.

మూలాలను వ్యాసాలలో చేర్చే విధానం

మార్చు

వికీపీడియాలో మూలాలను రెండు రకాలుగా చేర్చవచ్చు. మొదటిరకంలో మీరు రాస్తున్న వ్యాస భాగంలో సమాచారం చేర్చిన దగ్గరే మూలాన్ని కూడా ప్రస్తావించవచ్చు. లేదా వాటన్నిటినీ వేరుగా మూలాలు అనే విభాగంలో చేర్చవచ్చు. మూలాలను ఏరకంగా చేర్చినా కూడా వాసాన్ని చదివేవారికి ఒకే రకంగా కనిపిస్తాయి. కాకపోతే వ్యాసంలో మార్పులు చేసేవారికి ఏదో ఒక రకమయిన విధానమే నచ్చవచ్చు. అప్పుడు వారు వారికి నచ్చిన విధానాన్ని ఎంచుకోవచ్చు.

నేరుగా

మార్చు

ఈ విధానంలో మీరు ఎటువంటి మూసలను ఉపయోగించాల్సిన పని లేదు. ఈ పద్దతిలో మీరు మార్పులు చేస్తున్న వ్యాసములో ఈ క్రింది విధముగా చేర్చాలి.

<ref name="మూలం పేరు"> ఒకటో రచయిత, రెండో రచయిత, (2001)లో రాసిన ఫలానా పుస్తకంలోని 419వ పేజీ నుండి 5/3/2006న సేకరించబడినది. ప్రచురణకర్తలు: అఆఇఈ ప్రచురణలు </ref> ఇలా మీరు చేరుస్తున్న సమాచారానికి రుజువులుగా, సమాచారంతోనే చేర్చేయండి. ఆ తరువాత మూలాలు లేదా రిఫరెంసులు విభాగంలో <references /> అనే దానిని తగిలిస్తే సరిపోతుంది.

ఉదాహరణ

ఇలా మూలాలను చేర్చటం వలన చదివేవారు మన రచనలలో పేర్కొన్న అంశాలు వాస్తవాలా కాదా అని సులువుగా నిర్ధారించుకోగలుగుతారు, తద్వారా వికీపిడియా మీద మరింతగా నమ్మకం పెంచుకుంటారు.
ఈ మధ్య ఆంగ్ల వికీపిడియాలో ఇలాంటి నమ్మకం పెంచటం ఒక అవసరంగా భావిస్తున్నారు
<ref name=ఆంగ్లం1> [[:en:Criticism_of_Wikipedia#Usefulness_as_a_reference|వికీపీడియాను మూలంగా ఉపయోగించవచ్చా?]] </ref>
<ref name=ఆంగ్లం2> [[:en:Wikipedia:Why_Wikipedia_is_not_so_great|వికీపీడియా అంత గొప్పది కాదు ఎందుకని?]] </ref>.

ఇలా మూలాలను చేర్చటం వలన చదివేవారు మన రచనలలో పేర్కొన్న అంశాలు వాస్తవాలా కాదా అని సులువుగా నిర్ధారించుకోగలుగుతారు, తద్వారా వికీపిడియా మీద మరింతగా నమ్మకం పెంచుకుంటారు. ఈ మధ్య ఆంగ్ల వికీపిడియాలో ఇలాంటి నమ్మకం పెంచటం ఒక అవసరంగా భావిస్తున్నారు [1] [2].

 <references /> 
  1. వికీపీడియాను మూలంగా ఉపయోగించవచ్చా?
  2. వికీపీడియా అంత గొప్పది కాదు ఎందుకని?

మూస వాడుకతో

మార్చు

పై పద్ధతిలో కాకుండా, ఈ క్రింది మూసలను కూడా వాడవచ్చు. ఈ మూసలను మీరు మార్పులు చేస్తున్న వ్యాసములో ఈ విధముగా ఉపయోగించాలి.

