డోకిపర్రు (కృష్ణా జిల్లా)

భారతదేశంలోని గ్రామం

డోకిపర్రు (Dokiparru) కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు మండలంలోని ఒక గ్రామం. ఈ వూరి పిన్ కోడ్ నం.521 332., యస్.టీ.డీ.కోడ్ నం.08674.

డోకిపర్రు
—  రెవిన్యూ గ్రామం  —
డోకిపర్రు is located in Andhra Pradesh
డోకిపర్రు
డోకిపర్రు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°17′58″N 81°03′14″E / 16.299576°N 81.053757°E / 16.299576; 81.053757
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గుడ్లవల్లేరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,909
 - పురుషులు 2,982
 - స్త్రీలు 2,927
 - గృహాల సంఖ్య 1,670
పిన్ కోడ్ 521332.
ఎస్.టి.డి కోడ్ 08674

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

గుడివాడ నుండి మచిలీపట్నం వెళ్ళే రోడ్డులో గుడ్లవల్లేరు నుండి 4 కి.మీ. దూరంలో, కౌతవరంకి నిడుమోలకు మధ్యన, విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్ళే NH9 రోడ్డులో నిడుమోలకు 3 కి.మీ. దూరం లో, డోకిపర్రు గ్రామం ఉంది.

సమీప గ్రామాలుసవరించు

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం

సమీప మండలాలుసవరించు

పామర్రు, గుడివాడ, గూడూరు, ముదినేపల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

ఊరికి బస్సు సౌకర్యం ఉంది. ఆటోలు, మోటారు సైకిళ్ళు ఇతర ముఖ్య ప్రయాణ సాధనాలు.

గుడ్లవల్లేరు, పామర్రు నుండి రోడ్దురవాణా సొకర్యం ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 54 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

 1. డోకిపర్రులో శ్రీ వీరమాఛనేని వెంకట గంగాధర రావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చాలా కాలంనుండి ఉంది. కృష్ణా జిల్లాలో ఇది రెండో ప్రభుత్వ ఉన్నత పాఠశాల. మిగిలినవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలే. పిల్లలకు రెండు ప్రభుత్వ పాఠశాలలు ఉండడం విశేషం.
 2. శాఖా గ్రంథాలయం:-ఈ గ్రంథాలయం గ్రేడ్-2 పరిధిలో ఉంది. ఇక్కడ మొత్తం 25,000 విలువైన గ్రంథాలు ఉన్నాయి. []

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

అనేక మంది దాతల వితరణతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ గ్రంథాలయం, ప్రభుత్వ వైద్యశాల, ప్రభుత్వ పశు వైద్యశాలలకు స్థలము, త్రాగు నీటి శుద్ధి కేంద్రం దాతల వితరణతో నెలకొల్పబడినది, భవనములు సమకూరినవి.

బ్యాంకులుసవరించు

ఆంధ్రా బ్యాంక్:- గ్రామంలోని, ఆధునికీకరించిన ఈ బ్యాంక్ శాఖను 2016,జనవరి-16న ప్రారంబించెదరు. [7]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

ముఖ్యమైన నీటివనరు కృష్ణా కాలువలు, అచ్చమ్మ చెరువు, భద్రారెడ్డి చెరువు, కోమటి చెరువు.

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ జోగి వెంకటేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [5]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ అగస్తేశ్వరస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయానికి డోకిపర్రు గ్రామములో 42 సెంట్ల మాన్యం భూమి ఉన్నది. [10]

శ్రీ అలివేలు మంగా, పద్మాతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంసవరించు

 1. హైదరాబాదుకు చెందిన (మెయిల్) ఎం.ఇ.ఐ.ఎల్. (Megha Engineering Infrastructure Private Ltd.,) సంంస్థ ఛైర్మన్ శ్రీ పామిరెడ్డి పిచ్చిరెడ్డి మరియూ ఆ సంస్థ ఎం.డి. శ్రీ పురిటిపాటి కృష్ణారెడ్డి, ఈ గ్రామంలో రెండున్నర ఎకరాల స్థలం కొనుగోలుచేసి, ఆగస్టు-2012 లో నిర్మాణం ప్రారంభించి, పదికోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. వీరి ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణపనులను గూడా ఆ సంస్థవారి ఇంజనీరింగ్ బృందమే చేపట్టి నిర్మించడం విశేషం. ఈ ఆలయానికి ఇరుప్రక్కలా శ్రీ సీతా, రామ, ఆంజనేయ, ప్రక్కన, వినాయక, వెనుక, ఉపాలయాలుగా శ్రీ లక్ష్మీనరసింహ, వరాహ, దశావతారస్వాములు, విష్వక్సేన, మునిమందిరాలు నిర్మించారు. 59 అడుగుల ఎత్తయిన భారీ గాలిగోపుర నిర్మాణం, చుట్టూ కళాకృతప్రహరీ, కోనేరు నిర్మాణం, ఇక్కడి విశేషాలు. నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2015,మే-27వ తేదీ, బుధవారంనాడు ప్రారంభించారు. [2]&[3]
 2. ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించి 40 రోజులైన సందర్భంగా, 2015,జూలై-15వ తేదీ బుధవారంనాడు, ఆలయంలో మండల దీక్షా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, క్రతువులు నిర్వహించారు. [4]
 3. ఈ ఆలయ ప్రథమ సాలకట్ల బ్రహ్మోత్సవాలు, 2016,నవంబరు-24,25,26 తేదీలలో (కార్తీక బహుళ గురు,శుక్ర,శనివారాలలో) అంగరంగ వైభవంగా నిర్వహించారు. [8]

