వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఏషియన్ నెల/2021

ఫౌంటెన్‌లో పేజీ సృష్టి మార్చు

ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడ ఒక ఈవెంట్ నమోదు చేయాలి, దీనికి సహాయం కావాలి. Nskjnv ☚╣✉╠☛ 13:15, 15 నవంబరు 2021 (UTC)Reply

ఏం సాయం కావాలో చెప్పండి.__ చదువరి (చర్చరచనలు) 04:52, 16 నవంబరు 2021 (UTC)Reply
చదువరి గారూ, ఇది వరకు ఆజాది కా అమృత్ మహోత్సవంకి మెటా వికీలో ఎలా అయితే ఒక ఈవెంట్ సృష్టించామో అలా దీనికి కూడా ఫౌంటెన్ లో ఒక ఈవెంట్ సృష్టించాలి తద్వారా వాడుకరులు వారి వ్యాసాలను ఈ ప్రాజెక్టులో భాగంగా రాసినట్టు వికీమీడియా ప్రాజెక్టుల సమన్వయము గుర్తించగలుగుతుంది.

ఈ ఎడిటతాన్ సృష్టించడానికి ఈ పేజీ చూడండి. ఆ సూచనలతో ఫౌంటెన్ లో

ఎడిటతాన్ ఒకటి సృష్టించండి .. 

స్టెప్స్:

  1. ఓపెన్ ఫౌంటెన్
  2. క్లిక్ ఆన్ creat new
  3. title = వికీపీడియా ఏషియన్ నెల/2021
  4. కోడ్ = any number (eg:99999)
  5. description : వికీపీడియా ఏషియన్ నెల 2021 బహుభాషలలో నిర్వహిస్తున్న ఎడిటథాన్. ఆసియా దేశాల వివిధ సముదాయాల మధ్య అవగాహన పెంచడం కోసం ఇది నిర్వహించబడుతుంది. 2021 నవంబరు 15 నుండి డిసెంబరు 15 వరకు జరుగుతుంది.
  6. start date :11/15/2021 12:00:00 AM
  7. end date: 12/15/2021 11:59:59 PM

save next

User:Nskjnv గారూ ఇది చూడండి. __చదువరి (చర్చరచనలు) 05:38, 18 నవంబరు 2021 (UTC)Reply
చదువరి గారూ , సరిపోయిందండి. ధన్యవాదాలు Nskjnv ☚╣✉╠☛ 12:25, 18 నవంబరు 2021 (UTC)Reply

సందేహం మార్చు

వ్యాసం పూర్తయిన తర్వాత హ్యాష్‌ట్యాగు లాంటిది ఏమైనా ఉపయోగించాలా.➵𝐂𝐡 𝐌𝐚𝐡𝐞𝐬𝐰𝐚𝐫𝐚 𝐑𝐚𝐣𝐮☻ (చర్చ) 11:41, 16 నవంబరు 2021 (UTC)Reply

➵𝐂𝐡 𝐌𝐚𝐡𝐞𝐬𝐰𝐚𝐫𝐚 𝐑𝐚𝐣𝐮☻ గారూ , వ్యాసం పూర్తయ్యాక ఎటువంటి యాష్ ట్యాగ్ చేర్చాల్సిన పని లేదు. ఈ ప్రాజెక్టు ఫౌంటెన్ టూల్ సహాయంతో నడవనుంది, అది దానంతట అదే వ్యాసాలని పరిగణలోకి తీసుకుంటుంది. దీని గురించి మనం ఒక సమావేశం నిర్వహించుకుందామని అనుకుంటున్నాను. ప్రాజెక్టులో పాల్గొనేవారు, ఆసక్తి ఉన్న వాళ్ళు పాల్గొనచ్చు. Nskjnv ☚╣✉╠☛ 13:13, 17 నవంబరు 2021 (UTC)Reply
వాడుకరి:Nskjnv సరేనండి.మీరన్నట్టు సమావేశం ఏర్పాటు చేద్దాం.ముందుగా రచ్చబండ లోని,వాట్స్అప్ గ్రూపులోను ఈ విషయం తెలియజేయండి. ​సభ్యులు ఎక్కువమంది పాల్గొనడానికి అవకాశం ఉంటుంది.➵𝐂𝐡 𝐌𝐚𝐡𝐞𝐬𝐰𝐚𝐫𝐚 𝐑𝐚𝐣𝐮☻ (చర్చ) 13:29, 17 నవంబరు 2021 (UTC)Reply