{{చూడు|పేరు}} - ఈ మూసను వ్యాసము మధ్యలో ఉపయోగించాల్సి ఉంటుండి. మీరు చేర్చబోయే ఏదయినా అంశమునకు ఆధారాలు, రుజువులు చూపించదలచిన చోట్ల ఈ మూసను తగిలించండి. పేరు అనేది మీరు ఇచ్చే ఆధారాలకు లేదా మూలాలకు గుర్తుగా, వ్యాసములో ఉన్న మరే ఇతర పేర్లతో కలిసిపోకుండా ప్రత్యేకంగా ఇవ్వవలిసిన నామము. దీంతో మీరు చేర్చిన విషయం నుండి మూలాన్ని చేరుకోవడానికి ఒక లింకు ఏర్పడుతుంది.

{{మూలం|పేరు}} - ఈ మూసను మూలాలు లేదా రిఫరెన్సులు విభాగాలలో, మూలాల చిరునామాకు ముందు తగిలించవలసి ఉంటుంది. దానివలన ఒక ఈ మూలము నుండి ఏ విషయానయితే సేకరించారో ఆ వివరణకు ఒక లింకు ఏర్పడుతుంది.

ఉదాహరణ
ఇలా మూలాలను చేర్చటం వలన చదివేవారు మన రచనలలో పేర్కొన్న అంశాలు వాస్తవాలా కాదా అని సులువుగా నిర్ధారించుకోగలుగుతారు, తద్వారా వికపీిడియా మీద మరింతగా నమ్మకం పెంచుకుంటారు.
ఈ మధ్య ఆంగ్ల వికీపిడియాలో ఇలాంటి నమ్మకం పెంచటం ఒక అవసరంగా భావిస్తున్నారు  {{చూడు|en3}} {{చూడు|en4}}. 

ఇలా మూలాలను చేర్చటం వలన చదివేవారు మన రచనలలో పేర్కొన్న అంశాలు వాస్తవాలా కాదా అని సులువుగా నిర్ధారించుకోగలుగుతారు, తద్వారా వికీపిడియా మీద మరింతగా నమ్మకం పెంచుకుంటారు. ఈ మధ్య ఆంగ్ల వికీపిడియాలో ఇలాంటి నమ్మకం పెంచటం ఒక అవసరంగా భావిస్తున్నారు [1] [2].

# {{మూలం|en3}} [[:en:Criticism_of_Wikipedia#Usefulness_as_a_reference|వికీపీడియాను మూలంగా ఉపయోగించవచ్చా?]] 
# {{మూలం|en4}} [[:en:Wikipedia:Why_Wikipedia_is_not_so_great|వికీపీడియా అంత గొప్పది కాదు ఎందుకని?]]
  1. ^  వికీపీడియాను మూలంగా ఉపయోగించవచ్చా?
  2. ^  వికీపీడియా అంత గొప్పది కాదు ఎందుకని?

జాల మూలాలు

మార్చు

జాల మూలాల కు వాడవలసిన మూస ఉదాహరణ: <ref>{{Cite web|title=కోట్ల రూపాయల కోడి పందేలు|last1=కె|first1=శ్రీనివాస్ |url=http://www.suryaa.com/features/article-1-12718 |publisher=సూర్య|date= 2011-01-12|accessdate=2014-01-13}} </ref>

  • తెలుగు మాధ్యమాల లింకులు శాశ్వతలింకులు కావున, ఆర్కీవ్ లో నిక్షిప్తం చేసి ఆర్కీవ్ లింకు కూడా చేర్చాలి.

పుస్తక మూలాలు

మార్చు

పుస్తక మూలాలకు వాడవలసిన మూస ఉదాహరణ:{{cite book |last= Cordell |first= Bruce R. |coauthors= Jeff Grubb, David Yu |title= [[Manual of the Planes]] |publisher= [[Wizards of the Coast]] |year= 2001 |month= September |isbn= 0-7869-1850-8 }}

ఎటువంటి మూలాలను చేర్చాలి

మార్చు

ఇంటర్‌నెట్‌లో వెబ్‌పేజీలకు లింకు ఇచ్చిన మూలాల పేజీలు పనిచేయనప్పుడు ఏంచేయాలి?