శ్రీ మదనగోపాలస్వామివారి ఆలయంసవరించు

శ్రీ సరస్వతీదేవి ఆలయంసవరించు

స్థానిక శ్రీ మదనగోపాలస్వామివారి ఆలయంలో ఉపాలయంగా ఉన్న ఈ ఆలయాన్ని, ఆ ఆలయ మాజీ ఛైర్‌మన్ శ్రీ పోలవరపు నారాయణరావు, వారి సోదరుడు శ్రీ రాజేంద్రప్రసాద్, 2 నెలల క్రితం మూడు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించినారు. ఇప్పుడు ఒక లక్ష రూపాయలను ఈ ఆలయ నిర్వహణ, నిత్యపూజల నిమిత్తం విరాళంగా అందజేసినారు. [9]

గ్రామంలోని ప్రధాన పంటలుసవరించు

ఈ వూరిలో ప్రధానమైన పంట వరి. అపరాలు కూడా పండుతాయి.

గ్రామంలోని ప్రధాన వృత్తులుసవరించు

ఈ గ్రామంలో వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు ప్రముఖ స్థానం ఉన్నా, అన్ని వృత్తుల వారికి వారి వారి వృత్తులకు అధిక ప్రాధాన్యము ఉంది. ఈ వూళ్ళో చాలా కాలంగా అన్ని కులాలు కలిసి సహ జీవనం సాగిస్తున్నాయి.

ప్రముఖులుసవరించు

 
వి.బి.రాజేంద్రప్రసాద్ సినిమా నిర్మాత, దర్శకుడు.

గ్రామం నుండి భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నవారుసవరించు

గ్రామ విశేషాలు[3]సవరించు

 1. ఈ గ్రామం అనేకమంది స్వాతంత్ర్య సమర యోధులను అందించింది.
 2. కొత్తపేట, చాకలి పేట, పెద మాలపల్లి, చిన మాలపల్లి లు, మాదిగువ గూడెం, తురాయి పాలెం, పెదపాలెం, ఇలా అనేకమైన వృత్తుల సముదాయములతో కలగలిసిన సమాహారమే ఈ డోకిపర్రు గ్రామం.
 3. ఈ ఊరికి చెందిన వీర్ల పాల్ సుధాకర్ అను విద్యార్థి, ఉక్రెయిన్లో రాకెట్ మరియూ ఎయిర్ క్రాఫ్ట్ డిజైనింగ్ బ్రాంచ్ లో మొదటి సం. ఇంజనీరింగ్ చదువుచున్నాడు. ఈయన చదువుచున్న కళాశాల పేరు kharkiv Aviation Institute of the National Aeroscope University. ఈతడు అంతరిక్షంలో వ్యోమగాములను తిరిగి క్షేమంగా భూమిమీద దింపగలిగిన మరియూ తిరిగి ఉపయోగించుకొనుటకు వీలయిన ఒక అంతరిక్ష రాకెట్ (Single Stage to Orbit = SSTO) ను డిజైన్ చేస్తున్నాడు. [1]

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 5,909 - పురుషుల సంఖ్య 2,982 - స్త్రీల సంఖ్య 2,927 - గృహాల సంఖ్య 1,670
జనాభా (2001) -మొత్తం 6243 -పురుషులు 3153 -స్త్రీలు 2982 -గృహాలు 1625 -హెక్టార్లు 1584

బయటి లింకులుసవరించు

[1] ది హిందు దినపత్రిక; 2013,జూన్-23; 2వపేజీ. [2] ఈనాడు అమరావతి; 2015,మే-27; 29వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,మే-30; 31వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015,జులై-16; 30వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015,ఆగస్టు-15; 32వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2015,నవంబరు-17; 26వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2016,జనవరి-15; 31వపేజీ. [8] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016,నవంబరు-27; 1వపేజీ. [9] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017,జులై-12; 2వపేజీ. [10] ఈనాడు అమరావతి;2020,అక్టోబరు-30,5వపేజీ.


 1. "డోకిపర్రు (కృష్ణా జిల్లా)". Retrieved 2 July 2016.
 2. "నమస్తే తెలంగాణలో వ్యాసం". Archived from the original on 2016-03-05. Retrieved 2015-01-12.
 3. సుధీర్ రెడ్డి, పామిరెడ్డి (2021). మా చెట్టు నీడ, అసలేం జరిగింది. కస్తూరి విజయం. ISBN 978-93-5445-095-2.