వ్యాసం నమూనా మార్చు

ఈ ప్రాజెక్టులో భాగంగా ఆసియాలో గల దేశాలకు(మన దేశం మినహాయించి) సంబందించిన ప్రదేశాలు, వ్యక్తులు ఇంకా ఇతర విషయాలపై వ్యాసాలూ నిర్మించవచ్చు. ఉదాహరణకు వాడుకరి:MYADAM ABHILASH గారూ , నిర్మించిన సి ఇంథ్రాథిత్ ఈ వ్యాసాన్ని చూడండి. మొదటి వ్యాసాన్ని రాసినందుకు అభిలాష్ గారికి అభినందనలు. Nskjnv ☚╣✉╠☛ 12:48, 18 నవంబరు 2021 (UTC)Reply

ధన్యవాదాలు సాయి కిరణ్ గారూ౼అభిలాష్ మ్యాడం 12:53, 18 నవంబరు 2021 (UTC)Reply

ఫౌంటెన్ ఉపయోగం మార్చు

ప్రాజెక్టు సబ్యులకు నమస్కారం,

ఈ ప్రాజెక్టులో భాగంగా రాసే వ్యాసాలు ఫౌంటెన్ టూల్ ఉపయోగంతో ఆమోదించబడతాయి. ఫౌంటైన్లో వ్యాసాలు సబ్మిట్ చేసే విధానం :

  1. ముందు ఈ లింకు నొక్కండి.(ఫౌంటెన్లో వికీపీడియా ఏషియన్ మాసం/2021 ఎడిటతాన్ పేజీకి తరలించబడతారు)
  2. ఆ పేజీలో సబ్మిట్ పై నొక్కండి.
  3. మీరు ఎవరి తరఫున వ్యాసం చేరుస్తున్నారో అడుగుతుంది అక్కడ మీ వాడుకరి పేరు ఉందొ లేదో చూస్కోండి. చూసి Next నొక్కండి.
  4. వ్యాసం పేరు రాయండి, సబ్మిట్ చేయండి. (వ్యాసం ప్రాజెక్టు ప్రమాణాలకు అనుగుణంగా 3000 బైట్లతో 300 పదాలతో ఉంటేనే అది పరిగణించబడుతుంది)
ధన్యవాదాలు. Nskjnv ☚╣✉╠☛  04:30, 19 నవంబరు 2021 (UTC)Reply

మూస మార్చు

ఈ ప్రాజెక్టు సభ్యులు తమ వాడుకరి పేజీలో

మూసని చేర్చుకోడం పరిశీలించగలరు. Nskjnv ☚╣✉╠☛ 05:12, 19 నవంబరు 2021 (UTC)Reply

గూగుల్ యాంత్రికానువాదలు మార్చు

గూగుల్ ట్రాన్స్లేట్ వాడి రాసినవి చెల్లవని నిబంధనల్లో రాసారు. అనువాదాలను సవరించి ప్రచురిస్తే చెల్లుతాయి కదా! దాన్ని పరిశీలించి, తగువిధంగా సవరించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 08:21, 24 నవంబరు 2021 (UTC)Reply

మీ సూచనకు ధన్యవాదాలు, ప్రాజెక్టు పేజీలో తగు మార్పులు చేస్తున్నాను.. Nskjnv ☚╣✉╠☛ 03:14, 27 నవంబరు 2021 (UTC)Reply

ప్రాజెక్టు పురోగతి మార్చు

 
WAM Telugu Wiki

వికీపీడియా ఏషియన్ నెల 2021 లో భాగంగా ఇప్పటివరకు 71 వ్యాసాలు సృష్టించబడ్డాయి. గణాంకాల పరంగా 36 వ్యాసాలతో అభిలాష్ గారు మొదటి స్థానంలో ఉన్నారు. 13 వ్యాసాలతో చదువరి గారు రెండవ స్థానంలో వాడుకరి:Ch Maheswara Raju, వాడుకరి:KUMMARI NARESH, వాడుకరి:యర్రా రామారావు గార్లు ప్రాజెక్టు నిబంధనలకు అనుగుణంగా తలా 4 వ్యాసాలు ఆపై పూర్తి చేశారు.