మార్చు
మార్చు

To help prevent dead links, persistent identifiers are available for some sources. Some journal articles have a digital object identifier (DOI); some online newspapers and blogs, and also Wikipedia, have permalinks that are stable. When permanent links aren't available, consider archiving the referenced document when writing the article; on-demand web archiving services such as WebCite (http://www.webcitation.org) are fairly easy to use (see pre-emptive archiving).

Dead links should be repaired or replaced if possible. Do not delete a citation merely because the URL is not working today. Follow these steps when you encounter a dead URL being used as a reliable source to support article content:

  1. Confirm status: First, check the link to confirm that it is dead and not temporarily down. Search the website to see whether it has been rearranged.
  2. Check for web archives: Many Web archiving services exist; link to their archive of the URL's content, if available. Examples:
  3. Remove convenience links: If the material was published on paper (e.g., academic journal, newspaper article, magazine, book), then the dead URL is not necessary. Simply remove the dead URL, leaving the remainder of the reference intact.
  4. Find a replacement source: Search the web for quoted text, the article title, and parts of the URL. Consider contacting the website/person that originally published the reference and asking them to republish it. Ask other editors for help finding the reference somewhere else, including the one that added the reference. Find a different source that says essentially the same thing as the reference in question.
  5. Remove hopelessly lost web-only sources: If the source material does not exist offline, and if there is no archived version of the webpage (be sure to wait ~24 months), and if you cannot find another copy of the material, then the dead citation should be removed and the material it supports should be regarded as unverified if there is no other supporting citation. If it is material that is specifically required by policy to have an inline citation, then please consider tagging it with {{citation needed}}. It may be appropriate for you to move the citation to the talk page with an explanation, and notify the editor that added the now-dead link.

మూలాల వినియోగ విశ్లేషణ-జూన్ 2020

మార్చు

వికీపీడియాలో మూలాల విశ్లేషణ అధారంగా వాడిన మూలాల తరచుదనాన్ని బట్టి (F-model) జూన్ 2020 లో ఈ క్రింది విధంగా వున్నాయి.[1] వీక్షణలతో పాటు, లేక వ్యాస రచయితలతోపాటు కూడా ఇతర గణాంకాలు వున్నాయి.

# Website Score in June 2020 1m changes వెబ్సైటు భాష
1 censusindia.gov.in 42,943 +57
2 books.google.com 7,346 +115
3 archive.org 4,333 +108
4 census2011.co.in 3,381 +65
5 indiatimes.com 3,380 +155
6 thehindu.com 2,839 +72
7 indiarailinfo.com 2,222 0
8 ourtelugunadu.com 1,877 -2 తెలుగు
9 cia.gov 1,591 +7
10 onefivenine.com 1,576 -2
11 hindu.com 1,396 +51
12 bbc.co.uk 1,368 +19
13 sakshi.com 1,295 +31 తెలుగు
14 andhrajyothy.com 1,281 +50 తెలుగు
15 eenadu.net 991 +6 తెలుగు
16 ap.gov.in 985 +14
17 telangana.gov.in 876 +40
18 nytimes.com 841 +24
19 ntnews.com 797 +6
20 indianexpress.com 719 +36
21 britannica.com 711 +16
22 google.co.in 698 +44
23 idlebrain.com 647 +20
24 youtube.com 632 +28
25 imf.org 618 +4

ఇవీ చూడండి

మార్చు

మూలాల ఉల్లేఖన మూసలు

మూలాలు

మార్చు
  1. "Best Sources in Telugu Wikipedia". bestref.net. Retrieved 2020-07-20.