ఈ శని ఆది వారాల్లో ఎడిటతాన్ ఒకటి నిర్వహించుకుందామా! రోజుకో వ్యాసం రెండు వ్యాసాలూ చొప్పున, ఎవరికి వీలైనంత వారము రాద్దామా!... ప్రాజెక్టు సభ్యులు తమ అభిప్రాయాలు సూచనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. Nskjnv ☚╣✉╠☛ 14:25, 2 డిసెంబరు 2021 (UTC)Reply

User:Nskjnv గారూ ధన్యవాదాలు ఎడిటతాన్ నిర్వహించుకుందాం. వ్యాసాలు కూడా రాద్దాం.-అభిలాష్ మ్యాడం 17:47, 2 డిసెంబరు 2021 (UTC)Reply
అలాగే కానివ్వండి. నేను ఆదివారం పాల్గొంటాను.__ చదువరి (చర్చరచనలు) 04:12, 3 డిసెంబరు 2021 (UTC)Reply

కొత్తవారిని గుర్తించండి.. ప్లీజ్..! మార్చు

ఈ ప్రాజెక్టులో భాగంగా నేను కొన్ని వ్యాసాలు రాసాను. మచ్చుకి.. ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, ‎చైనా సెంట్రల్ టెలివిజన్, ‎ఆసియన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్, ‎చైనీస్ డ్రాగన్, ‎గిన్‌కోగో వృక్షం, ‎కకేబో టెక్నిక్‌, ‎మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ మొదలైనవి. అలాగే కొన్ని వ్యాసాలు.. వికీపీడియా ఏషియన్ నెల 2021 ఎడిటథాన్ ప్రకటనలో వివరాలకు అనుగుణంగా సవరించాను. ఈ "ఫౌంటెన్" విషయం ఇప్పుడు ఈ పేజీలో చూసాను. ఇది కూడా అక్కడే చేర్చి, ప్రకటన సవివిరంగా ఉంటే బాగుండేది అని నా అభిప్రాయం.

అందుకని నా అభ్యర్థన ఏంటంటే కొత్తవారి కోసం ఇలాంటి ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి చివరి వరకు కొన్ని సమావేశాలు నిర్వహించడం మంచిది. --మురళీకృష్ణ ముసునూరి (చర్చ) 05:03, 17 డిసెంబరు 2021 (UTC)Reply

మురళీకృష్ణ ముసునూరి గారూ, ముందుగా వికీపీడియా ఏషియన్ నెల ప్రాజెక్టులో మీరందించిన వ్యాసాలకు అభినందనలు. ఈ ప్రాజెక్టు ఒక మహత్కర కార్యం, తెలుగు ప్రజలకు ప్రాపంచిక విషయాల గురించి నేర్చుకోవడానికి తెలుగు వికీని ఒక వేదికగా మరింత బలపరిచింది.

మీ సూచనకు ధన్యవాదాలు. వికీలో జరిగే అన్ని విషయాలకు సంబందించిన చర్చా, శిక్షణ తదితర విషయాలు రాత రూపాల్లో ప్రాధాన్యంగా ఉన్న.. మీరన్నట్టు ప్రతి ప్రాజెక్టుకి సంబంధించి అలాగే వికీలో జరుగుతున్న పనుల గురించి అవసరం ఉన్న వారికి ప్రోత్సాహక దిశగా కొన్ని సమావేశాలను చేపట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ప్రస్తావన ప్రాజెక్టు నడిచే సమయంలో చేస్తే తప్పక సమావేశాన్ని నిర్వహించుకునే వారము. ఇక మీకు మిగతా ప్రాజెక్టులలో కూడా ఏం చేయాలో అవగాహన అవసరమైతే నన్ను గాని ఇతర వికీపీడియన్లను గాని సంప్రదించవచ్చు.

ఈ ప్రస్తావనను తీసుకు వచ్చినందుకు ధన్యవాదాలు. తెలుగు వికీలో మీ కృషి శుభసూచికం, ఈ ప్రాజెక్టు ద్వారా వికీలో మీరు మరింత మెరుగైన సేవ అందించారని తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. Nskjnv ☚╣✉╠☛ 11:39, 20 డిసెంబరు 2021 (UTC)Reply

ప్రాజెక్టు గణాంకాలు మార్చు

ఏషియన్ నెల 2021 ప్రాజెక్టు నవంబర్ 15 న మొదలుకొని డిసెంబర్ 15 వరకు 30 రోజులపాటు సాగింది.  దీనిలో భాగంగా ఆసియా దేశాలకు సంబంధించి వివిధ విషయాలపై తెలుగు వికీపీడియాలో  వ్యాసాలు అభివృద్ధి చేయడం జరిగింది.


ప్రాపంచిక విషయాలపై తెలుగు భాషలో  విజ్ఞానం అందించడానికి తెలుగు వికీపీడియాని మరింత బలమైన వేదికగా ఈ ప్రాజెక్టు అభివృద్ధి పరిచిందని నేను విశ్వసిస్తున్నాను. విశ్వవ్యాప్త విషయాల గురించి తెలుగు ప్రజలకు విజ్ఞాన్ అందించడంలో ఇది మరో ముందడుగు నిలిచిందని భావిస్తున్నాను.


వాడుకరి సృష్టించిన వ్యాసాలూ Points
MYADAM ABHILASH 100 100
KUMMARI NARESH 31 31
Chaduvari 19 19
Ch Maheswara Raju 11 11
యర్రా రామారావు 10 10
Ramesh bethi 5 5
Tmamatha 5 5
PARALA NAGARAJU 4 4
ప్రభాకర్ గౌడ్ నోముల 4 4
Nskjnv 2 2
Divya4232


తెలుగు వికీపీడియన్లు మ్యాడం అభిలాష్ గారు, , కుమ్మరి నరేష్ గారు, తుమ్మల శిరీష్ కుమార్ గారు, మహేశ్వర్ రాజు గారు, యర్రా రామారావు గారు, రమేష్ బేతి గారు, మమతా గారు, పరాల నాగరాజు గారు, ప్రభాకర్ గౌడ్ నోముల గారు, దివ్య గారు ఈ ప్రాజెక్టులో పాల్గొని 192 అమూల్యమైన వ్యాసాలను సృష్టించారు.


ఈ ప్రాజెక్టులో మ్యాడం అభిలాష్ గారు 30 రోజులలో రమారమి 100 వ్యాసాలు సృష్టించి తెలుగు వికీపీడియా నుండి వికీపీడియా ఏషియన్ నెల బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. అభినందనలు వికీపీడియా ఏషియన్ నెల బ్రాండ్ అంబాసిడర్ గారు. మీరందించిన ఈ కృషికి తెలుగు వికీ గర్విస్తుంది, తెలుగు వికీలో 30 రోజుల్లో ఒక ప్రాజెక్టు కోసం 100 వ్యాసాలూ రాసిన వ్యక్తిగా రానున్న ప్రాజెక్టులలో వికీపీడియన్లకు ఆదర్శంగా నిలుస్తారని ఆశిస్తున్నా.

కొత్త వాడుకరి అయినా కుమ్మరి నరేష్, వికీపీడియా ఏషియన్ నెల ప్రాజెక్టులో 31 వ్యాసాలూ రాసి తెలుగు వికీ అభిరుద్దిలో పాల్గొన్నాడు. కొత్త వాడుకరిగా ఉన్న 30 రోజులలో 31 వ్యాసాలూ అంటే సుమారు రోజుకో వ్యాసం చొప్పున రాసి వికీలో దిద్దుబాట్లు ప్రారంభించిన తోలి రోజుల్లోనే అద్భుతం చేశారు. మీ కృషి అమోఘం, ధన్యవాదాలు.

ఇక ఈ ప్రాజెక్టు నిర్వాహణలో సహాయం అందించిన చదువరి గారి గురించి, నేను వికీలో ఏ పని తలపెట్టిన నాకు ఏ సందేహం వచ్చిన వెన్నంటే ఉంటూ నా ప్రతి ప్రశ్నకు ఓపికతో బదులిస్తూ తమ అమూల్యమైన సమయాన్ని అందించినందుకు వారికి ధన్యవాదాలు. మీ సహకారం ఈ ప్రాజెక్టు నడపడంలో కీలక పాత్ర పోషించిందనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు, అలాగే ప్రాజెక్టులో భాగంగా 19 విలువైన వ్యాసాలు అందించి మీదైనా శైలిలో ఈ ప్రాజెక్టుకు తోడ్పడ్డారు.

వికీ వీరులు రామారావు గారు, మహేశ్వర్ రాజు గారు తలా 10, 11 వ్యాసాలూ రాసి తమదైన పాత్ర పోషించారు.

ఈ ప్రాజెక్టులో మీ అందరి కృషికి ధన్యవాదాలు. Nskjnv ☚╣✉╠☛ 12:43, 20 డిసెంబరు 2021 (UTC)Reply

Return to the project page "వికీప్రాజెక్టు/ఏషియన్ నెల/2021".